vvip chopper scam
-
విదేశీయుడని ఎన్నాళ్లు కస్టడీలో ఉంచుతారు?
న్యూఢిల్లీ: అగస్టా వెస్ట్‌ల్యాండ్ హెలికాప్టర్ల కుంభకోణంలో మధ్యవర్తిగా వ్యవహరించాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న క్రిస్టియన్ మైఖేల్ జేమ్స్‌ను విదేశీయుడన్న కారణంతో ఎన్ని రోజులు పోలీసు కస్టడీలో ఉంచుతారని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. అతను భారతీయుడు కాకపోవడంతో నాలుగేళ్లకు పైగా కస్టడీలో ఉంచడం సమర్థనీయమా అని ప్రశ్నించింది. ఇది అతని స్వేచ్ఛను పూర్తిగా అణిచివేయడమేనని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్, జస్టిస్ పిఎస్.నరసింహలతో కూడిన బెంచ్ అభిప్రాయపడింది. బ్రిటన్ జాతీయుడైన మైఖేల్‌ను దుబాయ్ 2018లో భారత్‌కు అప్పగించింది. అప్పట్నుంచి అతను పోలీసు కస్టడీలోనే ఉన్నాడు. తనకు బెయిల్ ఇవ్వడానికి నిరాకరిస్తూ ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పుని మైఖేల్ సుప్రీంలో సవాల్ చేశాడు. ఈ పిటిషన్‌ను విచారించిన సుప్రీం .. విదేశీయుడైనందుకు అతను అలాగే కస్టడీలో మగ్గిపోవాలా ? అని వ్యాఖ్యానించింది. మైఖేల్ జేమ్స్ అప్పగింత సమయంలో జరిగిన ఒప్పందం వివరాలన్నింటినీ కోర్టుకు సమర్పించాలని ఆదేశిస్తూ తదుపరి విచారణను 2023 జనవరి రెండో వారానికి వాయిదా వేసింది. ఇదీ చదవండి: ఇకపై సహజీవనం నేరమే.. ఆరు నెలల జైలు శిక్ష -
‘అగస్టా’ మైకేల్‌ను విచారించనున్న సీబీఐ
న్యూఢిల్లీ: అగస్టా వెస్ట్‌ల్యాండ్ హెలికాప్టర్ కుంభకోణంలో మధ్యవర్తిగా భావిస్తున్న క్రిస్టియన్ మైకేల్(58)ను విచారించేందుకు సీబీఐకి ఢిల్లీ కోర్టు అనుమతి ఇచ్చింది. ఈ నెల 24 నుంచి 26 వరకు విచారించవచ్చని పేర్కొంది. ప్రస్తుతం మైకేల్ ఉంటున్న తీహార్ సెంట్రల్ జైల్లోనే ఈ విచారణ జరగనుంది. జైల్ సూపరింటెండెంట్ పర్యవేక్షణలోగానీ, లేదా ఆయన అనుమతించిన వారి పర్యవేక్షణలోగానీ ఈ విచారణ జరగనుంది. గతేడాది డిసెంబర్లో దుబాయ్ ప్రభుత్వం ఆయనను భారత్‌కు అప్పగించింది. బ్రిటన్ జాతీయుడైన మైకేల్ అగస్టా వెస్ట్‌ల్యాండ్ కంపెనీ నుంచి రూ.225 కోట్ల ముడుపులు పుచ్చుకున్నట్లు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) 2016లో చార్జిషీటు దాఖలు చేసింది. ఈ కుంభకోణంలో మైకేల్‌తో పాటు గైడో హాష్కే, కార్లో గెరోసా అనే మధ్యర్తులపైనా ఈడీ, సీబీఐలు దర్యాప్తు జరుపుతున్నాయి. ఏమిటీ కుంభకోణం? రూ.3600 కోట్లతో 12 వీవీఐపీ హెలికాప్టర్లు కొనేందుకు 2010, ఫిబ్రవరిలో నాటి యూపీఏ ప్రభుత్వం అగస్టా వెస్ట్‌ల్యాండ్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. కాంట్రాక్టు నిబంధనలు ఉల్లంఘనకు గురవడంతో పాటు రూ.423 కోట్ల ముడుపులు చేతులు మారాయని, కేంద్ర ఖజానాకు సుమారు రూ.2666 కోట్ల నష్టం వాటిల్లినట్లు ఆరోపణలు రావడంతో 2014 జనవరి 1న ఆ ఒప్పందాన్ని రద్దు చేసుకుంది. హెలి కాప్టర్లు ఎగిరే ఎత్తు పరిమితిని 6 వేల మీటర్ల నుంచి 4500 మీటర్లకు తగ్గించి కొందరు అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని సీబీఐ ఆరోపించింది. ఎత్తు తగ్గించడం ద్వారానే అగస్టా వెస్ట్‌ల్యాండ్ ఒప్పందం చేసుకోవడానికి అర్హత సాధించిందని తెలిపింది. -
ఎవరీ మైకేల్?
సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: అగస్టా కుంభకోణంలో నిందితుడిగా ఉన్న మధ్యవర్తి, బ్రిటిషర్ క్రిస్టియన్ మైకేల్‌ను ఢిల్లీలోని ఓ కోర్టు ఐదు రోజుల పాటు కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) కస్టడీకి అప్పగించింది. భారత్‌లో రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, రక్షణ మంత్రి సహా పలువురు వీవీఐపీల కోసం రూ.3,600 కోట్లతో 12 విలాసవంతమైన హెలికాప్టర్ల కొనుగోలు వ్యవహారంలో మైకేల్‌ను సీబీఐ అధికారులు నిన్న రాత్రి యూఏఈ నుంచి ఢిల్లీకి తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలో బుధవారం ఆయన్ను గట్టి భద్రత నడుమ ఢిల్లీలోని కోర్టు ముందు సీబీఐ అధికారులు హాజరుపర్చారు. అగస్టా కుంభకోణంలో లోతైన కుట్ర దాగుందనీ, ప్రభుత్వ పెద్దలు, ఉన్నతాధికారుల పాత్రపై దర్యాప్తు జరపడానికి వీలుగా 14 రోజులు తమ కస్టడీకి అప్పగించాలని సీబీఐ న్యాయవాది డీపీ సింగ్ కోరారు. దీంతో సీబీఐ ప్రత్యేక జడ్జి.. మైకేల్‌ను 5 రోజుల సీబీఐ కస్టడీకి అప్పగించారు. అగస్టా ఒప్పందంలో భాగంగా మైకేల్ రూ.225 కోట్లు అందుకున్నారనీ, ఈ మొత్తాన్ని ప్రభుత్వ పెద్దలు, ఐఏఎఫ్ అధికారులకు లంచంగా చెల్లించారని సీబీఐ చార్జిషీటులో తెలిపింది. అలాగే మైకేల్ కంపెనీ గ్లోబల్ సర్వీసెస్ ద్వారా ఢిల్లీలోని ఓ మీడియా సంస్థలోకి నగదు వచ్చిన విషయాన్ని తాము గుర్తించినట్లు ఈడీ వెల్లడించింది. మరోవైపు ఈ వ్యవహారంపై కాంగ్రెస్, బీజేపీ మధ్య మాటలయుద్ధం ముదిరింది. మైకేల్‌పై తప్పుడు వాంగ్మూలం ఇప్పించి ప్రతిపక్ష నేతలపై బురద చల్లేందుకు బీజేపీ యత్నిస్తోందని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. దీంతో కాంగ్రెస్ పార్టీ అగస్టా కుంభకోణంలో మధ్యవర్తిగా ఉన్న మైకేల్‌ను కాపాడాలనుకుంటోందా? అని బీజేపీ చీఫ్ అమిత్ షా ప్రశ్నించారు. కాంగ్రెస్‌కు ఇబ్బంది తప్పదా! మైకేల్‌ను విచారించడం ద్వారా అగస్టా కుంభకోణంలో కాంగ్రెస్ నేతల పాత్రపై మరిన్ని వాస్తవాలు వెలుగులోకి వస్తాయనీ, తద్వారా కాంగ్రెస్‌ను రాజకీయంగా ఇరుకునపెట్టాలని కేంద్రం భావిస్తోంది. విజయ్ మాల్యా, నీరవ్‌మోదీ వంటి ఆర్థిక నేరస్తులను వెనక్కి రప్పించడంలో బీజేపీ సర్కారు విఫలమయిందంటూ కాంగ్రెస్ చేస్తున్న ప్రచారాన్ని దీటుగా తిప్పికొట్టేందుకు మైకేల్‌ను బీజేపీ ఆయుధంగా ఉపయోగించుకుంటుందని పరిశీలకులు అంటున్నారు. ఈ ఒప్పందం కుదరాలంటే సోనియాగాంధీని ప్రసన్నం చేసుకోవాలంటూ 2008లో అప్పటి అగస్టా కంపెనీ భారత్ విభాగం చీఫ్ పీటర్ హ్యూలెట్‌కు రాసిన లేఖలో మైకేల్ సూచించారు. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న సీబీఐ, ఈడీ అధికారులు ఇప్పటికే మైకేల్ డైరీని సంపాదించారు. అగస్టా ఒప్పందం కోసం ఎవరెవరికి ఎంత ముడుపులు ఇచ్చింది మైకేల్ తన డైరీలో కోడ్ భాషలో రాసుకున్నారు. కాగా, అగస్టా కుంభకోణానికి సోనియాకు సంబంధం లేదని కాంగ్రెస్ పార్టీ వాదిస్తోంది. కేంద్రం ఆదేశాల మేరకు సీబీఐ అధికారులు ఒత్తిడి చేసి మైకేల్ చేత బలవంతపు వాంగ్మూలం ఇప్పించారని ఆరోపించింది. సల్వార్కమీజ్లో పారిపోయేందుకు యత్నం! భారత అధికారులకు దొరక్కుండా ఉండేందుకు మైకేల్ చాలా వ్యూహాలు రచించాడు. తొలుత దుబయ్ పోలీసులు తనను అరెస్ట్ చేయగానే తాను బ్రిటన్ పౌరుడ్ని అయినందున భారత్‌కు అప్పగించడం కుదరదని వాదించారు. వెంటనే అప్రమత్తమైన జాతీయభద్రతా సలహాదారు అజిత్ దోవల్ మైకేల్ చేజారిపోకుండా ఏడాది క్రితం సీబీఐ, నిఘా సంస్థ ‘రా’ అధికారులతో ఓ బృందాన్ని ఏర్పాటుచేశారు. సెప్టెంబర్‌లో దుబయ్‌లోని కోర్టు ఆయనకు ఇచ్చిన బెయిల్‌ను రద్దుచేసింది. దీంతో సల్వార్ కమీజ్, టోపీ ధరించి మారువేషంలో పారిపోయేందుకు మైకేల్ యత్నించగా భారత నిఘావర్గాలు ఇచ్చిన సమాచారంతో పోలీసులు అయన్ను పట్టుకున్నారు. దౌత్యమార్గంలోనూ ఒత్తిడి పెంచడంతో యూఏఈ మైకేల్‌ను భారత్‌కు అప్పగించింది. ఎవరీ మైకేల్? బ్రిటన్ పౌరుడైన మైకేల్ వెస్ట్‌ల్యాండ్ కంపెనీకి కన్సల్టెంట్‌గా పని చేస్తున్నారు. భారత్ నుంచి అగస్టాకు కాంట్రాక్టులు సాధించిపెట్టడమే మైకేల్ పని. మైకేల్ తండ్రి వోల్ఫ్‌గంగ్ మైకేల్ సైతం 1980లలో వెస్ట్‌ల్యాండ్ కంపెనీకి ఇండియాలో కన్సల్టెంట్‌గా చేశారు. ఆయన మూడు కంపెనీలు నిర్వహించారు. తరచూ భారత్‌లో పర్యటించే మైకేల్‌కు ప్రధాన రాజకీయ పార్టీల నేతలు, ప్రభుత్వ ఉన్నతాధికారులతో స్నేహం ఏర్పడింది. పరిచయాలను స్వదినియోగం చేసుకున్న ఆయన భారత్ నుంచి 12 హెలికాప్టర్ల కాంట్రాక్టును అగస్టా కంపెనీకి ఇప్పించేందుకు రంగంలోకి దిగారు. ఇందుకోసం రాజకీయ నేతలకు, ఐఏఎఫ్ అధికారులకు భారీగా లంచాలిచ్చారు. దీంతో అప్పటివరకూ హెలికాప్టర్ ప్రయాణించే ఎత్తు పరిమితిని అధికారుల సాయంతో 6,000 మీటర్ల నుంచి 4,500కు తగ్గించగలిగారు. దీంతో అప్పటివరకూ రేసులోనే లేని అగస్టా ఏకంగా కాంట్రాక్టునే ఎగరేసుకుపోయింది. భారత రక్షణ, వైమానిక దళాలకు చెందిన రహస్య పత్రాలు, సమాచారాన్ని సంపాదించిన మైకేల్ ముంబైలోని తన సహాయకుడి ద్వారా దాన్ని వెస్ట్‌ల్యాండ్ కంపెనీకి చేరవేయగలిగాడు. వీవీఐపీ హెలికాప్టర్ కొనుగోలు ప్రక్రియ మొదలయ్యాక 1997–2013 మధ్యకాలంలో మైకేల్ 300 సార్లు ఇండియాకు వచ్చాడు. -
మైకేల్‌ను అప్పగించిన యూఏఈ
న్యూఢిల్లీ: సంచలనం సృష్టించిన అగస్టా వెస్ట్‌ల్యాండ్ హెలికాప్టర్ల కొనుగోలు కుంభకోణంలో మధ్యవర్తి క్రిస్టియన్ జేమ్స్ మైకేల్(57)ను యూఏఈ భారత్‌కు అప్పగించింది. మంగళవారం రాత్రే ఆయన్ని దుబాయ్ నుంచి ఢిల్లీకి తీసుకొచ్చినట్లు అధికారులు తెలిపారు. బ్రిటన్ జాతీయుడైన మైకేల్ అగస్టా వెస్ట్‌ల్యాండ్ కంపెనీ నుంచి రూ.225 కోట్ల ముడుపులు పుచ్చుకున్నట్లు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) 2016లో చార్జిషీటు దాఖలు చేసింది. ఈ కుంభకోణంలో మైకేల్‌తో పాటు గైడో హాష్కే, కార్లో గెరోసా అనే మధ్యర్తులపైనా ఈడీ, సీబీఐలు దర్యాప్తు జరుపుతున్నాయి. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ పర్యవేక్షణలో చేపట్టిన ఆపరేషన్ మూలంగానే మైకేల్‌ను భారత్‌కు అప్పగించేందుకు యూఏఈ అంగీకరించిందని సీబీఐ తెలిపింది. సీబీఐ డైరెక్టర్ ఎం.నాగేశ్వర రావు ఈ ఆపరేషన్‌ను సమన్వయపరచగా, జాయింట్ డైరెక్టర్ సాయి మనోహర్ నేతృత్వంలోని బృందం..మైకేల్‌ను తెచ్చేందుకు దుబాయ్ వెళ్లిందని వెల్లడించింది. వైమానిక దళ మాజీ చీఫ్‌తో కుమ్మక్కు.. హెలికాప్టర్ల కుంభకోణంలో మైకేల్ పాత్ర 2012లో వెలుగుచూసింది. ఒప్పందాన్ని ఆ కంపెనీకే కట్టబెట్టేలా భారత అధికారులకు అతడు అక్రమంగా చెల్లింపులు జరిపినట్లు సీబీఐ ఆరోపించింది. సహనిందితులైన నాటి వైమానిక దళ చీఫ్ ఎస్పీ త్యాగి, ఆయన కుటుంబీకులతో కలసి నేరపూరిత కుట్రకు పాల్పడినట్లు తెలిపింది. విచారణ నుంచి తప్పించుకోవడానికి అతడు విదేశాలకు పారిపోయాడని సీబీఐ వెల్లడించింది. దీంతో మైకేల్‌పై 2015లో నాన్–బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ అయింది. ఈ వారెంట్ ఆధారంగా ఇంటర్‌పోల్ రెడ్ కార్నర్ నోటీసు జారీచేయడంతో 2017 ఫిబ్రవరిలో దుబాయ్‌లో అరెస్టయ్యాడు. అప్పటి నుంచి అక్కడే జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. తనను భారత్‌కు అప్పగించొద్దని అతను పెట్టుకున్న అభ్యర్థనను అక్కడి కోర్టు కొట్టివేయడంతో భారత అధికారుల శ్రమ ఫలించినట్లయింది. ‘గాంధీ’లకు కష్టాలు తప్పవు: బీజేపీ మైకేల్ అప్పగింతతో గాంధీ కుటుంబానికి చిక్కులు తప్పవని బీజేపీ హెచ్చరించింది. అవినీతిపై మోదీ ప్రభుత్వం సాగిస్తున్న తిరుగులేని పోరాటానికి తాజా పరిణామమే ఉదాహరణ అని బీజేపీ పేర్కొంది.మైకేల్‌ను సీబీఐ కస్టడీలోకి తీసుకున్న తరువాత ఈ కుంభకోణంలో అసలు దోషులెవరో తెలుస్తుందని పేర్కొంది. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్, సోనియాకు మైకేల్ విశ్వాసపాత్రుడనే పేరుంది. ఏమిటీ కుంభకోణం? రూ.3600 కోట్లతో 12 వీవీఐపీ హెలికాప్టర్లు కొనేందుకు 2010, ఫిబ్రవరిలో నాటి యూపీఏ ప్రభుత్వం అగస్టా వెస్ట్‌ల్యాండ్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. కాంట్రాక్టు నిబంధనలు ఉల్లంఘనకు గురవడంతో పాటు రూ.423 కోట్ల ముడుపులు చేతులు మారాయని, కేంద్ర ఖజానాకు సుమారు రూ.2666 కోట్ల నష్టం వాటిల్లినట్లు ఆరోపణలు రావడంతో 2014 జనవరి 1న ఆ ఒప్పందాన్ని రద్దు చేసుకుంది. హెలి కాప్టర్లు ఎగిరే ఎత్తు పరిమితిని 6 వేల మీటర్ల నుంచి 4500 మీటర్లకు తగ్గించి కొందరు అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని సీబీఐ ఆరోపించింది. ఎత్తు తగ్గించడం ద్వారానే అగస్టా వెస్ట్‌ల్యాండ్ ఒప్పందం చేసుకోవడానికి అర్హత సాధించిందని తెలిపింది. -
నన్ను ఎవరైనా తిట్టినా సంతోషమే: రాహుల్ గాంధీ
తనను ఎవరైనా తిడితే ఇష్టమని చెబుతున్నారు కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ. తనను కామన్వెల్త్ క్రీడలు, వీవీఐపీ హెలికాప్టర్ల స్కాముల్లోకి లాగేందుకు బీజేపీ ప్రయత్నిస్తున్నా జంకేది లేదన్నారు. తనను ఎవరైనా తిట్టినా, టార్గెట్ చేసినా తనకు ఎంతో సంతోషంగా ఉంటుందన్నారు. తననే లక్ష్యంగా చేసుకుని ఎప్పుడూ అందరూ ఏవో ఒకటి అంటుంటారని చెప్పారు. పార్లమెంటు సమావేశాలకు హాజరయ్యే సమయంలో విలేకరులతో మాట్లాడుతూ రాహుల్ ఈ వ్యాఖ్యలు చేశారు. కామన్వెల్త్ క్రీడల స్కాంలో ఉన్న ఓ రియల్ ఎస్టేట్ డెవలపర్‌తో రాహుల్ గాంధీకి ఉన్న సంబంధాలపైన, అగస్టా వెస్ట్‌లాండ్ హెలికాప్టర్ల కొనుగోలు ఒప్పందంలో రాహుల్ రాజకీయ అనుచరుడొకరు మధ్యవర్తిగా వ్యవహరించిన విషయంపైన విచారణ జరపాలంటూ బీజేపీ ఎంపీ కిరీట్ సోమయ్య ఈడీకి, సీబీఐకి లేఖలు రాశారు. ఈ అంశంపైనే రాహుల్ గాంధీని మీడియా ప్రశ్నించినప్పుడు ఆయనిలా సమాధానమిచ్చారు. రెండు స్కాముల్లోను గుడో హష్కె అనే మధ్యవర్తి ఉన్నాడని, అతడికి హెలికాప్టర్ల స్కాంలోని నిందితుడు క్రిస్టియన్ మైఖేల్‌తో సంబంధాలున్నాయని కిరీట్ సోమయ్య ఆరోపించారు.