Voter list errors
-
భర్త, తండ్రి అందరి పేరు తెలంగాణే..!
సాక్షి, జనగామ: జనగామ మునిసిపల్ అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఫొటో ఓటరు జాబితాలో అనేక తప్పులు చోటు చేసుకుంటున్నాయి. కులాల గుర్తింపులో పొరపాట్లు చేసిన అధికారులు.. తండ్రి, భర్తల పేర్లు మార్చేసి మరో అడుగు ముందుకు వేశారు. ఓటరు జాబితాల్లో చోటుచేసుకున్న తప్పిదాలు.. సోషల్ మీడియా వేదికగా హల్చల్ చేస్తున్నాయి. ఈ నెల 16న తుది ఓటరు జాబితా ప్రకటించగా.. ఒక్కొక్కటిగా తప్పులు వెలుగు చూస్తున్నాయి. 10వ వార్డుకు చెందిన రేఖ పేరు పక్కన తండ్రికి బదులుగా భర్త అని ముద్రించి.. తెలంగాణగా నమోదు చేశారు. ఆమె తల్లి మీరాబాయి.. భర్త పేరుకు బదులుగా తెలంగాణ, ఆమె భర్త సోనాబీర్ తండ్రికి బదులుగా తెలంగాణ అని ముద్రించారు. ఇంటిల్లిపాదికి ‘తెలంగాణ’పదాన్ని ఇచ్చేశారు. వార్డుల వారీగా ఓటరు సర్వేతో పాటు ఫొటో ఐడెంటిఫికేషన్ సమయంలో.. క్షేత్రస్థాయిలో పనిచేయక పోవడంతోనే తప్పిదాలకు ఆస్కారం కలిగిందని చెబుతున్నారు. ఇదిలా ఉంటే కులాల మార్పిడి దుమారం రేపుతోంది. ఓసీలను బీసీగా.. బీసీలను ఎస్సీలుగా అక్కడక్కడా మార్చడంతో బాధితులు ఆందోళనకు గురవుతున్నారు. 3వ వార్డుకు చెందిన ఓసీ కులానికి చెందిన దొంతుల భిక్షపతి కుటుంబాన్ని బీసీగా, బీసీ కులానికి చెందిన వారిని ఓసీగా మార్చడంతో గురువారం పురపాలక సంఘ కార్యాలయానికి వెళ్లి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓసీ నుంచి బీసీకి మార్చడంతో.. తమకు అదే సర్టిఫికెట్ ఇవ్వాలని భిక్షపతి కుటుంబ సభ్యులు అధికారులను డిమాండ్ చేశారు. ఏ ప్రాతిపదికన కులం పేరు మార్చారు.. వాటి వివరాలను చూపించాలని ప్రశ్నించారు. -
ఒకే ఇంట్లో వారి పేర్లు వేర్వేరు వార్డుల్లోనా?
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం ప్రకారం ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేసినంత మాత్రాన ఓటర్ల జాబితాకు పవిత్రత వచ్చినట్లు కాదని హైకోర్టు స్పష్టం చేసింది. ఓటర్ల జాబితాలో తప్పులకు ఆస్కారం లేనప్పుడే ఆ జాబితాకు పవిత్రత చేకూరుతుం దని తేల్చి చెప్పింది. నల్లగొండ జిల్లా గుర్రంపోడు గ్రామంలో ఒకే ఇంట్లో నివాసం ఉంటున్న కుటుం బీకులను వేర్వేరు వార్డుల్లో ఓటర్లుగా చూపడంపై విస్మయం వ్యక్తం చేసింది. ప్రస్తుత కేసులో ఎన్నికల కమిషన్ తన విధులను నిర్వర్తించడంలో విఫలమైనట్లు కనిపిస్తోందని విమర్శించింది. గుర్రంపోడు గ్రామ ఓటర్ల జాబితాను సవరించాలని ఎన్నికల కమిషన్‌ను ఆదేశించింది. ఓటర్ల జాబితా సవరణ గడువులోగా సాధ్యం కాకపోతే గుర్రంపోడు ఎన్నికను రీ షెడ్యూల్ చేసి రెండో దశ లేదా మూడో దశలోనైనా సవరించిన జాబితా ఆధారంగా నిర్వహించాలని కమిషన్‌కు తెలిపింది. ఎన్నికల ప్రక్రియ నిరాటం కంగా కొనసాగేందుకే ఈ విషయంలో తాము జోక్యం చేసుకుంటున్నామని తెలిపింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ పి.వి.సంజయ్ కుమార్ శుక్రవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. -
