ఐఎస్‌ఓ సర్టిఫికెట్‌ను స్టేషన్ మేనేజర్‌కి అందజేస్తున్న డీఆర్‌ఎమ్
సాక్షి, విజయనగరం: పరిశుభ్రత విషయంలో విజయనగరం రైల్వేస్టేషన్‌కు ఐఎస్‌ఓ గుర్తింపు రావడం ఆనందదాయకమని ఈస్ట్‌కోస్ట్ రైల్వే డివిజనల్ మేనేజర్ చేతన్‌కుమార్ శ్రీవాస్తవ (విశాఖ) పేర్కొన్నారు. స్థానిక రైల్వేస్టేషన్ ఆవరణలో మంగళవారం సాయంత్రం ఏర్పాటు చేసిన అభినందన సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అవార్డులు రావడంతో అందరిపైనా బాధ్యత మరింతగా పెరిగిందన్నారు. ఎంతో ప్రతిష్టాత్మకమైన అవార్డులను సంపాదించుకుంటున్నామంటే సిబ్బంది పనితీరే నిదర్శనమన్నారు. ఇకపై ప్రతి ఒక్కరూ కష్టపడి రైల్వే పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేందుకు పూర్తి స్థాయిలో కృషి చేయాలన్నారు.
పాలిథిన్ కవర్లను పూర్తిగా నిషేధించాలన్నారు. కాగితపు సంచులకే ప్రాధాన్యతనిచ్చే విధంగా చూడాలన్నారు. రైల్వేస్టేషన్‌లో ప్రయాణికులకు ఎటువంటి అసౌకర్యాలు గురికాకుండా ఉండేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. ఈ సందర్భంగా ఐఎస్‌ఓ సర్టిఫికెట్ ఈస్ట్‌కోస్ట్ రైల్వేలో ఏడు రైల్వేస్టేషన్‌లకు వచ్చిందన్నారు. అందులో బెస్ట్ విజయనగరమన్నారు. అనంతరం సర్టిఫికెట్‌ను రైల్వేస్టేషన్ మేనేజరు జగదీశ్వరరావుకు అందజేశారు. కార్యక్రమంలో ఏడీఆర్‌ఎంలు అక్షయ్ సక్సేనా, పి.రామచంద్రరావు, సీనియర్ డీఈఎన్ అశోక్‌కుమార్, కెవి.నరసింహారావు, సీనియర్ డీసీఎం సునీల్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
రైల్వే పరిసరాల్లో స్వచ్ఛభారత్
పరిశుభ్రత విషయంలో ఐఎస్‌ఓ సర్టిఫికెట్ వచ్చిన నేపథ్యంలో విజయనగరం రైల్వేస్టేషన్‌లో ముందుగా ప్రయాణికులకు కాగితపు, గుడ్డ సంచులను అందజేసి, ప్లాస్టిక్ సంచులను వాడొద్దని అవగాహన కల్పించారు. అనంతరం రైల్వేస్టేషన్ పరిసరాల్లో ఉన్న చెత్తా, చెదారాలను స్వయంగా ఎత్తి, అధికారులకు, సిబ్బందికి స్ఫూర్తిని కలిగించారు. అనంతరం కమర్షియల్ విభాగం కార్యాలయం వద్ద మొక్కలు నాటారు. కార్యక్రమంలో అధిక సంఖ్యలో రైల్వే సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment