virginia tobacco
-
‘వర్జీనియా’ రైతుకు ‘పొగ’
సాక్షి, అమరావతి: వర్జీనియా పొగాకు సాగుదార్ల ఆశలపై టుబాకో బోర్డు నీళ్లు చల్లింది. ఒక్కో బ్యారన్ పరిధిలో విక్రయ పరిమాణానికి నామమాత్రపు పెంపు మాత్రమే ఇచ్చింది. ఈ నిర్ణయం పట ప్రకాశం, గుంటూరు, నెల్లూరు జిల్లాల రైతులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తాము పది క్వింటాళ్ల పెంపును ఊహిస్తే మూడో వంతు కూడా బోర్డు ప్రకటించలేదని పెదవి విరుస్తున్నారు. ఒక్కో బ్యారన్ కింద 2.5 నుంచి 3.5 క్వింటాళ్ల విక్రయ పెంపును మాత్రమే టుబాకో బోర్డు అనుమతించడాన్ని తీవ్రంగా తప్పుబడుతున్నారు. దక్షిణప్రాంత తేలికపాటి భూములు (ఎస్ఎల్ఎస్), దక్షిణాది నల్లరేగడి భూముల్లో (ఎస్బీఎస్) వర్జీనియా పొగాకు రైతులు 2021–22 సంవత్సరానికి ఒక్కో బ్యారన్ కింద కనీసం 40 క్వింటాళ్ల వరకైనా పొగాకును విక్రయించుకునేందుకు అనుమతి ఇస్తారని ఆశించారు. అయితే ఇటీవల సమావేశమైన టుబాకో బోర్డు అధికారులు ఒక్కో బ్యారన్ కింద ఎస్ఎల్ఎస్ రైతులకైతే 33.5 క్వింటాళ్లు, ఎస్బీఎస్ రైతులకైతే 32.5 క్వింటాళ్ల విక్రయానికి మాత్రమే అనుమతించాలని తీర్మానించారు. ఉత్పత్తి లక్ష్యం 130 మిలియన్ కిలోలు.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి 130 మిలియన్ కిలోల పొ గాకు ఉత్పత్తి లక్ష్యం కాగా అందులో ఎస్ఎల్ఎస్ ప్రాంత రైతుల కోటా 43.68 మిలియన్ కిలోలు. ఎస్బీఎస్ ప్రాంత రై తుల కోటా 37.44 మిలియన్ కిలోలుగా అధికారులు నిర్ణయించారు. సాగు వ్యయం నానాటికీ పెరుగుతున్న పరిస్థితుల్లో మరింత పొగాకు విక్రయానికి బోర్డు అనుమతివ్వకపోతే తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందని రైతులు వాపోతున్నారు. వాస్తవానికి పొగాకు పరిశోధనా సంస్థ (సీటీఆర్ఐ) ఒక్కో పొగాకు బ్యారన్ కింద కనీసం 55 క్వింటాళ్ల ఉత్పత్తికి అనుమతించాలని టుబాకో బోర్డుకు ప్రతిపాదించింది. వర్షాధారిత ప్రాంతాల్లో రైతులు ఒక్కో పొగాకు బ్యారన్ కింద ఏడు ఎకరాలు సాగు చేస్తుంటారు. పరిస్థితులు బాగుండి దిగుబడి బాగా వస్తే రైతులు మరో బ్యారన్‌ను తీసుకోవడమో లేక అదనపు ఉత్పత్తికి జరిమానా కట్టడమో చేయాలి. ప్రతి ఏటా కనీసం పది శాతం సాగు వ్యయం పెరుగుతున్నది. ఆ స్థాయిలో రేటు పెరగడం లేదు. పంట విక్రయ విషయంలో బోర్డు నిర్ణయం రైతులకు శరాఘాతమని టుబాకో బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు భద్రారెడ్డి వ్యాఖ్యానించారు. -
వర్జీనియాకు వాతావరణం ‘పొగ’
