Warangal Region
-
ఆర్టీసీకి రూ. 12 కోట్ల నష్టం
గత ఏడాదితో పోలిస్తే తగ్గిన వైనం ఇంధన పొదుపులో రాష్ట్రంలోనే రెండో స్థానం హన్మకొండ : ఆర్టీసీని నష్టాలు వీడడం లేదు. వరంగల్ రీజియన్‌లో పరిస్థితి గత ఏడాది కంటే మెరుగైనా.. నష్టాల నుంచి మాత్రం గట్టెక్కలేదు. వరంగల్ రీజియన్‌లో గత ఏడాది రూ.17.37 కోట్ల నష్టాన్ని మూటకట్టుకోగా.. ఈ ఆర్థిక సంవత్సరం ఇప్పటి వరకు రూ.12.43 కోట్ల నష్టం వచ్చినట్లు తేలింది. అయితే, గత ఏడాదితో పోలిస్తే రూ.4.92 కోట్లు అదనంగా ఆదాయం సమకూర్చుకుంది. ఈ మేరకు నష్టం పూడ్చుకున్నట్లు అయింది. కొత్త నోట్ల రద్దుతో ఆర్టీసీ కొంత మేర ఆదా యం కోల్పోయింది. లేకుంటే నష్టం మరింత తగ్గేదని అధికారులు చెబుతున్నారు. రీజియన్‌లోని వరంగల్ అర్బన్ డివిజన్లో వరంగల్–1, వరంగల్–2 డిపోలు లాభాల్లో ఉండగా హన్మకొండ, జనగామ డిపోలు నష్టాల్లో ఉన్నాయి. వరంగల్ రూరల్ డివిజన్లోని పరకాల, భూపాలపల్లి, నర్సంపేట, తొర్రూరు, మహబూబాబాద్ డిపోలు నష్టాల్లో ఉన్నాయి. ఇంధన పొదుపులో భేష్ ఇందన పొదుపులో రాష్ట్రంలోనే వరంగల్ రీజియన్ రెండో స్థానంలో నిలిచింది. కరీంనగర్ రీజియన్ 5.73 కేఎంపీఎల్‌తో మొదటి స్థానంలో ఉండగా, 5.69 కేఎంపీఎల్‌తో వరంగల్ రీజియన్ ద్వితీయ స్థానం సాధించింది. వరంగల్ రీజియన్‌లో డిపోల వారీగా పరిశీలిస్తే 5.80 కేఎంపీఎల్‌తో మహబూబాబాద్ డిపో మొదటి స్థానంలో ఉండగా 5.79 కేఎంపీఎల్‌తో జనగామ డిపో రెండో స్థానంలో నిలిచింది. వరంగల్ రీజియన్ గత ఏడాది 5.64 కేఎంపీఎల్ సాధించగా ఈ ఏడాది 5.68 కేఎంపీఎల్‌తో ముందుకు సాగుతోంది. కాగా, పరకాల డిపో ఇందన పొ దుపులో మైనస్‌లో ఉండగా మిగతా ఎని మిది డిపోలు మెరుగుగా ఉన్నాయి. -
హమ్మయ్య.. పోస్టింగ్ ఇచ్చేశారు..
