Warangal Division
-
నాలుగు జిల్లాల్లో డీఎంహెచ్ఓ కార్యాలయాలు
జిల్లా వైద్యారోగ్య శాఖాధికారి సాంబశివరావు ఎంజీఎం : వరంగల్ విభజన ద్వారా ఏర్పడనున్న నా లుగు కొత్త జిల్లాల్లో డీఎంహెచ్ఓ కార్యాలయాలను ఏర్పాటు చేయడంపై దృష్టిసారించినట్లు డీఎంహెచ్ఓ సాంబశివరావు తెలిపారు. వరంగల్, హన్మకొండ కార్యాలయాలు ప్రస్తుతమున్న ప్రదేశాల్లోనే పనిచేస్తాయన్నారు. భూపాలపల్లి జిల్లాలో సింగరేణి క్వార్టర్స్, మహబూబాబాద్‌లో గిరిజన సంక్షేమ శాఖ బాలుర ఆశ్రమ పాఠశాలలను డీఎంహెచ్ఓ కార్యాలయాల ఏర్పాటుకు ఎంపిక చేశామన్నారు. కార్యాలయాలవారీగా అధికారులు, సిబ్బంది వివరాలను ఉన్నతాధికారులకు అందజేశామన్నారు. ఫైళ్ల విభజన పూర్తి కావచ్చిందని డీఎంహెచ్ఓ వివరించారు. -
పాస్‌పుస్తకాల కోసం పాట్లు
కలెక్టరేట్, న్యూస్‌లైన్ : పాస్‌పుస్తకాల కోసం రైతులు నానా పాట్లు పడుతున్నారు. ఒకవేళ పాస్ పుస్తకం ఉన్నా టైటిల్ డీడ్ ఇచ్చేందుకు అధికారులు ఇబ్బందులకు గురిచేస్తున్నారు. దాదాపు జిల్లా అంతటా ఇదే పరి స్థితి ఉన్నప్పటికీ వరంగల్ రెవెన్యూ డివి జన్‌లో మాత్రం పరిస్థితి మరీ దారుణంగా ఉంది. డివిజన్ పరిధిలోని పలు మండలాల్లో కొందరు రైతులు రెండేళ్ల క్రితం నుంచి టైటిల్‌డీడ్ కోసం వీఆర్వో ల చుట్టూ తిరిగినా ఫలితం ఉండటం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులను పలుమార్లు అడిగినా ‘ఆర్డీఓ సార్ సంతకం కాలేదు’ అనే సమాధానం వస్తోందని అంటున్నారు. అడిగినంత ఇచ్చినా... రెవెన్యూ శాఖలో క్షేత్రస్థాయి సిబ్బందికి అక్రమ ఆదాయ వనరు పట్టాదారు పాస్‌పుస్తకాల జారీ అనేది అందరికీ తెలిసిన విషయమే. ఆయా గ్రామాలు, మండలాల్లో భూమి రేటును బట్టి ఎకరానికి ఇంత అని వీఆర్వోలు ధర ఖరారు చేసి మరీ వసూలు చేసుకుంటారు. ప్రస్తుతం హన్మకొండ, హసన్‌పర్తి, ధర్మసాగర్, వర్ధన్నపేట తదితర మండలాల పరిధిలో కొన్నిచోట్ల పట్టాదార్ పాస్‌పుస్తకాల జారీకి ఎకరాకు రూ.10వేల నుంచి రూ.2లక్షల వరకు డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. భూములకు మార్కెట్ ధర ఉన్నచోట తప్పనిసరి పరిస్థితుల్లో రైతులు అధికారులు అడిగినంత ఇచ్చి పనులు చేయించుకుంటున్నారు. అయితే ఇంతచేసినా పనులు సకాలంలో కాకపోవడంతో అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వాటాల్లో తేడాల వల్ల...? సహజంగా రైతులకు పట్టాదార్ పాస్‌పుస్తకాలు జారీ చేసే క్రమంలో రెండు పుస్తకాలు ఇస్తారు. ఇందులో ఒకటి స్థానిక తహసీల్దార్ సంతకంతో ఉంటుంది. రెండోది ఆర్డీఓ సంతకంతో ఉంటుంది. దీనినే టైటిల్ డీడ్ లేదా భూమి హక్కుపత్రం అంటారు. ఇది జారీ చేయడానికి అనధికారికంగా ఆర్డీఓ కార్యాల యాల్లో రూ.300 వరకు వసూలు చేసేవారు. ఈ మొత్తం కూడా వీఆర్వోలు సంబంధిత రైతుల నుంచి వసూలు చేసి ఇచ్చేవారు. అయితే ముందుగా తహసీల్దార్ నుంచి వచ్చే పట్టాదార్ పాస్‌పుస్తకం ఇచ్చి టైటిల్ డీడ్ కోసం కొంత సమయం కేటాయించేవారు. ఎందుకంటే.. డివిజన్ పరిధిలోని అన్ని మండలాల పుస్తకాలు ఆర్డీఓలు చూడాలి. కాబట్టి వారికి సందేహాలు ఉన్నచోట పరిశీలన చేసి మరీ జారీ చేసేవారు. ఇయితే క్రమంగా ఇది లాభసాటి వ్యాపారంగా మారడంతో కొన్ని ఆర్డీఓ కార్యాలయాల్లో ఒక్కో పుస్తకానికి రూ.వెయ్యి వరకు డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం. దీంతో వీఆర్వోలు ఈ విషయంలో పెద్దగా శ్రద్ధ చూపడం లేదు. వెరశి ఆర్డీఓ కార్యాలయానికి సంతకం కోసం వెళ్లిన పుస్తకాలు ఏళ్లు గడుస్తున్నా అడ్రస్ లేకుండా పోతున్నాయి. ఇదేమిటని నిలదీసిన రైతులకు ఏదో ఒక కొర్రీవేసి పనులు చేయకుండా వేధిస్తున్న ఘటనలు కూడా ఉన్నాయి. బ్యాంకుల్లో అవస్థలు రైతులు తమ పాస్‌పుస్తకాలను బ్యాంకులో పెట్టి రుణం తీసుకుంటారు. గతంలో కేవలం ఒకే పుస్తకంతో రుణం ఇచ్చిన బ్యాంకర్లు కొంతకాలంగా టైటిల్ డీడ్ కూడా ఉంటేనే రుణం ఇస్తామని మెలిక పెడుతున్నారు. అయితే వేల సంఖ్యలో పుస్తకాలు ఆర్డీఓ కార్యాలయాల్లో ఉండటంతో రైతులు రుణం పొందలేక ఇబ్బందులు పడుతున్నారు. రుణం మంజూరు అయిన వారు కూడా టైటిల్ డీడ్ లేక పొందలేక పోతున్నామంటున్నారు. వరంగల్ డివిజన్‌లోనే వేలల్లో... జిల్లా మొత్తంగా సమస్య ఉన్నప్పటికీ వరంగల్ రెవెన్యూ డివిజన్ పరిధిలో సమస్య తీవ్రత ఎక్కుగా ఉంది. ఇక్కడ రెండేళ్ల నుంచి టైటిల్ డీడ్ కోసం ఎదురుచూస్తున్న రైతులు ఉన్నారు. డివిజన్ పరిధిలోని 10 మండలాల నుంచి మొత్తం 2వేల పుస్తకాల వరకు పెండింగ్‌లో ఉన్నట్లు క్షేత్రస్థాయి అధికారులు చెబుతున్నారు. ఆర్ఓఆర్పై నిషేధం ఉన్న సాకుతో అధికారులు అన్నింటినీ అదేగాటన పెట్టి కాలయాపన చేస్తున్నారనే విమర్శలున్నాయి. ఇప్పటికైనా అధికారులు రైతుల అవస్థలు గుర్తించి పాస్‌పుస్తకాల జారీ ప్రక్రియను పూర్తిచేస్తే చేస్తే కనీసం బ్యాంకు రుణాలైనా పొందే అవకాశం ఉంటుంది. -
పనులు త్వరగా పూర్తి చేయాలి
జిల్లా పరిషత్, న్యూస్‌లైన్ : వివిధ ప్రభుత్వ శాఖల ద్వారా చేపట్టిన పలు అభివృద్ధి పనులను వచ్చే నెలాఖరులోగా పూర్తి చేయాలని కలెక్టర్ జి.