ఇక ప్రచార హోరు..! | time to election campaign | Sakshi
Sakshi News home page

ఇక ప్రచార హోరు..!

Published Wed, Mar 19 2014 5:02 AM | Last Updated on Fri, May 25 2018 9:12 PM

ఇక ప్రచార హోరు..! - Sakshi

ఇక ప్రచార హోరు..!

కర్నూలు(సిటీ),న్యూస్‌లైన్: మునిసిపల్ ఎన్నికల్లో నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. పోటీలో అభ్యర్థులు ఎవరో తేలిపోయింది.  ఇక ప్రచారం ఊపందుకోనుంది. మంగళవారం జిల్లాలోని 4 మునిసిపాలిటీలు, 5 నగర పంచాయతీల్లో నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసింది. మొత్తం 457 మంది అభ్యర్థులు చివరిరోజు తను నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. జిల్లాలోని 239 వార్డుల్లో 926 అభ్యర్థులు బరిలో నిలిచారు. ఈ ఏడాది మున్సిపల్ ఎన్నికల్లో ఇండిపెండెంట్ల హవా కొనసాగింది. నామినేషన్ల ఉపసంహరణ నాటికే జిల్లాలో ముగ్గురు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
 
 వార్డులు 236..అభ్యర్థులు 926 :
 జిల్లాలోని నాలుగు మునిసిపాల్టీలు(నంద్యాల, ఆదోని, ఎమ్మిగనూరు, డోన్), నగర పంచాయతీలైన గూడూరు, బనగానపల్లె, ఆత్మకూరు, నందికొట్కూరు, ఆళ్లగడ్డలో మొత్తం 239 వార్డులు ఉన్నాయి. ఆదోని మునిసిపాల్టీలో(41), ఎమ్మిగనూరు(33), నంద్యాల(42), ఆళ్లగడ్డ(20), బనగానపల్లె(20), ఆత్మకూరు(20), నందికొట్కూరు(23), డోన్(20), గూడూరు(20) చొప్పున వార్డులు ఉన్నాయి.
 
 ఈనెల 10వ తేదీన నామినేషన్ల స్వీకరణ ప్రారంభమైంది. 15వ తేదీన నామినేషన్ల పరిశీలనఅనంతరం 18వ తేదీ వరకు ఉపసంహరణకు గడువు విధించింది. చివరిరోజు 457 మంది అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు.
 బరిలో 926 మంది అభ్యర్థులు..: జిల్లాలో 926 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ(236), టీడీపీ(236), కాంగ్రెస్(99), సీపీఎం(18), బీజేపీ(33), సీపీఐ(18), ఇండిపెండెంట్లు 286 మంది పోటీలో నిలిచారు.
 
 ప్రధాన పోటీ వైఎస్సార్సీపీ, టీడీపీ మధ్యే..: జిల్లాలోని అన్ని మున్సిపాల్టీల్లో ప్రధానంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీల మధ్య పోటీ నెలకొంది. తెలుగుదేశం పార్టీకి అడుగడుగునా రెబల్స్ బెడద పట్టుకుంది. ఎమ్మిగనూరు మున్సిపాల్టీతో పాటు ఆదోని, నందికొట్కూరు గ్రామ పంచాయతీల్లో తెలుగుదేశం పార్టీకి రెబల్స్ రంగంలో ఉండటంతో అభ్యర్థులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.
 
 ‘బోణి’ కొట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ... : జిల్లాలో నామినేషన్ల ఉపసంహరణ రోజే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏకగ్రీవంగా గెలిచి బోణి కొట్టింది. సోమవారం బనగానపల్లె 3వ వార్డులో ఏకగ్రీవంగా ఆళ్లగడ్డ నగర పంచాయతీలో 13, 14 వార్డులకు సంబంధించి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
 
 నేటి నుంచి ప్రచార పోరు..: నామినేషన్ల ఘట్టం పూర్తికావడంతో రాజకీయ పార్టీలు ప్రచార హోరుకు తెరలేపాయి. బుధవారం నుంచి అభ్యర్థుల ప్రచారం ముమ్మరంగా సాగనుంది. రాబోయే పది రోజుల పాటు ప్రచారం ఆయా పార్టీలు ఉద్ధృతం చేయనున్నాయి. ఈనెల 30న పోలింగ్ నిర్వహించనున్నారు.
 
 మున్సిపాల్టీ వారీగా బరిలో నిలిచిన అభ్యర్థులు...
 ఆదోని.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ(41), కాంగ్రెస్(39),  టీడీపీ(40), ఎంఐఎం(12), సీపీఐ(5), సీపీఎం(6), బీజేపీ(6), లోక్‌సత్తా(1), బీఎస్పీ(1), ఇండిపెండెంట్లు(70)
 గూడూరు.. వైఎస్సార్‌కాంగ్రెస్ పార్టీ(20), కాంగ్రెస్(12), టీడీపీ(19), బీజేపీ(4), సీపీఐ(1), సీపీఎం(1), ఇండిపెండెంట్లు(5)
 
 నంద్యాల.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ(41), కాంగ్రెస్(6), టీడీపీ(41), బీజేపీ(9), సీపీఎం(2), సీపీఐ(1), లోక్‌సత్తా(3), ఎంఐఎం(5), ఇండిపెండెంట్లు(105)
 నందికొట్కూరు.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ(23), కాంగ్రెస్(1), టీడీపీ(26), బీజేపీ(3), సీపీఎం(3), సీపీఐ(1), లోక్‌సత్తా(1), ఇతరులు(4), ఇండిపెండెంట్లు(60)
 బనగానపల్లె.. వైఎస్సార్‌కాంగ్రెస్ పార్టీ(19), కాంగ్రెస్(3), టీడీపీ(19), ఇతరులు(14)
 ఆళ్లగడ్డ.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ(18), టీడీపీ(18), సీపీఐ(2), బీజేపీ(2), ఇండిపెండెంట్లు(5)
 
 డోన్..వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ(20), కాంగ్రెస్(1), టీడీపీ(20), బీజేపీ(3), సీపీఐ(5), సీపీఎం(2), ఇండిపెండెంట్లు(41)
 
 ఎమ్మిగనూరు.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ(34), కాంగ్రెస్(31), టీడీపీ (33), బీజేపీ(1), సీపీఐ(3), సీపీఎం(4), లోక్‌సత్తా(1), ఎస్‌డీపీఐ(7), ఇతరులు(23)
 ఆత్మకూరు.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ(20), టీడీపీ(20), కాంగ్రెస్(5), బీజేపీ(3), సీపీఎం(4), సీపీఐ(4), లోక్‌సత్తా(1) చొప్పున అభ్యర్థులు బరిలో నిలిచారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement