recognised
-
భారత్‌లో స్టార్టప్ కంపెనీల సరికొత్త రికార్డ్! ఏకంగా..
భారత్‌లో పారిశ్రామిక చైతన్యం పెరుగుతూ వస్తోంది. పరిశ్రమలు స్థాపించి తమకు చేతనైనంత మందికి ఉపాధి కల్పించాలన్న స్పృహ యువతలో బాగా పెరిగింది. ఇందుకు అనుగుణంగా ప్రభుత్వం కూడా ప్రోత్సాహక విధానాలను అవలంభిస్తోంది. ఫలితంగా దీంతో దేశంలో స్టార్టప్ కంపెనీ సంఖ్య గణనీయంగా పెరిగింది. ప్రభుత్వ గుర్తింపు పొందిన స్టార్టప్‌ల సంఖ్య 2016లో 450 ఉండగా ప్రస్తుతం లక్షకు పైగా పెరిగిందని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. ఓ కార్యక్రమంలో పారిశ్రామికవేత్తలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ 2047 నాటికి భారతదేశ ఆర్థిక వ్యవస్థ విపరీతమైన వృద్ధిని సాధిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. (High Severity Warning: ఐఫోన్లు, యాపిల్ ప్రొడక్ట్స్‌కు హై సివియారిటీ వార్నింగ్!) భారతదేశంలో పరిశ్రమల స్థాపన, వాణిజ్యాన్ని సులభతరం చేయడానికి ప్రభుత్వం నిబద్ధతతో ఉందని పీయూష్ గోయల్ పేర్కొన్నారు. తద్వారా దేశంలో బిజినెస్ ప్రారంభించడం, నిర్వహించాడాన్ని సులభతరం చేసినట్లు వివరించారు. -
ఐఏఎస్‌లకు జలసిరి పాఠాలు
సిరిసిల్ల: దేశ భవిష్యత్‌కు బాటలు వేస్తూ.. పాలనా విభాగానికి ప్రాణం పోసే ఇండియన్ అడ్మినిస్ట్రేషన్ సర్వీస్ (ఐఏఎస్)కు ఎంపికైన అధికారులకు శిక్షణనిచ్చే ముస్సోరీలోని లాల్ బహదూర్‌శాస్త్రి అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్‌కు సిరిసిల్ల ‘జలసంరక్షణ’పాఠ్యాంశమైంది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో గత ఆరేళ్లుగా చేపట్టిన నీటి నిర్వహణ పద్ధతి ఇప్పుడు దేశానికి ఆదర్శంగా మారింది. జిల్లా లో భూగర్భ జలాలు గణనీయంగా వృద్ధి చెందడమే ఇందుకు కారణం. కరువు కోరల్లో చిక్కిన ఈ జిల్లాలో ఇప్పుడు భూగర్భ జలాల మట్టం ఆరు మీటర్లకు పెరగడం విశేషం. కరువు నుంచి జలసిరుల వైపు.. రాజన్న సిరిసిల్ల జిల్లా మెట్ట ప్రాంతం. సముద్ర మట్టానికి సుమారు 1,250 అడుగుల ఎత్తులో ఉంటుంది. ఒకప్పుడు ఎండిపోయిన వాగులు, చెరువులు.. చుక్క నీరివ్వని బోర్లు.. బీళ్లుగా మారిన పంట భూములు.. వెరసి ముంబై, దుబాయ్‌లకు వలసలు. ఇదీ రాజన్న సిరిసిల్ల జిల్లా దుస్థితి. కానీ ఇప్పుడు జలసిరులు పొంగుతున్నాయి. మధ్యమానేరు జలాశయానికి గోదావరి జలాలు చేరా యి. ఎల్లంపల్లి ద్వారా వచ్చిన నీటితో సాగునీటి వనరుల్లో నీరు చేరింది. గతేడాది సమృద్ధిగా వర్షాలు పడటంతో భూగర్భ జలాలు బాగా అభివృద్ధి చెందాయి. జిల్లాలో 6 మీట ర్ల