రాజకీయాల్లో విశ్వసనీయత, విలువలు, నిజాయితీ చాలా ప్రధానమని బలంగా నమ్మే వ్యక్తి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి. ఇవేవీ లేకుండా వెన్నుపోటు, అవకాశవాద రాజకీయాన్ని నమ్ముకున్న వ్యక్తం చంద్రబాబు. స్వార్థంతో ఆదరించిన పార్టీని మోసం చేసి.. అలాంటి వంచన పరుల చెంత చేరితే చివరకు రాజకీయ జీవితమే ప్రశ్నార్థకంగా మారుతుంది. ఇందుకు ఉండవల్లి శ్రీదేవి మంచి ఉదాహరణ అని సోషల్ మీడియా ఇప్పుడు కోడై కూస్తోంది.
వైఎస్సార్‌సీపీ బహిష్కృత నాయకురాలు ఉండవల్లి శ్రీదేవికి బిగ్ షాక్ తగిలింది. తనను నమ్ముకుంటే ఎలా ఉంటుందో చంద్రబాబు మరోసారి చేసి చూపించారు. ఈ క్రమంలో ఉండవల్లి శ్రీదేవికి చంద్రబాబు హ్యాండ్ ఇచ్చారు. కాగా, ఉండవల్లి శ్రీదేవి టీడీపీలో చేరిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో చంద్రబాబు ఆమెకు అసెంబ్లీ సీటును కూడా ఆఫర్ చేశారు. తీరా ఎన్నికల సమయంలో వచ్చాక శ్రీదేవికి చంద్రబాబు షాకిచ్చారు. శ్రీదేవి అడిగిన మూడు స్థానాల్లో కూడా ఆమెకు సీటు ఇవ్వలేదు. బాపట్ల ఎంపీ, తిరువూరు, తాడికొండ శ్రీదేవి ఆశించారు. కానీ, చంద్రబాబు మాత్రం ఈ మూడు సీట్లలో శ్రీదేవికి హ్యాండిచ్చారు. మూడు సీట్లలో వేరే వాళ్లకి సీట్ల ఇచ్చారు. దీంతో, ఉండవల్లి శ్రీదేవి, ఆమె అనుచరులు చంద్రబాబు తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నమ్మించి మోసం గొంతు చేశారంటూ శ్రీదేవి తన సన్నిహితుల వద్ద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్టు సమాచారం.
రాజకీయాలు ఎలా ఉంటాయో..
ఎవరు ఎలాంటి వారో ఈరోజు అర్థం అయ్యింది!! #Bapatla 🗡️ pic.twitter.com/6Mhl0KY7t4— MLA Dr Vundavalli Sridevi (@MlaSrideviDr) March 22, 2024
నాడు ఆదరించిన జగనన్న..
రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబమే అయినా.. 2019 ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ తరఫున పోటీ చేసేదాకా ఉండవల్లి శ్రీదేవి పేరు ఎవరికీ పెద్దగా తెలియదు. హైదరాబాద్‌లో వైద్య వృత్తిలో ఉన్న ఆమెను పిలిచి మరీ ఆనాడు తాడికొండ సీటు ఇచ్చారు వైఎస్ జగన్. ఆ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ ప్రభంజనంలో ఆమె కూడా నెగ్గి అసెంబ్లీకి వెళ్లారు. అయితే.. అవినీతి ఆరోపణలతో ఆమెకు టికెట్ ఇవ్వబోమనే సంకేతాలిచ్చింది. అయినా కూడా పార్టీలో గౌరవంగా చూసుకుంటామనే మాటిచ్చింది. అయినా ఆమె ద్రోహానికి దిగారు.
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో టీడీపీ అభ్యర్థికి క్రాస్ ఓటు వేశారు. ఆ తర్వాత అనర్హత వేటు వేయించుకుని మరీ టీడీపీలో చేరారామె. రాజకీయ భవిష్యత్ ఇచ్చిన సీఎం జగన్‌నే విమర్శిస్తూ.. బాబుకు జై కొట్టారు. చివరకు ఏమైంది?.. రాజకీయాల్లో రాంగ్ స్టెప్ వేశారు. కనీసం ఇప్పుడు వైఎస్సార్‌సీపీలో ఉండి ఉంటే పరువు అయినా దక్కి ఉండేది. పార్టీ మారి.. బాబు వెన్నుపోటు కత్తి పదును చవిచూసి.. రాజకీయ జీవితాన్నే ప్రశ్నార్థకంగా మార్చుకున్నారామె.
ఎలాంటి రాజకీయ నేపథ్యం లేని ఆమెను పిలిచి మరీ టికెట్ ఇచ్చి.. ఎమ్మెల్యేను చేసిన సీఎం జగన్‌కే వెన్నుపోటు పొడిచినందుకు తగిన శాస్తి జరిగిందనే కామెంట్స్ కూడా వినిపిస్తోన్నాయిప్పుడు. సోషల్ మీడియాలో ఆమె పేరిట వైరల్ అవుతున్న పోస్ట్ కింద కొన్ని కామెంట్లను పరిశీలిస్తే..
Comments
Please login to add a commentAdd a comment