ఎదుగుదల లేని పొగాకు మొక్క గతేడాది మంచి ధర రావడంతో పెరిగిన సాగు విస్తీర్ణం చల్లటి వాతావరణంతో రైతుల్లో ఆందోళన ధర పలకదంటూ పొగాకు బోర్డు హెచ్చరిక సాక్షి ప్రతినిధి, ఏలూరు : గతేడాది పొగాకు ఊహించని ధర పలికింది. ఈసారీ అదే విధంగా వస్తుందనే ఆశతో రైతు దాని సాగుపై ఎక్కువ మక్కువ చూపాడు. అయితే అనుకూలించని వాతావరణ పరిస్థితుల కారణంగా మొక్క ఎదుగుదల లేక పొలాల్లోనే పంట ‘పొగబారి’ పోయేలా కన్పిస్తోంది. దిగుబడి తగ్గుతుందనే ఆందోళన ఒకవైపు, ఈసారి ధర అంతగా రాదనే పొగాకు బోర్డు హెచ్చరికలు మరోవైపు రైతులను కుంగదీస్తున్నాయి. పశ్చిమగోదావరి జిల్లాలోని మెట్ట ప్రాంతమైన గోపాలపురం, దేవరపల్లి, నల్లజర్ల, జంగారెడ్డిగూడెం, కొయ్యలగూడెం తదితర మండలాల్లో ఉత్తర తేలిక పాటి నేలల్లో (ఎన్ఎల్ఎస్) అత్యంత నాణ్యమైన వర్జీనియా పొగాకు పండుతుంది. తూర్పుగోదావరి జిల్లాలోని రంగంపేట, తొర్రేడు ప్రాంతాల్లోనూ వర్జీనియా పొగాకు సాగు చేస్తారు. ఇక్కడ సాగయ్యే పొగాకు పంటకు అంతర్జాతీయ మార్కెట్లో మంచి డిమాండ్ ఉంటుంది. కాగా, మరోవైపు సాగు విస్తీర్ణం పెరగడంతో గత ఏడాది స్థాయిలో ధర రాదని పొగాకు బోర్డు హెచ్చరించడం రైతులను ఇంకా కుంగదీస్తోంది. ఈ ఏడాది 80 వేల ఎకరాల్లో సాగుకే బోర్డు అనుమతించింది. అంటే 54 మిలియన్ టన్నుల ఉత్పత్తికి ఆమోదం తెలిపింది. అయితే సాగు విస్తీర్ణం పెరగడంతో 62 టన్నుల ఉత్పత్తి వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇంత పంటను కొనుగోలు చేయటం సాధ్యం కాదని, అనుమతిచ్చిన మేరకే పంటను కొనుగోలు చేస్తామని బోర్డు అధికారులు స్పష్టం చేస్తున్నారు. దిగుబడి తగ్గిపోయే పరిస్థితుల్లో ఉత్పత్తి ఆ స్థాయికి చేరదని రైతులు వాదిస్తున్నారు. మొక్క పెరగలేదు మంచు కురవడం, మబ్బులు కమ్ముకోవడం వల్ల మొక్కలు సరిగా పెరగలేదు. దిగుబడి వచ్చేలా లేదు. పండిన దానికి మంచి రేటు దక్కుతుందో లేదో తెలియడంలేదు. చాలా పెట్టుబడి పెట్టా. రేటు రాకపోతే అప్పులపాలవుతా. - నల్లజర్ల రైతు రామకృష్ణ గత ఏడాది.. ఈ ఏడాది .. ఎన్నడూ లేని విధంగా గతేడాది వర్జీనియా పొగాకు ధర అనూహ్యంగా పెరిగింది. కిలో రూ.150-160 ఉండే ధర రైతులు ఊహించని రీతిలో రూ.195కు చేరింది. దీంతో ఈ ఏడాది కూడా అదే పరిస్థితి ఉంటుందనే అంచనాతో అధికంగా పొగాకు సాగు చేశారు. వాస్తవానికి పొగాకు బోర్డు ఇచ్చిన అనుమతి మేరకే ఈ పంటను సాగు చేయాల్సి ఉంది. అనుమతి లేకుండా సాగుచేసిన పంటను బోర్డు కొనుగోలు చేయదు. అయితే ధర వస్తుందనే ఆశతో రైతులు ఎక్కువ విస్తీర్ణంలో సాగు ప్రారంభించారు. పశ్చిమగోదావరి జిల్లాలో ఈ ఏడాది లక్ష ఎకరాల్లో సాగు చేశారు. తూర్పుగోదావరిలో 2,200 ఎకరాల్లో సాగుచేశారు. పంట పరిస్థితి ఎలా ఉంది.. చల్లటి వాతావరణం రైతుల ఆశలను నీరుగార్చేసింది. పొగాకు పంటకు పగలు ఎండ,రాత్రి ఉక్కపోత వాతావరణం అనుకూలం. రెండు నెలల నుంచి పగలు ఎండ తక్కువగా, వాతావరణం మబ్బులతో ఉంటోంది. చలిగాలులు కూడా ఎక్కువగా వీస్తున్నాయి. మంచు బాగా కురుస్తోంది. మొక్కలు గిడసబారిపోవడంతోపాటు చీడల బాధ కూడా ఎక్కువైంది. ఆకు మందంగా ఉంటేనే బరువు ఎక్కువగా తూగుతుంది. {పస్తుతం ఆకు పల్చబడి తేలిగ్గా ఉండడంతో దిగుబడి తగ్గిపోయే ప్రమాదం ఏర్పడింది. -
