visibility affected
-
ఉత్తరాదిని కమ్మేసిన పొగమంచు.. 22 రైళ్లు ఆలస్యం
ఢిల్లీ: దేశ రాజధాని పరిసర ప్రాంతాల్లో దట్టమైన పొగమంచు కమ్ముకుంది. రోడ్లపై విజిబిలిటీ(దృశ్యమానత) సున్నాకి పడిపోయింది. దేశంలోని వివిధ ప్రాంతాల నుండి ఢిల్లీకి వెళ్లే దాదాపు 22 రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. దట్టమైన పొగమంచు కారణంగా ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం(ఐజీఐ)లో అనేక విమాన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఐజీఐ విమానాశ్రయంలో విజిబిలిటీ 350 మీటర్లుగా నమోదైందని వాతావరణ శాఖ తెలిపింది. మరికొద్ది గంటల్లో ఇది 200 మీటర్ల మేర తగ్గే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, వాయువ్య మధ్యప్రదేశ్, చండీగఢ్ పరిసర ప్రాంతాల్లో దట్టమైన పొగమంచు ఏర్పడింది. #WATCH | Visibility affected in parts of the national capital as a blanket of dense fog covers Delhi. (Visuals from Rajaji Marg shot at 7.30 am) pic.twitter.com/Nfm5eAHTVi — ANI (@ANI) January 14, 2024 ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో దట్టమైన పొగమంచు ఏర్పడింది. తీవ్రమైన చలిగాలులు వీస్తున్నాయి. రోడ్లపై వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. తక్కువ వేగంతో ప్రయాణించాలని వాహనదారులకు అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. అత్యవసరమైతే తప్పా ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని కోరారు. #WATCH | Visibility affected due to dense fog in Uttar Pradesh's Lucknow as cold wave conditions prevail in the region (Visuals shot at 7.00am) pic.twitter.com/BH6DMRWw3W — ANI UP/Uttarakhand (@ANINewsUP) January 14, 2024 దేశ రాజధానిలో 3.6 డిగ్రీల సెల్సియస్‌కు తగ్గడంతో ఈ సీజన్లో అత్యల్ప కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. వచ్చే 3-4 రోజుల్లో వాయువ్య భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో దట్టమైన పొగమంచు ఏర్పడుతుందని ఐఎండీ తెలిపింది. 22 trains to Delhi from various parts of the country are running late due to dense fog conditions as on 14th January. pic.twitter.com/vmY6LBOSvr — ANI (@ANI) January 14, 2024 ఇదీ చదవండి: ‘ఇండియా’కు ఖర్గే సారథ్యం! -
పొగమంచు గుప్పిట్లో ఉత్తర భారతం
న్యూఢిల్లీ/బాగ్పట్: ఉత్తర భారతదేశం పొగ మంచు గుప్పిట్లో చిక్కుకుంటోంది. దారులన్నీ దట్టమైన పొగ మంచుతో మూసుకుపోతున్నాయి. ముందున్న వాహనాలు సైతం కనిపించని పరిస్థితి. దేశ రాజధాని ఢిల్లీలో పొగ మంచుకుతోడు చలి తీవ్ర నానాటికీ పెరుగుతోంది. నగరంలో నగరంలో భారత వాతావరణ శాఖ(ఐఎండీ) రెడ్ అలర్ట్ ప్రకటించింది. ఢిల్లీలో పొగమంచు కారణంగా బుధవారం 110 విమానాలు ఆలస్యంగా నడిచాయి. కొన్నింటిని ఇతర ఎయిర్‌పోర్టులకు మళ్లించారు. ఢిల్లీకి చేరుకోవాల్సిన 25 రైళ్లు ఆలస్యంగా వచ్చాయి. ఢిల్లీ నుంచి రాకపోకలు సాగించే విమానాలు ఆలస్యంగా నడుస్తుండడంపై ఎయిర్ ఇండియా సంస్థ స్పందించింది. ప్రయాణికులు తమ టికెట్లను ఎలాంటి అదనపు చార్జీలు లేకుండానే రీషెడ్యూల్ లేదా క్యాన్సిల్ చేసుకోవచ్చని సూచించింది. పంజాబ్, హరియాణా, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్‌లో పొగమంచు తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది. ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు సమీపంలో విజిబిలిటీ లెవెల్ 25 మీటర్లుగా నమోదైంది. హరియాణా, ఉత్తరప్రదేశ్, పంజాబ్ తదితర రాష్ట్రాల్లోనూ విజిబిలిటీ స్థాయి పడిపోయింది. ఆగ్రా, బరేలీ, భటిండాలో విజిబిలిటీ లెవెల్ సున్నాకు పడిపోవడం గమనార్హం. పొగ మంచు, కాలుష్యం వల్ల ఉత్తరాదిన వాయు నాణ్యత కూడా క్షీణిస్తోంది. తాజాగా సగటు వాయు నాణ్యత 381గా రికార్డయిం్యంది. ఇది ‘వెరీ పూర్’ కేటగిరీలోకి వస్తుందని అధికారులు చెప్పారు. రాబోయే రోజుల్లో మరింత తగ్గే అవకాశం ఉందని వెల్లడించారు. ఢిల్లీలో కనిష్ట ఉష్ణోగ్రత 7 డిగ్రీలు, గరిష్ట ఉష్ణోగ్రత 24 డిగ్రీలుగా నమోదైంది. పొగమంచు వల్ల 8 మంది మృతి విపరీతమైన పొగమంచు వల్ల దారి కనిపించక ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. రహదారులపై వాహనాలు ఒకదాన్ని ఒకటి ఢీకొంటున్నాయి. ఫలితంగా ప్రయాణికుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. ఉత్తరప్రదేశ్‌లో మంగళవారం అర్ధరాత్రి తర్వాత, బుధవారం ఉదయం జరిగిన వేర్వేరు ప్రమాదాల్లో 8 మంది మరణించారు. మరో 25 మందికిపైగా గాయాలపాలయ్యారు. బరేలీ జిల్లాలోని హఫీజ్‌గంజ్‌లో మోటార్ సైకిల్‌ను ట్రాక్టర్ ఢీకొట్టడంతో ఇద్దరు మహిళలు మృతిచెందారు. మరొకరు గాయపడ్డారు. -
పొగమంచుతో పెరిగిన వాహన ప్రమాదాలు
చలికాలంలో పొగమంచు రోడ్డు ప్రమాదాలకు కారణంగా మారుతోంది. విజిబులిటీ తగ్గిన కారణంగా రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా పొగమంచు కారణంగా యూపీలోని ఆగ్రాలో పలు వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ఘటనలో పలువురు గాయపడ్డారు. ఉత్తరప్రదేశ్‌లోని బహ్రైచ్‌లో సోమవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బహ్రైచ్-బలరాంపూర్ హైవేపై డబుల్ డెక్కర్ బస్సు, ట్రక్కు ఢీకొన్నాయి. ఈ ప్రైవేట్ బస్సు గుజరాత్ నుంచి బలరాంపూర్ జిల్లా వైపు వెళ్తోంది. ఈ క్రమంలో బహ్రైచ్-బలరాంపూర్ హైవేలోని ధరస్వాన్ గ్రామం సమీపంలో బియ్యం లోడుతో వస్తున్న ట్రక్కును డబుల్ డెక్కర్ బస్సు ఢీకొంది. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్, ఇద్దరు ప్రయాణికులు మృతి చెందారు. మరో 25 మంది ప్రయాణికులు గాయపడ్డారు. వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ విచారం వ్యక్తం చేశారు. హాపూర్‌లో పొగమంచు కారణంగా రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జాతీయ రహదారి-9పై సుమారు 15 వాహనాలు ఒక్కొక్కటిగా ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ఘటనలో పలువురు గాయాలపాలయ్యారు. ఈ ప్రమాదం కారణంగా రోడ్డుపై చాలాసేపు ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. మరోవైపు ఆగ్రాలోనూ పొగమంచు కారణంగా రోడ్డుపై డ్రైవింగ్ ఇబ్బందికరంగా మారింది. పొగమంచు కారణంగా పలు వాహనాలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో దాదాపు ఐదుగురికి గాయాలయ్యాయి. ఈ ఘటన జాతీయ రహదారిలోని ఎత్మాద్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. సిద్ధార్థనగర్లోనూ రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బన్సీ కొత్వాలి పరిధిలోని బెల్బన్వా గ్రామంలో ఒక పికప్ వాహనం, బైక్ ఢీకొన్నాయి. పశువులను తప్పించబోయిన పికప్ వాహనం బైక్‌ను ఢీకొంది. ఈ ఘటనలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గంమధ్యలో మృతి చెందారు. కాగా పికప్ వాహనంలో అక్రమంగా పశువులను తరలిస్తున్నట్లు పోలీసులు గుర్తించి, వాటిని గోశాలకు తరలించారు. ఈ ఉదంతంలో ఇద్దరి అదుపులోనికి తీసుకుని విచారిస్తున్నారు. పికప్ వాహనాన్ని సీజ్ చేశారు. ఇది కూడా చదవండి: హిమాచల్‌కు టూరిస్టుల తాకిడి! -
ట్విటర్ కీలక నిర్ణయం.. ఇకపై అలాంటి ట్వీట్లు కనిపించవు..
న్యూఢిల్లీ: నిబంధనలకు విరుద్ధంగా ఉండే ట్వీట్లకు పరిమితులు వర్తింపచేయనున్నట్లు సోషల్ మీడియా సైట్ ట్విటర్ వెల్లడించింది. ఇకపై రూల్స్‌ను అతిక్రమించే ట్వీట్లను చూపడంపై (విజిబిలిటీ) ఆంక్షలు అమలు చేయనున్నట్లు పేర్కొంది. ఈ మేరకు పాలసీని అప్డేట్ చేసినట్లు వివరించింది. దీని ప్రకారం ముందుగా, విద్వేషపూరిత ప్రవర్తన నిబంధనలను ఉల్లంఘిస్తున్నాయనిపించే ట్వీట్లను వడగట్టేందుకు ట్విటర్ విజిబిలిటీ ఫిల్టర్‌ను ఉపయోగించనుంది. ఆ తర్వాత ఇతరత్రా విభాగాలకు కూడా దీన్ని విస్తరించనుంది. అభ్యంతరకరమైన ట్వీట్లపై, వాటి విజిబిలిటీ మీద ఆంక్షలు విధించినట్లుగా అందరికీ కనిపించేలా ముద్ర వేస్తారు. అయితే, ఆయా ట్వీట్లను ట్విటర్ తప్పుగా వర్గీకరించిందని వాటిని పోస్ట్ చేసిన యూజర్లు గానీ సంప్రదించిన పక్షంలో పునఃసమీక్షిస్తామని ట్విటర్ పేర్కొంది. అయితే, ట్వీట్ విజిబిలిటీని పునరుద్ధరించేందుకు గ్యారంటీ అంటూ ఉండదని స్పష్టం చేసింది. సాధారణంగా తాము వాక్స్వాతంత్య్రానికి పెద్ద పీట వేస్తామని, సెన్సార్షిప్ భయం లేకుండా తమ అభిప్రాయాలు, ఐడియాలను చెప్పేందుకు యూజర్లందరికీ హక్కులు ఉంటాయని ట్విటర్ తెలిపింది. అదే సమయంలో వారందరికీ కూడా తమ ప్లాట్‌ఫామ్ సురక్షితమైనదిగా ఉండేలా తీర్చిదిద్దేందుకే ఈ జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు పేర్కొంది. -
విమాన రాకపోకలకు అంతరాయం
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో దట్టమైన పొగమంచు వ్యాపించింది. దీంతో రవాణ వ్యవస్థకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఢిల్లీ ఎయిర్ పోర్టులో దట్టమైన పొగమంచు వ్యాపించడంతో రన్ వే కనిపించడం లేదు. పొగమంచు కారణంగా 6 అంతర్జాతీయ విమానాలు, 7 దేశీయ విమాన సర్వీసులకు అంతరాయం ఏర్పడింది. ఓ డొమెస్టిక్ ఫ్లైట్ సర్వీస్ రద్దు చేశారు. మంచు ప్రభావంతో ఢిల్లీలో 94 రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి.