Wards
-
కార్పొరేట్‌ను తలదన్నేలా...
ఇక్కడ కనిపిస్తున్న రెండు ఫొటోల్లో మొదటిది బొబ్బిలి సామాజిక ఆరోగ్య కేంద్రం పాత భవనం. పక్క ఫొటోలో కనిపిస్తున్నది అదే ఆవరణలో రూ.3.50 కోట్లతో అత్యాధునిక వసతులతో నూతనంగా నిర్మించిన సీహెచ్‌సీ నూతన భవనం. ఇది కార్పొరేట్ ఆస్పత్రిని తలదన్నేలా నిర్మించింది. ఈ ఆస్పత్రే కాదు... వైద్య విధాన్ పరిషత్ ఆస్పత్రులను ఎనిమిదింటిని పూర్తి స్థాయి వసతులతో ఇలానే నిర్మిస్తున్నారు. రాష్ట్రంలో జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం వచ్చాక వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. నాడు – నేడు ద్వారా ఆస్పత్రులను అధునాతనంగా మార్చింది. ఆహ్లాదకర వాతావరణం నెలకొనేలా తీర్చిదిద్దింది. వైద్యులు, సిబ్బంది కొరత లేకుండా చర్యలు చేపట్టింది. రోగులకు కావాల్సినన్ని సదుపాయాలు కల్పించింది. దీంతో రోగులు కార్పొరేట్‌ను కాదని ప్రభుత్వ ఆస్పత్రుల వైపు అడుగులు వేస్తున్నారు. విజయనగరం ఫోర్ట్: రాష్ట్రంలో గత టీడీపీ ప్రభుత్వం వైద్య రంగాన్ని పూర్తిగా గాలికొదేలిసింది. ఆస్పత్రుల్లో తగినంత మంది వైద్యులు, సిబ్బందిని నియమించక, కనీస వసతులు కల్పించక.. కావాలనే కార్పొరేట్‌ను ప్రొత్సహించేలా ఇలా వ్యహరించిందన్న విమర్శలు అప్పట్లో లేకపోలేదు. ప్రస్తుతం పరిస్థితి మారింది. రాష్ట్రంలో జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రజారోగ్యమే పరమావధిగా ఆస్పత్రుల రూపురేఖలనే సమూలంగా మార్చివేసింది. కార్పొరేట్‌ను తలదన్నేలా తీర్చిదిద్దింది. అవసరమైనంత మంది వైద్యులు, సిబ్బందిని నియమించి... ఆరోగ్యశ్రీ వంటి సేవలతో కార్పొరేట్‌కు దీటుగా మార్చేసింది. రూ.కోట్లు ఖర్చు పెట్టి వైద్య విధాన్ పరిషత్ ఆస్పత్రులను నిర్మిస్తోంది. ఇప్పటికే కొన్ని ఆస్పత్రుల నిర్మాణం పూర్తి కాగా.. మరికొన్ని నిర్మాణ దశలో దూసుకుపోతున్నాయి. రూ.58.58 కోట్లతో 8 ఆస్పత్రుల నిర్మాణం జిల్లాలో వైద్య విధాన్ పరిషత్‌కు చెందిన 8 ఆస్పత్రులను రూ.58.58 కోట్లతో నిర్మాణం చేపట్టారు. పాత ఆస్పత్రి ఆవరణలో కొత్తగా నిర్మాణం చేపట్టారు. వీటిలో బొబ్బిలి, చీపురుపల్లి ఆస్పత్రుల నిర్మాణం పూర్తయి ఇప్పటికే ప్రారంభించారు. భోగాపురం ఆస్పత్రి నిర్మాణం దాదాపు పూర్తి కావొచ్చింది. త్వరలోనే దీన్ని ప్రారంభించనున్నారు. ఎస్.