ఎట్టకేలకు కారుణ్య నియామకాలు అభ్యర్థులకు పోస్టింగ్‌లు హన్మకొండ : ఆర్టీసీ వరంగల్ రీజియన్‌లో అధికారులు ఎట్టకేలకు కారుణ్య నియామకాల ప్రకియ పూర్తి చేశారు. నెలలకొద్ది ఎ దురు చూస్తున్న అభ్యర్థులకు మంగళవా రం పోస్టింగ్‌లు ఇచ్చారు. 2006 నుంచి వ రంగల్ రీజియన్ పరిధిలో సుమారు 45 కు టుంబాలు కారుణ్య నియామకాలకై ఎదురు చూస్తున్నా యి. ఇందులో 37 కుటుం బాల నుంచి 37 మంది అభ్యర్థులను కా రుణ్య నియామకాల కింద కండక్టర్లుగా ఎంపిక చేసి శిక్షణ ఇచ్చారు. వారికి నైపుణ్య పరీక్ష నిర్వహించారు. పరీక్షలో కూడా వారంతా పాసయ్యా రు. దీనికితోడు వారి అర్హత సర్టిఫికేట్లు సంబంధి త బోర్డులకు పంపించి వెరిఫికేషన్ చేయించారు. ఇక్కడి వరకు సవ్యంగానే జరిగినా ఆ తర్వాత వారికి పోస్టింగ్ ఇవ్వకుండా ఆర్టీసీ రీజినల్ ఉన్నతాధికారి ఒకరు వేధింపులకు గురి చేస్తూ వచ్చారు. అభ్యర్థులు ఎదుర్కొంటు న్న ఇబ్బందులపై ఈ నెల 18న ‘కారుణ్య నియామకాలపై వివక్ష’ అనే శీర్షికతో సాక్షిలో కథ నం ప్రచురితమైంది. కథనానికి స్పందించిన ఆర్టీసీ వరంగల్ రీజియన్ యాజమాన్యం, అధికారులకు అభ్యర్థుల కు పోస్టింగ్‌లు ఇచ్చారు. 37 మంది అభ్యర్థులకు కారుణ్య నియామకాల కింద పో స్టింగ్‌లు ఇచ్చి డిపోలు కేటాయించారు. ఇందులో 32 మందికి భూపాలపల్లి డిపో లో పోస్టింగ్ ఇవ్వగా, హన్మకొండ డిపోకు ముగ్గురు, పరకాల, నర్సంపేట డిపోకు ఒక్కొక్కరి చొప్పున కండక్టర్లుగా పోస్టింగ్ లు ఇచ్చారు. భూపాలపల్లి డిపోకు కె.రమేశ్‌కుమార్, ఎండి మజారుద్దీన్, పి.రాఘవేందర్, టి.దయాకర్, సి.హెచ్.అమృతరావు, ఎస్.కె.అమ్జద్ పాషా, ఆర్.వీరేష్, పి.శ్రీనివాస్, డి.సంతోష్, ఆజీజ్ షాదాబ్, పి.అరుణ్‌కుమార్, ఎస్.రమేష్, ఆర్.కిరణ్‌కుమార్, డి.ప్రవీణ్, సి.హెచ్.ఎస్.కుమార్, జె.అనిల్, ఎం. విజయ్‌కుమార్, బి.కిషన్‌కుమార్, జి.నరేష్,ఎ.సురేష్, ఎస్.కె.ఫయాజ్, టి.వినీల్‌కుమార్, ఎస్.కె.షబ్బీర్, కె.శేఖర్‌బాబు, బి.రాజేష్, బి.ప్రశాంత్, జి.పవన్‌కుమార్, ఎన్.శ్రీను ఎస్.కె.ఖలీల్ పాషా, బి.శ్రీధర్, ఇ.శంకర్, ఎం.రవికుమార్‌ను కేటాయించారు. హన్మకొండ డిపోకు కె.సుష్మ, వి.సరిత, జి.జము న, నర్సంపేట డిపోకు జి.నాగమణి, పరకాలకు పి.నవీనకు పోస్టింగ్‌లు ఇచ్చారు. -
పోలీస్..!
సీఐ పోస్టింగ్‌ల సీన్ చేంజ్ టీఆర్ఎస్ నేతల ఒత్తిళ్లతో బదిలీలకు బ్రేక్! పోస్టింగ్‌ల రద్దు ఖరారు సాక్షి ప్రతినిధి, వరంగల్ : వరంగల్ రీజియన్ పరిధిలోని సర్కిల్ ఇన్స్పెక్టర్ల పోస్టింగ్‌ల కథ తిరగబడింది. వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్, ఖమ్మం జిల్లాల్లో శుక్రవారం జరిగిన 29 మంది సీఐల బదిలీలకు బ్రేక్ పడింది. బదిలీల్లో పోస్టింగ్‌లు పొందిన వారు కొత్త స్థానాల్లో చేరొద్దని పోలీసు శాఖ ఉన్నతాధికారులు శనివారం ఆదేశాలు జారీ చేశారు. మళ్లీ నిర్ణయం తీసుకునే వరకు పాత పోస్టింగ్‌లోనే కొనసాగాలని ఆదేశించారు. సాధారణ ఎన్నికల తర్వాత 29 మంది సీఐలను బదిలీ చేయడం ఇదే మొదటిసారి. ఆలస్యంగా జరిగిన ఈ బదిలీలు రాజకీయ కారణాలతో ఆగిపోయాయి. తెలంగాణలో పోలీసు శాఖను బలోపేతం చేయడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ పకడ్బందీ వ్యూహరచన చేస్తుండగా... అధికార టీఆర్ఎస్ నేతలే దీన్ని నీరుగారుస్తున్నారు. తమకు ఇష్టమైన వారికి పోస్టింగ్‌లు ఇవ్వాలని జిల్లాకు చెందిన టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు చేసిన రాజకీయంతో పోలీసు శాఖ ప్రతిష్ట మసకబారే పరిస్థితి నెలకొంది. వరంగల్ రేంజ్ పరిధిలో 29 మంది సీఐలకు ఇచ్చిన పోస్టింగ్‌లను 24 గంటల్లోనే రద్దు చేస్తూ ఉన్నత స్థాయిలో నిర్ణయం తీసుకున్నారు. రాజకీయ నాయకుల ప్రమేయం లేకుండా కొన్ని పోస్టింగ్‌లు ఇవ్వడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. ఏళ్లుగా లూప్‌లైన్ సర్వీస్‌లో మగ్గుతున్న ఇన్స్పెక్టర్లకు తాజా బదిలీల్లో ప్రాధాన్యం ఇచ్చారు. నిబంధనల ప్రకారం పోలీసు ఉన్నతాధికారులు తీసుకున్న ఈ నిర్ణయం రాజకీయ నాయకులకు ఇబ్బందికరంగా మారింది. ఎన్నికల సమయంలో, ఆ తర్వాత తమకు దగ్గరగా ఉంటున్న కొందరు సీఐలకు మంచి స్థానాల్లో పోస్టింగ్‌లు ఇస్తామని హామీలు ఇచ్చారు. ఈ విషయంలో రాజకీయ నాయకులు, సీఐలకు మధ్య కొన్ని వ్యవహారాలు జరిగినట్లు ప్రచారం జరుగుతోంది. రాజకీయ నాయకుల ప్రతిపాదనలను పక్కనబెట్టి పోలీసు ఉన్నతాధికారులు నిబంధనల ప్రకారం పోస్టింగ్‌లు ఇచ్చారు. దీంతో రాజకీయ నాయకులకు, ముఖ్యంగా అధికార పార్టీ ప్రజాప్రతినిధులు ఇబ్బందికరంగా భావించారు. వెంటనే ఉన్నత స్థాయిలో రాజకీయ పలుకుబడితో ఒత్తిడి తెచ్చారు. ఫలితంగా పోస్టింగ్‌లను నిలుపుదల చేస్తున్నట్లు అధికారులు నిర్ణయం తీసుకున్నారు. దీనిపై అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసే విషయంలో పోలీసు శాఖ ఇబ్బంది పడుతోంది. లూప్‌లైన్ సీఐల మొర... ప్రభుత్వ శాఖల్లోని అధికారులు, సిబ్బంది పోస్టింగ్ విషయంలో నిబంధనలు ఉంటాయి. కొన్నేళ్లు ఫోకల్ స్థానాల్లో విధులు నిర్వర్తించిన వారు మరికొన్నేళ్లు నాన్ ఫోకల్ పోస్టుల్లో