దేవరపల్లి, న్యూస్‌లైన్ : వర్జీనియా పొగాకు విత్తనాలకు కొరత ఏర్పడింది. దీనిని ఆసరా చేసుకుని కొందరు వ్యాపారులు ధరను అమాం తం పెంచేశారు. బ్యారన్ ఉన్న రైతులకు మాత్రమే సరఫరా చేయాల్సిన విత్తనాలు వ్యాపారులు, దళారుల చేతుల్లోకి చేరాయి. రైతులకు అవసరమైన విత్తనాలను ఐటిసీ సంస్థ సరఫరా చేస్తుంది. అధిక దిగుబడులు ఇచ్చే ఎల్వీ-6, 7, ఎన్‌ఎల్‌ఎస్-4 విత్తనాలకు డివూండ్ ఉండటంతో వాటినే ఐటీసీ రైతులకు అందజేస్తోంది. జిల్లాలో వర్జీనియూ పొగాకు పండిస్తున్న దేవరపల్లి, గోపాలపురం, కొయ్యులగూడెం, జంగారెడ్డిగూడెం-1, 2 వేలం కేంద్రాల పరిధిలో రెండు వారాలుగా రైతులు ముమ్మరంగా నారువుడులు కడుతున్నారు.
గత ఏడాది నారుకు డివూండ్ రావటంతో నారు విక్రయించే రైతులకు నాలుగు డబ్బులు మిగిలారుు. దీంతో ఈ ఏడాది నారువుళ్ల విస్తీర్ణం పెరిగింది. సాధారణంగా ఏటా సువూరు వెరుు్య ఎకరాలలో నారువుడులు కడతారు. వారు కూడా కౌలు రైతులు, నారు వ్యాపారులే. ఇక్కడ పెంచే నారుకు వుంచి డివూండ్ ఉంది. నెల్లూరు, ప్రకాశం, కృష్ణా జిల్లాలలోపాటు తెలంగాణ ప్రాంత రైతులు కూడా ఇక్కడకు వచ్చి నారు కొనుగోలు చేస్తారు. ఈ ఏడాది ఐటీసీ ద్వారా ఎల్వీ-6 విత్తనం 150 కిలోలు, ఎల్వీ-7 విత్తనం 650 కిలోలు రైతులకు పంపిణీ చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ విత్తనం కిలో రూ.15 వేలు కాగా, ఎన్‌ఎల్‌ఎస్-4 విత్తనం వెరుు్య రూపాయులకు సరఫరా చేస్తున్నారు. కొంతవుంది వ్యాపారులు ఎక్కువ విత్తనాలు కొనుగోలు చేసి నిల్వ ఉంచి బ్లాక్‌లో విక్రరుుస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. కిలో విత్తనం రూ.30వేలు ధర పలుకుతోందని వారు తెలిపారు. బ్యారన్ లెసైన్సు ఉన్న రైతులకు వూత్రమే విత్తనాలు సరఫరా చేయాల్సి ఉండగా, వారికి దొరకని విత్తనాలు వ్యాపారులు, దళారులకు ఎక్కడినుంచి వస్తున్నాయునేది రైతుల ప్రశ్న. దేవరపల్లి వుండలంలో ఇప్పటి వరకు సువూరు 200ఎకరాల్లో నారువుడులు కట్టగా, వురో 50 ఎకరాల్లో కట్టాల్సి ఉందని రైతులు తెలిపారు. విత్తనాలు లేక వుడులు కట్టలేకపోతున్నట్టు వారు చెప్పారు.
బ్యారన్‌కు 100 గ్రాములే
పొగాకు రైతులకు ఐటీసీ సంస్థ బ్యారన్‌కు 100గ్రావుుల చొప్పున విత్తనాలు సరఫరా చేసింది. ఎకరం నారువుడికి 500 గ్రావుుల విత్తనాలు అవసరం. ఎకరం నారువుడిలో నారు సువూరు 400 ఎకరాల్లో నాటటానికి సరిపోతుంది. ఎకరాకు 6వేల మొక్కలు నాటుతారు. అక్టోబర్ నుంచి నాట్లు ప్రారంభిస్తారు. ఎన్‌ఎల్‌ఎస్ ప్రాంతంలో సువూరు 15 వేల బ్యారన్లు ఉండగా సువూరు లక్ష ఎకరాల్లో వర్జీనియా పొగాకు సాగు చేస్తున్నారు.
పొగాకు విత్తనాలకు కొరత
Published Sat, Aug 24 2013 4:41 AM | Last Updated on Mon, Oct 1 2018 2:44 PM
Advertisement
Advertisement