Vizianagaram railway station
-
పట్టాలు తప్పిన గూడ్స్
విజయనగరం టౌన్: విజయనగరం రైల్వేస్టేషన్‌లోకి వస్తున్న గూడ్స్ బుధవారం పట్టాలు తప్పింది. విజయనగరం నుంచి పలాస వెళ్లేందుకు రూట్ నంబర్ తొమ్మిదిలో ఖాళీ గూడ్స్ బయలుదేరింది. ట్రాక్ మారుతున్న సమయంలో కిలోమీటర్ నంబర్ 817/37 ట్రాక్ వద్ద చక్రం పట్టా తప్పింది. డ్రైవర్ గుర్తించి వెంటనే బండిని నిలిపివేసి, అధికారులకు సమాచారమందించారు. దీంతో అప్రమత్తమైన అధికారులు విశాఖ నుంచి ప్రత్యేక క్రేన్‌ను తెప్పించి కేవలం గంట వ్యవధిలోనే సమస్యను పరిష్కరించారు. అదృష్టవశాత్తు ఎటువంటి ప్రమాదం సంభవించలేదు. -
విజయనగరంలో బాంబు కలకలం
విజయనగరం టౌన్:విజయనగరం రైల్వే స్టేషన్లో బాంబు ఉందంటూ ఓ అపరిచిత వ్యక్తి 100కు చేరిన ఫోన్‌కాల్ కలకలం రేగింది. ఆదివారం సాయంత్రం వచ్చిన కాల్‌తో అప్రమత్తమైన జిల్లా పోలీసు యంత్రాంగం రంగంలోకి దిగింది. జిల్లా ఎస్పీ బి.రాజకుమారి ఆదేశాల మేరకు రైల్వే స్టేషన్లో అడుగడుగునా ఆర్పీఎఫ్, జీఆర్పీ పోలీసులతోపాటు వన్ టౌన్ పోలీసులు, బాంబ్‌స్క్వాడ్ అడుగడుగునా తనిఖీలు చేశారు. అయితే ఫోన్ చేసిన వ్యక్తికి తిరిగి ఫోన్‌చేసినా ఫలితం లేకపోవడంతో అది ఫేక్‌కాల్‌గా భావించకుండా ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా రాత్రి పదిన్నర గంటలకూ అణువణువూ తనిఖీలు చేస్తూనే ఉన్నారు. అనుమానితులను ప్రశ్నిస్తున్నారు. -
విజయనగరం రైల్వేస్టేషన్‌కు ఐఎస్ఓ గుర్తింపు
సాక్షి, విజయనగరం: పరిశుభ్రత విషయంలో విజయనగరం రైల్వేస్టేషన్‌కు ఐఎస్ఓ గుర్తింపు రావడం ఆనందదాయకమని ఈస్ట్‌కోస్ట్ రైల్వే డివిజనల్ మేనేజర్ చేతన్‌కుమార్ శ్రీవాస్తవ (విశాఖ) పేర్కొన్నారు. స్థానిక రైల్వేస్టేషన్ ఆవరణలో మంగళవారం సాయంత్రం ఏర్పాటు చేసిన అభినందన సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అవార్డులు రావడంతో అందరిపైనా బాధ్యత మరింతగా పెరిగిందన్నారు. ఎంతో ప్రతిష్టాత్మకమైన అవార్డులను సంపాదించుకుంటున్నామంటే సిబ్బంది పనితీరే నిదర్శనమన్నారు. ఇకపై ప్రతి ఒక్కరూ కష్టపడి రైల్వే పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేందుకు పూర్తి స్థాయిలో కృషి చేయాలన్నారు. పాలిథిన్ కవర్లను పూర్తిగా నిషేధించాలన్నారు. కాగితపు సంచులకే ప్రాధాన్యతనిచ్చే విధంగా చూడాలన్నారు. రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు ఎటువంటి అసౌకర్యాలు గురికాకుండా ఉండేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. ఈ సందర్భంగా ఐఎస్ఓ సర్టిఫికెట్ ఈస్ట్‌కోస్ట్ రైల్వేలో ఏడు రైల్వేస్టేషన్లకు వచ్చిందన్నారు. అందులో బెస్ట్ విజయనగరమన్నారు. అనంతరం సర్టిఫికెట్‌ను రైల్వేస్టేషన్ మేనేజరు జగదీశ్వరరావుకు అందజేశారు. కార్యక్రమంలో ఏడీఆర్‌ఎంలు అక్షయ్ సక్సేనా, పి.రామచంద్రరావు, సీనియర్ డీఈఎన్ అశోక్‌కుమార్, కెవి.నరసింహారావు, సీనియర్ డీసీఎం సునీల్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. రైల్వే పరిసరాల్లో స్వచ్ఛభారత్ పరిశుభ్రత విషయంలో ఐఎస్ఓ సర్టిఫికెట్ వచ్చిన నేపథ్యంలో విజయనగరం రైల్వేస్టేషన్లో ముందుగా ప్రయాణికులకు కాగితపు, గుడ్డ సంచులను అందజేసి, ప్లాస్టిక్ సంచులను వాడొద్దని అవగాహన కల్పించారు. అనంతరం రైల్వేస్టేషన్ పరిసరాల్లో ఉన్న చెత్తా, చెదారాలను స్వయంగా ఎత్తి, అధికారులకు, సిబ్బందికి స్ఫూర్తిని కలిగించారు. అనంతరం కమర్షియల్ విభాగం కార్యాలయం వద్ద మొక్కలు నాటారు. కార్యక్రమంలో అధిక సంఖ్యలో రైల్వే సిబ్బంది పాల్గొన్నారు. -
విజయనగరం రైల్వే స్టేషన్ వద్ద సందడి వాతావరణం
-
విజయనగరంలో సమతా ఎక్స్‌ప్రెస్ నిలిపివేత
విశాఖపట్నం - న్యూఢిల్లీ మధ్య నడిచే సమతా ఎక్స్‌ప్రెస్ రైలును విజయనగరంలో నిలిపివేశారు. ఆ ఎక్స్‌ప్రెస్‌లోని ఎస్ 20 బోగీ లేకపోవడంతో రిజర్వేషన్ చేయించుకున్న ప్రయాణీకులు ఆందోళనకు దిగారు. దాంతో ఆ రైలును విజయనగరంలో నిలిపివేశారు. అయితే ఎస్ 20 బోగీ విశాఖలోనే వదిలేసి సమతా ఎక్స్‌ప్రెస్ న్యూఢిల్లీ బయలుదేరింది. ఎస్ 20 బోగీని విజయనగరం పంపేందుకు రైల్వే అధికారులు ప్రత్యక చర్యలు చేపట్టారు. ఆ ఘటనతో రైల్వే అధికారుల నిర్లక్ష్యం మరోసారి బహిర్గతమైంది.