Washington D.C
-
ట్రంప్ కేబినెట్ నామినీలకు బాంబు బెదిరింపులు
వాషింగ్టన్: కాబోయే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన మంత్రివర్గ సభ్యులుగా నామినేట్ చేస్తున్న పలువురు నేతలు, ప్రముఖులకు బాంబు బెదిరింపులు వచ్చాయి. రక్షణ, గృహనిర్మాణం, వ్యవసాయం, కారి్మక శాఖల మంత్రులతోపాటు పలువురు విభాగాలకు అధిపతులుగా ట్రంప్ ఎంపిక చేసిన తొమ్మిది మందికీ ఈ బెదిరింపులు వచ్చాయి. ఐక్యరాజ్యసమితిలో అమెరికా రాయబారిగా ఎంపికైన రిపబ్లికన్ నాయకురాలు ఎలీస్ స్టెఫానిక్ సైతం బెదిరింపులను ఎదుర్కొన్న వారిలో ఉన్నారు. బాంబుతో పేల్చేస్తామని తమ ఇంటికి బెదిరింపు ఫోన్‌కాల్ వచ్చిందని ఎలీస్ చెప్పారు. థ్యాంక్స్ గివింగ్ కోసం వాషింగ్టన్ డీసీ నుంచి న్యూయార్క్‌కు భర్త, కుమారుడితో కలిసి కారులో వెళ్తుండగా ఆమెకు ఈ బెదిరింపు సందేశం అందింది. రక్షణ మంత్రిగా నామినేట్ అయిన పీట్ హెగ్సెత్కు సైతం బెదిరింపు సందేశం వచ్చింది. పర్యావరణ పరిరక్షణ ఏజెన్సీ అడ్మిని్రస్టేటర్‌గా ట్రంప్ నామినేట్ చేసిన లీ జెల్డిన్, వ్యవసాయ మంత్రిగా నామినేట్ అయిన బ్రూక్ రోలిన్స్కూ బుధవారం ఉదయం బెదిరింపు కాల్స్ వచ్చాయి. గృహనిర్మాణ శాఖ మంత్రిగా ఎంపికైన స్కాట్ టర్నర్, కారి్మక మంత్రిగా ఎంపికైన లోరీ చావెజ్ డెర్మర్కు బెదిరింపులు వచ్చాయి. ఇటీవల అమెరికా అటార్నీ జనరల్ పదవి నామినేషన్ నుంచి చివరి నిమిషంలో తప్పుకున్న ఫ్లోరిడా రిపబ్లికన్ నాయకుడు మాట్ గేట్జ్‌ను, వాణిజ్య మంత్రి నామినేట్ అయిన హోవార్డ్ లుట్నిక్‌ను ఆగంతకులు లక్ష్యంగా చేసుకున్నారు. గేట్జ్ స్థానంలో ఎంపికైన పామ్ బోండీతో పాటు శ్వేతసౌధం చీఫ్ ఆఫ్ స్టాఫ్ సూజీ వైల్స్, సీఐఏ డైరెక్టర్‌గా నామినేట్ అయిన జాన్ రాట్‌క్లిఫ్‌కు బెదిరింపులు వచ్చాయి. అధికార రిపబ్లికన్ పార్టీ నేతలతోపాటు విపక్ష డెమొక్రాట్లకూ బాంబు బెదిరింపు కాల్స్ రావడం గమనార్హం.ఈ ఘటనలను అధ్యక్షుడు బైడెన్‌కు వివరించినట్లు వైట్‌హౌస్ ఒక ప్రకటనలో తెలిపింది. ట్రంప్ బృందంతో ఫెడరల్ లా ఎన్ఫోర్స్మెంట్ సంప్రదింపులు జరుపుతోందని, అమెరికా పార్లమెంట్ భద్రతాబలగాలతో కలిసి పరిస్థితిపై సమీక్ష జరుపుతున్నామని శ్వేతసౌధం వెల్లడించింది. ఇది కూడా చదవండి: Pakistan: షియా-సున్నీల ఘర్షణ.. 10 మంది మృతి -
USA : ఘనంగా జరిగిన ఆర్ట్ ఆఫ్ లివింగ్ 4వ ప్రపంచ సాంస్కృతిక ఉత్సవాలు
వాషింగ్టన్ డి.సి. లోని నేషనల్ మాల్లో ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఆధ్వర్యంలో జరుగుతున్న 4వ ప్రపంచ సాంస్కృతిక ఉత్సవాలలో మొదటిరోజునే రికార్డు స్థాయిలో పది లక్షలమంది ప్రజలు ప్రత్యక్షంగా హాజరై తిలకించారని చెప్పడానికి మేము చాలా ఆనందిస్తున్నాము. ప్రపంచంలోని భిన్న సంస్కృతుల సమాహారంగా, మానత్వం, శాంతి సందేశాల ద్వారా మానవాళిని ఏకంచేసే ఉద్దేశ్యంతో రూపొందిన ఈ ఉత్సవంలో పాల్గొనేందుకు 180 దేశాలనుండి కళాకారులు ఇక్కడకు చేరుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఈ కార్యక్రమానికి హాజరైన ప్రముఖులలో ఐక్యరాజ్యసమితి 8వ సెక్రటరీ జనరల్ బాన్ కీ మూన్, వాషింగ్టన్ డి.సి. నగర మేయర్ మురియెల్ బౌసర్, భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్, పోంటిఫికల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ఛాన్సలర్ బిషప్ ఎమెరిటస్, మార్సెలో శాంచెజ్ సోరోండో మొదలైనవారు ఉన్నారు. మొదటిరోజు కార్యక్రమంలో భాగంగా గ్రామీ అవార్డు గ్రహీత చంద్రికా టాండన్, 200 మంది కళాకారుల బృందంచే అమెరికా ది బ్యూటిఫుల్, వందేమాతరం మనోహర సంగీత ప్రదర్శన, పంచభూతం పేరిట, 1000 మంది భారతీయ శాస్త్రీయ నృత్యకళాకారులచే శాస్త్రీయ నృత్య-వాద్య సంగమం, గ్రామీ అవార్డు విజేత మిక్కీ ఫ్రీ నేతృత్వంలో 1000 మంది కళాకారులచే ప్రపంచ గిటార్ వాద్యగోష్టి, ఇంకా ఆఫ్రికా, జపాన్, మధ్యప్రాచ్య దేశాల కళాకారుల ప్రదర్శనలు ఆకర్షణగా నిలిచాయి. -
చరిత్ర సృష్టించాలన్నా.. దాన్ని తిరగరాయాలన్నా మనమే: ఆటా
వాషింగ్టన్ డీసీ: అమెరికన్ తెలుగు అసోసియేషన్(ఆటా) అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీ నగరంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఆటా 17వ తెలుగు మహాసభల సంబరాలు అంబరాన్నంటాయి. వాషింగ్టన్ డీసీ నగరం తెలుగు వారితో పోటెత్తింది. ఇంత భారీ ఎత్తున అమెరికాలో మహా సభలు నిర్వహించటం తెలుగు కన్వెన్షన్స్ చరిత్రలో మొట్ట మొదటి సారి కావటం విశేషం. సద్గురు జగ్గీ వాసుదేవ్ పాల్గొన్న ఈ కార్యక్రమంలో 15వేల మందికి పైగా హాజరైనారు. జులై 1 వ తారీఖున నిర్వహించిన బాంక్వేట్ డిన్నర్ లో 3000 మందికి పైగా పాల్గొన్నారు. వివిధ రంగాలలో అత్యద్భుతమైన ప్రతిభ పాఠవాలు కనబరచిన వారికీ ఆటా అవార్డ్స్ ప్రదానం చేసారు. క్రికెట్ దిగ్గజాలు కపిల్ దేవ్, సునీల్ గవాస్కర్, క్రిస్ గేల్ తదితరులు ఈ బాంక్వేట్ డిన్నర్ లో పాల్గొన్నారు, వీరిని ఆటా ఘనంగా సత్కరించింది. 125 మందితో స్వాగతోత్సవ జానపద సంబరాలు "మన ఆటా జానపదాల కోట" నిర్వహించారు. 140 మందికి పైగా పాల్గొన్న “తెలుగు మన వెలుగు” కార్యక్రమంలో కూచిపూడి, గోండి, లంబాడి తదితర సంప్రదాయ నృత్య రూపకాలు ఆహుతులను విశేషంగా ఆకట్టుకున్నాయి. మన బడి బాలలు చేసిన శ్రీ కృష్ణ రాయభారం ఆహుతులను విశేషంగా ఆకట్టుకుంది. బతుకమ్మ పైన ఆటా ముద్రించిన పుస్తకాన్ని కల్వకుంట్ల కవిత ఆవిష్కరించారు. వద్దిపర్తి పద్మాకర్ అవధానం విశేషంగా ఆకట్టుకున్నది. శివమణి, థమన్ మ్యూజికల్ నైట్ శ్రోతలను ఉర్రుతలు గించింది. ఉపాసన కామినేని సద్గురుకి వినూత్నమైన ప్రశ్నలు శ్రోతల తరపున అడిగారు. సద్గురు మాట్లాడుతూ పర్యావరణ ముప్పుని నివారించటానికి సారవంతమైన భూమిని ఎలా కాపాడుకోవాలో, ఆహార భద్రతకు దీని ఆవశ్యకత, ఎంత ప్రాముఖ్యం సంతరించుకుందో సోదాహరణంగా “సేవ్ ది సాయిల్” ప్రోగ్రాం గురించి వివరించారు. ఈ సభలకు మగ్దూం సయ్యద్, రవి రాక్లే, సింగర్ సునీత వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు. మహిళలు, పిన్నలు పెద్దలు సాంప్రదాయ దుస్తులతో సందడి చేసారు. ఆటా మొదటి రోజు సాహిత్య కార్యక్రమాల ప్రారంభ సమావేశంలో కే. శ్రీనివాస్, అఫ్సర్, కసిరెడ్డి వెంకట రెడ్డి, ప్రభావతి, స్వామి వెంకటయోగి సమకాలీన సాహిత్యం గురించి మాట్లాడారు. ఆ తర్వాత, జొన్నవిత్తుల తన పారడీ పాటలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ‘మానకాలపు నవల, కథ’ పేరుతో నిర్వహించిన చర్చలో అమెరికాలో ఉన్న కథా, నవలా రచయితలు పాల్గొని సమకాలీన కథా సాహిత్యం గురించి లోతైన చర్చ చేశారు. రెండవ రోజు సాహిత్య కార్యక్రమాలలో సినిమాకి, సాహిత్యంలో ఉన్న సంబంధం గురించి వివరించడానికి ‘సినిమా కథ... సాహిత్య నేపధ్యం’ పేరుతో నిర్వహించిన చర్చలో దర్శకులు సందీప్ రెడ్డి వంగ, తనికెళ్ళ భరణి, ధర్మ దోనేపూడి, సుకుమార్, శివ సోమయాజుల పాల్గొన్నారు. చర్చలో భాగంగా ఆడియన్స్ అడిగిన ప్రశ్నలకు దర్శకులు సమాధానాలు ఇచ్చారు. ఆ తర్వాత, ‘ఆటా, పాటా, మనం’ పేరుతో నిర్వహించిన కార్యక్రమమంలో చంద్రబోసు, రామజోగయ్య శాస్త్రి వారి పాటల నేపధ్యాన్నీ వివరించారు. ఈ కార్యక్రమానికి ఆడియన్స్ నుండి విశేషమైన స్పందన లభించింది. జులై 3న ఉదయం తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీనివాస కళ్యాణంలో భక్తులు పాల్గొని స్వామి వారి ఆశీస్సులు, తీర్ధ ప్రసాదాలందుకున్నారు. ఆటా బ్యూటీ పేజంట్ విజేతలకు హీరోయిన రకుల్ ప్రీత్ సింగ్, నటుడు అడివి శేష్ బహుమతులందచేశారు. అమెరికాలో 12 నగరాల నుంచి ఔత్సాహికులు పాల్గొనటం విశేషం. ఝుమ్మంది నాదం పాటల పోటీలు, సయ్యంది పాదం నాట్య పోటీల విజేతలకు బహుమతులు అందచేశారు. బిజినెస్ కమిటీ నిర్వహించిన ఎంట్రప్రెనేయూర్షిప్ అండ్ లైఫ్ సైకిల్ కార్యక్రమంలో GMR సంస్థల అధినేత గ్రంధి మల్లికార్జున రావు పాల్గొన్నారు. ఉమెన్ ఎంపవర్మెంట్ సదస్సులో ఉపాసన కామినేని పాల్గొన్నారు. తెలుగు సంస్కృతి పై నిర్వహించిన సదస్సులో తనికెళ్ళ భరణి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ మహాసభలలో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, నిరంజన్ రెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి, మల్ల రెడ్డి, ఎమ్మెల్యేలు ఆళ్ళ వేంకటేశ్వర రెడ్డి , గువ్వల బాలరాజు, కాలే యాదయ్య, బొళ్ళం మల్లయ్య యాదవ్ , గాదారి కిశోర్, వైజాగ్ పార్లమెంట్ సభ్యులు MVV సత్యనారాయణ, రాజమండ్రి శషన సభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌధరి ఇతర నాయకులు భాను ప్రకాష్ రెడ్డి, పటేల్ రమేశ్ రెడ్డి, భవానీ మారికంటి, మన్నవ సుబ్బ రావు తదితర నాయకులు పాల్గొన్నారు. రామచంద్ర మిషన్ ధ్యాన గురువు కమలేష్ పటేల్( దాజి) ప్రత్యేక సందేశం అందించారు . ఈ మహాసభల నిర్వహణకు విరాలలాను అందచేసిన ధాతలను ఆటా కార్యవర్గం ఘనంగా సత్కరించింది. ప్రైమ్ హెల్త్ కేర్ సర్వీసెస్ అధినేత డాక్టర్ ప్రేమ్ సాగర్ రెడ్డి ఆటా జీవిత సాఫల్య పురస్కారాన్ని అందుకున్నారు. తెలుగు వారందరు అమెరికాలో ఎదగటానికి ఆకాశమే కొలమానమని మన జాడ్యాలను విడనాడి అవకాశాలను అందిపుచ్చుకొని ఎంతో అబివృద్దిలోకి రావాలి అని ఆయన ఆకాంక్షించారు. ఆటా అధ్యక్షుడు భువనేష్ బుజాల తెలుగు శాస్త్రీయ పద్దతిలో ఘనంగా సత్కరించారు. మాస్ట్రో ఇళయరాజా సంగీత విభావరి అంధరిని మైమరిపించింది. గురువందనతో సంగీత విభావరి ప్రారంభమై ఎన్నో అద్భుతమైన పాటలను మనో, కార్తీక్ లాంటి ప్రముఖ గాయనీగాయకులసంగీత ఝురిలో ప్రేక్షకులను ఉర్రూతలూగారు. =అమెరికాలో తెలుగు వారి చరిత్రలో నభూతో నభవిష్యతిగా ఈ మహాసభలు నిర్వహించడానికి తోడ్పాటునందించిన కాన్ఫరెన్స్ కన్వీనర్ సుధీర్ బండారు, కోఆర్డినేటర్ కిరణ్ పాశం తదితరులకు ఆటా ప్రెసిడెంట్ భువనేశ్ బుజాల ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఇంకా కోర్ కమిటీ, ఆడ్ హాక్ కమిటీ, కాట్స్ టీం & వాలంటీర్స్ ఇలా ప్రతి ఒక్కరికీ పేరు పేరునా ధన్యవాదాలు తెలియచేశారు. ఆటా ఫౌండింగ్ మెంబర్ హనుమంత్ రెడ్డి మాట్లాడుతూ ప్రెసిడెంట్ అండ్ టీం కార్యాదక్షత మూలంగానే ఇంత ఘనంగా ఈ మహాసభలు నిర్వహించగలిగామని కొనియాడారు. వెండర్ బూత్స్ ఒక మినీ షాపింగ్ మాల్ని పించాయి. ఆటా సంప్రదాయ దుస్తులలో రిజిస్ట్రేషన్ వాలంటీర్స్ ఎరుపు రంగు ధరించి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. మీడియా మిత్రులకు, ప్రకటనకర్తలు వాలంటీర్స్, సహకరించిన ప్రతి ఒక్కరికి అట కాన్ఫరెన్స్ కన్వీనర్ సుధీర్ బండారు, కోఆర్డినేటర్ కిరణ్ పాశం ప్రత్యేక ధన్యవాదాలు తెలియ చేసారు. ఆటా ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు సెక్రటరీ హరి ప్రసాద్ రెడ్డి లింగాల, కోశాధికారి సాయినాథ్ రెడ్డి బోయపల్లి, జాయింట్ సెక్రటరీ రామకృష్ణ రెడ్డి ఆలా, జాయింట్ కోశాధికారి విజయ్ కుందూరు కాన్ఫరెన్స్ విజయానికి ఎంతో తోడ్పాటుని అందించిన కోహోస్టు కాపిటల్ ఏరియా తెలుగు సొసైటీ సబ్యులకు ధన్యవాదాలు తెలియచేసారు. ఈవెంట్ రిజిస్ట్రేషన్ పనులను కో-కన్వీనర్ సాయి సూదిని, కో-కోఆర్డినేటర్ రవి చల్ల. లోకల్ కోఆర్డినేటర్ శ్రావణ్ పాదురు పర్యవేక్షించారు. -
ఆటా మహాసభలు: ఏపీ పెవిలియన్ ప్రారంభం
వాషింగ్టన్: అమెరికా తెలుగు అసోసియేషన్ (ఆటా)17వ మహాసభలు అంగరంగ వైభవంగా ప్రారంభమైనాయి. మూడురోజుల పాటు వాష్టింగ్టన్ డీసీలో జరుగు తున్న ఈ ఈవెంట్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రతినిధులు రత్నాకర్ పండుగాయల, హరి ప్రసాద్ లింగాల, మేడపాటి వెంకట్ ఏపీ పెవిలియన్ ను ప్రారంభించారు. 17వ ఆటా కన్వెన్షన్ అండ్ యూత్ కాన్ఫరెన్స్‌లో డా.వైఎస్సార్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్దసంఖ్యలో వైఎస్సార్ అభిమానులు, నేతలు హాజరైన ఆయనకు ఘనంగా నివాళులర్పించారు.ఆ మహానేత సేవలను, స్ఫూర్తిని ఏపీ ఆధికారిక భాషా సంఘం అధ్యక్షుడు ఆచార్య యార్లగడ్డ లక్మి ప్రసాద్ రావు గుర్తు చేశారు. పలువురు రాజకీయ నాయకులు, కళాకారులు ఆటా వేడుకల్లో సందడి చేస్తున్నారు. - వాష్టింగ్టన్ డీసీ నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి -
ఆటా 17వ మహాసభలకు ఎమ్మెల్సీ కవిత
సాక్షి, హైదరాబాద్: అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో జూలై 1 నుంచి 3 వరకు జరిగే అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ఆటా) 17వ మహాసభల్లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పాల్గొంటారు. మహాసభల్లో భాగంగా జరిగే యువజన సదస్సులో పాల్గొనాల్సిందిగా ఆటా ప్రతినిధులు ఆమెను ఆహ్వానించారు. జూలై 2న జరిగే ఆటా మహాసభల్లో కవిత చేతుల మీదుగా తెలంగాణ పెవిలియన్ ప్రారంభమవుతుంది. అదేరోజు సాయంత్రం జరిగే ప్రధాన సమావేశంలో కవిత అతిథిగా పాల్గొంటారు. ఇదే సమావేశం వేదికగా బతుకమ్మ పండుగపై ఆటా ప్రచురించిన ప్రత్యేక సంచికను ఆమె ఆవిష్కరిస్తారు. వేడుకల నిర్వహణకు 80 కమిటీలు ఏర్పాటు చేసినట్లు ఆటా ప్రతినిధులు వెల్లడించారు. -
ఆటా వేడుకలకు వేళాయే
అమెరికన్ తెలుగు అసొసియేషన్ కన్వెన్షన్ వేడుకలకు అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీలోని వాల్టర్ ఈ వాషింగ్టన్ కన్వెన్షన్ సెంటర్ ముస్తాబవుతోంది. మూడు రోజుల పాటు జరిగే ఈ వేడుకల్లో ఏ రోజుకారోజు ప్రత్యేక కార్యక్రమాలను రూపొందించారు. అమెరికన్ తెలుగు అసొసియేషన్ అధ్యక్షుడు భువనేష్ భుజాల సారథ్యంలో వేర్వేరు కమిటీలు వేడుకలకు సంబంధించి వేగంగా ఏర్పాట్లు చేస్తున్నారు. కార్యక్రమాల నుంచి కళా ప్రదర్శనల వరకు, అవార్డుల నుంచి హాస్పిటాలిటీ వరకు, స్వాగతాల నుంచి భోజనాల వరకు ఇలా.. చెప్పుకుంటూ పోతే దాదాపు 80 కమిటీలు, 300 మంది వాలంటీర్లు అలుపెరుగకుండా ఏర్పాట్లు చేయడంలో నిమగ్నమయ్యారు. వచ్చిన అతిథులను ఆకట్టుకునేలా మూడు రోజుల్లో వేటికవే వినూత్నమైన కార్యక్రమాలను రూపొందించారు. ఈ వేడుకలకు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి వందకు పైగా రాజకీయ, సినీ, వ్యాపార, అధికార ప్రముఖులు హాజరు అవుతున్నారు. గత మూడేళ్లుగా కరోనా పరిస్థితుల వల్ల అమెరికాలో పెద్ద తెలుగు ఈవెంట్ ఏదీ జరగలేదు. సుదీర్ఘ విరామం తర్వాత జరుగుతున్న ఈ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగేలా ఏర్పాట్లు చేశారు. ఈ వేడుకలకు హాజరయ్యేందుకు అమెరికా సంయుక్త రాష్ట్రాల నుంచి ప్రవాసాంధ్రులు ఇప్పటికే భారీగా రిజిస్ట్రేషన్లు చేసుకున్నారు. చారిత్రక వేదిక డిసి కన్వెన్షన్ సెంటర్ వేడుకలు నిర్వహించనున్న వాషింగ్టన్ కన్వెన్షన్ సెంటర్‌కు ఎన్నో ప్రత్యేకతలున్నాయి. అమెరికా అరు వేర్వేరు అధ్యక్ష ఎన్నికలకు సంబంధించి ప్రెసిడెంట్ అభ్యర్థి సమావేశాలకు ఇదే కన్వెన్షన్ సెంటర్‌ను ఎంచుకున్నారు... * 23 లక్షల స్క్వేర్ ఫీట్ ఏరియా * అల్ట్రా మోడర్న్ స్ట్రక్చర్ * 40 వేల మందితో సమావేశాలు నిర్వహించుకునే సదుపాయం * పూర్తి పర్యావరణ అనుకూలంగా ఉండే గ్లాస్ వాల్స్ * మూడు ఎయిర్‌పోర్ట్‌లకు సులువుగా చేరుకునే సదుపాయం * అత్యంత సులువుగా అన్ని రకాల రవాణా సౌకర్యాలు కరోనా విపత్కర పరిస్థితుల నుంచి ప్రపంచం కోలుకున్న తర్వాత నిర్వహిస్తున్న అతిపెద్ద తెలుగు పండుగ ఇది. ప్రవాసాంధ్రులందరిని ఒక్కతాటిపైకి తెచ్చి ఒక కుటుంబం అన్న భావన తీసుకురావడానికే మా ఈ ప్రయత్నం. ఘనమైన తెలుగు వారసత్వాన్ని అందించడం, పుట్టిన నేలకు తమ వంతు సాయం అందించడం, కొత్త తరానికి స్పూర్తిదాయక సందేశం ఇవ్వడమే ఆటా ముందున్న లక్ష్యాలు. వాషింగ్టన్ డీసీలో జులై 1,2,3 తేదీల్లో జరగనున్న వేడుకలకు తరలిరండి!మా ఆతిథ్యాన్ని స్వీకరించండి!! ఆటా కుటుంబంలో భాగం కండి!!! - భువనేష్ భుజాల, ఆటా అధ్యక్షుడు ఎంతో ఘనకీర్తి, ఎన్నో విజయాలు సాధించిన తెలుగు వారికి ఆటా ఒక కేంద్ర బిందువు అవుతుందని భావిస్తున్నాం. వాషింగ్టన్ డీసీ కేంద్రంగా నిర్వహిస్తున్న ఈ కన్వెన్షన్.. ప్రవాసాంధ్రులందరినీ ఒక్క తాటిపైకి చేర్చబోతుంది. ఎందరో ప్రముఖులు వస్తున్న ఈ కన్వెన్షన్ మునుపెన్నడూ లేనంత ఘనంగా నిర్వహించబోతున్నాం. కార్యక్రమాల్లో అత్యున్నత సాంకేతికత, వచ్చిన అతిథులకు అత్యుత్తమ హోటళ్లు, రాకపోకలకు ఆధునాతన రవాణా వసతులు, రుచికరమైన భోజనం, మరిచిపోలేని విధంగా కళా ప్రదర్శనలు ఏర్పాటు చేస్తున్నాం. హరిప్రసాద్ లింగాల, ఆటా సెక్రటరీ -వాషింగ్టన్ డీసీ నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి -
17వ ఆటా మహాసభలు: వారధిగా ‘ఆటా’