లోతుల్లోనే నీటి ఊటలు ఉండటం విశేషం. యువ ఐఏఎస్‌ల శిక్షణకు ఎంపిక.. ఐఏఎస్‌కు ఎంపికైన అధికారులకు వివిధ అంశాలపై ముస్సోరీలో శిక్షణ ఇస్తారు. జాతీయ, అంతర్జాతీయ, స్థానిక అంశాలపై ఆదర్శ విధానాలు, పాలనాపరమైన సంస్కరణలపై ఇందులో చర్చిస్తారు. ఈసారి రాజన్న సిరిసిల్ల జిల్లాలో చేపట్టిన జల నిర్వహణ ఎంపికైంది. ఇక్కడ గత ఆరేళ్లుగా చేపడుతున్న నీటి నిర్వహణ పనులు సత్ఫలితాలు ఇచ్చాయని గుర్తించారు. ఈ నేపథ్యంలో ముస్సోరీ అకాడమీ సిరిసిల్ల జిల్లాలో చేసిన పనులను డాక్యుమెంట్ రూపంలో అందించాలని ఇక్కడి అధికారులను కోరింది. కలెక్టర్‌తో మాట్లాడిన అధికారులు.. కలెక్టర్ కృష్ణభాస్కర్‌తో అకాడమీ అధికారులు ఫోన్లో మాట్లాడారు. జిల్లాలో చేపట్టిన వాటర్ మేనేజ్మెంట్ పనుల వివరాల ను అడిగి తెలుసుకున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మధ్యమానేరు జలాశయం, పునరావాస అంశాలపై సమగ్రంగా తెలుసుకున్నారు. జిల్లాలో పర్యటిం చేందుకు పలువురు శిక్షణలో ఉన్న ఐఏఎస్ అధికారులు ఆసక్తితో ఉన్నట్లు తెలిపారు. ఆనందంగా ఉంది జాతీయస్థాయిలో రాజన్న సిరిసిల్ల జిల్లాకు గుర్తింపు రావడం ఆనందంగా ఉంది. తెలంగాణ జల విధానాన్ని సీఎం కేసీఆర్ సమర్థవంతంగా అమలు చేశారు. బీళ్లకు గోదావరి జలాలను కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా తీసుకురావడం విశేషం. జిల్లాకు సాగునీటి ఫలాలు అందాయి. దీంతో భూగర్భ జలాలు బాగా పెరిగాయి. శిక్షణ ఐఏఎస్‌లకు సిరిసిల్ల జల సంరక్షణ పాఠ్యాంశం కావడం సంతోషంగా ఉంది. –కె.తారక రామారావు, రాష్ట్రమంత్రి -
విజయనగరం రైల్వేస్టేషన్‌కు ఐఎస్ఓ గుర్తింపు
సాక్షి, విజయనగరం: పరిశుభ్రత విషయంలో విజయనగరం రైల్వేస్టేషన్‌కు ఐఎస్ఓ గుర్తింపు రావడం ఆనందదాయకమని ఈస్ట్‌కోస్ట్ రైల్వే డివిజనల్ మేనేజర్ చేతన్‌కుమార్ శ్రీవాస్తవ (విశాఖ) పేర్కొన్నారు. స్థానిక రైల్వేస్టేషన్ ఆవరణలో మంగళవారం సాయంత్రం ఏర్పాటు చేసిన అభినందన సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అవార్డులు రావడంతో అందరిపైనా బాధ్యత మరింతగా పెరిగిందన్నారు. ఎంతో ప్రతిష్టాత్మకమైన అవార్డులను సంపాదించుకుంటున్నామంటే సిబ్బంది పనితీరే నిదర్శనమన్నారు. ఇకపై ప్రతి ఒక్కరూ కష్టపడి రైల్వే పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేందుకు పూర్తి స్థాయిలో కృషి చేయాలన్నారు. పాలిథిన్ కవర్లను పూర్తిగా నిషేధించాలన్నారు. కాగితపు సంచులకే ప్రాధాన్యతనిచ్చే విధంగా చూడాలన్నారు. రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు ఎటువంటి