తీర్మానం చేస్తే సరిపోదు : విశ్వేశ్వరరెడ్డి
ప్రత్యేక హోదాపై కేవలం తీర్మానం చేస్తే సరిపోదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత వై. విశ్వేశ్వర రెడ్డి అన్నారు. ప్రజాభిప్రాయాన్ని కూడా తీర్మానంలో పొందుపరిస్తే బాగుండేదని అభిప్రయపడ్డారు. పార్లమెంట్ సాక్షిగా ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్రంతో పోరాడి.. విభజన హామీలను సాధించుకోవాలని.. అడుక్కుంటే మాత్రం హామీలు నెరవేరవని అన్నారు.