Warangal Police Commissioner
-
పేపర్ లీక్ అయ్యిందనడం సరికాదు: వరంగల్ సీపీ
సాక్షి, వరంగల్: తెలంగాణలో ప్రశ్నాపత్రాల లీక్ వ్యవహారం కలకలం రేపుతున్న వేళ.. తాజాగా మొదలైన పదో తరగతి పరీక్షల్లోనూ పేపర్లు బయటకు రావడం చర్చనీయాంశంగా మారింది. తాజాగా హిందీ క్వశ్చన్ పేపర్ సైతం వాట్సాప్ గ్రూప్‌లో చక్కర్లు కొట్టడం తల్లిదండ్రుల్లో ఆందోళన రేకెత్తించింది. ఈ తరుణంలో.. ఇవాళ్టి హిందీ క్వశ్చన్ పేపర్ పరీక్ష సమయంలోనే బయటకు వచ్చిన విషయాన్ని ధృవీకరించారు వరంగల్ పోలీస్ కమిషనర్ ఏవీ రంగనాథ్. పేపర్ బయటకు వచ్చిన అంశంపై సైబర్ క్రైమ్ దర్యాప్తు కొనసాగుతోందని, సాయంత్రంకల్లా అసలు విషయం తేలుతుందని వరంగల్ సీపీ రంగనాథ్ తెలిపారు. పేపర్ బయటకు వచ్చిన విషయం మీడియా ద్వారానే మాకు తెలిసింది. ఎగ్జామ్ ప్రారంభమైన గంట తర్వాత పేపర్ వాట్సాప్ గ్రూప్ ద్వారా బయటకు వచ్చింది. అంటే.. దాదాపు సగం పరీక్ష అయ్యాక వచ్చిందన్నమాట!. కాబట్టి దీనిని లీక్ అనడం సరికాదు. పరీక్ష మధ్యలో ఉండగానే పేపర్ బయటకు వచ్చిందనే మేం భావిస్తున్నాం. ఒక మీడియా ఛానెల్ మాజీ రిపోర్టర్ ద్వారా పేపర్ సోషల్ మీడియాలోకి వచ్చిందని తేలింది. అయితే.. అతనికి ఎక్కడి నుంచి వచ్చిందనేది తేలాల్సి ఉంది. బహుశా ఇన్విజిలేటర్ ఫోన్ లోపలికి తీసుకెళ్లడం వల్లే పేపర్ బయటికి వచ్చిందని భావిస్తున్నాం. ఈ అంశంపై విచారణ జరుగుతోంది. సైబర్ క్రైమ్ పోలీసులు ఆరా తీస్తున్నారు. సాయంత్రం కల్లా విచారణ పూర్తి చేస్తాం అని కమిషనర్ మీడియా ద్వారా స్పష్టం చేశారు. మరోవైపు సోషల్ మీడియాలో వైరల్ అయిన పేపర్, ఇవాళ్టి హిందీ పరీక్ష పత్రం ఒక్కటే అని తేలింది. అయితే.. ఎక్కడి నుంచి బయటకు వచ్చిందో తెలియదంటూ వరంగల్ హన్మకొండ డీఈవోలు వాసంతి, అబ్దుల్‌లు సీపీని కలిసి ఫిర్యాదు చేశారు. హన్మకొండ జిల్లా పరిధిలోని ఓ పాఠశాలకు చెందిన టెన్త్ విద్యార్థుల వాట్సాప్ గ్రూప్‌లోనే పేపర్ పెట్టినట్లు తెలుస్తున్నా.. అధికారికంగా అది ధృవీకరణ కావాల్సి ఉంది. -
సీఐతో మహిళా ఎస్ఐ ప్రేమ వ్యవహారం.. సీపీ సంచలన నిర్ణయం
వరంగల్ క్రైం: మహిళా ఎస్ఐ పెళ్లయి నెలరోజులైంది. కానీ, అంతకుముందు ఉన్న పరిచయం కారణంగా ఓ ఇన్స్పెక్టర్తో కలిసి ‘హద్దులు’వీురింది. వీరి ప్రేమ వ్యవహారం భర్తకు తెలియడంతో బట్టబయలైంది. అదేవిధంగా లైంగిక వేధింపులతో పోలీస్‌స్టేషన్‌కు వచ్చిన యువతిని మరో ఎస్ఐ.. పట్టించుకోకుండా రాజీపడాలి్సందిగా ఉచిత సలహా ఇచ్చా డు. వీరి చర్యలను సహించని సీపీ రంగనాథ్ మంగళవారం ముగ్గురిపై సస్పెన్షన్ వేటు వేశారు. కమిషనరేట్ పరిధిలో ఇక ఏమి జరిగినా కఠిన చర్యలు తప్పవన్న సంకేతం ఇచ్చారు. వచ్చిన నెలరోజుల్లోనే దిద్దుబాటు చర్యలకు దిగడంతో నిబంధనలు అతిక్రమించే పోలీసుల్లో భయం పట్టుకుంది. క్రమశిక్షణకు మారుపేరు పోలీస్ శాఖ. కానీ కొంతమంది అధికారులు హద్దు మీరి ప్రవర్తించడం ఆ శాఖకు తలవంపులు తెచ్చిపెడుతోంది. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని గీసుగొండ ఇన్స్పెక్టర్ రాయల వెంకటేశ్వర్లు, దామెర సబ్ ఇన్స్పెక్టర్ హరిప్రియలు హద్దు మీరి ప్రవర్తించడంతో ఇరువురిని సస్పెండ్ చేస్తూ వరంగల్ పోలీస్ కమిషనర్ రంగనాథ్ ఉత్తర్వులు జారీ చేయడం కమిషనరేట్ పరిధిలో సంచలనం కలిగించింది. ఎస్ఐ హరిప్రియకు ఇటీవల పెళ్లయ్యింది. కానీ.. ఇన్స్పెక్టర్ రాయల వెంకటేశ్వర్లు, ఎస్సై హరిప్రియ మధ్య కొంత కాలంగా ప్రేమాయణం సాగుతోంది. ఆమె ప్రవర్తనపై భర్తకు అనుమానం రావడంతో ఫోన్లో వాట్సాప్ చాటింగ్ గమనించాడు. దీని ఆధారంగా సీపీ రంగనాథ్‌కు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. దీంతో విచారణ చేపట్టిన సీపీ.. వాస్తవమని తేలడంతో సస్పెన్షన్ వేటు వేశారు. రాజీ కుదుర్చుకోండని ఉచిత సలహా.. సుబేదారి పోలీస్‌స్టేషన్‌లో సబ్ ఇన్స్పెక్టర్గా విధులు నిర్వహిస్తున్న పి.పున్నంచందర్ ఓ యువతి ఫిర్యాదు విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఆయనపై వేటు పడింది. స్టేషన్ పరిధిలో ఉండే ఓ యువతి కొంత కాలంగా లైంగిక వేధింపులకు గురై పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. స్పందించాలి్సన ఎస్సై పున్నంచందర్ నిందితుడిపై కేసు నమోదు చేయకుండా నిర్లక్ష్యం వహించడంతోపాటు రాజీ పడాలని ఉచిత సలహా ఇచ్చాడు. దీంతో బాధితురాలు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో విచారణ చేసిన అధికారులు సీపీకి నివేదిక సమర్పించారు. దీంతో ఆయనను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. నెల రోజుల్లో ఐదుగురిపై వేటు.. వరంగల్ పోలీస్ కమిషనర్‌గా డిసెంబర్ 3న బాధ్యతలు స్వీకరించిన సీపీ రంగనాథ్.. నెల రోజుల్లోనే నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన ఐదుగురిపై వేటు వేయడం కమిషనరేట్‌లో కలకలం సృష్టిస్తోంది. కొద్ది రోజుల క్రితం ఓ దొంగతనం విషయంలో ఓ నిందితుడిని అదుపులోకి తీసుకున్న కాకతీయ యూనివర్సిటీ పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం కారణంగా దొంగ పరారయ్యాడు. ఈ వ్యవహారంలో కానిస్టేబుల్ మోహన్ నాయక్‌పై సస్పెన్షన్ వేటు పడగా, అడ్మిన్ ఎస్సై సంపత్‌ను ఏఆర్‌కు అటాచ్డ్ చేశారు. తాజాగా ముగ్గురిని సస్పెండ్ చేశారు. గతంలోనూ ప్రేమాయణాలు.. కమిషనరేట్‌లోని పోలీస్ అధికారుల ప్రేమాయణాలు కొత్తేమి కాదు. మహబూబాబాద్ జిల్లాలో పనిచేస్తున్న ఓ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఫిర్యాదు మేరకు సీబీసీఐడీలో పనిచేస్తున్న ఇన్స్పెక్టర్పై సుబేదారి పోలీసులు అక్రమాస్తులు, నేరపూరిత బెదిరింపుల కింద కేసు నమోదు చేశారు. సీబీ సీఐడీ ఇన్స్పెక్టర్, రవి, తన మహిళా సహోద్యోగి అయిన ఇన్స్పెక్టర్తో కలిసి హనుమకొండలోని రాంనగర్‌లోని ఆమె ఇంట్లో ఉండగా భర్త అయిన మహబూబాబాద్ సీఐ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. సీబీసీఐడీ ఇన్స్పెక్టర్, మహిళా ఇన్స్పెక్టర్ వివాహేతర సంబంధం పెట్టుకున్నారనే ఆరోపణలున్నాయి. గీసుకొండ మండలంలో సంబరాలు గీసుకొండ ఇన్స్పెక్టర్ రాయల వెంకటేశ్వర్లుపై సస్పెన్షన్ వేటు పడిందన్న సమాచారంతో గీసుకొండ మండలం మణుగొండ, కొమ్మాలగ్రామాల్లో యువకులు బాణసంచా కాల్చి సీపీ నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేశారు. -
హైదరాబాద్ ట్రాఫిక్ చీఫ్ రంగనాథ్ బదిలీ..
సాక్షి, హైదరాబాద్/వరంగల్: హైదరాబాద్ ట్రాఫిక్ విభాగం సంయుక్త పోలీసు కమిషనర్ ఏవీ రంగనాథ్ బదిలీ అయ్యారు. ఆయనను వరంగల్ పోలీసు కమిషనర్‌గా నియమిస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. నల్లగొండ ఎస్పీగా పని చేస్తూ డీఐజీగా పదోన్నతి పొందిన రంగనాథ్ గతేడాది డిసెంబర్ 29న సిటీ ట్రాఫిక్ చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించారు. నల్లగొండకు వెళ్లే ముందూ ఆయన సిటీ ట్రాఫిక్ డీసీపీగా పని చేశారు. రోడ్డు ఆక్రమణల నిరోధం కోసం నగర కొత్వాల్ సీవీ ఆనంద్ ఆదేశాల మేరకు అమలులోకి వచ్చిన ఆపరేషన్ రోప్లో రంగనాథ్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఫుట్‌పాత్‌లు ఆక్రమిస్తున్న వ్యాపారులపై క్రిమినల్ కేసులు, తప్పుడు నంబర్ ప్లేట్లతో తిరుగుతున్న వారిపై చర్యలు, అధికారుల క్షేత్రస్థాయి పర్యటనలు, మలక్‌పేట్ వద్ద మూడో మార్గం పనుల వేగవంతం... ఇలా నగర ట్రాఫిక్‌పై రంగనాథ్ తనదైన ముద్ర వేశారు. ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న ట్రాఫిక్ లోక్ అదాలత్‌ను ఆన్లైన్లో నిర్వహించేలా చేశారు. ట్రాఫిక్ విభాగంలోనూ టెలీ కాన్ఫరెన్స్ నిర్వహణ, జంక్షన్లలో డైరీలు ఏర్పాటు, అడ్డదిడ్డంగా సంచరిస్తున్న అంబులెన్స్‌ల క్రమబద్దీకరణ, జంక్షన్లలో గ్రీన్ లైట్ వినియోగం పెంపు, కార్ల అద్దాల నల్ల ఫిల్మ్ తొలగింపు, అతిగా శబ్దం చేసే హారన్ల వినియోగంపై ఆంక్షలు.. ఇలా ఎన్నో సంస్కరణలు రంగనాథ్ తీసుకువచ్చారు. ఆయన అమలు చేసిన జూబ్లీహిల్స్ రోడ్ నెం.45తో పాటు ఇతర మార్గాల్లో మళ్లింపులు ప్రస్తుతం ప్రయోగాత్మక దశలో ఉన్నాయి. ట్రాఫిక్ విభాగానికి కొత్త చీఫ్ వచ్చే వరకు మరో అధికారి ఇన్చార్జిగా ఉండనున్నారు. 19నెలలు పనిచేసిన తరుణ్‌జోషి వరంగల్ పోలీస్ కమిషనర్‌గా ఉన్న డాక్టర్ తరుణ్జోషిని డీజీపీ కార్యాలయానికి బదిలీ చేశారు. 2004 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన తరుణ్‌జోషి 2021 ఏప్రిల్ 4న వరంగల్ పోలీస్ కమిషనర్‌గా నియమితులయ్యారు. శాంతిభద్రతల పరిరక్షణతోపాటు పోలీస్ వర్టికల్స్, వెల్ఫేర్ విషయంలో నిజాయితీగల అధికారిగా పేరున్న ఆయన సుమారు 19 నెలల పాటు తన మార్కు వేసుకున్నారు. ఐజీగా పదోన్నతి పొందిన తరుణ్‌జోషి సెంట్రల్ సర్వీసెస్‌కు వెళ్తున్నారన్న ప్రచారం కొంతకాలంగా జరిగింది. ఇదే సమయంలో గురువారం ఆయనను డీజీపీ కార్యాలయానికి బదిలీ చేసిన ప్రభుత్వం ఆయన స్థానంలో ఏవీ రంగనాథ్‌ను నియమించింది. చదవండి: Hyderabad: ఐటీ ఉద్యోగులకు తెలంగాణ ఆర్టీసీ శుభవార్త.. పోలీస్‌శాఖలో రంగనాథ్ తనదైన మార్క్ ఏవీ రంగనాథ్ 1970 అక్టోబర్‌లో నల్లగొండలో జన్మించారు. ప్రాథమిక విద్యాభ్యాసం హుజూర్నగర్ తదితర ప్రాంతాల్లో చేసిన ఆయన తర్వాత గుంటూరులో పదో తరగతి వరకు చదివారు. ఇంటర్మీడియట్, ఇంజనీరింగ్ హైదరాబాద్‌లో పూర్తి చేశారు. ఓయూలో ఇంజనీరింగ్ పూర్తి చేసి బెంగళూరులో ఐడీబీఐ బ్యాంకు అధికారిగా కొంతకాలం పనిచేసి పోలీస్ బాస్ కావాలన్న లక్ష్యంతో గ్రూప్–1 పరీక్షలకు ప్రిపేర్ అయ్యారు. గ్రూప్ –1 లో స్టేట్ 13వ ర్యాంకు సాధించారు. పోలీస్ బాస్ కావాలన్న ఏకైక లక్ష్యంతో డీఎస్పీ ఆప్షన్ ఖరారు చేసుకున్నారు. 