VRO transfer
-
బాధ్యత నిర్వహిస్తే.. బదిలీ చేశారు
సాక్షి, కాశీబుగ్గ: ఇంటి ముందు, ఇంటిపైనా, వీధుల్లో ఫ్లెక్సీలు తొలగించమన్నందుకు ఎన్నికల విధుల్లో ఉన్న ప్రభుత్వ ఉద్యోగిని బదిలీ చేసిన ఉదంతం సంచలనంగా మారింది. వివరాల్లోకి వెళ్తే పలాస మండలం లక్ష్మిపురం పంచాయతీ పరిధిలో ఉన్న కిష్టుపురం గ్రామానికి చెందిన ఎంపీటీసీ బూర్లె మాధవి ఇంటి వద్ద మంగళవారం జెండాలు ఎగరడంతో బ్రాహ్మాణతర్లా రూట్లో ఎన్నికల అధికారి డి అనితాదేవి ఆదేశాల మేరకు వీఆర్ఓ సంతోష్‌కుమార్ వాటిని తొలగింపజేశారు. వీఆర్ఓకు బెదిరింపులు లక్ష్మిపురం పంచాయతీ ఎంపీటీసీ బూర్లె మాధవి భర్త బూర్లె రాజు వీఆర్ఒపై ఫోన్లో విరుచుకుపడి.. ఎక్కడున్నావో చెప్పు.. ఎవడవురా నీవు ఎవరనుకుంటున్నావు, కట్టేసి కొడతాంరా అంటూ చిందులు వేశారు. అప్పటికీ ఊరుకోక ఎమ్మెల్యే అల్లుడు యార్లగడ్డ వెంకన్నచౌదరి, పీరుకట్ల విఠల్‌రావులతో తహశీల్దారు కార్యాలయానికి వచ్చి ఎన్నికల అధికారి అనితాదేవితో వాదనకు దిగారు. రూల్స్ ఎలా ఉంటే అలా చేస్తామని చెప్పడంతో వెనుదిరిగి తహసీల్దారు బాపిరాజును పట్టుకుని ఇలా అయితే గొడవలు వస్తాయని చెప్పి వీఆర్ఓను బదలాయించారు. ఆయనకు వేరే ప్రాంతం చూడమని, ఎమ్మెల్యే ప్రధాన అనుచరుడు పీరుకట్ల విఠల్ బంధువు హేమగిరిని వీఆర్ఓగా ఫుల్చార్జ్తో నియమించారు. ఎటువంటి గొడవలు రాకూడదని మార్చాం.. ఎన్నికల విధులలో భాగంగా కిష్టుపురం వీఆర్ఓగా విధులు నిర్వహిస్తున్న సంతోష్‌కుమార్‌ను వేరే ప్రాంతానికి పంపించి ఫుల్‌చార్జ్ వీఆర్ఓ హేమగిరిని నియమించాము. వాస్తవంగా తహసీల్దారు కార్యాలయం వద్ద ఎటువంటి గొడవలు జరగలేదు. కిష్టుపురంలో జెండాలు తొలగించమంటే అబ్జక్షన్ చేశారు. దానికి ఎన్నికల అధికారి వివరణ ఇవ్వడంతో వెనుదిరిగారు. –బాపిరాజు, తహసీల్దారు, పలాస -
వీఆర్ఓల బదిలీలు షురూ..!