కిషన్ అదేశించారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో బుధవా రం వరంగల్ రెవెన్యూ డివిజన్ పరిధిలోని 11 మండలాల్లోని అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలు, పురోగతిని ఎంపీడీఓలు, తహసీల్దా ర్లు, ఇతర శాఖల అధికారులతో ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడు తూ ఇందిరమ్మ పథకంలో లబ్ధిదారులకు గృహా లు మంజూరైనప్పటికీ ఇప్పటి వరకు పొజిషన్ సర్టిఫికెట్లు ఎందుకు ఇవ్వలేదని రెవెన్యూ అధికారులను ప్రశ్నించారు. దీనికి వారు ఇచ్చిన స మాధానాలు సరిగా లేక పోవడంతో ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. మండల స్థాయిలోని అధికారులు స్థానికంగా ఉండి సమన్వయంతో పని చేస్తే ప్రభుత్వ పథకాలను విజయవంతం చేయవచ్చన్నారు. పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధి నిధులు మంజూరైనప్పటికీ పనులు ఎందుకు పూర్తి చేయలేకపోతున్నారని ఇంజినీరింగ్ అధికారులను ప్రశ్నించారు. హన్మకొండ ఎంపీడీఓ ఎంపీ నిధుల ద్వారా చేపట్టిన పను లు 64 అని చెప్పడం, కలెక్టర్ వద్ద ఉన్న నివేదికలో తొమ్మిది ఉండడంతో డీఆర్డీఏ పీడీని ఎందుకు తేడాలు వచ్చాయని ప్రశ్నించారు. ని వేదికలు సరిగా ఎందుకు అందించలేక పోయారని అధికారులను ప్రశ్నించారు. బీఆర్జీఎఫ్ పథకంలో నిధులు మంజూరైనప్పటికీ ఎందుకు పురోగతి ఉండడం లేదని ఇంజినీరింగ్ అధికారులను, ఎంపీడీఓలను ప్రశ్నించారు. వివిధ మండలాల్లో జీపీ సెక్టార్ జెడ్పీ సెక్టార్లో 15 పనులు ఇంకా ప్రారంభం కాకపోవడం, కొన్ని రెండేళ్లుగా పురోగతిలోనే ఉండడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పనులు చేపట్టేందుకు అవంతరాలు ఉంటే వాటిని రద్దు చేసి జెడ్పీ అ ధికారులకు సమాచారం అందించాలన్నారు. డీ పీసీ ఆమోదం పొందిన పనులు మాత్రమే చేపట్టాలని, ఇతర పనులు చేపడితే వాటికి సంబంధిత అధికారులే బాధ్యత వహించాల్సి ఉంటుం దన్నరు. బీఆర్జీఎఫ్ 2011-12 ఆర్థిక సంవత్స రం పనులన్నీ వచ్చే నెలాఖరులోగా పూర్తి చే యాలని ఆదేశించారు. రాజీవ్ విద్యామిషన్ పథకంలో 153 తరగతి గదుల నిర్మాణం కోసం నిధులు మంజూరు కాగా, వీటిలో ఇంకా 37 పనులు ఎందుకు ప్రారంభం కాలేదని ఆర్వీఎం ఈఈ రవీందర్రావును ప్రశ్నించారు. అక్కడ స్థలాలు లేక పోవడం వల్ల పనులు చేపట్టలేక పోయమన్నారు. మండలాల్లోని ప్రభుత్వ స్థలాలను గుర్తించి హద్దులు పెట్టాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ పౌసమిబసు, ఏజేసీ సంజీవయ్య, జెడ్పీ సీఈఓ ఆంజనేయులు, డీఆర్డీఏ, హౌసింగ్ పీడీలు విజయగోపాల్, లక్ష్మణ్, సీపీఓ రాంచందర్‌రావు, పీఆర్ ఎస్ఈ సత్త య్య, డీపీఓ ఈఎస్.నాయక్, ఆర్డబ్ల్యూఎస్, పీఆర్ ఈ ఈలు శ్రీనివాసరావు, సత్యనారాయణ, శ్రీనివాస్‌రావు, డీసీఓ సంజీవయ్య, డిప్యూటీ సీఈఓ రమాదేవి, జెడ్పీ సూపరింటెండెంట్లు వెంకటస్వామి, శ్రీనివాస్‌రెడ్డి, పులి వెంకటేశ్వర్లు, వెంకటరమణ పాల్గొన్నారు.