కోట, బాడంగి, నెల్లిమర్ల, రాజాం, గజపతినగరం ఆస్పత్రులు నిర్మాణ దశలో ఉన్నాయి. వీటి నిర్మాణాలు కూడా వేగవంతం అయ్యే విధంగా అధికారులు చర్యలు చేపడుతున్నారు. ఆస్పత్రులు ఇలా... ప్రతి ఆస్పత్రిలోని క్యాజువాలటీ, ఓపీ విభాగం, మేల్, ఫీమేల్ వార్డులు, చేంజింగ్ రూమ్, ల్యాబొరేటరీ, అత్యా«ధునిక సౌకర్యాలతో కూడిన ఆపరేషన్ థియేటర్, ఎక్స్‌రే విభాగం, కార్యాలయ నిర్మాణాలు ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా నిర్మిస్తున్నారు. కార్పొరేట్ ఆస్పత్రులకు ధీటుగా ఆస్పత్రులను నిర్మిస్తున్నారు. నాణ్యతలో రాజీ పడకుండా రోగులకు సేవలే లక్ష్యంగా దూసుకుపోతున్నారు. అన్ని వసతులతో... వైద్య విధాన్ పరిషత్ పరిధిలో 8 ఆస్పత్రులను ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా అన్ని వసతులతో రూ.58.58 కోట్లతో నిర్మిస్తున్నాం. రెండు ఆస్పత్రులు నిర్మాణం పూర్తవ్వడంతో వాటిని ప్రారంభించి వినియోగంలోకి తీసుకొచ్చాం. మరో ఆస్పత్రి ప్రారంభానికి సిద్ధంగా ఉంది. మిగిలిన ఆస్పత్రుల నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. కలెక్టర్ ప్రతి నెల ఆస్పత్రుల నిర్మాణం పురోగతిపై సమీక్ష నిర్వహిస్తున్నారు. – డాక్టర్ బి.గౌరీశంకర్, జిల్లా ఆస్పత్రుల సేవల సమన్వయధికారి (డీసీహెచ్ఎస్) -
27 డివిజన్లు, వార్డుల్లో వైఎస్సార్సీపీ ఏకగ్రీవం
సాక్షి, అమరావతి: నెల్లూరు కార్పొరేషన్‌తోపాటు 12 మునిసిపాలిటీలు, నగర పంచాయతీలతోపాటు, వివిధ కార్పొరేషన్లు, మునిసిపాలిటీల్లో జరుగుతున్న 353 డివిజన్లు, వార్డుల ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ సోమవారం ముగిసింది. 27 డివిజన్లు, వార్డుల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు రిటర్నింగ్ అధికారులు ప్రకటించారు. నెల్లూరు కార్పొరేషన్లో 54 డివిజన్లకు ఎన్నికలు నిర్వహిస్తుండగా 8 డివిజన్లను వైఎస్సార్సీపీ ఏకగ్రీవంగా గెల్చుకుంది. గుంటూరు జిల్లా గురజాల నగర పంచాయతీలో ఆరు వార్డులు, దాచేపల్లి నగర పంచాయతీ, ప్రకాశం జిల్లా దర్శి, చిత్తూరు జిల్లా కుప్పం మునిసిపాలిటీల్లో ఒక్కొక్క వార్డులో వైఎస్సార్సీపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గత మార్చిలో ఎన్నికైన ప్రజాప్రతినిధుల మరణం, అప్పట్లో వివిధ కారణాలతో ఎన్నికలు జరగని కార్పొరేషన్లు, మునిసిపాలిటీల్లో 19 డివిజన్లు, వార్డులకు ఎన్నికలు జరుగుతుండగా 10 చోట్ల వైఎస్సార్సీపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా విజయం సాధించారు. ఒకచోట ఇండిపెండెంట్ అభ్యర్థి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆమోదించిన 838 నామినేషన్లను అన్ని పార్టీలకు చెందిన అభ్యర్థులు ఉపసంహరించుకున్నారు. నెల్లూరు నగరపాలక సంస్థలో ఎన్నికలు జరుగుతున్న 46 డివిజన్లలోను వైఎస్సార్సీపీ బరిలో ఉంది. టీడీపీ 44 డివిజన్లలో పోటీ చేస్తోంది. నేనే తప్పుకొన్నా.. మా పార్టీవాళ్లే డ్రామా చేస్తున్నారు దర్శి టీడీపీ నేత శ్రీనివాసరావు దర్శి: ప్రకాశం జిల్లా దర్శి నగర పంచాయతీ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని ఎదుర్కోలేక టీడీపీ నీచరాజకీయాలకు తెరతీసింది. 