జిల్లాలో గ్రామ రెవెన్యూ అధికారు(వీఆర్ఓ)ల బదిలీలకు జిల్లా యంత్రాంగం శ్రీకారం చుట్టింది.ఏడేళ్లకు పైబడి ఒకే చోట పనిచేస్తున్న వారంతా బదిలీలకు ఈ నెల 10వ తేదీలోగా దరఖాస్తులు సమర్పించాలని ఆదేశాలు జారీ చేసింది. గతంలో లేని విధంగా, పరిపాలన సౌలభ్యం కోసం ప్రస్తుత బదిలీల్లో సొంత మండలాలను, ప్రస్తుతం పనిచేస్తున్న నియోజకవర్గం దాటి బదిలీ చేయాలని నిర్ణయించింది. చౌటుప్పల్ : జిల్లాలో 830వీఆర్వో పోస్టులుండగా 733మంది పనిచేస్తున్నారు. మొత్తం 97పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 2008లో బదిలీ అయిన వారు ఇప్పటి వరకు ఏడేళ్లకు పైబడి ఒకేచోట పనిచేస్తున్నారు. ఇలా జిల్లాలో మొత్తం 231మంది ఉన్నారు. పరిపాలనా సౌలభ్యం కోసం వీరందరినీ బదిలీ చేయాలని జిల్లా యంత్రాంగం నిర్ణయించింది. ఏడేళ్లు పూర్తి చేసుకున్న వీఆర్ఓల జాబితాను, ఖాళీగా ఉన్న జాబితాను విడుదల చేసింది. వీరంతా ఈ నెల 10వ తేదీలోగా బదిలీకోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. 7ఏళ్ల సర్వీసు పూర్తయిన వారు ఆలేరు నియోజకవర్గంలో 23మంది, భువనగిరి-19, మునుగోడు-19, దేవరకొండ-14, తుంగతుర్తి-31, సూర్యాపేట-24, నకిరేకల్-32, కోదాడ-11, మిర్యాలగూడ-7, హుజూర్నగర్-11, నల్లగొండ-14, నాగార్జునసాగర్ నియోజకవర్గంలో 26మంది ఉన్నారు. వీరంతా తప్పనిసరిగా బదిలీ కావాల్సి ఉంది. సొంత మండలానికి బదిలీ ఉండదు.. చాలా మండలాల్లో వీఆర్ఏలుగా పనిచేసి, వీఆర్ఓలుగా ఉద్యోగోన్నతి పొంది, సొంత మండలాల్లోనే పనిచేస్తున్నారు. కొంత మంది వీఆర్ఓలు కూడా తమ సొంత మండలాల్లోనే తిష్ట వేశారు. వీరికి ఉద్యోగిగా సరైన గౌరవం దక్కకపోవడంతో పాటు, పాత రికార్డుల మార్పిడి, రాజకీయ సంబంధాలతో జిల్లా యంత్రాంగానికి తలనొప్పిగా మా రారు. దీంతో సొంత మండలాల నుంచి పంపించాలని, బదిలీల్లోనూ సొంత మండలాలకు బదిలీ చేయొద్దని నిర్ణయించింది. ప్రస్తుతం పనిచేస్తున్న నియోజకవర్గం దాటి బదిలీ చేయాలనే ఆలోచనకు వచ్చారంటే పరిస్థితేమిటో అర్థం చేసుకోవచ్చు. మూడేళ్లు దాటితే రిక్వెస్ట్ బదిలీ.. ఒకే క్లస్టర్లో ఏడేళ్లు దాటిన వారిని బదిలీ చేయాలనుకుంటున్న జిల్లా యంత్రాంగం, మూడేళ్లు దాటిన వారు కూడా బదిలీ కోరితే చేయాలని నిర్ణయించింది. ఈ విషయమై గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం నాయకులు గురువారం కలెక్టర్ సత్యనారాయణరెడ్డిని కలిసి విన్నవించారు. అందుకు కలెక్టర్ ఒప్పుకున్నట్టు చెబుతున్నారు. కాగా, ఆలేరు నియోజకవర్గంలో 9, భువనగిరి-6, మునుగోడు-8, దేవరకొండ-14, తుంగతుర్తి-4, సూర్యాపేట-5, నకిరేకల్-9, కోదాడ-13, మిర్యాలగూడ-4, హుజూర్నగర్-16, నల్లగొండ-4, సాగర్ నియోజకవర్గంలో 11చొప్పున వీఆర్ఓ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. -