ఓటరు జాబితాలో లోపాలున్నాయి
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో దాదాపు 70 లక్షల ఓటర్లకు సంబంధించి అవకతవకలు చోటు చేసుకున్నాయని, అందువల్ల కుదించిన ఓటరు నమోదు షెడ్యూలును రద్దు చేసి, ముందుగా జారీచేసిన ఓటరు నమోదు కార్యక్రమాన్ని కొనసాగించేలా ఆదేశాలు ఇవ్వాలని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ ఎలక్షన్ కమిషన్ కోఆర్డినేషన్ కమిటీ చైర్మన్ మర్రి శశిధర్‌రెడ్డి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తెలంగాణలో జనవరి 1, 2019వ తేదీ ప్రామాణికంగా ఓటర్ల నమోదు ప్రక్రియ కొనసాగుతుండగా, దానిని రద్దు చేస్తూ 2018 జనవరి 1వ తేదీని ప్రామాణికంగా స్వల్పకాలిక ఓటరు నమోదు షెడ్యూలును జారీచేసిందని, 4 నెలల కాలంలో సరిదిద్దాల్సిన ఓటరు జాబితాను నాలుగు వారాలకు కుదించిందని, ఈ సమయం సరిపోదని ఆయన పిటిషన్లో పేర్కొన్నారు. కేంద్ర ఎన్నికల సంఘాన్ని మొద టి ప్రతివాదిగా చేర్చారు. 70 లక్షల ఓటర్లకు సం బంధించి అవకతవకలున్నాయని, తాము బలమైన సాక్ష్యాధారాలను ఈ నెల 14న కేంద్ర ఎన్నికల సంఘానికి సమర్పించామని, దీనిపై కేంద్ర ఎన్నికల సంఘం మౌనం దాల్చిందన్నారు. వచ్చే వారం ఈ పిటిషన్ విచారణకు వచ్చే అవకాశం ఉందని మర్రి శశిధర్‌రెడ్డి తెలిపారు. -
కోహ్లిది ఢిల్లీ కాదట.!
గోరఖ్‌పూర్ : ఎన్నికల అధికారుల పనితనం మరోసారి తేటతెల్లమయింది. ఇప్పటివరకు ఓటరు జాబితాలో ఓటర్ల పేర్లు గల్లంతు, పేర్లలోగందరగోళం ఉండేది. కానీ ఏకంగా ఓ సెలబ్రిటీని రాష్ట్రం కాని రాష్ట్రం ఓటర్ జాబితాలో చేర్చారు. ఈ వ్యవహారం బయటకు రావడంతో సోషల్‌మీడియాలో ఎన్నికల అధికారులపై విమర్శలు వెల్లువెత్తాయి. చేతుల కాలాక ఆకులు పట్టుకున్నట్లు ఆదివారం ఉపఎన్నికలు జరగబోతుంటే.. పొరపాటు ఎలా జరిగిందో తెలుసుకుంటామని ఇప్పుడు కూల్‌గా చెప్తున్నారు అధికారులు. ఇంతకీ ఆ సెలబ్రిటీ ఎవరో కాదు భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లి. ఢిల్లీకి చెందిన కోహ్లి పేరు.. ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్ ఉపఎన్నికల ఓటర్ జాబితాలో వచ్చింది. అంతేకాదు ఆయన పేరిట ఓటర్ స్లిప్ కూడా వచ్చింది. జాబితాలో కోహ్లి పేరు సాహజన్వా అసెంబ్లీనియోజకవర్గంలో 822వ ఓటరు నెంబరుతో రిజిస్టర్ అయింది. స్థానిక బూత్ అధికారి సునీతా చౌబే ఐదు రోజులు క్రితం ఈ విషయాన్ని గుర్తించినా అధికారులు అలసత్వం ప్రదర్శించారు. ఇప్పుడు బయటకి పొక్కడంతో అసలు ఈ పొరపాటు ఎలా జరిగిందన్న దానిపై విచారణ చేస్తున్నామని డిప్యూటీ ఎన్నికల కమిషనర్ ప్రభునాథ్ మీడియాకు తెలిపారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్య నాథ్, ఉప ముఖ్యమంత్రి మౌర్య ఇద్దరూ రాజీనామా చేయడంతో గోరఖ్‌పూర్, పూల్పూర్ లోక్‌సభ నియోజకవర్గాల్లో ఉపఎన్నికలు జరుగుతున్నాయి. -
ఆత్మలకు ఓట్లు!
ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటుహక్కు వజ్రాయుధం వంటిది. అటువంటి ఓటు ప్రాధాన్యాన్ని గుర్తించిన ఎన్నికల సంఘం తప్పులు లేని ఓటర్ల జాబితాను రూపొందించాలని అధికారులను ఆదేశించింది. కానీ ఆ ఆదేశాలు ఆచరణలో అమలుకు నోచుకోవడంలేదు. ఓటర్ల జాబితాలు తప్పుల తడకలను తలపిస్తున్నాయి. జాబితాను సవరించాల్సిన అధికార గణం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తోంది. మృతుల పేర్లను జాబితా నుంచి తొలగించకపోవడం, ఒకే ఓటరు పేరు రెండుమూడుసార్లున్నా పట్టించుకోకపోవడం, బోగస్ ఓట్లను తీసివేయకపోవడం, ఫొటో ఒకరిది ఉంటే పేరు మరొకరిది, ఇంటి పేర్లలో తప్పులు.. ఇలా ఒకటనేమిటి.. ఎన్నో అవకతవకలు జాబితాలోు వెక్కిరిస్తున్నాయి. జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఓటరు జాబితాల్లో తప్పులు ఇంకా అలాగే కొనసాగుతున్నాయని ఆదివారం ‘న్యూస్‌లైన్’ పరిశీలనలో తేలింది. జాబితాల్లో మృతుల పేర్లు.. ఇబ్రహీంపట్నం రూరల్: మండల పరిధిలోని పోచారంలో దాదాపు 50మంది ఓటర్లు స్థానికంగా వుండటం లేదని తొలగించారు. అయితే ఇది ఏకపక్షంగా జరిగిందని పలువురు పేర్కొన్నారు. కొందరిని లక్ష్యంగా చేసుకుని ఓటరుజాబితాలోంచి పేరు తొలగించడం సమంజసం కాదని వారు అన్నారు. మండల పరిధిలోని ఆదిబట్ల గ్రామంలో సుమారు 2వేల మంది ఓటర్లు వున్నారు. మూడేళ్ల క్రితం చనిపోయిన వారి పేర్లు కూడా జాబితాలో వున్నట్లు గ్రామస్తులు పేర్కొన్నారు. ఎలిమినేడు గ్రామంలో దాదాపు 30మంది స్థానికంగా లేకున్నా ఓటర్లుగా పేరు కలిగివున్నట్లు తెలిసింది. వీరిలో ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి కుటుంబం ఓట్లు కూడా వివాదాస్పదంగా మారాయి. నగరంలోని మలక్‌పేటతోపాటు స్వగ్రామంలో వీరు ఓట్లు కల్గివున్నారని ఇటీవల పలువురు ఆరోపించిన విషయం తెలిసిందే. అవే తప్పులు మళ్లీ మళ్లీ.. మొయినాబాద్: మండలంలోని అమ్డాపూర్‌లో కొత్త మంజూల (27) రెండేళ్ల క్రితం మృతి చెందారు. కానీ ఆమె పేరు మాత్రం ఇంకా ఓటరు జాబితాలో అలాగే ఉంది. ఇదే మరో ఏడుగురు చనిపోయినవారి పేర్లు ఓటరు జాబితాలో తొలగించకుండా అలాగే ఉన్నాయి. గ్రామానికి చెందిన మద్యపాగ గౌరమ్మ(50) గతంలో అనేకసార్లు ఓటుహక్కును వినియోగించుకుంది. ప్రస్తుతం కొత్తగా వచ్చిన ఓటరు జాబితాలో మాత్రం ఆమె పేరు రాలేదు. సురంగల్ గ్రామంలో సైతం ఆరుగురు మరణించినవారి పేర్లు ఓటరు జాబితాలో ఉన్నాయి. కొంత మంది పేర్లు ఓటరు జాబితాలో రెండుసార్లు వచ్చాయి. బూత్‌స్థాయి అధికారులు ఈతప్పులన్నీ సరిచేసి పంపినప్పటికీ మళ్లీ కొత్త జాబితా వచ్చినప్పుడు అవే తప్పులు ఉంటున్నాయి. అంతులేని అశ్రద్ధ మేడ్చల్/ మేడ్చల్ రూరల్:మండలంలోని అత్వెల్లిలో రాజమల్లారెడ్డి అ నే వ్యక్తి మూడేళ్ల క్రితం మరణించగా ఆయన పేరు ఇప్పటికీ ఓటరు జాబితాలోంచి తొలగిం చలేదు. ఏడాది క్రితం మరణించిన నీలమ్మ, మండల సత్తయ్య, ప్రతాప్‌రెడ్డి తదితరుల పేర్లు ఓటరు జాబితాలో కొనసాగుతూనే ఉన్నాయి. గ్రామంలో 2,300 ఓటర్లలో 100 వరకు తప్పులున్నాయి. ఎల్లంపేట గ్రామంలో అర్హత లేని ఓట్లను తొలగింపు ప్రక్రి య కాగితాలకే పరిమితమయ్యింది. చని పోయిన వారి పేర్లను జాబితా నుంచి తొలగించకుండా వారి ఫొటోల పక్కన చనిపోయారని రాసి ఉంచారు. కొత్తవారి నుంచి ఫారాలు తీసుకుంటున్నారే కానీ మిగతా వాటిపై శ్రద్ధ కనబరచడం లేదు. చనిపోయినా.. యాలాల: యాలాల అనుబంధ గ్రామం గోవిందరావుపేటకు చెందిన నాదర్గి సాయన్న (62) ఏడాది క్రితం చనిపోయారు. కానీ నూతన ఓటరు జాబితాలో సాయన్న వివరాలు అలాగే ఉన్నాయి. ఇలాగే మండలంలోని చాలా గ్రామాల్లో మృతుల పేర్లను ఓటరు జాబితా నుంచి అధికారులు తొలగించలేదు. ఫొటో ఒకరిది.. వివరాలు మరొకరివి.. దోమ: మండల పరిధిలోని పాలేపల్లికి చెందిన తుప్పల కిష్టమ్మ, ఎం.బిచ్చమ్మ, ఎస్. అంజిలయ్య, శివన్నగారి నర్సమ్మ, బొక్క నర్సమ్మలు మృతి చెంది నెలలు గడుస్తున్నా ఓటరు లిస్టులో వారి పేర్లు మాత్రం అలాగే ఉన్నాయి. ఇక 20మందికి పైగా ఓటర్ల పేర్లు రెండేసి సార్లు వచ్చాయి. చాలా మంది విషయంలో ఫొటోలు ఒకరివైతే వివరాలు వేరొకరివి ఉండడంతో ఓటర్లు ఇబ్బందులకు గురవుతున్నారు. ఒకే పేరు.. రెండేసి ఓట్లు ఘట్కేసర్ టౌన్: ఘట్కేసర్ 11వ వార్డులో 547 క్రమసంఖ్యతో టి.రాజయ్య అనే వ్యక్తి మృతి చెంది రెండేళ్లు కావస్తున్నా ఆయన పేరునుజాబితా నుంచి తొలగించలేదు. 9వ వార్డులో 6-157 ఇంటి నంబర్‌పై 942 క్రమసంఖ్యతో కుమోజి శ్రీహరి పేరుతో, అదే వ్యక్తి 6-157/బి ఇంటి నంబర్లో 945 క్రమసంఖ్యతో శ్రీహరి కుంబోజి పేరుతో ఓటు కలిగి ఉన్నాడు.ఇలా ఒక గ్రామంలోనే వందలాదిగా రెండేసిసార్లు ఓట్లున్నాయి.