విధులు నిర్వర్తించాలి. సివిల్ విభాగంలో సీఐలుగా పని చేసిన వారు అనివార్యంగా కొంతకాలం సీఐడీ, రైల్వే, ట్రాన్స్‌కో, ఎస్బీ, ఇంటెలిజెన్స్ విభాగాల్లో పని చేయాలి. రాజకీయ కారణాలతో ఇది మారిపోతోంది. సివిల్ విభాగంలో సీఐలుగా పనిచేస్తున్న వారు... అధికార పార్టీ నేతల సహకారంతో వరుసగా ఇలాంటి పోస్టుల్లోనే పనిచేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఈ పద్ధతికి స్వస్తి పలకాలనే ఉద్దేశంతో పోలీస్ ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఈ జాబితాలో తాము సూచించిన వారు లేకపోవడంతో రాజకీయ నాయకులు అసంతృప్తికి లోనయ్యారు. సీఐలకు ఇచ్చిన మాట నెరవేకపోవడంతో రాజకీయ నేతలకు కష్టంగా మారింది. బదిలీ అయిన సీఐలలో 16 మంది ప్రస్తుతం లూప్‌లైన్ పోస్టింగ్‌లోనే ఉన్నారు. మరో 13 మంది సీఐలు రాజకీయ నాయకులు ప్రతిపాదించిన వారు ఉన్నారు. లూప్‌లైన్ వారు దక్కించుకున్న పోస్టింగ్‌లకు సంబందించి ప్రజాప్రతినిధులు వేరే వారికి గతంలో మాట ఇచ్చారు. బదిలీ ఉత్తర్వులతో ప్రజాప్రతినిధులు ఇబ్బందిగా ఫీలయ్యారు. బదిలీ ఉత్తర్వులు నిలిపివేఆయలని ప్రభుత్వ పెద్దలపై ఒత్తిడి తెస్తున్నారు. రాజకీయ నేతల తీరు ఇలా ఉంటే... అధికార పార్టీ ప్రజాప్రతినిధికి సోదరుడు అయిన ఒక సీఐ పోస్టింగ్‌ల విషయంలో ఏకంగా హైదరాబాద్ సచివాలయంలో హంగామా చేయడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. అనుకున్నదే జరిగింది... నిబంధనల ప్రకారం జరిగిన సీఐల బదిలీల నిర్ణయంపై పోలీసు ఉన్నతాధికారుల్లోనూ కొన్ని సందేహాలు వ్యక్తమయ్యాయి. చివరికి ఇదే నిజమవుతోంది. వరంగల్ రేంజ్ ఐజీ రవిగుప్తా శుక్రవారం నాలుగు జిల్లాల ఎస్పీలతో మాట్లాడుతూ... కొన్నేళ్లుగా లూప్లైన్లో పనిచేస్తున్న ఇన్స్పెక్టర్లపై సానుభూతితోనే ఈ పోస్టింగ్‌లు ఇస్తున్నామని, ఆయా స్టేషన్ల పరిధిలో స్ధానిక ప్రజాప్రతినిధులను మేనేజ్ చేయాలని సూచించారు. కొంతమంది ఎస్పీలు సైతం స్థానిక ప్రజాప్రతినిధులకు పోస్టింగ్‌లపై ఫోన్లో సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. అయినా సీఐల పోస్టింగ్‌ల కథ మొదటికే వచ్చింది. మమ్మల్ని అణగదొక్కుతున్నారు పోలీసు శాఖలో తమను అణగదొక్కుతున్నారని సీఐ విష్ణుమూర్తి ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల జరిగిన బదిలీలో దళిత సీఐలకు అన్యాయం జరిగిందన్నారు. దీనిపై సీఎం కేసీఆర్‌ను కలిసి వినతిపత్రం సమర్పిస్తామన్నారు. మరో సీఐ సుబ్బారావు అంబేద్కర్ విగ్రహం వద్దకు చేరుకున్నాడు. అరగుండు, అరమీసంతో వచ్చిన ఆయన మొదట అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేశారు. అక్కడికి చేరుకున్న మీడియా ఇదేంటని ప్రశ్నించగా... తాను ఇంటి సమస్యలతో బాధపడుతున్నానని, ఇలా వచ్చి తమ దేవుడైన అంబేద్కర్‌కు పూలమాల వేస్తే అన్ని సర్దుకుంటాయని ఒకరు చెప్పడంతో ఇలా చేశానని చెప్పారు. సిఐ పోస్టింగులతో దీనికి సంబంధం లేదని స్పష్టం చేశారు. -