1996 బ్యాచ్‌లో డీఎస్పీ ర్యాంక్‌లో స్థిరపడి 2000 సంవత్సరంలో గ్రేహౌండ్స్ అసాల్ట్ కమాండర్‌గా పనిచేశారు. ఆ తర్వాత కొత్తగూడెం డీఎస్పీగా బదిలీ అయిన రంగనాథ్ 2003 వరకు కొత్తగూడెంలో పనిచేసి, ఆ తర్వాత సంవత్సరంపాటు వరంగల్ జిల్లా నర్సంపేట డీఎస్పీగా పనిచేశారు. 2004లో ఎన్నికల వేళ నక్సల్స్ అడ్డా అయిన ప్రకాశం జిల్లా మార్కాపురంలో విధులు నిర్వర్తించారు. వైఎస్ హయాంలో రాష్ట్ర ప్రభుత్వం, నక్సల్స్ చర్చల సందర్భంలో నక్సల్స్ కేంద్ర నాయకులు రామకృష్ణ వంటి వారిని స్థానిక అధికారిగా స్వాగతించారు. అనంతరం తూర్పు గోదావరి అడిషనల్ ఎస్పీగా పనిచేసిన సమయంలో బలిమెల రిజర్వాయర్ వద్ద నక్సల్స్ చేతిలో గ్రేహౌండ్స్ సిబ్బంది ప్రాణాలు కోల్పోయిన సంఘటన తర్వాత రంగనాథ్‌ను ఆ ప్రాంతానికి బదిలీ చేశారు. అక్కడ గ్రేహౌండ్స్ ఆపరేషన్స్ పునరుద్ధరించడంలో కీలకంగా ఉన్న ఏవీఆర్.. 2012 చివరివరకు అక్కడ పనిచేశారు. ఆ సమయంలో రంగనాథ్ పనికి గుర్తింపుగా రాష్ట్రపతి గ్యాలంటరీ అవార్డు దక్కింది. 2014 వరకు ఖమ్మం ఎస్పీగా పనిచేసి, అక్కడినుంచి నల్లగొండకు బదిలీ అయ్యారు. దాదాపు నాలుగేళ్లు పనిచేసి తన మార్కు వేసుకున్నారు. నల్లగొండలో ఉన్నసమయంలోనే డీఐజీగా పదోన్నతి వచ్చింది. ఆ తర్వాత హైదరాబాద్ సిటీలో జాయింట్ కమిషనర్ (ట్రాఫిక్)గా విధులు నిర్వర్తించిన ఏవీ రంగనాథ్ వరంగల్ పోలీసు కమిషనర్‌గా నియమితులయ్యారు. రాష్ట్రంలో సంచలనం సృష్టించిన అయేషా, నల్ల గొండ జిల్లాలో అమృత ప్రణయ్ కేసు విషయంలో ఎంతో చొరవ చూపారు. నర్సంపేటలో పనిచేసినప్పుడు నక్సల్స్ సమస్యపై కీలకంగా పనిచేశారు. కాగా, ఆయన సీపీగా రెండు రోజుల్లో బాధ్యతలు స్వీకరించనున్నట్లు కమిషనరేట్ వర్గాలు తెలిపాయి. ప్రొఫైల్ పూర్తి పేరు : ఆవుల వెంకట రంగనాథ్ పుట్టిన తేదీ : అక్టోబర్ 22, 1970 పుట్టిన ప్రదేశం : నల్లగొండ తల్లిదండ్రులు : సుబ్బయ్య, విజయలక్ష్మి భార్య : లక్ష్మీలావణ్య పిల్లలు : రుషిత, కౌశిక్ గ్రూప్ –1 : 1996 డీఎస్పీ, 2006లో ఐపీఎస్ మొదటి పోస్టింగ్ : గ్రేహౌండ్స్ అసాల్ట్ కమాండర్ ఇష్టమైన ఆట : టెన్నిస్ ప్రదేశం : కశ్మీర్ చదవండి: Hyderabad: ఐటీ ఉద్యోగులకు తెలంగాణ ఆర్టీసీ శుభవార్త.. -
ఎవరైనా.. ఎక్కడి నుంచైనా!
వరంగల్ క్రైం: సైబర్ నేరాలకు సంబంధించి ఇకపై ఎవరైనా.. ఎక్కడి నుంచైనా ఫిర్యాదు చేయొచ్చని వరంగల్ పోలీసు కమిషనర్ డాక్టర్ విశ్వనాథ రవీందర్ తెలి పారు. వరంగల్ పోలీసు కమిషనరేట్ కార్యాలయంలో సోమవారం సైబర్ విభా గం ఆధ్వర్యాన ‘సైబర్ పోలీసు పోర్టల్’పై పోలీసు స్టేషన్ల రైటర్లకు ఒక రోజు శిక్షణ ఏర్పాటుచేశారు. ఈ సందర్బంగా సీపీ రవీందర్ మాట్లాడుతూ దేశంలో సైబర్ నేరాలను నియంత్రించి నేరస్తులను పట్టుకోవడంతో పాటు బాధితుల ఫిర్యాదులను ఎక్కడి నుంచైనా స్వీకరించేందుకుగాను కేంద్ర హోం మంత్రిత్వశాఖ ఇండియన్ సైబర్ క్రైం కోఆరి్డనేషన్ సెంటర్ పేరుతో పోర్టల్‌ను ప్రారంభించిందని తెలిపారు. దీని వల్ల సైబర్ బాధితులు నేరుగా http://cybercrime.gov.in ద్వారా తమ నమోదు చేయవచ్చని