పొగాకు విత్తనాలకు కొరత
దేవరపల్లి, న్యూస్‌లైన్ : వర్జీనియా పొగాకు విత్తనాలకు కొరత ఏర్పడింది. దీనిని ఆసరా చేసుకుని కొందరు వ్యాపారులు ధరను అమాం తం పెంచేశారు. బ్యారన్ ఉన్న రైతులకు మాత్రమే సరఫరా చేయాల్సిన విత్తనాలు వ్యాపారులు, దళారుల చేతుల్లోకి చేరాయి. రైతులకు అవసరమైన విత్తనాలను ఐటిసీ సంస్థ సరఫరా చేస్తుంది. అధిక దిగుబడులు ఇచ్చే ఎల్వీ-6, 7, ఎన్ఎల్ఎస్-4 విత్తనాలకు డివూండ్ ఉండటంతో వాటినే ఐటీసీ రైతులకు అందజేస్తోంది. జిల్లాలో వర్జీనియూ పొగాకు పండిస్తున్న దేవరపల్లి, గోపాలపురం, కొయ్యులగూడెం, జంగారెడ్డిగూడెం-1, 2 వేలం కేంద్రాల పరిధిలో రెండు వారాలుగా రైతులు ముమ్మరంగా నారువుడులు కడుతున్నారు. గత ఏడాది నారుకు డివూండ్ రావటంతో నారు విక్రయించే రైతులకు నాలుగు డబ్బులు మిగిలారుు. దీంతో ఈ ఏడాది నారువుళ్ల విస్తీర్ణం పెరిగింది. సాధారణంగా ఏటా సువూరు వెరుు్య ఎకరాలలో నారువుడులు కడతారు. వారు కూడా కౌలు రైతులు, నారు వ్యాపారులే. ఇక్కడ పెంచే నారుకు వుంచి డివూండ్ ఉంది. నెల్లూరు, ప్రకాశం, కృష్ణా జిల్లాలలోపాటు తెలంగాణ ప్రాంత రైతులు కూడా ఇక్కడకు వచ్చి నారు కొనుగోలు చేస్తారు. ఈ ఏడాది ఐటీసీ ద్వారా ఎల్వీ-6 విత్తనం 150 కిలోలు, ఎల్వీ-7 విత్తనం 650 కిలోలు రైతులకు పంపిణీ చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ విత్తనం కిలో రూ.15 వేలు కాగా, ఎన్ఎల్ఎస్-4 విత్తనం వెరుు్య రూపాయులకు సరఫరా చేస్తున్నారు. కొంతవుంది వ్యాపారులు ఎక్కువ విత్తనాలు కొనుగోలు చేసి నిల్వ ఉంచి బ్లాక్‌లో విక్రరుుస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. కిలో విత్తనం రూ.30వేలు ధర పలుకుతోందని వారు తెలిపారు. బ్యారన్ లెసైన్సు ఉన్న రైతులకు వూత్రమే విత్తనాలు సరఫరా చేయాల్సి ఉండగా, వారికి దొరకని విత్తనాలు వ్యాపారులు, దళారులకు ఎక్కడినుంచి వస్తున్నాయునేది రైతుల ప్రశ్న. దేవరపల్లి వుండలంలో ఇప్పటి వరకు సువూరు 200ఎకరాల్లో నారువుడులు కట్టగా, వురో 50 ఎకరాల్లో కట్టాల్సి ఉందని రైతులు తెలిపారు. విత్తనాలు లేక వుడులు కట్టలేకపోతున్నట్టు వారు చెప్పారు. బ్యారన్‌కు 100 గ్రాములే పొగాకు రైతులకు ఐటీసీ సంస్థ బ్యారన్‌కు 100గ్రావుుల చొప్పున విత్తనాలు సరఫరా చేసింది. ఎకరం నారువుడికి 500 గ్రావుుల విత్తనాలు అవసరం. ఎకరం నారువుడిలో నారు సువూరు 400 ఎకరాల్లో నాటటానికి సరిపోతుంది. ఎకరాకు 6వేల మొక్కలు నాటుతారు. అక్టోబర్ నుంచి నాట్లు ప్రారంభిస్తారు. ఎన్ఎల్ఎస్ ప్రాంతంలో సువూరు 15 వేల బ్యారన్లు ఉండగా సువూరు లక్ష ఎకరాల్లో వర్జీనియా పొగాకు సాగు చేస్తున్నారు.