- జిల్లా వైద్యారోగ్య శాఖాధికారి సాంబశివరావు
నాలుగు జిల్లాల్లో డీఎంహెచ్‌ఓ కార్యాలయాలు
Published Thu, Sep 29 2016 12:25 AM | Last Updated on Mon, Sep 4 2017 3:24 PM
ఎంజీఎం : వరంగల్ విభజన ద్వారా ఏర్పడనున్న నా లుగు కొత్త జిల్లాల్లో డీఎంహెచ్‌ఓ కార్యాలయాలను ఏర్పాటు చేయడంపై దృష్టిసారించినట్లు డీఎంహెచ్‌ఓ సాంబశివరావు తెలిపారు. వరంగల్, హన్మకొండ కార్యాలయాలు ప్రస్తుతమున్న ప్రదేశాల్లోనే పనిచేస్తాయన్నారు. భూపాలపల్లి జిల్లాలో సింగరేణి క్వార్టర్స్, మహబూబాబాద్‌లో గిరిజన సంక్షేమ శాఖ బాలుర ఆశ్రమ పాఠశాలలను డీఎంహెచ్‌ఓ కార్యాలయాల ఏర్పాటుకు ఎంపిక చేశామన్నారు. కార్యాలయాలవారీగా అధికారులు, సిబ్బంది వివరాలను ఉన్నతాధికారులకు అందజేశామన్నారు. ఫైళ్ల విభజన పూర్తి కావచ్చిందని డీఎంహెచ్‌ఓ వివరించారు.
Advertisement
Advertisement