‘ఉయ్’ఆర్వోలు
ఒంగోలు టౌన్ : పదేళ్ల తర్వాత అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం పార్టీ.. జిల్లా యంత్రాంగంపై పూర్తి స్థాయి పట్టు సాధించేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టింది. తమకు అనుకూలమైన వారిని అందలాలు ఎక్కించడం, ప్రతిపక్షపార్టీ సానుభూతి పరులుగా ముద్ర పడిన వారిని సుదూర ప్రాంతాలకు బదిలీ చేయడం పనిగా పెట్టుకుంది. రెవెన్యూ శాఖలో కీలక గ్రామ రెవెన్యూ అధికారుల(వీఆర్వో)పై అధికార పార్టీ నేతల కన్నుపడింది. రెండు రోజుల పాటు జరిగిన బదిలీల్లో వీఆర్వోలను ఉయ్(మా) ఆర్వోలుగా మార్చేసుకోవడం గమనార్హం. తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులతో పాటు ఆ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జిలు చెప్పిన వారికే కోరుకున్నచోట్ల పోస్టింగ్‌లు ఇప్పించారన్న వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. జిల్లాలో 750 మంది గ్రామ రెవెన్యూ అధికారులు ఉన్నారు. సాధారణ బదిలీల్లో భాగంగా 20 శాతానికి మించి బదిలీలు జరగకూడదు. అదికూడా ఒకే ప్రాంతంలో మూడేళ్లు సర్వీసు నిండిన వారిని మాత్రమే బదిలీ చేయాల్సి ఉంటుంది. పెపైచ్చు గతంలో గ్రామ రెవెన్యూ అధికారులను ఒక డివిజన్ నుంచి మరో డివిజన్‌కు బదిలీ చేశారు. తాజాగా రెండు విడతలుగా గ్రామ రెవెన్యూ అధికారులను బదిలీ చేశారు. ఒకసారి 74 మందిని, మరోసారి 74 మందిని బదిలీ చేశారు. ష్... గప్చిప్! ప్రస్తుత బదిలీలు అత్యంత గోప్యంగా జరిగాయి. గతంలో గ్రామ రెవెన్యూ అధికారుల సంఘాల ప్రతినిధులను పిలిపించి వారి సమక్షంలో బదిలీ ప్రక్రియ పూర్తి చేసేవారు. చివరకు ఆ జాబితాలను గ్రామ రెవెన్యూ అధికారుల సంఘాలకు కూడా ఇవ్వకపోవడం చర్చనీయాంశమైంది. కొంతమంది సంఘాల నాయకులు చివరకు పత్రికా కార్యాలయాలకు ఫోన్లు చేసి బదిలీల జాబితా అధికారికంగా వచ్చిందా, అందులో ఎవరి పేర్లు ఉన్నాయని విచారించడం పరిస్థితికి అద్దం పడుతోంది. జిల్లా యంత్రాంగం కూడా అధికాార పార్టీ శాసనసభ్యులు, పార్టీ నియోజకవర్గ ఇన్చార్జిలు చెప్పిన వారికే ప్రాధాన్యం ఇచ్చారు. ఎన్నికల సంఘం ఆదేశాలు బేఖాతర్ జిల్లాలో గ్రామ రెవెన్యూ అధికారుల్లో ఎక్కువ మంది బూత్ లెవల్ అధికారులుగా విధులు నిర్వర్తిస్తున్నారు. ప్రస్తుతం ఓటర్ల నమోదు ప్రక్రియ జరుగుతోంది. ఎన్నికల సంఘం విధుల్లో పాలుపంచుకుంటున్న వారిని బదిలీ చేయరాదంటూ రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రభుత్వాన్ని ఆదేశించింది. అయితే ఆ ఆదేశాలు జిల్లాల స్థాయిలో అమలు కావడం లేదనేందుకు ప్రస్తుతం జరిగిన గ్రామ రెవెన్యూ అధికారుల బదిలీలే ఉదాహరణగా చెప్పవచ్చు.