జిల్లా పరిషత్, న్యూస్‌లైన్ : వివిధ ప్రభుత్వ శాఖల ద్వారా చేపట్టిన పలు అభివృద్ధి పనులను వచ్చే నెలాఖరులోగా పూర్తి చేయాలని కలెక్టర్ జి.కిషన్ అదేశించారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో బుధవా రం వరంగల్ రెవెన్యూ డివిజన్ పరిధిలోని 11 మండలాల్లోని అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలు, పురోగతిని ఎంపీడీఓలు, తహసీల్దా ర్లు, ఇతర శాఖల అధికారులతో ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడు తూ ఇందిరమ్మ పథకంలో లబ్ధిదారులకు గృహా లు మంజూరైనప్పటికీ ఇప్పటి వరకు పొజిషన్ సర్టిఫికెట్లు ఎందుకు ఇవ్వలేదని రెవెన్యూ అధికారులను ప్రశ్నించారు. దీనికి వారు ఇచ్చిన స మాధానాలు సరిగా లేక పోవడంతో ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు.
మండల స్థాయిలోని అధికారులు స్థానికంగా ఉండి సమన్వయంతో పని చేస్తే ప్రభుత్వ పథకాలను విజయవంతం చేయవచ్చన్నారు. పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధి నిధులు మంజూరైనప్పటికీ పనులు ఎందుకు పూర్తి చేయలేకపోతున్నారని ఇంజినీరింగ్ అధికారులను ప్రశ్నించారు. హన్మకొండ ఎంపీడీఓ ఎంపీ నిధుల ద్వారా చేపట్టిన పను లు 64 అని చెప్పడం, కలెక్టర్ వద్ద ఉన్న నివేదికలో తొమ్మిది ఉండడంతో డీఆర్‌డీఏ పీడీని ఎందుకు తేడాలు వచ్చాయని ప్రశ్నించారు. ని వేదికలు సరిగా ఎందుకు అందించలేక పోయారని అధికారులను ప్రశ్నించారు.
బీఆర్‌జీఎఫ్ పథకంలో నిధులు మంజూరైనప్పటికీ ఎందుకు పురోగతి ఉండడం లేదని ఇంజినీరింగ్ అధికారులను, ఎంపీడీఓలను ప్రశ్నించారు. వివిధ మండలాల్లో జీపీ సెక్టార్ జెడ్పీ సెక్టార్‌లో 15 పనులు ఇంకా ప్రారంభం కాకపోవడం, కొన్ని రెండేళ్లుగా పురోగతిలోనే ఉండడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పనులు చేపట్టేందుకు అవంతరాలు ఉంటే వాటిని రద్దు చేసి జెడ్పీ అ ధికారులకు సమాచారం అందించాలన్నారు. డీ పీసీ ఆమోదం పొందిన పనులు మాత్రమే చేపట్టాలని, ఇతర పనులు చేపడితే వాటికి సంబంధిత అధికారులే బాధ్యత వహించాల్సి ఉంటుం దన్నరు.
బీఆర్‌జీఎఫ్ 2011-12 ఆర్థిక సంవత్స రం పనులన్నీ వచ్చే నెలాఖరులోగా పూర్తి చే యాలని ఆదేశించారు. రాజీవ్ విద్యామిషన్ పథకంలో 153 తరగతి గదుల నిర్మాణం కోసం నిధులు మంజూరు కాగా, వీటిలో ఇంకా 37 పనులు ఎందుకు ప్రారంభం కాలేదని ఆర్వీఎం ఈఈ రవీందర్‌రావును ప్రశ్నించారు. అక్కడ స్థలాలు లేక పోవడం వల్ల పనులు చేపట్టలేక పోయమన్నారు. మండలాల్లోని ప్రభుత్వ స్థలాలను గుర్తించి హద్దులు పెట్టాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు.
సమావేశంలో జాయింట్ కలెక్టర్ పౌసమిబసు, ఏజేసీ సంజీవయ్య, జెడ్పీ సీఈఓ ఆంజనేయులు, డీఆర్‌డీఏ, హౌసింగ్ పీడీలు విజయగోపాల్, లక్ష్మణ్, సీపీఓ రాంచందర్‌రావు, పీఆర్ ఎస్‌ఈ సత్త య్య, డీపీఓ ఈఎస్.నాయక్, ఆర్‌డబ్ల్యూఎస్, పీఆర్ ఈ ఈలు శ్రీనివాసరావు, సత్యనారాయణ, శ్రీనివాస్‌రావు, డీసీఓ సంజీవయ్య, డిప్యూటీ సీఈఓ రమాదేవి, జెడ్పీ సూపరింటెండెంట్లు వెంకటస్వామి, శ్రీనివాస్‌రెడ్డి, పులి వెంకటేశ్వర్లు, వెంకటరమణ పాల్గొన్నారు.
పనులు త్వరగా పూర్తి చేయాలి
Published Thu, Oct 24 2013 1:36 AM | Last Updated on Fri, Sep 1 2017 11:54 PM
Advertisement