warnig
-
Big Question: సర్కారు వారి అరాచకం.. లా అండ్ ఆర్డర్ రెడ్ బుక్ సేవలో పోలీసులు
-
ఇదే లాస్ట్ వార్నింగ్.. పనితీరు మార్చుకోండి
సాక్షి, ఎస్.రాయవరం(విశాఖపట్నం): సర్వసిద్ధి పీహెచ్సీ సిబ్బంది పనితీరు మార్చుకోవాలని, విధులకు సక్రమంగా హాజరుకాకుంటే సహించేది లేదని పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబూరావు హెచ్చరించారు. సర్వసిద్ధి గ్రామంలోని ప్రైవేటు కార్యక్రమానికి ఆదివారం వచ్చిన ఆయన ఆకస్మికంగా స్థానిక పీహెచ్‌సీని సందర్శించారు. పీహెచ్సీలో డాక్టర్ లేకపోవడంతో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సిబ్బంది ఎక్కడ ఉంటున్నారని ఆరా తీశారు. అటెండర్‌తో సహా ఎవరూ స్థానికంగా ఉండడం లేదని గ్రామస్తులు చెప్పడంతో ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానికంగా అందుబాటులోకి వచ్చిన స్టాఫ్ నర్సు, అటెండర్‌తో మాట్లాడుతూ ఇదే లాస్ట్ వార్నింగ్ అని, ఇకపై పీహెచ్సీ ఇబ్బంది ఇలా చేస్తే క్షమించేది లేదన్నారు. రోడ్ల నిర్మాణానికి నిధులు గ్రామంలో ఎస్సీపేట వీధి రోడ్ల నిర్మాణానికి త్వరలో నిధులు కేటాయిస్తానని ఎమ్మెల్యే గొల్ల బాబూరావు తెలిపారు. కాలనీవాసుల విజ్ఞప్తి మేరకు ఆయన ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. పంచాయతీకి మంజూరయ్యే నిధులను ఈ వీధిలోని రోడ్ల అభివృద్ధికి కేటాయించాలని స్థానిక సర్పంచ్ గణేశ్వరరావుకు సూచించారు. ఎమ్మెల్యే వెంట పాయకరావుపేట మార్కెట్ కమిటీ చైర్మన్ మామిడి చంటి, వైఎస్సార్ సీపీ మండల శాఖ అధ్యక్షుడు కొణతాల శ్రీనివాసరావు తదితరులున్నారు. -
లుపిన్కు మరోసారి యూఎస్ఎఫ్డీఏ షాక్
సాక్షి, ముంబై: దేశీయ ఫార్మ దిగ్గజం లుపిన్ లిమిటెడ్‌కు మరోసారి ఎదురు దెబ్బ తగిలింది. యునైటెడ్ స్టేట్స్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (యూఎస్ఎఫ్డీఏ) జారీ చేసిన హెచ్చరికలో మంగళవారం నాటి మార్కెట్లో భారీ నష్టాలను నమోదు చేసింది. లుపిన్ 17 శాతం పైగా క్షీణించి 52 వారాల కనిష్టాన్ని తాకింది. గోవా, పితంపూర్‌లలో గల రెండు ప్లాంట్లకూ సంబంధించి యూఎస్ఎఫ్డీఏ ఈ హెచ్చరికలు జారీ చేయడంతో హెల్త్‌కేర్ దిగ్గజం లుపిన్కు బారీ షాక్ గిలింది. ఇక్కడి ఉత్పాదక సదుపాయాలకు సంబంధించి ప్లాంట్లలో తయారీ లోపాలపై యూఎస్ఎఫ్డీఏ ఈ ఏడాది ఏప్రిల్, మే నెలల్లో మూడు ఫామ్ 483లను జారీ చేసింది. అయితే తాజాగా దిగుమతుల హెచ్చరికలను సైతం జారీ చేసింది. దీంతో అమ్మకాలు క్షీణించే అవకాశముందన్న అంచనాలతో భారీగా అమ్మకాలకు తెర లేచింది. అయితే ఉత్పత్తి, సరఫరాలో ఎలాంటి అంతరాయం ఉండదని లుపిన్ ప్రకటించింది. ఉత్పాదక నాణ్యతా ప్రమాణాలకు తాము కట్టుబడి ఉన్నామని,యూఎస్ఎఫ్డీఏ ఆందోళనలను పరిష్కరించడానికి చర్చలు జరుపుతామని హామీఇచ్చింది. -
మరో వ్యాపారికి నయీం గ్యాంగ్ బెదిరింపులు
కోరుట్ల : కోరుట్ల బీడీ లీవ్స్ కాంట్రాక్టర్ మహ్మద్ అబ్దుల్ రవూఫ్‌ను బెదిరించి రూ.30 లక్షలు వసూలు చేసిన నయీం గ్యాంగ్ ఆ తరువాత మరో వ్యాపారిని బెదిరించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. సదరు వ్యాపారికి ఫోన్ ద్వారా హెచ్చరికలు చేసి పెద్ద మొత్తంలో డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. సదరు వ్యాపారి మొదట నయీం గ్యాంగ్ బెదిరింపులతో ఇబ్బంది పడ్డప్పటికీ పెద్ద మొత్తంలో డబ్బులు అడగటంతో ఇచ్చేది లేదని మొండికేసినట్లుగా పోలీసులు భావిస్తున్నారు. అయితే నయీం గ్యాంగ్‌కు కోరుట్లలోని బడా వ్యాపారుల వివరాలు ఎవరు అందించారన్న విషయంపై సిట్ అధికారులు లోతుగా విచారణ సాగిస్తున్నట్లు సమాచారం. బీడీ లీవ్స్ కాంట్రాక్టర్ రవూఫ్ కదలికలు నయీం గ్యాంగ్ అనుచరులు ఎలా పసిగట్టారన్న విషయంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. రవూప్ బంధువులు, పిల్లలు హైదరాబాద్‌లో ఎక్కడ ఉన్నారు, ఏ స్కూళ్లలో చదువుతున్నారన్న వివరాలు సేకరించి నయీం గ్యాంగ్ బెదిరింపులకు దిగిందంటే ఈ సమాచారాన్ని స్థానికులే అందించి ఉంటారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయంలో కోరుట్ల, జగిత్యాల ప్రాంతాలకు చెందిన కొందరిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు ఊహాగానాలు జోరుగా సాగుతున్నాయి