void
-
పూర్వీకుల ఆస్తిలో వాళ్లకు కూడా హక్కు ఉంది : సుప్రీంకోర్టు
పెళ్లికి ముందు లేక వివాహేతర సంబంధంలో జన్మించిన సంతానానికి తల్లిదండ్రుల పూర్వీకుల ఆస్తిలో హక్కు ఉందా? అనే అంశంపై దాఖలైన పిటిషన్‌పై అత్యున్నత న్యాయస్థానం శుక్రవారం కీలక తీర్పు వెలువరించింది. చెల్లుబాటుకాని లేదా రద్దు చేయదగ్గ వివాహాల్లో జన్మించిన పిల్లలు కూడా చట్టబద్ధమైన వారసులేనని స్పష్టం చేసింది. హిందూ వారసత్వ చట్టం ప్రకారం ఉమ్మడి కుటుంబంలో((Hindu Joint Family) తల్లిదండ్రులకు వచ్చే పూర్వీకుల ఆస్తిలో ఈ పిల్లలకు కూడా హక్కు ఉందని చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. అలాంటి సంబంధంలో జన్మించిన పిల్లలను తల్లిదండ్రుల నుంచి వేరుగా చూడాలని, ఆ బిడ్డ అన్యం పుణ్యం ఎరుగనదని తెలిపింది. వివాహేతర సంబంధంలో పుట్టిన పిల్లలకు ఇతర పిల్లల మాదిరిగానే అన్ని హక్కులు ఉంటాయని స్పష్టం చేసింది. రేవణ సిద్దప్ప వర్సెస్ మల్లికార్జున్ (2011) కేసులో ఈ ప్రశ్నలు తలెత్తాయి. ఐతే అప్పటి జస్టిస్ (రిటైర్డ్) జిఎస్ సింఘ్వి, ఏకే గంగూలీలతో కూడిన ధర్మాసనం సెక్షన్ 16(3)లోని సవరణ ప్రధానాంశాన్ని ప్రస్తావిస్తూ.. వివాహేతర సంబంధంలో పుట్టిన పిల్లలకు చట్టబద్ధత ఉంటుందని, వారికి చెల్లుబాటయ్యే వివాహంలో జన్మించిన పిల్లల మాదిరి హక్కులు ఉంటాయని అప్పట్లో బెంచ్ ఉత్తర్వులిచ్చింది. అయితే పూర్వికుల ఆస్తిలో వాటా ఉండదని అభియప్రాయపడింది. ఈ కేసు అప్పటి నుంచి పెండింగ్‌లో ఉండిపోయింది. దీనిపై ప్రస్తుత చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం ఇటీవల విచారణ జరిపి గతంలో బెంచ్ వ్యక్తం చేసిన అభిప్రాయంతో విభేదించింది. ఆయా వివాహేతర సంబంధంలో పుట్టిన సంతానానికి తల్లిదండ్రుల ఆస్తిలో హక్కు ఉంటుందని నిబంధనలు స్పష్టంగా చెబుతున్నాయని వెల్లడించింది. అలాగే తల్లిదండ్రులకు వారి పూర్వీకుల ద్వారా సంక్రమించిన ఆస్తిలో కూడా ఈ పిల్లలకు వాటా పొందే హక్కు ఉందని పేర్కొంది. (చదవండి: "బతకడు" అన్న మాటే ఊపిరి పోసింది! వైద్యులనే విస్తుపోయేలా చేసింది!) -
కలిసి జీవిస్తే సరిపోతుందా?.. విడాకులెలా కోరతారు?
మన దేశ చట్టాల్లో భూతద్దం పెట్టి చూసిన దొరకని ‘సహజీవనం’ అనే బంధం గురించి ఆసక్తికరమైన తీర్పు ఒకటి వెలువడింది. సహజీవనంలో ఉన్న ఓ జంట విడాకులు కోరుతూ కోర్టు మెట్లు ఎక్కింది. అయితే చట్టం ప్రకారం అది పెళ్లి కానప్పుడు.. విడాకుల ప్రస్తావన ఎక్కడి నుంచి వస్తుందని ఓ జంటను ప్రశ్నించింది కేరళ హైకోర్టు. ఏ చట్టంలోనూ కలిసి ఉంటే పెళ్లి అని లేదు. ఇద్దరి మనసులు కలిసాయని సహజీవనం చేసేవాళ్లకు విడాకులు అడిగే హక్కే లేదు. కేవలం పర్సనల్, సెక్యులర్ చట్టం ప్రకారం వివాహం జరిగినప్పుడే దానికి గుర్తింపు ఉంటుందని కోర్టు స్పష్టం చేసింది. ఒప్పందం ప్రకారం కలిసి జీవించినా.. అది వివాహం కిందకు రాదని, విడాకులకు ఆస్కారం ఉండదని స్పష్టం చేసింది బెంచ్. చట్టం ప్రకారం ఒక్కటైన జంటలకు మాత్రమే విడాకులు తీసుకునే హక్కు మన చట్టాలు కల్పించాయని ఈ సందర్భంగా పిటిషనర్లకు కోర్టు గుర్తుచేసింది. 2006 నుంచి వేర్వేరు మతాలకు చెందిన ఇద్దరు సహజీవనం చేస్తున్నారు. పైగా తమ బంధానికి సంబంధించి ఒప్పంద పత్రం కూడా రాసుకున్నారు. ఓ బిడ్డనూ కన్నారు. ఈ క్రమంలో మనస్పర్థలతో విడిపోవాలని నిర్ణయించుకున్న ఆ జంట స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించారు. అయితే.. చట్ట ప్రకారం వివాహం కానప్పుడు విడాకులు ఎలా ఇస్తామని ప్రశ్నిస్తూ పిటిషన్‌ను ఫ్యామిలీ కోర్టు కొట్టేసింది. దీంతో ఫ్యామిలీ కోర్టు ఆదేశాల్ని సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించింది ఆ జంట. చట్టం ప్రకారం సహజీవనానికి గుర్తింపు లేదు. కలిసి ఉండడానికి మీకు ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం కాలేదు. ఇప్పుడు విడిపోవడానికి చట్టం ప్రకారం ముందుకెళ్తున్నారు. ఇది వీలుకాని విషయం. చట్టంలోనూ అందుకు వెసులుబాటు లేదు అని జస్టిస్ ముహమ్మద్ ముస్తాఖ్, జస్టిస్ సోఫీ థామస్ నేతృత్వంలోని బెంచ్ తీర్పు ఇచ్చింది. ఇక ఈ కేసులో ఫ్యామిలీ కోర్టు తీరుపైనా హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. చట్టం ద్వారా గుర్తించబడిన వివాహాలకు సంబంధించిన దావాలను మాత్రమే స్వీకరించే పరిధి ఫ్యామిలీ కోర్టులకు ఉందని, పై పిటిషన్‌ను విచారణకు తీసుకుని కొట్టేసే బదులు.. పిటిషన్ నిర్వహణ సాధ్యం కాదని ముందుగానే పిటిషన్‌ను తిరస్కరించి ఉండాల్సిందని, తద్వారా కోర్టు సమయం వృథా కాకుండా ఉండేదని హైకోర్టు ఈ సందర్భంగా అభిప్రాయపడింది. ఇది రూ.10 మర్డర్ కేసు.. చదివేయండి! -
పెళ్లి జరిగినంతసేపు ఏడుస్తూనే ఉన్నాడు
పట్నా : రెండేళ్ల క్రితం బిహార్‌లో జరిగిన ఓ వివాహం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. సాధరణంగా అమ్మాయిని కిడ్నాప్ చేసి, బెదిరించి వివాహం చేసుకునే సంఘటనల గురించి చూస్తుంటాం. కానీ ఇక్కడ మాత్రం అబ్బాయిని గన్నుతో బెదిరించి.. పెళ్లి మంటపానికి లాక్కొచ్చి మరి బలవంతంగా వివాహం జరిపించారు. 2017లో జరిగిన ఈ ‘పకడ్వా వివాహం’(బలవంతపు పెళ్లి) దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. వివరాలు.. వినోద్ కుమార్ అనే వ్యక్తి బొకారో స్టీల్ ప్లాంట్‌లో పని చేస్తున్నాడు. ఈ క్రమంలో స్నేహితుడి వివాహానికి హాజరయ్యేందుకు వెళ్తున్న వినోద్‌కు.. సురేంద్ర అనే వ్యక్తి తారసపడ్డాడు. లిఫ్ట్ ఇస్తానని చెప్పి బైక్ మీద ఎక్కించుకుని తన ఇంటికి తీసుకువచ్చాడు సురేంద్ర. అప్పటికే అక్కడ పెళ్లి ఏర్పాట్లు అన్ని పూర్తయ్యాయి. సురేంద్ర చెల్లి పెళ్లి కూతురు స్థానంలో కూర్చుని ఉంది. సురేంద్ర బంధువులంతా మండపం దగ్గర ఉన్నారు. ఇంతలో సురేంద్ర గన్ను తీసి వినోద్ తలకు గురిపెట్టి.. అతడిని పెళ్లిమంటపానికి లాక్కెళ్లాడు. తన చెల్లిని వివాహం చేసుకోకపోతే.. చంపేస్తానని బెదిరించాడు. గతిలేని పరిస్థితుల్లో వినోద్.. ఆ పెళ్లి చేసుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలయ్యింది. అనంతరం వినోద్.. తనకు బలవంతంగా పెళ్లి చేశారని.. ఈ వివాహాన్ని రద్దు చేయాల్సిందిగా కోరాడు. అంతేకాక సురేంద్ర కుటుంబం మీద క్రిమినల్ కేసు కూడా పెట్టాడు. అయితే పోలీసులు ఈ విషయాన్ని బయటకు రాకుండా ఉంచేందుకు ప్రయత్నించారు. కానీ అప్పటికే సోషల్ మీడియాలో వినోద్ పెళ్లి వీడియో వైరల్ కావడంతో ఉన్నతాధికారులు రంగంలోకి దిగారు. అనంతరం వ్యవహారం కోర్టుకు వెళ్లింది. ఈ ఏడాది మేలో కోర్టు వినోద్‌కు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. బలవంతపు వివాహం చెల్లదని పేర్కొంది. వినోద్ పెళ్లి ఆధారంగా ప్రస్తుతం బాలీవుడ్లో ఓ సినిమా తెరకెక్కుతుంది. వచ్చే నెల ఈ చిత్రం విడుదల కానుంది. -
నేడు తెలంగాణ ఉద్యోగ గర్జన
వరంగల్ సిటీ, న్యూస్‌లైన్ : తెలంగాణ ఉద్యోగులు మరోమారు ఉద్యమ గళం ఎత్తేందుకు సిద్ధమయ్యారు. ఉద్యోగుల సమస్యలతోపాటు పార్లమెంట్లో తెలంగాణ బిల్లును ప్రవేశపెట్టాలనే డిమాండ్‌తో గురువారం హన్మకొండ ఆర్ట్స్ కళాశాల ఆడిటోరియంలో నిర్వహించనున్న ఉద్యోగ గర్జనకు టీఎన్జీవోస్ రాష్ట్ర అధ్యక్షుడు దేవీప్రసా ద్, ప్రధాన కార్యదర్శి కారం రవిందర్‌రెడ్డి హాజరవుతున్నారు. ఇప్పటికే ఉద్యోగల సమస్యలపై జిల్లా వ్యాప్తంగా మండల, డివిజన్ స్థాయిలో సదస్సులు నిర్వహించా రు. జిల్లా కేంద్రంలో ఉద్యోగులను సమీకరించి పోరాటాన్ని తీవ్రం చేయాలని భావిస్తున్నారు. ఈ నెల 29న హైదరాబాద్‌లో జరిగే సకల జనభేరి సభకు ఉద్యోగు లు తరలివెళ్లే అంశంపై ఈ సభలో చర్చించనున్నారు. మహిళా ఉద్యోగ ఫోరం నేత రేచల్, రాష్ట్రనాయకులు ప్రతాప్, జిల్లా ఉద్యోగ జేఏసీ చైర్మన్ పరిటాల సుబ్బారావుతోపాటు జిల్లా నాయకులు హాజరయ్యే ఈ సభకు ఉద్యోగులు సకాలంలో వచ్చి విజయవంతం చేయాలని టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు కోలా రాజేష్‌కుమార్ కోరారు.