అసౌకర్యాలు గురికాకుండా ఉండేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. ఈ సందర్భంగా ఐఎస్ఓ సర్టిఫికెట్ ఈస్ట్‌కోస్ట్ రైల్వేలో ఏడు రైల్వేస్టేషన్లకు వచ్చిందన్నారు. అందులో బెస్ట్ విజయనగరమన్నారు. అనంతరం సర్టిఫికెట్‌ను రైల్వేస్టేషన్ మేనేజరు జగదీశ్వరరావుకు అందజేశారు. కార్యక్రమంలో ఏడీఆర్‌ఎంలు అక్షయ్ సక్సేనా, పి.రామచంద్రరావు, సీనియర్ డీఈఎన్ అశోక్‌కుమార్, కెవి.నరసింహారావు, సీనియర్ డీసీఎం సునీల్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. రైల్వే పరిసరాల్లో స్వచ్ఛభారత్ పరిశుభ్రత విషయంలో ఐఎస్ఓ సర్టిఫికెట్ వచ్చిన నేపథ్యంలో విజయనగరం రైల్వేస్టేషన్లో ముందుగా ప్రయాణికులకు కాగితపు, గుడ్డ సంచులను అందజేసి, ప్లాస్టిక్ సంచులను వాడొద్దని అవగాహన కల్పించారు. అనంతరం రైల్వేస్టేషన్ పరిసరాల్లో ఉన్న చెత్తా, చెదారాలను స్వయంగా ఎత్తి, అధికారులకు, సిబ్బందికి స్ఫూర్తిని కలిగించారు. అనంతరం కమర్షియల్ విభాగం కార్యాలయం వద్ద మొక్కలు నాటారు. కార్యక్రమంలో అధిక సంఖ్యలో రైల్వే సిబ్బంది పాల్గొన్నారు. -
'గ్లోబల్ టాప్ ఎంప్లాయర్' గా టీసీఎస్...
టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) ప్రపంచ వ్యాప్త గుర్తింపును తెచ్చుకుంది. ప్రపంచ వ్యాప్తంగా 1,072 సంస్థల్లో టాప్ ఎంప్లాయర్స్ ఇనిస్టిట్యూట్ గా పేరొందిన టీసీఎస్ 'గ్లోబల్ టాప్ ఎంప్లాయర్' అవార్డును అందుకుంది. ప్రపంచ వ్యాప్తంగా తొమ్మిది ఇతర సంస్థలతో సహా శ్రామిక ప్రణాళిక, ఆన్ బోర్డింగ్, అభ్యాసం మరియు అభివృద్ధి, పనితీరు నిర్వహణ, నాయకత్వ అభివృద్ధి వంటి విషయాల్లో అగ్రభాగాన నిలిచింది. ప్రపంచంలోని ఉత్తమ యాజమాన్యాలకు ప్రదానం చేసే ఈ గౌరవ అవార్డును ఇప్పుడు టీసీఎస్ సాధించింది. ఉద్యోగులు, వినియోగదారుల విషయంలో అత్యున్నత ప్రమాణాలను పాటించే తమ యాజమాన్యం ఈ పురస్కారాన్ని అందుకుంటోందని సంస్థ తెలిపింది. ఈ జాబితాలో సీజేఎస్సీ టెక్నిప్, డీహెచ్ ఎల్, డైమెన్షన్ డేటా, సెయింట్ గోబెయిన్, జేటీ ఇంటర్నేషనల్, మొబినిల్, మోబిస్టార్, ఆరెంజ్, వాలియో సంస్థలు ఉన్నాయి. ఈ సంస్థలన్నీ నిరంతరం ముందు చూపుతో ఆలోచిస్తూ తమ ఉద్యోగుల పరిస్థితులు, అభివృద్ధికి మార్గంగా నిలుస్తున్నాయని టీసీఎస్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ అండ్ హ్యూమన్ రిసోర్సెస్ గ్లోబల్ హెడ్ అజయ్ ముఖర్జీ తెలిపారు. ఇది తమ సంస్థకు మంచి విజయమని, దీని స్ఫూర్తితో ప్రపంచవ్యాప్తంగా తమ ఉద్యోగులు, వినియోగదారుల సేవల్లో మరింత అభివృద్ధికి మార్గమౌతుందని సంస్థ చెప్తోంది.