Walter Sisulu University
-
7 వేలకు బదులు 7 కోట్లు అకౌంట్లోకి.. కానీ!
⇔ కోట్ల డబ్బు అకౌంట్లో పడటంతో విద్యార్థిని జల్సాలు లండన్: అదృష్టం వెనుక డోర్ నుంచి వస్తే.. దురదృష్టం ఫ్రంట్ డోర్ తెరిచినట్లయింది ఓ విద్యార్థిని పరిస్థితి. చివరికి ప్రాణభయంతో పోలీస్ స్టేషన్ కు ఆమె పరుగులు తీశారు. ఆ వివరాలిలా ఉన్నాయి.. యూకేలోని వాల్టర్ సిసులు యూనివర్సిటీలో దక్షిణాఫ్రికాకు చెందిన సిబాంగైల్ మణి(27) అనే విద్యార్థిని చదువుకుంటున్నారు. ఆమెకు ఓ యూకే కంపెనీ నుంచి చదువు నిమిత్తం లోన్ కింద 85 పౌండ్లు అందజేసేది. ఈ క్రమంలో ఈనెల నగదు రూ. 7,113 (85 పౌండ్లు)కు బదులుగా 7.11 కోట్ల రూపాయలు (8.5లక్షల పౌండ్లు) ఆమె బ్యాంకు ఖాతాలో జమ కావడం స్థానికంగా కలకలం రేపింది. ఓ సిబ్బంది తప్పిదం కారణంగా సిబాంగైల్ మణి ఖాతాలోకి పదివేల రెట్లు అధికంగా డబ్బు జమైనట్లు ఉన్నతాధికారులు గుర్తించారు. అయితే జరగాల్సిన నష్టం అంతలోనే జరిగిపోయింది. స్కాలర్ షిప్ సంస్థ అధికారులు, కాలేజీ సిబ్బంది ఆమెను ప్రశ్నించేలోగానే.. ఆ విద్యార్థిని విచ్చలవిడిగా ఖర్చుచేశారు. దుస్తులు, కొన్ని ఖరీదైన వస్తువులు కొనుగోలు చేయడంతో పాటుగా మద్యం సేవించేందుకు ఆమె రూ. 41.8 లక్షలు (50,000 పౌండ్లు) ఖర్చుచేసినట్లు తేలింది. నగదు మొత్తాన్ని తిరిగి ఇచ్చేయాలంటూ అందరూ చెప్పినా.. మణి పట్టించుకోలేదు. ఆమెపై చోరీతో పాటు చీటింగ్ చేసిన ఆరోపణలతో కేసులు నమోదయ్యాయి. దీంతో తోటి విద్యార్థులు, సంస్థ సిబ్బంది ఆమెపై దాడికి పాల్పడ్డారు. ప్రాణభయంతో బాధిత విద్యార్థిని సిబాంగైల్ మణి రక్షణ కోసం పోలీస్ స్టేషన్ కు పరుగులు తీసినట్లు సమాచారం. ఆమె నుంచి పూర్తి నగదును రాబట్టే పనిలో పోలీసులు ఉన్నారు. -
చిన్న తప్పుతో విద్యార్థిని ఖాతాలో కోట్లు
సాక్షి, జోహెన్స్‌బర్గ్: సాంకేతిక తప్పిదాలు ఘోరాలకు దారితీయటమే కాదు.. అప్పుడప్పుడు అదృష్టాన్ని కూడా తెచ్చిపెడుతుంటాయి. దక్షిణాఫ్రికాలో ఓ యూనివర్సిటీ అధికారులు చేసిన చిన్న తప్పు ఓ యువతికి మధురానుభూతిని మిగిల్చింది. తూర్పు కేప్ ప్రాంతంలో ఉన్న ‘వాల్టర్ సిసులు యూనివర్సిటీ’లో ఓ యువతి చదువుతోంది. నెల నెలా భోజన ఖర్చుల నిమిత్తం విశ్వవిద్యాలయ అధికారులు ఆమెకు 1400 రాండ్(మన కరెన్సీలో 6800 రూపాయలు) స్కాలర్ షిప్ రూపంలో అందజేస్తున్నారు. అయితే జూన్ నెలలో మాత్రం పొరపాటున 1400కు బదులు 14 మిలియన్ రాండ్( మన కరెన్సీలో సుమారు 7 కోట్లు) ఆమె అకౌంట్లో జమ చేశారు. మరి అంత డబ్బు కనిపించేసరికి యువతి ఊరుకుంటుందా? ఎడాపెడా షాపింగ్‌లు, పార్టీలతో జల్సా చేసింది. ఓ ఖరైదీన మొబైల్ ఫోన్‌తోపాటు బట్టలు కూడా కొనుగోలు చేసింది. మొత్తం సొమ్ములో సుమారు 80,000 రాండ్(39 లక్షలు) ఖర్చు చేసేసింది. ఆలస్యంగా తాము చేసిన తప్పును గమనించిన యూనివర్సిటీ అధికారులు యువతి అకౌంట్ నుంచి మిగతా డబ్బును వెనక్కి తీసేసుకున్నారు. నిబంధనల ప్రకారం ఖర్చు చేసిన ఖర్చు చేసిన సొమ్మును విద్యార్థిని చెల్లించాల్సిందేనని అధికారులు చెబుతున్నారు. కాగా, సౌతాఫ్రికాలో గత రెండేళ్లుగా యూనివర్సిటీలో ఉచిత విద్య కోసం విద్యార్థులు తీవ్ర స్థాయిలో ఆందోళనలు చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో వాళ్లను శాంతపరిచేందుకు ఆర్థిక సహాయ నిధిని ఏర్పాటు చేసి విద్యార్థులకు స్కాలర్‌షిప్‌ల రూపంలో ప్రభుత్వం అందజేస్తూ వస్తోంది.