ఆయన తెలిపారు. ఈ పోర్టల్ ద్వార అందిన ఫిర్యాదులను రాష్ట్ర సైబర్, జిల్లా సైబర్ విభాగాల ద్వారా సంబంధించి పోలీసు స్టేషన్లకు బదిలీ చేస్తారని చెప్పారు. ఆ వెంటనే విచారణ ప్రారంభమవుతుందని వివరించారు. కమిషరేట్‌లో ఓ కేసు ఇటీవల కమిషనరేట్ పరిధిలో ఓ మహిళ వ్యక్తిగత ఫొటోలను పరిచయం ఉన్న వ్యక్తి ఫేస్బుక్లో పెట్టాడని సీపీ రవీందర్ తెలిపారు. ఈ విషయమై మహిళ ఫిర్యాదు చేయగా సైబర్ విభాగం అధికారులు ఫేస్బుక్లో ఫొటోలు తొలగింపచేశారని గుర్తు చేశారు. అంతేకాకుండా నిందితుడిపై కేసు నమోదు చేశామని తెలిపారు. ఈ మేరకు సైబర్ క్రైం పోర్టల్‌పై సిబ్బంది అవగాహన పెంచుకోవడంతో పాటు ప్రజలకు వివరించాలని సూచించారు. సదస్సులో అడిషనల్ డీసీపీ వెంకటలక్ష్మి, సైబర్, ఐటీ కోర్ విభాగం ఇన్స్పెక్టర్లు జనార్దన్‌రెడ్డి, రాఘవేందర్, ప్రశాంత్, సైబర్ సిబ్బంది కిషోర్, రాజు, దినేష్, ఆంజనేయులు, రత్నాకర్, నరేష్ పాల్గొన్నారు. -
సుమార్గ్ శిక్షణతో అద్భుత ఫలితాలు
సాక్షి, కేయూ క్యాంపస్: పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో యువత ప్రభుత్వ పోటీ పరీక్షల్లో రాణించేందుకు ఏర్పాటుచేసిన సుమార్గ్ ఉచిత శిక్షణలో అద్భుత ఫలితాలు సాధించామని వరంగల్ పోలీస్ కమిషనర్ డాక్టర్ రవీందర్ తెలిపారు. సుమార్గ్ ఉచిత శిక్షణ కార్యక్రమం ద్వారా శిక్షణ పొందిన సబ్ ఇన్స్పెక్టర్లు, కానిస్టేబుళ్లతో పాటు ప్రభుత్వ ఉద్యోగాలు సాధిం చిన యువతకు సోమవారం కాకతీయ యూనివర్సిటీలోని సేనెట్‌హాల్‌లో అభినందన సభ నిర్వహించారు. ఈ సభకు సీపీ ముఖ్యఅతిథిగా సీపీ హాజరై మాట్లాడారు. సుమార్గ్ రెండోవిడత ఉచిత శిక్షణ తరగతులకు 300ల మంది యువతను ఎంపిక చేసి శిక్షణ ఇవ్వగా 250 మంది ప్రభుత్వ ఉద్యోగాలు సాధించారన్నారు. ఇందులో ప్రధానంగా సబ్ ఇన్స్పెక్టర్లు 40మంది, కానిస్టేబుళ్లుగా 165మంది, మరో 49మం ది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు సాధించారని తెలిపారు. రాష్ట్రంలో ఎక్కడాలేని విధంగా శిక్షణ అందించిన అభ్యర్థుల్లో 80శాతం మంది నిరుద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించటంలో వరంగల్ పోలీస్ కమిషనరేట్ ప్రధమస్థానంలో నిలిచిందన్నారు. మీరు ప్రతిభతో సాధించిన ఉద్యోగంతో సంతృప్తి చెందకుండా మరింత ఉన్నతస్థాయికి ఎదిగే విధంగా కృషిచేయాలని ఆయన కోరారు. సుమార్గ్ శిక్షణ అందించటంలో పూర్తి సహకారం అందించిన ప్రతిఒక్కరికి అభినందనలు తెలిపారు. అనంతరం శిక్షణ పొంది ప్రభుత్వ ఉద్యోగం సాధించిన యువతకు పోలీస్ కమిషనర్ చేతులమీదుగా ప్రశంసాపత్రాలు అందజేశారు. అంతేగాకుండా శిక్షణ ఇచ్చిన పోలీస్ అధికారులకు జ్ఞాపికలు అందజేశారు. కార్యక్రమంలో ఏఆర్ అదనపు డీసీపీ గిరిరాజు, ఎసీపీలు శ్రీధర్, శ్యాంసుందర్, శ్రీనివాస్, ఆర్ఐ సతీష్, హతీరాం, శ్రీనివాస్‌రావు, నగేష్, పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షుడు అశోక్‌కుమార్, కేయూ పోలీస్టేషన్ ఇన్స్పెక్టర్ డేవిడ్‌రాజు పాల్గొన్నారు. -
నకిలీ మావోయిస్టుల ముఠా అరెస్ట్
సాక్షి, వరంగల్ : మావోయిస్టుల పేరుతో అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న నలుగురు నకిలీ నక్సలైట్ ముఠాను అరెస్టు చేసినట్లు వరంగల్ పోలీసు కమిషనర్ డాక్టర్ విశ్వనాథ రవీందర్ తెలిపారు. సోమవారం సాయంత్రం కమిషనరేట్ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో సీపీ వివరాలు వెల్లడించారు.నిందితులు మహబుబాబాద్ జిల్లా తొర్రూరు మండల కేంద్రానికి చెందిన పూసల శ్రీమన్నారాయణ, వరంగల్ రూరల్ జిల్లా పరకాల మండలం, కామారెడ్డిపల్లికి చెందిన పోతరాజు అశోక్, తొర్రూరుకు చెందిన నర్మెట్ట నాగరాజు, జనగామ జిల్లా కొడకండ్ల మండలం చెరువు ముందు గ్రామానికి చెందిన ధరావత్ శ్రీనివాస్‌లు నలుగురు ముఠాగా ఏర్పడ్డారు. సులువుగా డబ్బులు సంపాధించడానికి ప్రణాళికలు తయారు చేసుకున్నారు. ఇందులో ప్రధాన నిందితుడు పూసల శ్రీమన్నారాయణ ఎమ్మెస్సీ వరకు చదువుకుని 2004–2009 వరకు తొర్రూరు, రాయపర్తి ప్రభుత్వ కళాశాలలో కాంట్రాక్టు పద్ధతిలో లెక్చరర్‌గా పనిచేశాడు. మరింత సంపాదన కోసం ఎడ్యూకేషన్ కన్సల్టెన్సీ నిర్వహించినట్లు తెలిపారు. కన్సల్టెన్సీలో నష్టాలు రావడంతో సులువుగా డబ్బులు సంపాధించాలనే ఆలోచనతో మావోయిస్టు నకిలీ పేరుతో ప్రణాళికలు రూపొందించుకున్నారు. మిగితా ముగ్గురు నిందితులు స్నేహితులు కావడంతో కాంట్రాక్టర్లు, వ్యాపారస్తులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, రాజకీయ నాయకులను లక్ష్యంగా చేసుకుని మావోయిస్టు నాయకులు దామోదర్, భాస్కర్ల పేర్లతో ఫోన్లలో బెదిరింపులకు పాల్పడి డబ్బులు వసూళ్లు చేయటానికి రంగం సిద్ధం చేసుకున్నారు. బెదిరింపులకు పాల్పడి.. పోలీసు కమిషనరేట్ పరిధిలో హంటర్‌రోడ్డు చిట్‌ఫండ్ వ్యాపారి నుంచి రూ. లక్ష, తొర్రూరు ప్రాంతానికి చెందిన రియల్టర్ నుంచి రూ.50వేలు, జనగామ జిల్లా కేంద్రం కిరాణ వ్యాపారి నుంచి రూ.10వేలు, çసూర్యపేట జిల్లా తిరుమలగిరి మండలానికి చెందిన రియల్ వ్యాపారి నుంచి రూ.30 వేలు, వసూల్ చేయడంతో పాటు మరో ఇద్దరు వ్యాపారులను బెదిరించినట్లు తెలిపారు. దీంతో నిందితులపై హసన్‌పర్తి, పరకాల, హన్మకొండ, కేయూసీ, జనగామ పోలీసు స్టేషన్లలో కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. నిందితులు మరికొంత మందిని బెదిరించేందుకు కేయూసీ అతిథి గృహం వద్ద సమావేశం అయినట్లు ఏసీపీ చక్రవర్తికి సమాచారం వచ్చింది. టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్ దేవేందర్‌రెడ్డి, కేయూసీ ఇన్స్పెక్టర్ డేవిడ్‌రాజ్, నిందితులను అదుపులోకి తీసుకుని విచారించగా నేరం అంగీకరించినట్లు ఆయన తెలిపారు. బొమ్మ తుపాకీ స్వాధీనం నిందితుల నుంచి రూ.1.65 లక్షల నగదుతో పాటు, 16 సెల్ఫోన్లు, ఒక ల్యాప్‌టాప్, కత్తి పెన్నును స్వాధీనం చేసుకున్నట్లు సీపీ రవీందర్ తెలిపారు. నిందితులను సకాలంలో గుర్తించడంలో ప్రతిభ కనపరిచిన అధికారులను సీపీ అభినందించారు. ఈ విలేకరుల సమావేశంలో ఈస్ట్ జోన్ డీసీపీ నాగరాజు, ఏసీపీ చక్రవర్తి, ఇన్స్పెక్టర్లు దేవేందర్‌రెడ్డి, డేవిడ్‌రాజ్, టాస్క్‌ఫోర్స్ హెడ్ కానిస్టేబుళ్లు శ్యాంసుందర్, శ్రీకాంత్‌రెడ్డి, శ్రీను, అలీ, రాజులు పాల్గొన్నారు. -
మిస్టర్ పర్ఫెక్ట్..
