vundavalli sridevi
-
బాబును నమ్ముకో.. ఉన్నది అమ్ముకో..
రాజకీయాల్లో విశ్వసనీయత, విలువలు, నిజాయితీ చాలా ప్రధానమని బలంగా నమ్మే వ్యక్తి వైఎస్ జగన్మోహన్రెడ్డి. ఇవేవీ లేకుండా వెన్నుపోటు, అవకాశవాద రాజకీయాన్ని నమ్ముకున్న వ్యక్తం చంద్రబాబు. స్వార్థంతో ఆదరించిన పార్టీని మోసం చేసి.. అలాంటి వంచన పరుల చెంత చేరితే చివరకు రాజకీయ జీవితమే ప్రశ్నార్థకంగా మారుతుంది. ఇందుకు ఉండవల్లి శ్రీదేవి మంచి ఉదాహరణ అని సోషల్ మీడియా ఇప్పుడు కోడై కూస్తోంది. వైఎస్సార్సీపీ బహిష్కృత నాయకురాలు ఉండవల్లి శ్రీదేవికి బిగ్ షాక్ తగిలింది. తనను నమ్ముకుంటే ఎలా ఉంటుందో చంద్రబాబు మరోసారి చేసి చూపించారు. ఈ క్రమంలో ఉండవల్లి శ్రీదేవికి చంద్రబాబు హ్యాండ్ ఇచ్చారు. కాగా, ఉండవల్లి శ్రీదేవి టీడీపీలో చేరిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో చంద్రబాబు ఆమెకు అసెంబ్లీ సీటును కూడా ఆఫర్ చేశారు. తీరా ఎన్నికల సమయంలో వచ్చాక శ్రీదేవికి చంద్రబాబు షాకిచ్చారు. శ్రీదేవి అడిగిన మూడు స్థానాల్లో కూడా ఆమెకు సీటు ఇవ్వలేదు. బాపట్ల ఎంపీ, తిరువూరు, తాడికొండ శ్రీదేవి ఆశించారు. కానీ, చంద్రబాబు మాత్రం ఈ మూడు సీట్లలో శ్రీదేవికి హ్యాండిచ్చారు. మూడు సీట్లలో వేరే వాళ్లకి సీట్ల ఇచ్చారు. దీంతో, ఉండవల్లి శ్రీదేవి, ఆమె అనుచరులు చంద్రబాబు తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నమ్మించి మోసం గొంతు చేశారంటూ శ్రీదేవి తన సన్నిహితుల వద్ద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్టు సమాచారం. రాజకీయాలు ఎలా ఉంటాయో.. ఎవరు ఎలాంటి వారో ఈరోజు అర్థం అయ్యింది!! #Bapatla 🗡️ pic.twitter.com/6Mhl0KY7t4 — MLA Dr Vundavalli Sridevi (@MlaSrideviDr) March 22, 2024 నాడు ఆదరించిన జగనన్న.. రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబమే అయినా.. 2019 ఎన్నికల్లో వైఎస్సార్సీపీ తరఫున పోటీ చేసేదాకా ఉండవల్లి శ్రీదేవి పేరు ఎవరికీ పెద్దగా తెలియదు. హైదరాబాద్‌లో వైద్య వృత్తిలో ఉన్న ఆమెను పిలిచి మరీ ఆనాడు తాడికొండ సీటు ఇచ్చారు వైఎస్ జగన్. ఆ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ప్రభంజనంలో ఆమె కూడా నెగ్గి అసెంబ్లీకి వెళ్లారు. అయితే.. అవినీతి ఆరోపణలతో ఆమెకు టికెట్ ఇవ్వబోమనే సంకేతాలిచ్చింది. అయినా కూడా పార్టీలో గౌరవంగా చూసుకుంటామనే మాటిచ్చింది. అయినా ఆమె ద్రోహానికి దిగారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో టీడీపీ అభ్యర్థికి క్రాస్ ఓటు వేశారు. ఆ తర్వాత అనర్హత వేటు వేయించుకుని మరీ టీడీపీలో చేరారామె. రాజకీయ భవిష్యత్ ఇచ్చిన సీఎం జగన్నే విమర్శిస్తూ.. బాబుకు జై కొట్టారు. చివరకు ఏమైంది?.. రాజకీయాల్లో రాంగ్ స్టెప్ వేశారు. కనీసం ఇప్పుడు వైఎస్సార్సీపీలో ఉండి ఉంటే పరువు అయినా దక్కి ఉండేది. పార్టీ మారి.. బాబు వెన్నుపోటు కత్తి పదును చవిచూసి.. రాజకీయ జీవితాన్నే ప్రశ్నార్థకంగా మార్చుకున్నారామె. ఎలాంటి రాజకీయ నేపథ్యం లేని ఆమెను పిలిచి మరీ టికెట్ ఇచ్చి.. ఎమ్మెల్యేను చేసిన సీఎం జగన్‌కే వెన్నుపోటు పొడిచినందుకు తగిన శాస్తి జరిగిందనే కామెంట్స్ కూడా వినిపిస్తోన్నాయిప్పుడు. సోషల్ మీడియాలో ఆమె పేరిట వైరల్ అవుతున్న పోస్ట్ కింద కొన్ని కామెంట్లను పరిశీలిస్తే.. -
