viswesvara reddy
-
‘రాష్ట్రంలో రావణ పాలన సాగుతోంది’
సాక్షి, అనంతపురం : రాష్ట్రంలో అడుగుడునా అవినీతి రాజ్యమేలుతోందని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి ఆరోపించారు. పేదలకు ఇళ్ల స్థలాలు, ఇళ్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ అనంతపురం జిల్లా కుడేరులో ఆయన మహాధర్నానిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో రావణాసుర పాలన సాగుతోందని మండిపడ్డారు. రాష్ట్రాన్ని తాకట్టు పెట్టి ప్రజల నెత్తిన రూ.2.30 లక్షల కోట్లు అప్పు మోపారని ఆరోపించారు. హంద్రీనీవా ద్వారా ఇప్పటి వరకూ జిల్లాలో ఒక్క ఎకరానికైనా నీరందించారా అని ప్రశ్నించారు. రాష్ట్రంలోని పేదలందరికి ఇళ్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. వైఎస్సార్సీపీ బీసీ విభాగం నేతల నిరసన బీసీ జాబితాలోని వాల్మీకి, కురుబ, నాయీ బ్రాహ్మణ, వడ్డెర, కుమ్మర కులాలను ఎస్సీ, ఎస్టీ జాబితాలోకి చేర్చాలంటూ గాంధీ విగ్రహం వద్ద వైఎస్సార్సీపీ బీసీ విభాగం నేతలు నిరసన తెలిపారు. గతంలో చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు బీసీ జాబితలోని ఆ ఐదు కులాలను ఎస్సీ, ఎస్టీ జాబితాలో చేర్చాలని డిమాండ్ చేశారు. -
అధ్యాపకుల సమస్యలను అసెంబ్లీలో వినిపిస్తా..
ఉరవకొండ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి అనంతపురం రూరల్ : కాంట్రాక్టు అధ్యాపకుల సమస్యలను అసెంబ్లీలో వినిపించి, పరిష్కారం కోసం కృషి చేస్తానని ఉరవకొండ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి అన్నారు. డిమాండ్ల సాధన కోసం కాంట్రాక్టు ఉద్యోగులు చేపట్టిన సమ్మెలో భాగంగా అనంతపురం ఆర్డీఓ కార్యాలయం ముందు చేపట్టిన ఆందోళనకు మంగళవారం ఆయన మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ అధికారంలోకి రాగానే కాంట్రాక్టు అధ్యాపకులను క్రమబద్ధీకరిస్తానని ఇచ్చిన హామీని చంద్రబాబునాయుడు విస్మరించారని ధ్వజమెత్తారు. కాంట్రాక్ట్ అధ్యాపకుల సమ్మెతో ఇంటర్ విద్యార్థుల చదువులకు ఆటంకం ఏర్పడినా ప్రభుత్వం పరిష్కరించడానికి ఏమాత్రమూ చొరవ చూపడం లేదని మండిపడ్డారు. ఎన్నికల మేనిఫెస్టోలోని ఏ ఒక్క హామీనీ టీడీపీ నెరవేర్చిన పాపాన పోలేదన్నారు. కాంట్రాక్టు అధ్యాపకుల సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చవ్వా రాజశేఖరరెడ్డి, అనిల్‌కుమార్ గౌడ్‌తోపాటు కాంట్రాక్టు అధ్యాపకులు యర్రప్ప, హనుమంతరెడ్డి, సుబ్రమణ్యం, అక్బర్, రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు.