7 వేలకు బదులు 7 కోట్లు అకౌంట్లోకి.. కానీ! | Administrative blunder a Student receives lot of amount | Sakshi
Sakshi News home page

7 వేలకు బదులు 7 కోట్లు అకౌంట్లోకి.. కానీ!

Published Thu, Sep 7 2017 7:47 PM | Last Updated on Sun, Sep 17 2017 6:32 PM

7 వేలకు బదులు 7 కోట్లు అకౌంట్లోకి.. కానీ!

7 వేలకు బదులు 7 కోట్లు అకౌంట్లోకి.. కానీ!

 కోట్ల డబ్బు అకౌంట్లో పడటంతో విద్యార్థిని జల్సాలు
లండన్: అదృష్టం వెనుక డోర్ నుంచి వస్తే.. దురదృష్టం ఫ్రంట్ డోర్ తెరిచినట్లయింది ఓ విద్యార్థిని పరిస్థితి. చివరికి ప్రాణభయంతో పోలీస్ స్టేషన్ కు ఆమె పరుగులు తీశారు. ఆ వివరాలిలా ఉన్నాయి.. యూకేలోని వాల్టర్ సిసులు యూనివర్సిటీలో దక్షిణాఫ్రికాకు చెందిన సిబాంగైల్ మణి(27) అనే విద్యార్థిని చదువుకుంటున్నారు. ఆమెకు ఓ యూకే కంపెనీ నుంచి చదువు నిమిత్తం లోన్ కింద 85 పౌండ్లు అందజేసేది. ఈ క్రమంలో ఈనెల నగదు రూ. 7,113 (85 పౌండ్లు)కు బదులుగా 7.11 కోట్ల రూపాయలు (8.5లక్షల పౌండ్లు) ఆమె బ్యాంకు ఖాతాలో జమ కావడం స్థానికంగా కలకలం రేపింది.
 
ఓ సిబ్బంది తప్పిదం కారణంగా సిబాంగైల్ మణి ఖాతాలోకి పదివేల రెట్లు అధికంగా డబ్బు జమైనట్లు ఉన్నతాధికారులు గుర్తించారు. అయితే జరగాల్సిన నష్టం అంతలోనే జరిగిపోయింది. స్కాలర్ షిప్ సంస్థ అధికారులు, కాలేజీ సిబ్బంది ఆమెను ప్రశ్నించేలోగానే.. ఆ విద్యార్థిని విచ్చలవిడిగా ఖర్చుచేశారు. దుస్తులు, కొన్ని ఖరీదైన వస్తువులు కొనుగోలు చేయడంతో పాటుగా మద్యం సేవించేందుకు ఆమె రూ. 41.8 లక్షలు (50,000 పౌండ్లు) ఖర్చుచేసినట్లు తేలింది. 
 
నగదు మొత్తాన్ని తిరిగి ఇచ్చేయాలంటూ అందరూ చెప్పినా.. మణి పట్టించుకోలేదు. ఆమెపై చోరీతో పాటు చీటింగ్ చేసిన ఆరోపణలతో కేసులు నమోదయ్యాయి. దీంతో తోటి విద్యార్థులు, సంస్థ సిబ్బంది ఆమెపై దాడికి పాల్పడ్డారు. ప్రాణభయంతో బాధిత విద్యార్థిని సిబాంగైల్ మణి రక్షణ కోసం పోలీస్ స్టేషన్ కు పరుగులు తీసినట్లు సమాచారం. ఆమె నుంచి పూర్తి నగదును రాబట్టే పనిలో పోలీసులు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement