visakha people
-
పవన్ కళ్యాణ్‌కు విశాఖ ప్రజల షాక్
సాక్షి, విశాఖపట్నం: పవన్ కళ్యాణ్‌కు విశాఖ ప్రజలు షాక్ ఇచ్చారు. పవన్ సభకు జనాలు మొహం చాటేశారు. జనాలు లేక బహిరంగ సభ ప్రాంగణం వెలవెలబోయింది. ఖాళీ కుర్చీలతో దర్శనమిచ్చింది. జనాలు లేక రెండు గంటలకుపైగా పవన్ కల్యాణ్ హోటల్ కే పరిమితమయ్యారు. గ్రౌండ్లో సగం వరకే కుర్చీలు వేసిన జనాలు కనిపించలేదు. జనాలను తీసుకురాలేక జనసేన నేతలు చేతులు ఎత్తేశారు. దీంతో జన సైనికులపై పవన్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. చదవండి: అబద్ధాల బాబు.. నిజం చెప్పరుగా! -
చివరి చూపైనా దక్కేనా..!
సాక్షి, విశాఖపట్నం : ఎక్కడున్నారో.. ఏమైపోయారో.. చివరి చూపైనా దక్కుతుందా.. అని గోదారి బోటు ప్రమాదంలో గల్లంతైన వారి కోసం కుటుంబసభ్యులు ఎదురుచూస్తున్నారు. గోదారమ్మ ఆగ్రహానికి గల్లంతైన తమ కుటుంబ సభ్యుల్ని కడసారి చూసేందుకు ఎదురు చూసీ.. చూసీ.. కన్నీళ్లు ఇంకిపోతున్నాయి. ఇప్పటికే 11 మంది మృతదేహాలు స్వగృహాలకు చేరుకున్నాయి. ఇంకా ఆరుగురి ఆచూకీ కోసం విస్తృతంగా గాలింపు చర్యలు చేపడుతున్నారు. తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నంలో ఆదివారం జరిగిన బోటు ప్రమాదంలో జిల్లాకు చెందిన 18 మంది గల్లంతవ్వగా వారిలో ఒకరు సురక్షితంగా బయటపడ్డారు. గోపాలపురం గ్రామానికి చెందిన భూసాల లక్ష్మి ఇంటికి చేరుకున్నా కళ్లముందే తన బంధువులను కోల్పోయిన ఘటన నుంచి తేరుకోలేదు. అందరితో వెళ్లి ఒంటరిగా వచ్చిన లక్ష్మి షాక్‌లోనే ఉంది. గల్లంతైన 17 మందిలో ఇప్ప టి వరకూ 11 మంది మృతదేహాలు మాత్రమే లభించాయి. మిగిలిన ఆరుగురి ఆచూకీ కోసం ప్రభుత్వం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపడుతోంది. ఓవైపు ప్రతికూల వాతావరణం ఎదురవుతున్నా సూర్యాస్తమయం వరకూ బాధితుల ఆచూకీ కోసం సహాయక బృందాలు విశ్వప్రయత్నాలు చేస్తున్నాయి. రామలక్ష్మి కాలనీకి చెందిన మధుపాడ రమణబాబు మృతదేహం మాత్రమే లభ్యమైంది. ఆయన భార్య అరుణకుమారి, పిల్లలు అఖిలేష్, కుషాలి ఆచూకీ లభ్యం కాలేదు. ఆరిలోవ దుర్గాబజారు ప్రాంతానికి చెందిన తలారి అప్పల నర్సమ్మ మృతదేహం మాత్రమే దొరకగా.. ఆమె వెంట వెళ్లిన మనవరాళ్లు గీతా వైష్ణవి, ధాత్రి అనన్య ఆచూకీ దొరకలేదు. గాజువాకకు చెందిన బాచిరెడ్డి స్వాతి, ఆమె కుమార్తె హాన్సిక మృతదేహాలు మంగళవారం దొరకగా భర్త బాచిరెడ్డి మహేశ్వర్‌రెడ్డి మృతదేహం బుధవారం లభించడంతో స్వస్థలం నంద్యాల తరలించారు. అతని కుమారుడు విఖ్యాత్‌రెడ్డి ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు. మిగిలిన వారి మృతదేహాలు స్వగృహానికి చేరుకున్నాయి. ఏ ఇంట చూసినా కన్నీటి సంద్రమే కనిపిస్తోంది. ఉన్నవారిని విగతజీవులుగా పంపిచావు.. మిగిలిన వారినైనా ప్రాణాలతో కాపాడు.. లేకుంటే.. కనీసం కడచూపునకైనా నోచుకోనివ్వు భగవంతుడా అంటూ ప్రతి కుటుంబం కన్నీరు మున్నీరై విలపిస్తోంది. కొనసాగుతున్న సహాయక చర్యలు.. బుధవారం రాత్రి వరకూ సహాయక చర్యలు కొనసాగాయి. తెల్లవారింది మొదలు సూర్యాస్తమయమయ్యే వరకూ రక్షణ బృందాలతో ప్రభుత్వం గాలింపు చర్యలు చేపడుతోంది. తమ వారి ఆచూకీ ఈ రోజైనా దొరకకపోతుందా అనే ఆశతో బంధువులు, కుటుంబ సభ్యులు గోదారి గట్టుపైనే నిరీక్షిస్తున్నారు. -
విశాఖలో కన్నీటి ‘గోదారి’
సాక్షి, విశాఖపట్నం : ఆదివారం జరిగిన బోటు ప్రమాదంతో విశాఖ జిల్లా కన్నీటి గోదారిలో మునిగిపోయింది. ఒకే కుటుంబానికి చెందిన 17 మంది గల్లంతవ్వగా.. ఇద్దరి మృతదేహాలు మాత్రమే ఇప్పటి వరకూ లభ్యమయ్యాయి. మిగిలినవారు ఎక్కడున్నారు..? ఏ పరిస్థితుల్లో ఉన్నారు.? అసలున్నారా.? ఎప్పుడు వస్తారు.? వస్తారో రారో..? రెండు నెలల్లో పెళ్లి పీటలెక్కనున్న ఆ అమ్మాయి గోదారిలో జరిగిన ఘోరానికి బలైపోయిందా..? ఇలా అనేక విషాద ప్రశ్నలు బంధువులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. భారమైన గుండెలతో తమ వాళ్ల జాడ కోసం ఎదురు చూస్తున్న ఏ కుటుంబాన్ని చూసినా విషణ్ణ వదనాలే కనిపిస్తున్నాయి. ఏ గుండెను కదిలించినా ఆవేదన స్వరాలే వినిపిస్తున్నాయి. పాపికొండలు విహార యాత్రకు వెళ్లిన 13 మంది కుటుంబసభ్యులు, బంధువుల్లో 12 మంది గోదావరిలో గల్లంతైన ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. అదేవిధంగా గాజువాకకు చెందిన అయిదుగురు కూడా పాపికొండలు చూసేందుకు