ఓటర్ల జాబితాపై అభ్యంతరాలుంటే తెలపండి
డీఆర్ఓ మార్కండేయులు
నెల్లూరు(పొగతోట):
ఎమ్మెల్సీ ఓటర్ల జాబితాకు సంబంధించి అభ్యంతరాలుంటే ఈ నెల 23వ తేదీలోపు తెలియజేయాలని డీఆర్ఓ మార్కండేయులు రాజకీయపార్టీల ప్రతినిధులకు సూచించారు. మంగళవారం తన చాంబర్లో రెవెన్యూ అధికారులు, వివిధ రాజీకీయపార్టీల ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో డీఆర్ఓ మాట్లాడారు. ఈ నెల 23 నుంచి వచ్చే నెల 8వ తేదీ వరకు అభ్యంతరాలు, క్లైమ్స్ స్వీకరించడం జరుగుతుందన్నారు. గ్రాడ్యుయేట్స్, ఉపాధ్యాయులకు ప్రత్యేక పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఓటర్లు వారికి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉండే పోలింగ్ కేంద్రాలల్లో ఓటు హక్కు వినియోగించుకునేలా చర్యలు చేపడతామన్నారు. పోలింగ్ కేంద్రాలపై అభ్యంతరాలుంటే రాతపూర్వకంగా తెలియజేయాలని తెలిపారు. సమావేశంలో ఆత్మకూరు, నాయుడుపేట ఆర్డీఓలు ఎంవీ రమణ, శ్రీనానాయక్, ప్రొటోకాల్ తహసీల్దార్ వెంకటేశ్వర్లు, సెక్షన్ సూపరింటెండెంట్ రాంభూపాల్‌రెడ్డి పాల్గొన్నారు.