Wash Basins
-
బాత్రూం సింక్స్ రూ.18 లక్షలట!
రియాలిటీ టీవీ మొఘల్, అమెరికా నటి కిమ్ కర్దాషియాన్ తన ఇంట్లోని బాత్రూం సింకులకు ఏకంగా రూ.18 లక్షలు చెల్లించందట. ఈ విషయాన్ని ఆమెనే స్వయంగా ఓ వీడియో ద్వారా ఇన్స్టాగ్రామ్ వేదికగా పంచుకుంది. బాత్రూం సింక్స్కు రూ.18 లక్షలు ఏంటిరా నాయనా అంటూ నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఈ డబ్బులతో మధ్యతరగతి కుటుంబాలు మూడు డబుల్ బెడ్రూం ఇళ్లులు నిర్మించుకునేవని నిట్టూరుస్తున్నారు. దీంతో ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట హల్చల్ చేస్తోంది. పూర్తి ఆర్కిటెక్ట్ డిజైన్స్‌తో కూడిన ఈ బాత్రూం బెసిన్స్ చూడటానికి ఆకర్షణీయంగా ఉన్నాయి. ఇక ఈ టీవీ మొఘల్ షేర్ చేసిన వీడియోలో.. వాష్ బేసిన్స్కు బేసిన్స్ లేకుండా టాప్స్ మాత్రమే ఉన్నాయి. ఇవి ఎలా పనిచేస్తాయని నెటిజన్లు ప్రశ్నలు సంధించడంతో ఆమె ట్యాప్‌లు ఆన్ చేసి మరి వాటి పనితీరును చూపించింది. ఈ సింక్‌పై చిన్న చీలక ఉందని, దానిలో నుంచి నీళ్లు వెళ్తాయని, ట్యాప్‌ను ఎంత ప్రెజర్‌తో పెట్టినా నీరు పక్కకు వెళ్లవని, అదే దీని ప్రత్యేకతని చెప్పుకొచ్చింది. తన భర్త, ప్రముఖ రాపర్ కన్యే వెస్ట్, డిజైనర్ ఆక్సెల్ వర్వోడోర్ట్, ఆర్కిటెక్ట్ క్లాడియో సిల్వర్పిన్లు కలిసి సంయుక్తంగా ఈ సింక్స్ను రూపొందించారని పేర్కొంది. View this post on Instagram bathroom tour! A post shared by Kim Kardashian Snapchat 🍑 (@kimkardashiansnap) on Apr 17, 2019 at 12:08pm PDT -
రోటరీక్లబ్ ఆధ్వర్యంలో 400 వాష్బేసిన్లు
అరకులోయ(విశాఖపట్టణం జిల్లా): విశాఖ జిల్లా రోటరీక్లబ్ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా 400 వాష్బేసిన్లు నిర్మించనున్నారు. ఈ మేరకు బుధవారం జిల్లాలోని అరకులోయలో రెండు ఆర్వో మంచి నీటి ఫ్లాంట్లు, 4 వాష్బేషిన్లు నిర్మించి, ప్రారంభించారు. శానిటేషన్ కార్యక్రమంలో భాగంగా ముందుగా 49 వాష్బేసిన్లు ఏర్పాటు చేయనున్నామని రోటరీక్లబ్ సభ్యులు వడ్లమాని రవి, సూర్యారావులు తెలిపారు. ఒక్కో వాష్‌బేషిన్‌లో 16ట్యాప్‌లను ఏర్పాటు చేయనున్నామని చెప్పారు. ఈ వాష్బేసిన్లు జిల్లాలోని ప్రభుత్వ డిగ్రీ, జూనియర్, హైస్కూల్స్‌లో నిర్మిస్తామని వారు తెలిపారు. -
చిట్కాలు తెలిస్తే చిటికెలో పని!
వాయనం ఇంటిని తళతళలాడేలా ఉంచుకునేందుకు ప్రతి గృహిణీ పెద్ద కసరత్తే చేస్తుంది. చేసీ చేసీ అలసిపోతుంది. నిజానికి అంత అలసిపో నక్కర్లేదు. ఎంత పెద్ద పని అయినా కొన్ని చిట్కాలు పాటిస్తే చిటికెలో అయిపోతుంది. ఇంటి క్లీనింగ్ మాత్రం ఎందుకవ్వదు! వాష్ బేసిన్స్కి పట్టిన మురికి, జిడ్డు వదలాలంటే... వాష్ బేసిన్ రంధ్రాలను మూసేసి, కాసింత గోరువెచ్చని నీళ్లను పోయండి. ఓ రెండు నిమ్మచెక్కల్ని కూడా వేస్తే నిమ్మతో కలిసి నీరు యాసిడ్‌లా పని చేస్తుంది. బేసిన్ క్లీనైపోతుంది. ఫ్రిజ్ క్లీన్ చేసేటప్పుడు ముందుగా ఉప్పు, నిమ్మరసం కలిపిన నీటిని లోపల చల్లి కాసేపు వదిలేయండి. ఆ తర్వాత బట్టతో తుడిస్తే మరకలు తేలికగా పోతాయి, క్రిములూ చచ్చిపోతాయి. టైల్స్ క్లీన్ చేసేటప్పుడు నీటిలో సర్ఫ్ వేసి, ఆ నీటితో తుడుస్తారు కొందరు. పొరపాటున కాస్త సర్ఫ్ ఎక్కువైనా కూడా ఆ జిడ్డు పోదు. తర్వాత నడిచినప్పుడు కాళ్లు జారిపోతాయి. మార్కెట్లో తక్కువ ధరలో కూడా ఫ్లోర్ క్లీనర్స్ దొరకుతున్నాయి. వాటిని వాడండి. లేదంటే తడి బట్టతో టైల్స్ తుడిచేసి, మరకలున్నచోట బేకింగ్ పౌడర్ చల్లి, స్పాంజితో తుడిచేయండి. మరక మాయమౌతుంది. మౌత్‌వాష్ మన నోటిలో క్రిములనే కాదు, ఇంటిలో క్రిముల్ని కూడా చంపేయగలదు. వాష్ బేసిన్స్లోను, టైల్స్ క్లీన్ చేసే నీటిలోనూ కలిపి వాడుకోవచ్చు. టవళ్లు, దుప్పట్లు, రగ్గులు, కర్టెన్సు, కార్పెట్లు, డోర్ మ్యాట్స్ని క్లీన్ చేసేటప్పుడు నీటిలో కాస్త వెనిగర్‌ను కలిపితే మీ చేతికి పని తగ్గుతుంది. ఫ్లవర్ వాజుల్లో చేయి దూరక ఇబ్బందిగా ఉంటే... బియ్యం కడిగిన నీటిని వేడి చేసి, ఆ నీటితో కడగండి. ఎంత బాగా శుభ్రమవుతాయో చూడండి! గోడల మీద గీసిన గీతలు, పెయింటు మరకలు పోవాలంటే... హెయిర్ స్ప్రేని మరకమీద స్ప్రే చేసి నానిన తరువాత బట్టతో తుడిచేయండి. ఎంత శుభ్రం చేసినా ఒక్కోసారి ఇల్లు అదోలాంటి వాసన వస్తుంది. అలాంట ప్పుడు కొన్ని కాఫీ గింజల్ని తీసుకుని, ఇంట్లో అక్కడక్కడా ఒక్కోటి పెడితే... ఘుమఘుమలు వస్తాయి కాసేపటికి!