వెళ్లి గల్లంతయ్యారన్న వార్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గల్లంతైన వారి ఆచూకీ కోసం నిర్వహించిన గాలింపు చర్యల్లో ఆరిలోవ ప్రాంతానికి చెందిన అప్పల నర్సమ్మ, వేపగుంటకు చెందిన లక్ష్మి మృతదేహాలు మాత్రమే లభ్యమయ్యాయి. మిగిలిన 10 మంది ఏమయ్యారోనన్న ఆందోళన ఆ కుటుంబాల్ని శోక సంద్రంలో నెట్టేస్తోంది. ఎక్కడో ఒకచోట ప్రాణాలతో ఉంటారనే ఆశతో ఆవేదనా భరితమైన వదనాలతో బంధువులు ఎదురుచూస్తున్నారు. మావాళ్లు కాకూడదు భగవంతుడా..!! సోమవారం ఉదయం గాలింపు చర్యలు మొదలైనప్పటి నుంచి గల్లంతైన వారి కుటుంబ సభ్యులు, బంధువులు తమవారి ఆచూకీ దొరుకుతుందని ఊపిరి బిగబట్టుకొని ఆశగా ఎదురుచూశారు. సామాజిక మాధ్యమాలు, టీవీల్లో వస్తున్న ప్రసారాల ద్వారా సమాచారం తెలుసుకునేందుకు ప్రయత్నించారు. కలెక్టరేట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్‌కి మాటిమాటికీ ఫోన్ చేసి ఏమైనా సమాచారం వచ్చిందా అని అడుగుతూ ఉన్నారు. సహాయక చర్యలు ప్రారంభించిన కొద్ది గంటల్లోనే నాలుగు మృతదేహాలు లభ్యమయ్యాయన్న సమాచారం వచ్చింది. ఇది విన్న బంధువులు ఆ దొరికిన మృతదేహాలు.. మా వాళ్లవి కాకూడదు దేవుడా అని ప్రార్థించారు. కానీ అందులో ఒకటి ఆరిలోవకి చెందిన తలారి అప్పలనర్సమ్మదనీ, మరొకటి వేపగుంటకు చెందిన లక్ష్మిగా గుర్తించగానే బంధువులు శోక సంద్రంలో మునిగిపోయారు. రెండు నెలల్లో పెళ్లి.. అంతలోనే విషాదం అనకాపల్లి: గోపాలపురానికి చెందిన భూసాల పూర్ణ, భూసాల సుస్మిత, పెదిరెడ్డి దాలమ్మ ఆచూకీ ఇంతవరకూ దొరకలేదు. దీంతో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. అందరూ సురక్షితంగా బయటపడాలంటూ ఊరంతా ఏకమై భగవంతుణ్ణి వేడుకుంటోంది. కానీ ఏ క్షణాన ఎలాంటి దుర్వార్త వినాల్సి వస్తుందోనంటూ గుండెలు బిగబట్టుకొని గ్రామస్తులు, బంధువులు ఎదురుచూస్తున్నారు. గోపాలపురం వాసులు సోమవారం ఏ పనికీ వెళ్లకుండా ఊరిలోనే ఉండిపోయారు. పాపికొండలను చూసేందుకు వెళ్లిన భూసాల పూర్ణకు మరో రెండు నెలల్లో పెళ్లి కానుంది. ఇంతలోనే ఘోరం జరిగిపోయిందని ఆమె తండ్రి రమణ తీవ్ర దుఖఃసాగరంలో మునిగాడు. పెళ్లి చేసి అత్తారింటికి పంపించాలని భావిస్తే.. ఇలా దేవుడు అంతం చేశాడంటూ ఆ కుటుంబం కన్నీరుమున్నీరవుతోంది. వారిని ఓదార్చడం ఎవరితరమూ కావడం లేదు చేనుల అగ్రహారంలో గంభీర వాతావరణం.. చేనుల అగ్రహారానికి చెందిన మధుపాడ రమణ బతుకుతెరువు కోసం విశాఖ వెళ్లిపోయాడు. క్యాంటిన్ పనులు నిర్వహించడంతోపాటు వాహన డ్రైవర్‌గా పని చేస్తున్న రమణ కుటుంబ సభ్యుల ఆచూకీ కూడా తెలియరాకపోవడంతో చేనుల అగ్రహారం గ్రామంలో గంభీర వాతావరణం నెలకొంది. కళ్లముందే మునిగిపోయారు.. అనకాపల్లి: పడవ మునిగిపోయిన ఘటనలో కళ్లముందే నా కుటుంబీకులందరూ నీట మునిగిపోతున్నా ఏం చేయలేకపోయానని గోదావరిలో గల్లంతై సురక్షితంగా బయటపడిన భూసాల లక్ష్మి తెలిపింది. లైఫ్‌జాకెట్ తనను కాపాడిందని ‘సాక్షి’తో ఆమె సోమవారం మాట్లాడుతూ చెప్పారు. తమ వారంతా బతికే ఉంటారని ఆశిస్తున్నానని రోదిస్తూ చెప్పింది. తన అల్లుడు రమణబాబు పాపికొండలను చూపిస్తానంటే 13 మందిమి ఆదివారం తెల్లవారుజామున విశాఖపట్నం నుంచి రైలులో బయల్దేరి రాజమండ్రికి చేరుకున్నామని, అక్కడి నుంచి గండిపోచమ్మ గుడికి కారులో వెళ్లినట్టు చెప్పారు. మధ్యాహ్నం 11.30 గంటలకు బోటు ఎక్కామని, చాలా మంది లైఫ్‌జాకెట్ వేసుకోలేదని పేర్కొంది. బోటు ప్రయాణం మొదలైన గంట తర్వాత ఒక్కసారిగా కుదుపు వచ్చిందని... తేరుకునేలోపే పడవ బోల్తాపడిందని వివరించింది. లైఫ్‌జాకెట్ ఉన్న నేను నీటిపై తేలియాడుతుండగా జాలర్లు వచ్చి కాపాడినట్టు లక్ష్మి తెలిపింది. లక్ష్మిని పరామర్శించిన ఎమ్మెల్యే గుడివాడ రాజమండ్రి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న భూసాల లక్ష్మిని అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ సోమవారం పరామర్శించారు. నిబ్బరంగా ఉండాలని ధైర్యం చెప్పారు. వైఎస్సార్సీపీ మండల పార్టీ అధ్యక్షుడు గొర్లి సూరిబాబు కూడా లక్ష్మిని పరామర్శించారు. గోదారమ్మ..నా పిల్లలెక్కడమ్మా..? ఆరిలోవ(విశాఖ తూర్పు): గోదావరిలో ఆదివారం జరిగిన బోటు ప్రమాదంలో మృతి చెందిన అప్పలనరసమ్మ మృతదేహానికి ఆరిలోవలో సోమవారం అంత్యక్రియలు జరి గాయి. విశాఖ నుంచి ఆరిలోవ ప్రాంతం దుర్గాబజార్‌కు చెందిన ఆమె తన ఇద్దరు మనవరాళ్లును తీసుకొని బంధువులతో కలసి పాపికొండలు యాత్రకు వెళ్లిన విషయం తెలిసిందే. బోటు ప్రమాదంలో ఆమెతో పాటు ఆమె ఇద్దరు మనవరాళ్లు వైష్ణవి, అనన్య గల్లంతయ్యారు. బోటు ప్రమాదంలో ఆరిలోవకు చెం దిన ముగ్గురు గల్లంతు కావడంతో చినగదిలి తహసీల్దారు ఆర్.