సీపీఎం జాతీయ మహాసభలు ప్రారంభం
సీపీఎం 21వ జాతీయ మహాసభలు విశాఖపట్నంలో ప్రారంభమయ్యాయి. పోర్టు కళావాణి ఆడిటోరియంలో ఈ మహాసభలను సీపీఎం ప్రధాన కార్యదర్శి ప్రకాశ్ కరత్ మంగళవారం ప్రారంభించారు.
ఈ మహాసభలకు బృందా కరత్, సీతారాం ఏచూరి, త్రిపుర ముఖ్యమంత్రి మాణిక్ సర్కార్, కేరళ మాజీ ముఖ్యమంత్రి అచ్యుతానందన్, సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి, 8 వామపక్ష పార్టీల నాయకులు హాజరయ్యారు.