లాభాల బాటలో వరంగల్ రీజియన్
భూపాలపల్లి, న్యూస్‌లైన్ :ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు వరంగల్ రీజియన్ రూ.2.93కోట్ల లాభాలు ఆర్జించిందని ఏపీఎస్ ఆర్టీసీ కరీంనగర్ జోన్ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ ఎ.పురుషోత్తంనాయక్ తెలిపారు. భూపాలపల్లి బస్ డిపో నిర్మాణ పనులను సోమవారం ఆయన పరిశీలించి స్థానిక అధికారులతో సమావేశమయ్యారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ వరంగల్ రీజియన్‌లో గత ఆర్థిక సంవత్సరం రూ.78 లక్షల నష్టం వాటిల్లగా ఈ ఆర్థిక సంవత్సరంలో అధికారులు, కార్మికుల కృషితో లాభాల బాటలో నడుస్తుందన్నారు. కరీంనగర్ జోన్లో ఇప్పటికే రూ. 6.5 కోట్ల నష్టం వాటిల్లిందని, అయినా ప్రయాణికులకు ఎలాంటి అసౌకర్యం కల గకుండా పూర్తిస్థాయిలో చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. కొద్దిరోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా భూపాలపల్లి బస్‌డిపో నిర్మాణ పనుల్లో అలస్యం జరిగిందన్నారు. ఫ్లోరింగ్, టైల్స్, ఎలక్ట్రిక్ తదితర పనులు జరగాల్సి ఉందన్నారు. ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటుకోసం ఏపీఎన్పీడీసీఎల్కు రూ.1.70లక్షలు చెల్లించినట్టు వివరించారు. మరో పదిరోజుల్లో జనరేటర్ బిగిస్తామని చెప్పారు. ఆయిల్బంక్ ఏర్పాటు చేసేవరకు బయటినుంచి డీజిల్ కొనుగోలు చేస్తామన్నారు. ఇప్పటి వరకు 95 శాతం పనులు పూర్తయ్యాయని మిగిలిన పనులను త్వరలోనే పూర్తి చేస్తామన్నారు. వచ్చే నెల 20వ తేదీలోపు భూపాలపల్లి బస్‌డిపోను ప్రారంభించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిపారు. డిపో ప్రారంభానికి ఆర్టీసీ చెర్మైన్, ఎండీలు హాజరవుతారని చెప్పారు. జిల్లాలోని 8 డిపోల నుంచి భూపాలపల్లి డిపోకు 80 బస్సులు, సుమారు 600 మంది కార్మికులను కేటాయించనున్నట్టు చెప్పారు. కోల్‌బెల్ట్ జిల్లాలైన కరీంనగర్, ఆదిలాబాద్, ఖమ్మం జిల్లాలతో పాటు తిరుపతి, రాయిచూరు, షిర్డీలాంటి దూర ప్రాంతాలకు సైతం బస్సులను ఏర్పాటు చేస్తామన్నారు. ప్రస్తుతానికి పట్టణంలో ఉన్న బస్ షెల్టర్‌లనే వినియోగించుకుంటామన్నారు. బస్టాండ్ నిర్మాణానికి రూ.కోటితో ప్రతిపాదనలు తయారుచేస్తున్నట్లు పురుషోత్తం తెలిపారు. ఈడీ వెంట వరంగల్ రీజినల్ మేనేజర్ యాదగిరి, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ మురళీమోహన్, పరకాల, భూపాలపల్లి డిపో మేనేజర్లు జి.రాజేందర్‌రెడ్డి, జి.జగన్, డీఈ పవీ నర్సింహారావ్, ఎలక్ట్రికల్ ఏఈలు శ్రీనివాస్, జి భాస్కర్లు ఉన్నారు.