నర్సింహమూర్తి, సిబ్బంది ఆదివారం సాయంత్రమే రాజమండ్రి చేరుకొన్నారు. అక్కడ అప్పలనరసమ్మ మృతదేహం ఆదివారం రాత్రి లభ్యంకావడంతో అంబులెన్స్‌లో ఆరిలోవ చేర్చారు. తల్లి మృతదేహాన్ని చూసి కొడుకు అప్పలరాజు, కోడలు భాగ్యలక్ష్మి గుండెలవిసేలా రోదించారు. నా బంగారు కొండలైనా క్షేమంగా ఉన్నారా అమ్మా అంటూ అప్పలరాజు విలపించాడు. ఇద్దరు పిల్లలూ గల్లంతయ్యారన్న షాక్‌లో భాగ్యలక్ష్మి విలపిస్తోంది. భాగ్యలక్ష్మి అనారోగ్యంతో బాధపడుతోంది. ఈ కారణంగానే ఏడాది వయసున్న చిన్నారి అనన్యని తల్లి పాలు మాన్పించాలని భావించారు. ఈ నిర్ణయమే ఆ చిన్నారుల పాలిట మృత్యు గీతంగా మారింది. అత్తమ్మని పొట్టన పెట్టుకున్నావ్ గోదారమ్మ తల్లీ.. నా పిల్లలెక్కడున్నారమ్మా.. నా అనారోగ్యమే వారి పాలిట శాపంగా మారిందంటూ రోదిస్తున్న భాగ్యలక్ష్మిని ఓదార్చడం ఎవ్వరితరమూ కాలేదు. బాధితులకు ఎంపీ ఎంవీవీ పరామర్శ.. అప్పలనరసమ్మ మృతి వార్త వినగానే స్థానికులతో పాటు ప్రజాప్రతినిధులు, నాయకులు విషాదం వ్యక్తం చేశారు. ఇందులో భాగంగా సోమవారం ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ చిన్నారులు, తల్లిని కోల్పోయిన అప్పలరాజు, భాగ్యలక్ష్మిని వారి ఇంటికి వెళ్లి పరామర్శించారు. ప్రభుత్వం తరపున ఆర్థిక సహకారం తొందరలోనే అందిస్తామని, తన వంతు సహకారం అందిస్తానని బాధితులకు హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు, వైఎస్సార్సీపీ నగర అధ్యక్షుడు సీహెచ్.వంశీకృష్ణ శ్రీనివాస్, తూర్పు నియోజకవర్గం సమన్వయకర్త అక్కరమాని విజయనిర్మల పరామర్శించి ఓదార్చారు. పెద్ద కుమారుడు అప్పలరాజు తల్లికి తలకొరివిపెట్టి అంత్యక్రియలు నిర్వహించారు. అమ్మా మాట్లాడమ్మా.. చెల్లి ఎక్కడుందమ్మా..? పెందుర్తి: ‘అమ్మా లెగమ్మా.. మాట్లాడమ్మా.. నా చెల్లెలు ఏదమ్మా.. ఇప్పుడు నాకు తోడెవరమ్మా.. నెనెవరితో ఆడుకోవాలమ్మా.. ఎవరితో గిల్లికజ్జాలు పెట్టుకోవాలమ్మా.. చెల్లెప్పుడు వస్తాదమ్మా.. మమ్మల్ని వదిలేసి ఎందుకు వెళ్లిపోయావమ్మా.. నాన్నకు నాకు దిక్కెవరమ్మా’ అంటూ వేపగుంటకు చెందిన బొండా లక్ష్మి పెద్దకుమార్తె రమ్య తల్లి మృతదేహం వద్ద విలపించిన తీరు ప్రతీ ఒక్కరినీ కన్నీరు పెట్టించింది. పాపికొండలు విహారయాత్రకు వెళ్లి గోదావరి నదిలో ఆదివారం జరిగిన బోటు ప్రమాదంలో గల్లంతైన బొండా లక్ష్మి(37) మృతి చెందింది. ఆమెతోపాటు వెళ్లిన చిన్నకుమార్తె పుష్ప(13) ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు. ప్రమాద స్థలానికి చేరుకున్న బంధువులు లక్ష్మి మృతదేహాన్ని గుర్తించడంతో సోమవారం ఉదయం రామమండ్రి ప్రభుత్వాసుపత్రిలో పోస్టుమార్టం పూర్తి చేశారు. అనంతరం రోడ్డు మార్గంలో లక్ష్మి మృతదేహాన్ని వేపగుంటకు తరలించారు. శనివారం సాయంత్రం ఇంటిలో అందరికీ జాగ్రత్తలు చెప్పి యాత్రకు బయలుదేరిన లక్ష్మి విగతజీవిగా కనిపించడంతో భర్త శంకరరావు, పెద్ద కుమార్తె రమ్య తల్లడిల్లిపోయారు. లక్ష్మి అత్తామామ, తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, బంధువులు లక్ష్మి మృతదేహం వద్ద బోరున విలపించారు. శంకర్, రమ్యలను ఓదార్చడం ఎవరితరమూ కాలేదు. వేపగుంట శ్మశానవాటికలో లక్ష్మి అంత్యక్రియలు పూర్తి చేశారు. ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్‌రాజ్ లక్ష్మి నివాసానికి చేరుకుని కుటుంబసభ్యులను ఓదార్చారు. మాకు దిక్కెవరమ్మా.. మధ్య తరగతి కుటుంబానికి చెందిన బొండా శంకరరావు, లక్ష్మి దంపతులు ఇద్దరు ఆడపిల్లలను అల్లారుముద్దుగా పెంచుకుంటున్నారు. శంకర్ ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషించుకుంటూ పిల్లలను ప్రైవేటు పాఠశాలల్లో చదివిస్తున్నాడు. పెద్ద కుమార్తె రమ్య తొమ్మిదో తరగతి కాగా.. చిన్న కుమార్తె పుష్ప ఎనిమిదో తరగతి చదువుతుంది. రమణబాబు కటుంబంతో కలిసి ఆదివారం వేకువజామున రాజమండ్రి రైలులో చేరుకుని బోటు షికారుకు విశిష్ట బోటు ఎక్కారు. ఆ బోటు ప్రమాదంలో మధుపాడ రమణబాబు కుటుంబసభ్యులు సహా లక్ష్మి, పుష్ప గల్లంతయ్యారు. లక్ష్మి మృతదేహాన్ని ఆదివారం అర్ధరాత్రి గుర్తించారు. ఇంకా పుష్ప ఆచూకీ లభించలేదు. ఓ వైపు లక్ష్మి మృతి.. మరోవైపు పుష్ప గల్లంతు కావడంతో ఆ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. తమకు దిక్కెవరంటూ శంకర్, రమ్య రోదిస్తున్నారు. ఈ ఘటనతో వేపగుంటలో తీవ్ర విషాదం అలముకుంది. -
గోపాలపురంలో విషాద ఛాయలు
సాక్షి, అనకాపల్లి/తుమ్మపాల: పాపికొండలను వీక్షించేందుకు వెళ్లిన అనకాపల్లి మండలం గోపాలపురం గ్రామానికి చెందిన ముగ్గురు గల్లంతయ్యారు. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఆదివారం పాపికొండలకు వెళ్లేందుకు బోటు ఎక్కిన గోపాలపురానికి చెందిన నలుగురిలో ముగ్గురు ఆచూకీ ఇంకా లభించకపోవడంతో వారి కుటుంబీకులు ఆందోళన చెందుతున్నారు. తమవారు క్షేమంగా ఇంటికి చేరాలని దేవుళ్లకు మొక్కుకుంటున్నారు. మరోపక్క గ్రామంలో నిశ్శబ్ద వాతావరం నెలకొంది. గల్లంతయిన వారి యోగక్షేమాలు తెలియకపోవడంతో ఏం జరుగుతుందోనన్న భయం అందరిలో నెలకొంది. గోపాలపురానికి చెందిన పెదిరెడ్డి దాలమ్మ(45), తన సోదరీమణి భూసాల లక్ష్మితో కలిసి పాపికొండలకు వెళ్లాలని భావించారు. వీరితో పాటు లక్ష్మి మనుమరాలు సుస్మిత(3)తో పాటు పక్కింటి అమ్మాయి భూసాల పూర్ణ(18)ను కూడా తీసుకువెళ్లారు. లక్ష్మి కుమార్తె అరుణకు చేనుల అగ్రహారానికి చెందిన రమణతో పెళ్లి అయ్యింది. చేనుల అగ్రహానికి చెందిన మధుపాడ రమణ, అరుణ దంపతులు ప్రస్తుతం విశాఖ పట్నంలోని ఆరిలోవలో ఉంటున్నారు. గోపాలపురానికి చెందిన నలుగురితో పాటు, ఆరిలోవలో ఉంటున్న రమణ, అరుణ దంపతులతో పాటు వారి పిల్లలు అఖిలోష్, కుషాలిలతో కలిపి ఎనిమిది మంది శనివారం సాయంత్రం రైలులో విశాఖపట్నం నుంచి రాజమండ్రి వెళ్లారు. అక్కడి నుంచి బోటులో పాపికొండలకు వెళ్తుండగా బోటు బోల్తాపడి అందులో ఉన్నవారు గల్లంతుకాగా, భూసాల లక్ష్మి సురక్షితంగా బయటపడింది. ఈమెను రంపచోడవరం ఏరియా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. లక్ష్మితో అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ ఫోన్లో మాట్లాడి ఆమె పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత గోపాలపురానికి వెళ్లి బాధిత కుటుంబీకులతో మాట్లాడి ధైర్యం చెప్పే ప్రయత్నం చేశారు. బాధిత కుటుంబీకులను రంపచోడవరం ప్రాంతానికి తరలించేందుకు సహకరిస్తానని హామీ ఇచ్చారు. అంతే కాకుండా గ్రామంలో విషాదఛాయలు ఏర్పడటంతో తహసీల్దార్ వైఎస్ వీవీ ప్రసాద్, ఎస్సై రామకృష్ణలు గోపాలపురానికి చేరుకున్నారు. మరోవైపు గోపాలపురంలోని బాధిత కుటుంబీకులు అంతా రోదనలో మునిగిపోయారు. వీరిని స్థానికుడైన వైఎస్సార్ సీపీ మండల అధ్యక్షుడు గొర్లె సూరిబాబు, వైఎస్సార్ సీపీ మండల ప్రధాన కార్యదర్శి భీశెట్టి జగన్‌లు పరామర్శించారు. లక్ష్మి సురక్షితంగా ఉన్నప్పటికీ పెదిరెడ్డి దాలమ్మ, పూర్ణ, సుశ్మితలు ఎక్కడున్నారనే ఆందోళనతో స్థానికులు ఉన్నారు. ఎమ్మెల్సీ బుద్ధ నాగజగదీశ్ కూడా బాధిత కుటుంబీకుల్ని పరామర్శించారు. వేపగుంటలో విషాదం పెందుర్తి: బోటు ప్రమాదంలో వేపగుంట ప్రాంతానికి చెందిన తల్లీ కూతురు గల్లంతయ్యారన్న సమాచారంతో ఆదివారం తీవ్ర విషాదం నెలకొంది. వేపగుంట ముత్యమాంబ కాలనీకి చెందిన బొండా శంకర్రావు, లక్ష్మి(37) దంపతులకు ఇద్దరు కుమార్తెలు. పాపికొండలకు వెళ్లేందుకు నగరంలోని బంధువులతో కలిసి ఆదివారం వేకువజామున లక్ష్మి, పెద్ద కుమార్తె పుష్ప బయలుదేరి వెళ్లారు. మధ్యాహ్నం జరిగిన ప్రమాదంలో తల్లీ కుమార్తెలు గల్లంతుకావడంతో బంధువులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. వాస్తవానికి వీరితోపాటు శంకర్రావు, చిన్న కుమార్తె కూడా వెళ్లాల్సి ఉండగా ఇంటి వద్ద పని ఉండడంతో ఉండిపోయారు. అప్రమత్తమైన కలెక్టర్.. మహారాణిపేట(విశాఖ దక్షిణ): గోదావరిలో జరిగిన బోటు ప్రమాదంలో విశాఖ జిల్లా వాసులు ఉండటంతో కలెక్టర్ వి.