విశాఖ నుంచి గోవాకు విమాన సర్వీసు
గోపాలపట్నం (విశాఖ): విశాఖపట్నం నుంచి గోవాకు విమానయాన సర్వీసు అందుబాటులోకి రానుంది. ఇక్కడి నుంచి గోవా అంతర్జాతీయ విమానాశ్రయానికి విమాన సర్వీసును నడపాలని ఇండిగో విమాన సంస్ధ నిర్ణయించింది. సెప్టెంబరు 15 నుంచి ఈ సర్వీసులు అందించడానికి నిర్ణయించినట్లు ఆ విమాన సంస్ధ వర్గాలు తెలిపాయి. ఇప్పటికే ఇండిగో విమానం విశాఖ నుంచి బెంగుళూరు, భువనేశ్వర్, చెన్నై, ఢిల్లీ, హైదరాబాదు, ముంబై, కోల్కతాకు సర్వీసులు అందిస్తున్న సంగతి తెలిసిందే.