8వ వార్డులో టీడీపీ అభ్యర్థి చెరుకూరి శ్రీనివాసరావు సోమవారం స్వచ్ఛందంగా ఎన్నికల బరిలో నుంచి తప్పుకొంటున్నట్టు తెలిపి నామినేషన్ ఉపసంహరణ పత్రాన్ని ఇచ్చారు. దీంతో వైఎస్సార్సీపీ అభ్యర్థి మోహన్‌రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దీన్ని జీర్ణించుకోలేని టీడీపీ నేతలు నూకసాని బాలాజీ, దామచర్ల జనార్దన్ తదితరులు సోమవారం సాయంత్రం నుంచి ఎన్నికల అధికారి కార్యాలయం ముందు హైడ్రామా చేశారు. తమ పార్టీ అభ్యర్థి శ్రీనివాసరావు సంతకాన్ని ఫోర్జరీ చేశారంటూ హడావుడి చేశారు. విధుల్లో ఉన్న అధికారులపై దౌర్జన్యం చేసేందుకు యత్నించారు. అడ్డుకున్న పోలీసులపై దురుసుగా వ్యవహరించారు. వైఎస్సార్సీపీ అభ్యర్థి మోహన్‌రెడ్డి, తాను స్నేహితులమని, స్నేహితుడిపై పోటీ చేసేందుకు ఇష్టం లేక నామినేషన్ ఉపసంహరించుకున్నానని శ్రీనివాసరావు స్పష్టం చేశారు. ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. తమ పార్టీ పెద్దలు తనను బెదిరించారని, సంతకాన్ని ఎవరో ఫోర్జరీ చేశారని అధికారులకు చెప్పాలని ఒత్తిడి తెచ్చారని తెలిపారు. ‘లాయర్‌తో లోపలికి వెళ్లు.. అంతా వాళ్లే చూసుకుంటారు..’ అని తనను బలవంతం చేశారని చెప్పారు. తాను ఇష్టపూర్వకంగానే ఎన్నికల బరిలో నుంచి తప్పుకొన్నానని శ్రీనివాసరావు మరోసారి స్పష్టం చేశారు. -
కరోనా రోగి వద్ద కాలింగ్ బెల్
సాక్షి, అమరావతి: కరోనాతో వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న వారి పడకల దగ్గర కాలింగ్ బెల్స్ ఏర్పాటు చేయనున్నారు. కొన్ని ఆస్పత్రుల్లో వైద్యులు తరచూ రౌండ్స్‌కు వెళ్లడం లేదన్న విమర్శలు రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. అవసరమైనప్పుడు రోగి బెల్ నొక్కితే చాలు.. నర్సు లేదా డాక్టర్ వచ్చి పేషెంట్ పరిస్థితి తెలుసుకునే వీలుంటుంది. ఈ నేపథ్యంలో అన్ని కోవిడ్ ఆస్పత్రుల్లో వీటిని ఏర్పాటు చేయాలని సూపరింటెండెంట్లకు ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు ఆదేశాలిచ్చారు. ♦ఐసీయూ, నాన్ ఐసీయూ, ఆక్సిజన్, జనరల్ వార్డుల్లో ఈ బెల్స్ ఏర్పాటు చేసి, రిసెప్షన్ చాంబర్‌తో అనుసంధానిస్తారు. ♦ఒక్కసారి బజర్ నొక్కగానే వార్డులో గంట మోగడంతో పాటు లైట్లు కూడా వెలుగుతాయి. ♦డాక్టర్ లేదా నర్సు వచ్చే వరకూ ఈ గంట మోగుతూనే ఉంటుంది. ♦ఎమర్జెన్సీ సేవలు అవసరమయ్యే రోగులను వెంటనే గుర్తించే వీలుంటుంది. ఇప్పటికే రోగులకు అందుతున్న సేవల పరిశీలనకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు. టార్గెటెడ్ వారికి నిర్ధారణ పరీక్షలు.. ఎక్కువ టెస్టులు చేయడం, ఎక్కువ మందిని గుర్తించి కట్టడి చేయడమనే విధానంతో ముందుకెళుతున్న సర్కారు.. మరింత నిర్దేశిత లక్ష్యంతో నిర్ధారణ పరీక్షలు చేయాలని భావిస్తోంది. అదెలాగంటే.. ♦కరోనా లక్షణాలు బాగా కనిపిస్తున్న వారికి.. ♦జ్వరం, జలుబు వంటి వాటితో బాధపడుతున్న వారికి ♦60 ఏళ్లు దాటిన వారికి మధుమేహం, బీపీ, గుండె జబ్బులు, క్యాన్సర్ వంటి వాటితో బాధపడుతున్న వారికి పరీక్షలు చేస్తారు. ♦ఎక్కువ టెస్టులు చేసినా తక్కువ పాజిటివ్‌లు వచ్చాయన్న దానికంటే.. ఎక్కువ టెస్టులు చేసి ఎక్కువ పాజిటివ్‌లు గుర్తించేలా చర్యలు. ఫలానా వారికి టెస్టు చేస్తే పాజిటివ్ అయి ఉండాలన్న లక్ష్యంతో పరీక్షలు -
ఇక ప్రచార హోరు..!
కర్నూలు(సిటీ),న్యూస్‌లైన్: మునిసిపల్ ఎన్నికల్లో నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. పోటీలో అభ్యర్థులు ఎవరో తేలిపోయింది. ఇక ప్రచారం ఊపందుకోనుంది. మంగళవారం జిల్లాలోని 4 మునిసిపాలిటీలు, 5 నగర పంచాయతీల్లో నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసింది. మొత్తం 457 మంది అభ్యర్థులు చివరిరోజు తను నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. జిల్లాలోని 239 వార్డుల్లో 926 అభ్యర్థులు బరిలో నిలిచారు. ఈ ఏడాది మున్సిపల్ ఎన్నికల్లో ఇండిపెండెంట్ల హవా కొనసాగింది. నామినేషన్ల ఉపసంహరణ నాటికే జిల్లాలో ముగ్గురు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వార్డులు 236..అభ్యర్థులు 926 : జిల్లాలోని నాలుగు మునిసిపాల్టీలు(నంద్యాల, ఆదోని, ఎమ్మిగనూరు, డోన్), నగర పంచాయతీలైన గూడూరు, బనగానపల్లె, ఆత్మకూరు, నందికొట్కూరు, ఆళ్లగడ్డలో మొత్తం 239 వార్డులు ఉన్నాయి. ఆదోని మునిసిపాల్టీలో(41), ఎమ్మిగనూరు(33), నంద్యాల(42), ఆళ్లగడ్డ(20), బనగానపల్లె(20), ఆత్మకూరు(20), నందికొట్కూరు(23), డోన్(20), గూడూరు(20) చొప్పున వార్డులు ఉన్నాయి. ఈనెల 10వ తేదీన నామినేషన్ల స్వీకరణ ప్రారంభమైంది. 15వ తేదీన నామినేషన్ల పరిశీలనఅనంతరం 18వ తేదీ వరకు ఉపసంహరణకు గడువు విధించింది. చివరిరోజు 457 మంది అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. బరిలో 926 మంది అభ్యర్థులు..: జిల్లాలో 926 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ(236), టీడీపీ(236), కాంగ్రెస్(99), సీపీఎం(18), బీజేపీ(33), సీపీఐ(18), ఇండిపెండెంట్లు 286 మంది పోటీలో నిలిచారు. ప్రధాన పోటీ వైఎస్సార్సీపీ, టీడీపీ మధ్యే..: జిల్లాలోని అన్ని మున్సిపాల్టీల్లో ప్రధానంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీల మధ్య పోటీ నెలకొంది. తెలుగుదేశం పార్టీకి అడుగడుగునా రెబల్స్ బెడద పట్టుకుంది. ఎమ్మిగనూరు మున్సిపాల్టీతో పాటు ఆదోని, నందికొట్కూరు గ్రామ పంచాయతీల్లో తెలుగుదేశం పార్టీకి రెబల్స్ రంగంలో ఉండటంతో అభ్యర్థులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ‘బోణి’ కొట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ... : జిల్లాలో నామినేషన్ల ఉపసంహరణ రోజే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏకగ్రీవంగా గెలిచి బోణి కొట్టింది. సోమవారం బనగానపల్లె 3వ వార్డులో ఏకగ్రీవంగా ఆళ్లగడ్డ నగర పంచాయతీలో 13, 14 వార్డులకు సంబంధించి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నేటి నుంచి ప్రచార పోరు..: నామినేషన్ల ఘట్టం పూర్తికావడంతో రాజకీయ పార్టీలు ప్రచార హోరుకు తెరలేపాయి. బుధవారం నుంచి అభ్యర్థుల ప్రచారం ముమ్మరంగా సాగనుంది. రాబోయే పది రోజుల పాటు ప్రచారం ఆయా పార్టీలు ఉద్ధృతం చేయనున్నాయి. ఈనెల 30న పోలింగ్ నిర్వహించనున్నారు. మున్సిపాల్టీ వారీగా బరిలో నిలిచిన అభ్యర్థులు... ఆదోని.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ(41), కాంగ్రెస్(39), టీడీపీ(40), ఎంఐఎం(12), సీపీఐ(5), సీపీఎం(6), బీజేపీ(6), లోక్‌సత్తా(1), బీఎస్పీ(1), ఇండిపెండెంట్లు(70) గూడూరు.. వైఎస్సార్‌కాంగ్రెస్ పార్టీ(20), కాంగ్రెస్(12), టీడీపీ(19), బీజేపీ(4), సీపీఐ(1), సీపీఎం(1), ఇండిపెండెంట్లు(5) నంద్యాల.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ(41), కాంగ్రెస్(6), టీడీపీ(41), బీజేపీ(9), సీపీఎం(2), సీపీఐ(1), లోక్‌సత్తా(3), ఎంఐఎం(5), ఇండిపెండెంట్లు(105) నందికొట్కూరు.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ(23), కాంగ్రెస్(1), టీడీపీ(26), బీజేపీ(3), సీపీఎం(3), సీపీఐ(1), లోక్‌సత్తా(1), ఇతరులు(4), ఇండిపెండెంట్లు(60) బనగానపల్లె.. వైఎస్సార్‌కాంగ్రెస్ పార్టీ(19), కాంగ్రెస్(3), టీడీపీ(19), ఇతరులు(14) ఆళ్లగడ్డ.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ(18), టీడీపీ(18), సీపీఐ(2), బీజేపీ(2), ఇండిపెండెంట్లు(5) డోన్..వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ(20), కాంగ్రెస్(1), టీడీపీ(20), బీజేపీ(3), సీపీఐ(5), సీపీఎం(2), ఇండిపెండెంట్లు(41) ఎమ్మిగనూరు.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ(34), కాంగ్రెస్(31), టీడీపీ (33), బీజేపీ(1), సీపీఐ(3), సీపీఎం(4), లోక్‌సత్తా(1), ఎస్డీపీఐ(7), ఇతరులు(23) ఆత్మకూరు.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ(20), టీడీపీ(20), కాంగ్రెస్(5), బీజేపీ(3), సీపీఎం(4), సీపీఐ(4), లోక్‌సత్తా(1) చొప్పున అభ్యర్థులు బరిలో నిలిచారు.