వినయ్‌చంద్ అప్రమత్తమయ్యారు. తక్షణం కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి టోల్‌ఫ్రీ నంబర్ ప్రకటించారు. ఘటన జరిగిన ప్రాంతానికి ఆర్డీవో కిశోర్, టూరిజం అధికారులను పంపారు. అలాగే బాధిత కుటుంబాల ఇళ్లకు వెళ్లి వివరాలు సేకరించాలని మహారాణిపేట తహసీల్దార్‌ను ఆదేశించారు. షాక్‌లో భూసాల లక్ష్మి.. అనకాపల్లి: పాపికొండలకు వెళ్తూ బోటు బోల్తా పడిన ఘటనలో సురక్షితంగా బయటపడిన భూసాల లక్ష్మి తీవ్ర షాక్‌లో ఉంది. పడవ మునిగిన తర్వాత ఎలా ఒడ్డుకు చేరానో తెలియలేదంటూ ఆమె సాక్షికి తెలిపింది. తన వారు ఏమయ్యారంటూ ఆందోళనగా ప్రశ్నిస్తోంది. రంపచోడవరంలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆమెను కుటుంబీకులు ఓదార్చే ప్రయత్నం చేశారు. మిగిలిన వారంతా మరో ఆస్పత్రిలో ఉన్నారని లక్ష్మి సర్దిచెప్పినప్పటికీ ఆమె షాక్ నుంచి కోలుకోలేదు. కాగా ఫోన్లో అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ బాధితురాలితో మాట్లాడి ధైర్యం చెప్పారు. బాధిత కుటుంబీకులకు వెన్నుదన్నుగా ఉంటానని ఎమ్మెల్యే తెలిపారు. సోమవారం ఉదయం ప్రమాదం జరిగిన ప్రాంతంతో పాటు లక్ష్మి చికిత్స పొందుతున్న ప్రాంతానికి ఎమ్మెల్యే వెళ్లనున్నారు. ప్రమాదం దురదృష్టకరం.. పాపికొండల్లో విహార యాత్రలో విషాదం చోటుచేసుకోవడం దురదృష్టకరం. మృతుల కుటుం బాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలి. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. ఇప్పటికే చికిత్స పొందుతున్న వారిని మంత్రులు పరామర్శించారు. వారంతా త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా. – వంశీకృష్ణ శ్రీనివాస్, విశాఖ నగర అధ్యక్షుడు, వైఎస్సార్ సీపీ గతంలోనూ అదే చోట ప్రమాదాలు.. దురదుష్టవశాత్తూ జరిగిన బోటు ప్రమాదంలో విశాఖ వాసులు గల్లంతవ్వడం బాధాకరం. మృతి చెందిన వారి కుటుం బాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. బాధితులకు ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుంది. గతంలో అదే ప్రదేశంలో రెండు ప్రమాదాలు జరిగాయి. –కొయ్య ప్రసాదరెడ్డి, వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి -
ఏమయ్యారో?
సాక్షి, విశాఖపట్నం, పాతపోస్టాఫీసు : గోదావరి నదిలో జరిగిన బోటు ప్రమాదం విశాఖ నగరంతోపాటు ఆరిలోవ, వేపగుంట, అనకాపల్లిలో తీవ్ర విషాదం నింపింది. ఈ ప్రమాదంలో నగరానికి 12 మంది గల్లంతుకాగా ఒకరు సురక్షితంగా బయటపడ్డారు. ఈ విషాదకర ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. నగరంలోని మహారాణిపేట, కొల్లూరు మేన్షన్ ప్రాంతం, రామలక్ష్మి కాలనీ డోర్ నెంబరు 14–33–37/ 9బి ఇంట్లో నివాసం ఉంటున్న ప్రైవేటు కారు డ్రైవరు మధుపాడ రమణబాబు (35), అతడి భార్య మధుపాడ అరుణ కుమారి (26), అఖిలేష్ (7), కమార్తె కుషాలి (5)లతో పాటు ఆరిలోవ ప్రాంతానికి చెందిన రమణబాబు పెద్ద అక్క తలారి అప్పలనర్సమ్మ(60), ఆమె మనవరాళ్లు గీత వైష్ణవి(3), అనన్య(1), వేపగుంటలో నివాసం ఉంటున్న రమణబాబు చిన్న అక్క బొండ పైడికొండ అలియాస్ లక్ష్మి(35), ఆమె కుమార్తె పుష్ప(15), అనకాపల్లి మండలం రేబాక కూడలి, గోపాలపురం ప్రాంతానికి చెందిన రమణబాబు పెద్ద అత్త బూసా లక్ష్మి(40), ఆమె పిల్లలు బోశాల సుస్మిత(3), పూర్ణ(18), చిన్న అత్త పెద్దిరెడ్డి దాలెమ్మ(45)లు శనివారం రాత్రి రమణబాబు ఇంటికి చేరుకుని ఆదివారం తెల్లవారు జామున 4 గంటలకు రైలులో రాజమండ్రి బయలుదేరి వెళ్లారు. ఉదయం 8 గంటలకు రాజమండ్రి చేరుకున్నామని రామలక్ష్మినగర్లో నివాసముంటున్న రామకృష్ణకు, ఆరిలోవలో ఉన్న అప్పలనర్సమ్మ కుమారుడికి ఫోన్ చేసి చెప్పారు. అక్కడి నుంచి బోటు ఎక్కి భద్రాచలం వెళ్తున్నట్లు చెప్పారు. ఇంతలో టీవీల ద్వారా ప్రమాదం విషయం తెలుసుకున్న రామకృష్ణ, కుటుంబ సభ్యులు ఉలిక్కి పడ్డారు. ఆందోళన చెందుతూ రమణబాబుకు ఫోన్ చెయ్యగా పనిచెయ్య లేదు. ఇతర కుటుంబ సభ్యులకు ఫోన్ చేసినా స్విచ్ ఆఫ్ వస్తుండటంతో కలెక్టరేట్లో ఉన్న కంట్రోల్ రూమ్‌ని ఆశ్రయించారు. తమ కుటుంబ సభ్యుల జాడ తెలియకపోవడంతో కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. వెంటనే కుటుంబ సభ్యులు రాత్రి 7.30 గంటల ప్రాంతంలో విశాఖ నుంచి ఘటనా స్థలానికి బయలుదేరారు. అసలు వారేమయ్యారు.. సురక్షితంగా ఉన్నారా..? ప్రమాదంలో చిక్కుకున్నారా.? ఊహకందని ప్రమాదంలో వీరికేమైనా జరిగుంటుందా..? అనే ఆందోళన అందరిలోనూ మొదలైంది. ఎవ్వరికీ ఏ ప్రమాదం జరగకుండా సురక్షితంగా బయటపడాలంటూ విశాఖ ప్రార్థిస్తోంది. మాటలు కూడా రాని ఆ ఏడాది చిన్నారి.. ఏ పరిస్థితుల్లో ఉందోనని తల్లిదండ్రులు విలపిస్తున్నారు. రమణబాబు పెద్ద అత్త బూసా లక్ష్మి రాజమండ్రిలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. బోటు యజమానిది పెందుర్తి.. గోదావరిలో ప్రమాదానికి గురైన బోటు విశాఖ జిల్లా పెందుర్తి మండలం సరిపల్లి గ్రామానికి చెందిన కోడిగుడ్ల వెంకటరమణదిగా గుర్తించారు. నాలుగేళ్లుగా శ్రీ వశిష్ట పున్నమి రాయల్ పేరుతో బోటును పర్యాటకం కోసం నడుపుతున్నాడు. గోదావరిలో జల రవాణాకు అనుమతి లేకపోయినా విహార యాత్రలకు వినియోగిస్తున్నారు. అదే ప్రాంతానికి చెందిన రాజు ఈ సర్వీసు ప్రారంభమైనప్పటి నుంచి బోటు డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. ఈయన మృతి చెందినట్లు సమాచారం. రాజు కుటుంబమంతా సరిపల్లి నుంచి దేవీపట్నం వలస వెళ్లిపోయారు. డ్రైవర్ రాజు ఆదివారం సెలవు పెట్టినట్లు గ్రామస్తులు చెబుతున్నారు. అయితే ప్రమాదంలో మృతిచెందిన బోటు డ్రైవర్లు ఇద్దరి పేర్లూ రాజు కావడంతో ఆ రాజు ఇతనేననే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వద్దన్నా.. వినకుండా.. బంధువులు ఇచ్చిన సమాచారం మేరకు... రమణబాబు కుటుంబ సభ్యులు గత ఆగస్టు 24న భద్రాచలం బయలుదేరాల్సి ఉంది. అయితే వర్షాల కారణంగా ఆ ప్రయాణాన్ని ఆదివారానికి వాయిదా వేసుకున్నారు. గోదావరిలో వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తుందని తెలుసుకున్న బంధువులంతా ప్రయాణాన్ని రద్దు చేసుకోవాలని కోరారు. అయినా వీరంతా వినిపించుకోలేదు. ఇప్పటికే ఆలస్యమైపోయింది... ఎలాగైనా ఆదివారం వెళ్లిపోతామని చెప్పి బయలుదేరారు. ఈ ప్రయాణమే తీరని శోకం మిగులుస్తుందని అనుకోలేదని బంధువులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఒకే కుటుంబానికి చెందిన 12 మంది గల్లంతుకావడంతో విశాఖ శోకసంద్రంలో మునిగిపోయింది. టీవీలో చూసి తెలుసుకున్నాం.. రామలక్ష్మీ కాలనీలో మా ఇంట్లో దిగువ పోర్షన్లో రమణబాబు తన కుటుంబంతో అద్దెకు ఉంటున్నాడు. టీవీలో బోటు ప్రమాదం వార్త చూసిన వెంటనే నా కుమార్తె, అల్లుడు వారి స్నేహితులను సంప్రదించారు. అప్పుడే విషయం తెలుసుకున్నాం. ఒకేసారి ఇంతమంది గల్లంతవ్వడం బాధాకరం. అందరితో కలిసిమెలిసి ఉండే కుటుంబానికి ఇలా జరిగిందంటే నమ్మలేకపోతున్నాం. – మధుపాడ లక్ష్మి, రామలక్ష్మీ కాలనీ (రమణబాబు ఒదిన) వార్తల ద్వారా తెలిసింది.. ఎలక్ట్రికల్ దుకాణంలో పనిచేస్తుండగా సాయంత్రం 6 గంటలకు వార్తల ద్వారా విషయం తెలిసింది. ఆదివారం ఉదయం 4 గంటలకు వీరంతా బయలుదేరి వెళ్లారు. వెళ్లిన వారంతా ఎలా ఉన్నారన్న సమాచారం తెలియదు. వీరంతా బోటు ప్రమాదంలో గల్లంతయ్యారని, గోపాలపురం ప్రాంతానికి చెందిన బూసా లక్ష్మి మాత్రం ఆస్పత్రిలో చికిత్స పొందుతుందన్న వార్త టీవీలో చూపించారు. – గొర్లె అప్పలరాజు, రామలక్ష్మీ కాలనీ, (రమణబాబు అన్న కొడుకు) తల్లడిల్లుతున్న హృదయాలు.. చిట్టితల్లుల కోసం ఎదురుచూస్తున్న తల్లిదండ్రులు: ఆరిలోవ(విశాఖ తూర్పు): తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి దరి పాపికొండల విహారయాత్రకు వెళ్తూ గోదావరిలో జరిగిన బోటు ప్రమాదంలో ఆరిలోవ ప్రాంతానికి చెందిన వారు గల్లంతవడంతో విషాదం నెలకొంది. స్థానికులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం... ఆరిలోవ ప్రాంతం ఒకటో వార్డు పరిధి దుర్గాబజార్ దరి సాయినగర్‌కు చెందిన తలారి అప్పలనరమ్మ తన కొడుకు, కోడలుతో నివాసముంటోంది. ఆమె తన తమ్ముడైన రమణబాబు కుటుంబీకులతో కలిసి పాపికొండలు వెళ్లడానికి తన ఇద్దరు మనవరాళ్లు వైష్ణవి(3), అనన్య(1 సంవత్సరం మూడు నెలలు)తో కలిసి ఆదివారం వేకువన రైలులో బయలుదేరారు. రాజమండ్రిలో దిగి పాపికొండలు వెళ్లడానికి గోదావరిలో బోటు ఎక్కి ప్రమాదంలో చిక్కుకొన్నారు. వారి ఆచూకీ తెలియకపోవడంతో అధికారులు గల్లంతైన వారి జాబితాలో వారి పేర్లును చేర్చారు. బోటు ప్రమాదం విషయం తెలిసినప్పటి నుంచి చిన్నారులు వైష్ణవి, అనన్య తల్లిదండ్రులు భాగ్యలక్ష్మి, అప్పలరాజు కన్నీటిపర్యంతమవుతున్నారు. వారు విలపించిన తీరు స్థానికులను కంటతడిపెట్టిస్తోంది. చిన్న పిల్లలను నాన్నమ్మతో పంపించడమే మేము చేసిన తప్పా అంటూ విలపిస్తున్నారు. బోటు ప్రమాదంలో ఆరిలోవ ప్రాంతానికి చెందిన ముగ్గురు గల్లంతయ్యారనే విషయం ఈ ప్రాంతమంతా దావానంలా వ్యాపాంచింది. చుట్టుపక్కల కాలనీవారంతా వారి నివాసానికి చేరుకొని విలపిస్తున్న చిన్నారుల తల్లిదండ్రులను ఓదార్చుతున్నారు. తల్లి నుంచి పాలు మాన్పించాలనే ఆలోచనతో పిల్లలను నాన్నమ్మతో పంపించినట్లు స్థానికులు అంటున్నారు. దిగ్భ్రాంతికి గురయ్యా.. గోదావరిలో బోటు ప్రమాదం విషయం తెలుసుకుని తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యా. గల్లంతైన వారిలో 12 మంది విశాఖ జిల్లాకు చెందిన వారున్నారన్న తెలిసి తీవ్రంగా కలతచెందా. వారి ఆచూకీ తెలుసుకునేందుకు పర్యాటక శాఖ తరఫున రక్షణ చర్యలు చేపడుతున్నాం. ప్రమాదానికి కారణమైన బోటుకు పర్యాటక శాఖ నుంచి ఎలాంటి అనుమతులు లేవు. గల్లంతైన వారి ఆచూకీ కోసం టూరిజం విభాగం నుంచి రెండు బోట్లు సంఘటన స్థలానికి తీసుకొచ్చాం. – మంత్రి అవంతి శ్రీనివాసరావు -