సాక్షి ప్రతినిధి, వరంగల్ : మిస్టర్ కూల్‌గా కనిపించే డాక్టర్ విశ్వనాథ రవీందర్ రూల్స్ విషయంలో మిస్టర్ పర్ఫెక్ట్గా పేరు గడించారు. 1991లో గ్రూప్–1లో విజయం సాధించి డీఎస్పీగా కెరీర్‌ను ప్రారంభించిన ఆయన తెలంగాణ, ఆంధ్ర, రాయలసీమలోని పలు ప్రాంతాల్లో విధులు నిర్వర్తించారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్‌కు రెండో కమిషనర్‌గా ఇటీవల నియమితులైన ఆయన ‘సాక్షి’తో సోమవారం తన అనుభవాలను పంచుకున్నారు. నూతన పోలీస్ కమిషనర్ స్వగతం, కెరీర్లో మరిచిపోలేని ఘటనలు మీ కోసం.. వద్దనుకుంటూనే వచ్చారు.. డాక్టర్ విశ్వనాథ రవీందర్ స్వస్థలం సిద్ధిపేట. తండ్రి రాజేశ్వర్, తల్లి అనసూయబాయి (లేట్). డిగ్రీ వరకు అక్కడే చదివారు. తర్వాత ఎమ్మెస్సీ ఎంట్రన్స్‌లో 18వ ర్యాంకు సా«ధించి 1982లో ఉస్మానియా యూనివర్సిటీ (ఓయూ) క్యాంపస్‌లో చేరారు. అనంతరం వెంటనే పీహెచ్డీ పూర్తి చేశారు. అది పూర్తవుతుండగానే ఒకేసారి లెక్చరర్, గ్రూప్–1 రాశారు. చిన్నప్పటి నుంచి పోలీస్ జాబ్ అంటే భయం ఉండడంతో ఇటువైపు రావొద్దని మొదట అనుకున్నారు. కుటుంబ సభ్యులు, సన్నిహితుల సూచనలతో లెక్చరర్ జాబ్‌ను పక్కనపెట్టి 1991లో డీఎస్పీగా చేరారు. తొలుత తెనాలి, బాపట్ల, గుంటూరులో డీఎస్పీగా పనిచేశారు. ఆ తర్వాత అడిషనల్ ఎస్పీగా చిత్తూరు, ఓఎస్డీగా కర్నూలు, నల్లగొండలో, డీసీపీగా విశాఖపట్నంలో, ఇంటలిజెన్స్‌శాఖలో ఎస్పీగా, తిరుపతి అర్బన్ ఎస్పీగా, కరీంనగర్ ఎస్పీగా, హైదరాబాద్ ఈస్ట్‌జోన్ డీసీపీగా, హైదరబాద్ జాయింట్ కమిషనర్ ట్రాఫిక్ బాధ్యతలు నిర్వర్తించారు. తాజాగా వరంగల్ పోలీస్ కమిషనర్‌గా బదిలీపై వచ్చారు. సన్నిహితులే స్ఫూర్తి... స్నేహితులు, సన్నిహితుల నుంచి స్ఫూర్తి పొందినట్లు పోలీస్ కమిషనర్ డాక్టర్ విశ్వనాథ రవీందర్ చెబుతున్నారు. వాళ్ల విజయాన్ని స్ఫూర్తిగా తీసుకుని.. పట్టుదలతో శ్రమించి చదువులో, కాంపిటేటివ్ పరీక్షల్లో విజయం సాధించానని అంటున్నారు. ‘సానుకూల దృక్పథంతో కష్టపడితే ఎంత పెద్ద లక్ష్యాన్ని అయినా సాధించవచ్చు. ఏదైనా లక్ష్యం కోసం మంచి మనసుతో కష్టపడితే తప్పక ఫలితం ఉంటుంది. ఇది నాచురల్ సీక్రెట్’ అని పేర్కొంటున్నారు. టీ షర్ట్స్ ధరించడంపై మక్కువ ఉన్నా, వృత్తిరీత్యా ఎక్కువగా ఖాకీ యూని ఫామ్‌లోనే కనిపిస్తానని.. పనిఒత్తిడి కారణంగా పార్టీలు, ఫంక్షన్లకు హాజరయ్యేది తక్కువేనని.. ఒత్తిడి నుంచి ఉపశమనం పొందేందుకు ప్రతిరోజు ఉదయం షటిల్ ఆడుతానని తన ఇష్టాయిష్టాలను వెల్లడించారు. చదువుకునే రోజుల్లో సాగర సంగమం సినిమాను అనేకసార్లు చూశానంటూ తన గతాన్ని ఒకసారి గుర్తు చేసుకున్నారు. మరిచిపోలేని సంఘటన తెనాలిలో పనిచేస్తుండగా ఓ యువకుడి మిస్సింగ్ కేసును ఛేదించడం తన వృత్తి జీవితంలో మరిచిపోలేనిదని విశ్వనాథ రవీందర్ ఆ ఘటన గురించి వివరించారు. ‘తెనాలిలో పని చేస్తున్నప్పుడు ఓ మహిళ నా దగ్గరకు వచ్చింది. ఒక్కగానొక్క కొడుకు కనిపించడం లేదని, బంధు వులతో కలిసి సినిమాకు వెళ్లి వస్తానని చెప్పి ఇంటినుంచి రాత్రి వేళ బయటకు వెళ్లిన కొడుకు తిరిగి రాలేదంటూ రోదించింది. కొడుకు కోసం ఏడాదిన్నరగా అన్ని చోట్ల తిరిగినా.. ఫలితం లేదని కన్నీరుమున్నీరైంది. చేతికి అందివచ్చిన కొడుకు ఏమైపోయాడో అంటూ ఆ తల్లి పడిన బాధ చూస్తే నా మనసు చలించిపోయింది. కేసు విచారణ మొదలుపెట్టాను. తప్పిపోయిన కొడుకును సినిమాకు తీసుకెళ్లిన బంధువులను పిలిపించి మాట్లాడాను. ‘నా అక్క కొడుకు సార్. రాత్రి సినిమా చూసిన తర్వాత ఎవరి ఇంటికి