టైటిల్ మారింది
తమిళసినిమా: అమలాపాల్ చిత్రం టైటిల్ మారింది. దర్శకుడు విజయ్‌తో విడాకులు పొందిన తరువాత నటిగా రీఎంట్రీ ఇచ్చిన అమలాపాల్‌ను అవకాశాలు వెతుక్కుంటూ వస్తున్నాయి. ప్రస్తుతం చేతి నిండా చిత్రాలతో బిజీగా ఉన్న అమలాపాల్ చేస్తున్న చిత్రాల్లో విష్ణువిశాల్‌తో నటిస్తున్న చిత్రం ఒకటి. ముండాసిపట్టి చిత్రం ఫేమ్ రామ్‌కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని యాక్సస్ ఫిలిం ఫాక్టరీ సంస్థ నిర్మిస్తోంది.
కాగా ఈ చిత్రానికి రెండో సారి టైటిల్ మార్చారు. ముందు సిండ్రెల్లా అనే టైటిల్‌ను పెట్టారు. ఆ తరువాత మిన్మినిగా మార్చారు. తాజాగా రక్షకన్ అంటూ పేరు మార్చారు. ఇదే టైటిల్‌తో ఇంతకు ముందు నాగార్జున, సుస్మితాసేన్ నటించిన చిత్రం తెరపైకి వచ్చిందన్నది గమనార్హం. కాగా క్రైమ్ థ్రిల్లర్ కథాంశంతో కూడిన విష్ణువిశాల్, అమలాపాల్‌ల చిత్రానికి పవర్ఫుల్ టైటిల్ అవసరం కావడంతో రక్షకన్గా మార్చినట్లు చిత్ర వర్గాలు వెల్లడించాయి. విష్ణువిశాల్ పోలీస్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో అమలాపాల్ టీచర్‌గా నటిస్తున్నారట. ఇందులో కాళీవెంకట్, మునీష్కాంత్ తదితరులు ముఖ్య పాత్రలను పోషిస్తున్నారు.