ఆపదలో 40 మంది విశాఖవాసులు
ఇరాక్‌లో ఓ కంటైనర్లోతిండీ, నీళ్లూ లేకుండా.. వారిని సురక్షితంగా తీసుకురావాలని స్నేహితుల వినతి ఏజెంట్ మోసంతో నెలలుగా ఢిల్లీలో మరికొందరి పడిగాపులు ‘సాక్షి’తో గోడు వెళ్లబోసుకున్న బాధితులు సాక్షి, న్యూఢిల్లీ: బతుకుతెరువు కోసం ఇరాక్ వెళ్లిన తెలుగువారు ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని కాలం వెళ్లదీస్తున్నారు. అంతర్యుద్ధంతో అట్టుడుకున్న ఆ దేశంలోని నజాఫ్‌లో దాదాపు 40 మంది విశాఖపట్నం జిల్లా వాసులు ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. తమను పనిలోకి తీసుకున్న కంపెనీ తమను ఓ కంటైనర్ ఉంచిందని, తిండీ, నీళ్లూ లేకుండా భయం భయంగా గడుపుతున్నామని, తమను కాపాడాలని వేడుకుంటున్నారు. వీరు ఈ నెల 18నే ఇరాక్ వెళ్లారు. వీరి స్నేహితులు ఆదివారం ఢిల్లీలో ‘సాక్షి’ కార్యాలయానికి వచ్చి ఈ వివరాలు వెల్లడించారు. బాధితులను సురక్షితంగా భారత్‌కు తీసుకురావాలని కేంద్ర, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేశారు. ఇరాక్ వెళ్లేందుకు ఢిల్లీ వరకు వచ్చి ఏజెంట్ల మోసం వల్ల ఆగిపోయిన మరికొందరు విశాఖ వాసులు కూడా తమకు సాయం చేయాలని కోరారు. రాజమండ్రి సమీపంలోని రావులపాలెం మండలం ఓబలంక గ్రామానికి చెందిన మేడిపాటి వెంకటకృష్ణ అనే ఏజెంట్ తమను ఇరాక్‌కు పంపుతానని మోసం చేశాడని ఆరోపించారు. తమ వద్ద నుంచి లక్షల్లో డబ్బులు దండుకుని, పాస్‌పోర్టులు తీసుకుని తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాడని వాపోయారు. విశాఖ జిల్లాకు చెందిన పి. బాపినాయుడు(కసిమికోట), కృష్ణ(హరిపాలెం), ఎం ఉమామహేశ్వరావు, మల్ల అప్పారావు, శివకుమార్, శంకర్, సురేశ్(తిమ్మరాజిపేట) తదితర బాధితులు సాక్షితో గోడు వెళ్లబోసుకున్నారు. ‘ఇరాక్‌లో మా జిల్లా వాళ్లు 40 మంది దాకా ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. రెండు రోజుల కిందట మాతో ఫోన్లో మాట్లాడారు. ఓ కంటైనర్‌లో ఉన్నామని, భోజనం, నీళ్లు అందడం లేదని చెప్పారు. తమను ఎలాగైనా కాపాడాలని కోరారు’ అని ఉమామహేశ్వరరావు చెప్పాడు. రెండు నిమిషాలే మాట్లాడారని, వాళ్ల ఫోన్లు కలవడం లేదని తెలిపాడు. ఇరాక్ పరిస్థితులు తెలిసి కూడా ఏమీ జరగదని నమ్మించి వెంకటకృష్ణ వారిని ఈ నెల 18న అక్కడికి పంపారని మల్ల అప్పారావు ఆరోపించారు. ఢిల్లీలో నెలలుగా పడిగాపులు..: ఇరాక్ వెళ్లేందుకు లక్షల్లో సొమ్ము ఇచ్చి మోసపోయిన బాధితులు ఢిల్లీలో నెలలుగా పడిగాపులు కాస్తున్నారు. వీరిలో కొందరు ఇరాక్ వెళ్లి వచ్చిన వారు కూడా ఉన్నారు. హరిపాలెంకు చెందిన కృష్ణ అనే బాధితుడు మాట్లాడుతూ.. ‘ఫిట్టర్లు, వెల్డర్లకు ఇరాక్‌లో మంచి జీతాలు ఉంటాయని వెంకటకృష్ణ చెబితే ఆశపడ్డాం. ఒక్కొక్కరం రూ.1.5 లక్షల వరకు ఇచ్చాం. మా డబ్బులు, పాస్‌పోర్టులు తీసుకుని మమ్మల్ని మార్చిలో ఇరాక్ పంపారు. బాగ్దాద్ ఎయిర్‌పోర్టులో తనిఖీలో మావి నకిలీ వీసాలని తెలిసి పోలీసులు పట్టుకున్నారు. చాలా ఇబ్బందులు పడి తిరిగొచ్చాం. ఢిల్లీకి వచ్చిన ఏజెంట్‌ను పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నాం. తిండి తిప్పలు లేవు. వెంకటకృష్ణ మా జిల్లా వాళ్ల నుంచి రూ.60 లక్షలు దండుకున్నాడు’ అని తెలిపాడు. వెంకటకృష్ణ నకిలీ వీసాలు చూపుతూ తమను మోసగిస్తున్నాడని మరో బాధితుడు చెప్పాడు. డబ్బులు, పాస్‌పోర్టుల కోసం ఆనంద్నికేతన్లోని ఏజెంట్ ఆఫీసు చుట్టూ తిరిగామని, ఓ చెక్కు ఇచ్చి చేతులు దులుపుకున్నారని బాబినాయుడు అనే బాధితుడు చెప్పాడు. ఇరాక్‌లో చిక్కుకున్న తమ స్నేహితులనురప్పించి, ఏజెంట్ మోసాల బారినుంచి కాపాడేందుకు ప్రభుత్వాలు చొరవ తీసుకోవాలని బాధితులు కోరారు. బాధితుల వివరాలు సేకరించిన ఏపీ ప్రభుత్వం బాధితుల గోడుపై ఏపీ ప్రభుత్వం స్పందించింది. ఢిల్లీలోని ఏపీభవన్‌లో ఏపీ ప్రభుత్వ అధికార ప్రతినిధి కంభంపాటి రామ్మోహన్రావు కార్యాలయ వర్గాలు బాధితులు వివరాలతోపాటు, ఇరాక్‌లో చిక్కుకున్న వారి వివరాలను సేకరించాయి. ఈ అంశాన్ని సోమవారం విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ దృష్టికి తీసుకెళ్తామన్నాయి. మరో రెండు పట్టణాలు మిలిటెంట్ల చేతికి.. బాగ్దాద్: ఇరాక్‌లో సున్నీ మిలిటెంట్లు మరో రెండు పట్టణాలను స్వాధీనం చేసుకున్నారు. శనివారం సిరియా సరిహద్దులోని వ్యూహాత్మక అల్ కాయిమ్ క్రాసింగ్‌పై పట్టు సాధించిన ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ లెవాంట్ జిహాదీలు ఆదివారం రవా, అనా పట్టణాలను చేజిక్కించుకున్నారు. వీరి ధాటికి ఈ పట్టణాలతో పాటు, అల్ క్వాయిమ్ నుంచి ప్రభుత్వ బలగాలు వ్యూహాత్మకంగా తప్పుకున్నాయి. అక్కడి తిరిగి మోహరించేందుకే తప్పుకున్నామని ప్రభుత్వం తెలిపింది. మిలిటెంట్ల స్వాధీనంలోని తిక్రిత్‌లో వాయుసేన దాడుల్లో ఏడుగురు పౌరులు చనిపోయారు. సున్నీ మిలిటెంట్లు తమ అధీనంలోని మోసుల్‌లో షరియా చట్టాలను కఠినంగా అమలు చేస్తున్నారని బాధితులు చెబుతున్నారు. కాగా, ఇరాక్ మిలిటెంట్లు బలం పుంజుకుని, పొరుగు దేశాలనూ అస్థిరపరచే అవకాశముందని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ఆందోళన వ్యక్తం చేశారు. ఇరాక్‌లో బందీలైన భారతీయుల విడుదల కోసం ఇరాక్‌లో భారత రాయబారిగా పనిచేసిన సురేశ్ రెడ్డి అక్కడి అధికారులతో చర్చిస్తున్నారు. -
చీకట్లు
గాడాంధకారంలో గ్రామీణ విశాఖ విద్యుత్ లేక అల్లాడుతున్న జనం సాగు, తాగునీటికి అవస్థలు చిరు వ్యాపారుల ఉపాధికి గండి అసలే మండువేసవి. అపై విద్యుత్ సరఫరా నిలిపివేత. విద్యుత్ ఉద్యోగుల సమ్మె‘ట’ దెబ్బకు జనజీవనం కళ్లు బైర్లు కమ్ముతోంది. ఎప్పుడు విద్యుత్ ఉంటుందో తెలియదు. ఎప్పుడొస్తుందో అంతుబట్టదు. విద్యుత్‌పైనే బతుకు బండిని నడిపే చిరు వ్యాపారులది మరీ దైన్యం. వ్యాపారం సాగక విలవిల్లాడిపోతున్నారు. గ్రామీణ విశాఖ ప్రజలు ‘ఉక్క’రిబిక్కిరవుతున్నారు. విద్యుత్ సిబ్బందితో ప్రభుత్వ చర్చలు ఫలించకపోతే మంగళవారం పరిస్థితి మరింత దిగజారే ప్రమాదముంది. సాక్షి, విశాఖపట్నం: విద్యుత్ ఉద్యోగుల సమ్మెతో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. సమైక్యాంధ్ర ఉద్యమ సమయంలో కనీసం పగటిపూట విద్యుత్ అంతరాయాలున్నా.. సాయంత్రానికి సిబ్బంది జాలి తలచేవారని, ప్రస్తుతం అదీ లేదని వాపోతున్నారు. పట్టణ ప్రాంతాల్లో కొంతలో కొంత మెరుగ్గా ప్రయివేటు సిబ్బందితో మరమ్మతులు కానిచ్చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతవాసులు మరీ నరకం చవిచూస్తున్నారు. సాధారణంగా సిబ్బంది సమ్మెలో ఉన్నపుడు విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడితే మరమ్మతులు చేపట్టే పరిస్థితి ఉండదు. గ్రామీణ ప్రాంతాల్లో చాలా చోట్ల విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడకపోయినా.. సిబ్బంది సమ్మెలోకి వెళ్తూ ఫ్యూజ్‌లు పీకి పట్టుకెళ్లిన సంఘటనలున్నాయి. దీంతో స్థానికంగా కరెంట్ పనులు తెలిసినవారితో సరఫరా పునరుద్ధరించడానికి కూడా వీలుకాని పరిస్థితులు నెలకొన్నాయి. నగర శివారు ప్రాంతాలతోపాటు, గ్రామీణ జిల్లాలో ఈ పరిస్థితి ఎక్కువగా ఉంది. మోటారు పంపింగ్ ద్వారా నీటి సరఫరా చేసే ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా లేక, నీళ్లు రాక జనాలు అల్లాడారు. సోమవారం చర్చలు ప్రారంభం కావడంతో.. ఉద్యోగులు పూర్తిగా తమ ప్రతాపం చూపలేదని ఈపీడీసీఎల్ ఉన్నతాధికారులు చెబున్నారు. మధ్యాహ్నం చర్చలు విఫలమయ్యాక కొన్ని చోట్ల విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. మళ్లీ రాత్రి చర్చలు ప్రారంభమయ్యాయి. విద్యుత్ ఉద్యోగులు సమ్మె విరమించకపోతే మంగళవారం పరిస్థితి మరెలా ఉంటుందోనని జనాలు భయపడుతున్నారు. పరిశ్రమలకు మంగళవారం కూడా లైటింగ్ లోడ్ (10 శాతం) అమలు చేయాల్సిందిగా ఇప్పటికే ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. అల్పపీడనం, మబ్బులు, చిరుజల్లుల వాతావరణంతో కాస్త చల్లగా ఉండటం వల్ల కొంతయినా ఉపశమనం కలుగుతోందని, లేకుంటే విద్యుత్ వెతలతో ప్రాణాలు పోయేవని జనాలు గగ్గోలు పెడుతున్నారు. -
రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ ఆందోళనలు
-
కాంగ్రెస్ పార్టీ తీరు పై విశాఖ వాసులు ఆగ్రహం