వాళ్లం వెళ్లిపోయాం. అప్పటి నుంచి వాడు కనిపించడం లేదు’ అంటూ చెప్పాడు. దీంతో కేసు ముందుకు కదలలేదు. బాగా ఆలోచించగా.. ఆ తల్లి చెప్పిన మాట ల్లో కొడుకు కనిపించకుండా పోయిన తర్వాత ఏడు నెలలకు ఓ చోట కొడుకు షర్ట్ కనిపించిందని చెప్పిన అంశం గుర్తుకొచ్చింది. ఆ ప్రదేశానికి వెళ్లి పరిశీలించాం. షర్ట్ దొరికిన ప్రదేశం చుట్టూ అర కిలోమీటరు వరకు అనుమానాస్పదంగా కనిపించిన ప్రతి అంశాన్ని పరిశీలించినా.. ఫలితం లేదు. చివరగా షర్ట్ దొరికిన ప్రదేశానికి సమీపంలో నాలుగైదు వ్యవసాయబావులు కనిపించాయి. మోటా ర్లతో అందులో ఉన్న నీరు అంతా బయటకు తోడించాం. ఒక బావిలో ఎముకలు కనిపించాయి. వాటిని బయటకు తీసి.. పేరిస్తే మనిషికి సంబంధించినవిగా తేలింది. వెంటనే మరోసారి సినిమా కు తీసుకెళ్లిన బంధువులను పిలిపించి గట్టిగా ప్రశ్నించడంతో నేరం ఒప్పుకున్నాడు. ఆస్తి కోసమే అల్లుడిని హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు. ‘అక్కకు ఒక్కడే కొడుకు.. బావ చనిపోయాడు. ఆమె పేరు మీద నాలుగెకరాల పొలం ఉంది. దాని విలువ కోట్లలో ఉంది. అల్లుడి అడ్డు తొలగిస్తే వార సులు లేకుండా పోయి.. అక్క తర్వాత ఆ ఆస్తి అంతా తనపరం అవుతుందని... అందుకే ఈ నేరం చేశా.’ అని చెప్పాడు. తమ్ముడే తన కొడుకును హత్య చేసిన విషయం తెలుసుకుని ఆ తల్లి గుండె పగిలేలా ఏడ్చింది. ఇంతకాలం నా కొడుకు ఏమయ్యాడో అని ఏడ్చాను. నా కొడుకు తిరిగి రాడు. కానీ.. దోషులను పట్టుకున్నారని ఆమె ఉద్వేగంగా మాట్లాడింది. ఈ సంఘటన నా కెరీర్లో గుర్తుండిపోయేదిగా నిలిచింది. సీపీ రవీందర్ కుటుంబం భార్య : నిర్మల కూతురు : నిఖిల అల్లుడు : డాక్టర్ మధునారాయణ, డీఎన్బీ సర్జికల్ అంకాలజీ కొడుకు : అభిజిత్ బీటెక్ ఇష్టమైన క్రీడ : టెన్నీస్ ఇష్టమైన నటులు : కమల్‌హాసన్, అమితాబ్‌బచ్చన్ -
కమిషనర్ చొరవతో మహిళకు విముక్తి
వాట్సాప్ సందేశంతో రియాద్‌లోని మహిళకు విముక్తి వరంగల్: వరంగల్ పోలీస్ కమిషనర్ జి.సుధీర్‌బాబు చొరవతో ఏపీలోని కడప జిల్లా మాదారం సిద్దోట మండలానికి చెందిన ఓ మహిళకు రియాద్‌లో పడుతున్న చిత్రహింసల నుంచి విముక్తి లభించింది. మాదారం సిద్దోట మండలం లక్ష్మీపురానికి చెందిన పేరూరు సుబ్బలక్ష్మి రియాద్‌లో తనను చిత్రహింసలు పెడుతున్నారని.. రక్షించాలని వాట్సప్‌లో పంపిన వీడియోను చూసి వరంగల్ పోలీస్ కమిషనర్ సుధీర్‌బాబు స్పందించారు. వెంటనే డీసీపీ నేతృత్వంలో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి 4 రోజుల్లోనే ఆమెను వరంగల్‌కు తీసుకువచ్చారు. సోమవారం వరంగల్ లో ఈ కేసు విషయాలను సీపీ వివరించారు. సుబ్బలక్ష్మి ఉపాధి కోసం దుబాయికి వెళ్లేందుకు ఏజెంట్లు జిలానీ, వెంకటేశ్, వలీలను సంప్రదించి రూ.80 వేలు అందజేసింది. వారు ఆమెను దుబాయికి కాకుండా రియాద్ దేశంలోని అబ్ధుల్లా షేక్‌కు రూ.2 లక్షలకు అమ్మేశారు. అక్కడ సుబ్బలక్ష్మి కొన్నాళ్లకు అనారోగ్యానికి గురైంది. షేక్ ఆమెకు చికిత్స చేయించకుండా ఓ గదిలో బంధించి హింసకు గురిచేశాడు. ఆ దృశ్యాలను ఆమె తన తమ్ముడదికి వాట్సప్‌లో పంపింది. ఈ నెల 7న సీపీ సుధీర్‌బాబు నంబరుకు ఆమె బంధువులు ఆ వీడియోను పంపడంతో అప్రమత్తమై డీసీపీ ఇస్మాయిల్ నేతృత్వంలో బృందాన్ని ఏర్పాటు చేశారు. ఈ బృందం సుబ్బలక్ష్మి యాజమాని అబ్ధుల్లా షేక్‌తో ఏజెంట్ ద్వారా సంప్రదింపులు జరిపించడంతో పాటు అతనికి ఇవ్వాల్సిన రూ.2 లక్షలను కూడా ఏజెంటుతోనే ఇప్పించారు. ఆమెను అక్కడినుంచి రప్పించి ఆమె భర్త పెంచలయ్యకు సోమవారం అప్పగించారు.