పార్లమెంట్‌కు ప్రియాంక పుత్రుడు
న్యూఢిల్లీ : ప్రియాంక గాంధీ కుమారుడు రైహాన్ తన స్నేహితులతో బుధవారం పార్లమెంట్‌ను తిలకించాడు. సందర్శకుల గ్యాలరీలో నుంచి పార్లమెంట్ కార్యకలాపాలను గమనించాడు. సోనియాగాంధీ మనవడైన రైహాన్... స్పోర్ట్స్ జాకెట్ ధరించి వచ్చాడు. ఆ తర్వాత సెంట్రల్ హాల్‌ను తిలకించిన అనంతరం గాంధీ కార్యాలయంలో కొద్దిసేపు గడిపాడు. ఈ సందర్భం గా రైహాన్ మాట్లాడుతూ పార్లమెంట్ ఎంతో బాగుందన్నాడు. ఇదిలాఉంచితే ప్రియాంక గాంధీ తన కుమారుడు రైహాన్, కుమార్తె మిరాయాలను లోక్‌సభ ఎన్నికల ప్రచార సమయంలో తరచూ తన వెంట తీసుకెళ్లారు.