ఉండవల్లి శ్రీదేవి గురించి అసలు నిజాలు బయటపెట్టిన రమణయ్య నాయుడు
-
ఉండవల్లి శ్రీదేవి కాదు ఊసరవెల్లి శ్రీదేవి: మంత్రి అమర్నాథ్
సాక్షి, విశాఖపట్నం: ఉండవల్లి శ్రీదేవికి నాలుగేళ్లుగా కనిపించని లోపాలు ఇప్పుడు ఎలా బయటికి వస్తున్నాయని మంత్రి గుడివాడ అమర్నాథ్ ప్రశ్నించారు. ఆమె ఉండవల్లి శ్రీదేవి కాదు ఊసరవెల్లి శ్రీదేవి అని వ్యంగాస్త్రాలు సంధించారు. సినీనటి శ్రీదేవికి మించి నటించిందని దుయ్యబట్టారు. ఎమ్మెల్సీ ఎన్నికలో ఓటు వేసే ముందు జగన్మోహన్రెడ్డి దగ్గరికి కూతురుని తీసుకెళ్లి ఫోటో దిగింది.. ఆయన అభిమాని అని నమ్మించి మోసం చేయాలని భావించిందని మండిపడ్డారు. ఆమె మరి కొద్ది రోజుల్లోనే చీకొట్టే స్థితికి చేరుకుంటుందని, శ్రీదేవి లాంటి నమ్మకద్రోహుల గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదన్నారు. అంతా చంద్రబాబు స్క్రిప్ట్ ప్రకారమే చంద్రబాబు స్క్రిప్ట్ ప్రకారమే శ్రీదేవి మాట్లాడారని బాపట్ల ఎంపీ నందిగం సురేశ్ ధ్వజమెత్తారు. దళితులను అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేయడం చంద్రబాబుకి అలవాటేనని ఎద్దేవా చేశారు. చంద్రబాబు ఏనాదైనా ఎస్సీలకు పదవులిచ్చారా అని ప్రశ్నించారు. దళితులు రాజకీయంగా ఎదగడానికి సీఎం జగన్ అవకాశాలు కల్పిస్తున్నారని .. అదే క్రమంలో పార్టీ లైన్ దాటితే ఎవరిపైనైనా చర్యలు ఉంటాయన్నారు. జగన్‌ను మోసం చేసినోళ్లకు రాజకీయ భవిష్యత్తు ఉండదని తెలిపారు. -
తప్పటడుగు వేసి అడ్డంగా దొరికిపోయారు..
మార్చి 23, 2023. గురువారం రోజున ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుల కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగాయి. అదే రోజు సాయంత్రం ఓట్ల లెక్కింపు జరిగింది. ఏడు స్థానాలకు గాను ఆరు ఎమ్మెల్సీలను వైఎస్సార్ కాంగ్రెస్ గెలుచుకుంది. ఒక స్థానాన్ని తెలుగుదేశం గెలిచింది. ఇక్కడ కీలకమైన విషయం ఏంటంటే.. బలం లేకున్నా తెలుగుదేశం గెలవడం. ఓటుకు కోట్లు గుమ్మరించడంలో బహుశా దేశ రాజకీయాల్లోనే అత్యంత నిష్ణాతుడయిన చంద్రబాబు.. గతానుభవాలతో పాటు తగు జాగ్రత్తలు తీసుకుని నలుగురు అధికార పార్టీ ఎమ్మెల్యేలకు వల వేసినట్టు స్పష్టమయింది. ఓటుకు కోట్ల వెనక 40 ఇయర్స్ చంద్రబాబు చేసింది సిగ్గు మాలిన పని అని తెలిసినా ఎల్లో మీడియా మాత్రం భలేగా డప్పు కొట్టింది. మా బాబుకు తెలిసిన విద్యలు మరెవరికి తెలియదని, ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ కాబట్టే బలం లేకున్నా తమ అభ్యర్థిని గెలిపించుకున్నాడని ఘనకీర్తిని అందుకున్నాయి ఎల్లోమీడియా. ఇక్కడ ఒక అడుగు ముందుకేసి కప్పదాటు వేసిన నలుగురు ఫిరాయింపు ఎమ్మెల్యేల తరపునా సానుభూతి రాగం వినిపించింది ఎల్లో మీడియా. కనీసం సంజాయిషీ అడగకుండా వేటు ఎలా వేస్తారంటూ తన అజ్ఞానాన్ని బయటపెట్టుకుంది. క్రాస్ ఓటింగ్ ఎలా కనిపెట్టవచ్చు? నిజానికి రాజకీయాల్లో ఇలాంటి ఎన్నికలు కొత్తేమీ కాదు. గతంలోనూ జరిగాయి. ఇప్పుడు కూడా జరుగుతున్నాయి. చంద్రబాబు లాంటి రాజకీయ బేహారులు వచ్చిన తర్వాత ఎన్నికలేవైనా ఓటుకు కోట్లు దెబ్బకు భ్రష్టు పడుతున్నాయి కాబట్టి పార్టీలు మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. అందుకే వైఎస్సార్సిపి కూడా పూర్తి అవగాహనతో వ్యవహరించింది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో 175 మంది ఎమ్మెల్యేలున్నారు. అందరూ ఓటేశారు. వైఎస్సార్సిపికి 151 మంది ఉన్నారు. ఎన్నిక జరిగింది 7 సీట్లకు కాగా.. పోటీలో ఉన్నది 8 మంది. కాబట్టి.. తన దగ్గర ఉన్న 151 మంది ఎమ్మెల్యేలను 7 టీంలుగా విభజించింది. అంటే ప్రతీ ఎమ్మెల్యే తన తొలి ప్రాధాన్యతగా ఎవరిని ఎంచుకోవాలో ముందే స్పష్టంగా సూచించారు. ఉదాహారణకు వైఎస్సార్సిపి ఎమ్మెల్సీ అభ్యర్థులు A, B, C, D, E, F & G అనుకుందాం. ప్రతి ఎమ్మెల్యేకు కింద ఇచ్చినట్టుగా ఓటు వేయమని చెబుతారు. అలాగే రెండో, మూడో ప్రాధాన్యతకు సంబంధించిన ఆప్షన్లు కూడా ఇస్తారు. అంటే ప్రతీ ఒక్కరికి ఒక యూనిక్ కాంబినేషన్ ఉంటుంది. ఏ ఒక్కరిది కూడా మరొకరితో కలవదు. రెండో, మూడో ప్రాధాన్యత చూడగానే కాంబినేషన్లో ఎక్కడ తేడా వచ్చిందో అర్థమవుతుంది. దీన్ని బట్టి క్రాస్ ఓటింగ్ చేసిన ఎమ్మెల్యేను క్షణాల్లో గుర్తించేస్తారు. ముందుగానే యునిక్ సీక్వెన్స్ ఇవ్వడంతో అమ్ముడుపోయిన ఎమ్మెల్యేల గుట్టు రట్టయింది. విషయం బయటపడడంతో ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్‌కు పాల్పడిన నలుగురు ఎమ్మెల్యేలను వైఎస్ఆర్ సీపీ అధిష్టానం వెంటనే సస్పెండ్ చేసింది. నమ్మక ద్రోహులను ఉపేక్షించేదిలేదని ఓ స్పష్టమైన సందేశాన్ని పంపింది. ఎల్లో మీడియా కక్కుర్తి రాతలు ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో మొత్తం సీట్లు 58. ప్రస్తుతం అధికార పక్షం వైఎస్సార్సిపికి సభలో 44 మంది సభ్యులున్నారు. తెలుగుదేశం పార్టీ కేవలం 10 స్థానాలకు పరిమితమయింది. ఇద్దరు స్వతంత్రులు కాగా, మరో ఇద్దరు పీడీఎఫ్. సభలో ఏ రకంగా చూసినా వైఎస్సార్‌సిపిదే శక్తిమంతమైన పార్టీ. పైగా ఎమ్మెల్సీ పదవుల కోసం వైఎస్సార్సిపి ఎప్పుడూ ఆరాటపడలేదు. చదవండి: బాబు బ్రోకర్లకు టైం వచ్చింది..! బీజేపీలోని పచ్చ నేతల ప్లాన్ ఏంటి? తమకున్న బలానికి ఎన్ని పదవులు వస్తాయో.. అంత వరకే ఆశించారు. నియోజకవర్గాల్లో పని తీరు సరిగాలేని ఉండవల్లి శ్రీదేవి ,మేకపాటి చంద్రశేఖర్ రెడ్డిలకు కూడా పార్టీ అధిష్టానం స్పష్టంగా తమ ఉద్దేశాన్ని ముందే చెప్పేసింది. మళ్లీ టికెట్ ఇస్తామని కూడా తప్పుడు హామీ ఇవ్వలేదు. ఇవన్నీ తెలిసినా.. నిజాలు దాచిపెట్టిన ఎల్లో మీడియా.. మా బాబు మహా గొప్పోడు, చాణక్యుడి కంటే సమర్థుడంటూ డప్పేసుకుంటోంది. -పొలిటికల్ ఎడిటర్, సాక్షి డిజిటల్