వాషింగ్టన్ డీసీ: వాషింగ్టన్ డీసీ వేదికగా అమెరికన్ తెలుగు అసొసియేషన్ నిర్వహించబోతున్న వేడుకలు రెండు రాష్ట్రాలకు, ప్రవాసాంధ్రులకు మధ్య వారధిగా నిలవబోతు న్నాయి. ఈ వేడుకలకు రెండు రాష్ట్రాల నుంచి 60 మంది మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వివిధ హోదాల్లో ఉన్న రాజకీయ ప్రముఖులు హాజరు కానున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయాలకు సంబంధించి ఆటా వేదికగా పొలిటికల్ డిబేట్లు జరగనున్నాయి. వీటితో పాటు వివిధ రంగాలకు సంబంధించి నిష్ణాతులైన వారితో డీసీ కన్వెన్షన్‌లోని వేర్వేరు వేదికలపై చర్చా కార్యక్రమాలు విడివిడిగా నిర్వహించనున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలకు ప్రత్యేక చిరునామా పుట్టి పెరిగిన మాతృభూమిపై మమకారం చూపించేలా రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ప్రత్యేక స్టాళ్లను ఏర్పాటు చేస్తున్నారు. ఏపీకి అయిదు స్టాళ్లు, తెలంగాణకు అయిదు స్టాళ్లు ఇందులో ఉంటాయి. రెండు ప్రభుత్వాలకు సంబంధించిన వివిధ కీలక అంశాలను ఈ స్టాళ్ల ద్వారా ప్రవాసాంధ్రులకు వివరించనున్నారు. ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చే విద్యార్థుల కోసం స్టూడెంట్ అవేర్నెస్ డెస్క్, అలాగే మెడికల్, టూరిజం, రియల్ ఎస్టేట్‌తో పాటు ఇతర రంగాల్లో పెట్టుబడులకు సంబంధించిన వివరాలందిస్తారు. ఈ స్టాళ్లలో ప్రభుత్వాలు చేపడుతున్న వివిధ సంక్షేమ పథకాలను ప్రదర్శిస్తారు. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వం చేపడుతున్న కొన్ని కార్యక్రమాల్లో ప్రవాసులు తమ వంతుగా భాగస్వామ్యం పంచుకుంటున్నారు. ‘నాడు-నేడు’, ‘మన బడి’ లాంటి కార్యక్రమాలకు విరాళాలను అందించడంలో ముందుంటున్నారు. ప్రవాసాంధ్రుల భాగస్వామ్యం మరింత పెంచేలా అధికారులు ఈ స్టాళ్లలో వివరాలందించ నున్నారు. ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధులు హరి లింగాల, రత్నాకర్ పండుగాయల తదితరులు వీటికి తోడ్పాటు అందిస్తున్నారు. ముఖ్య విభాగాలకు చెందిన ప్రభుత్వ అధికారులు ఈ స్టాళ్లలో అందుబాటులో ఉండి ప్రవాసాంధ్రుల విజ్ఞప్తులను పరిశీలిస్తారు. మొత్తమ్మీద ప్రభుత్వానికి, అలాగే ప్రవాసాంధ్రులకు ఆటా కన్వెన్షన్ వారధిగా నిలవనుంది. జోహార్ వైఎస్సార్ ఆటా వేడుకల్లో భాగంగా డీసీ కన్వెన్షన్‌లో శనివారం ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, దివంగత మహానేత వైఎస్ఆర్ జయంతి వేడుకలను నిర్వహించనున్నారు. ఈ వేడుకల కోసం అమెరికాలోని వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. జయంతి వేడుకల్లో పాల్గొనేందుకు వైఎస్సార్సీపీకి చెందిన పలువురు ప్రముఖులు ఇప్పటికే అమెరికా చేరుకున్నారు. మరి కొంత మంది మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు వచ్చే రెండు రోజుల్లో అమెరికా రానున్నారు. - వాషింగ్టన్ డీసీ నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి -
వాషింగ్టన్లో ఉద్రిక్తత: ట్రంప్‌కు షాక్..!
వాషింగ్టన్: క్యాపిటల్ భవనంపై డొనాల్డ్ ట్రంప్ మద్దతుదారుల దాడి నేపథ్యంలో ఆయనపై తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అధ్యక్ష ఎన్నికల ఫలితాన్ని తారుమారుచేసేలా ఆయన వ్యవహరిస్తున్న తీరును సొంతపార్టీ నేతలతో పాటు ప్రపంచ దేశాధినేతలు ఖండిస్తున్నారు. ప్రజాస్వామ్య పద్ధతిలో శాంతియుతంగా అధికార మార్పిడి జరిగేందుకు సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. కాగా అగ్రరాజ్య 46వ అధ్యక్షుడిగా డెమొక్రాట్ జో బైడెన్ గెలుపును ధ్రువీకరించే సమావేశాన్ని అడ్డుకునేందుకు ట్రంప్ మద్దతుదారులు క్యాపిటల్ భవనాన్ని ముట్టడించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో వాషింగ్టన్ డీసీలో తీవ్రస్థాయిలో ఉద్రిక్తతలు చెలరేగాయి. ఆందోళనలను అణచివేసే క్రమంలో జరిపిన కాల్పుల్లో నలుగురు వ్యక్తులు మృతి చెందారు. ఈ నేపథ్యంలో ట్రంప్ వ్యవహారశైలి కారణంగానే ఈ దుస్థితి వచ్చిందని, అధ్యక్ష పదవి నుంచి ఆయనను తొలగించేందుకు కేబినెట్ నిర్ణయించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అమెరికా రాజ్యాంగంలోని 25వ సవరణ ప్రకారం ట్రంప్‌ను పదవీచ్యుతుడిని చేసేందుకు ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ సహా మంత్రిమండలి సిద్ధమైనట్లు అమెరికా మీడియా పేర్కొంది. ఇందుకు సంబంధించి చర్చ జరుగుతోందని, విచక్షణ కోల్పోయి ఆందోళనకు కారణమైన ట్రంప్ ఏ క్షణంలోనైనా పదవి నుంచి దిగిపోవాల్సి వస్తుందని రిపబ్లికన్ నాయకులు అన్నట్లు సీఎన్ఎన్ కథనం వెలువరించింది. (చదవండి: ఇది నిరసన కాదు: జో బైడెన్) హింస ఎన్నటికీ గెలవదు 25వ రాజ్యాంగ సవరణ ప్రకారం.. అధ్యక్షుడు మరణించడం లేదా అభిశంసనకు గురికావడం లేదా రాజీనామా చేయడం, తన బాధ్యతలు సక్రమంగా నిర్వహించని పక్షంలో ఉపాధ్యక్షుడు ప్రెసిడెంట్‌గా వ్యవహరించే అవకాశం ఉంటుంది. ఇక అధ్యక్ష ఎన్నికల ఫలితాలను తారుమారు చేయాలన్న ట్రంప్ తీరును వ్యతిరేకిస్తున్న వైస్ ప్రెసిడెంట్ మైక్ పెన్స్.. ‘‘హింస ఎన్నటికీ గెలవదు’’ అంటూ బైడెన్ ఎన్నికను ధ్రువపరిచే సమావేశాన్ని కొనసాగించనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఒకవేళ కేబినెట్ నిజంగానే ట్రంప్‌ను గద్దెదించేందుకు నిర్ణయిస్తే పెన్స్ ఆయన స్థానంలో బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంటుంది. (చదవండి: అమెరికాలో హింస.. ట్రంప్ తీరుపై ఆగ్రహం) మరో 14 రోజులు అధికారంలో ఉంటే.. ఇదిలా ఉండగా.. ‘‘మరో 14 రోజుల పాటు ఆయన(ట్రంప్) పదవిలో ఉంటే.. ప్రతీ క్షణం అధికార దుర్వినియోగం చేసేందుకు ప్రయత్నిస్తారు. ప్రజలు, జాతీయ భద్రతా కారణాల దృష్ట్యా ఆయనను వెంటనే తొలగించండి’’ అంటూ డెమొక్రాట్లు డిమాండ్ చేస్తున్నారు. ఇక.. అన్నివైపుల నుంచి విమర్శలు వెల్లువెత్తుతుండటంతో ట్రంప్ రాజీనామా చేసే యోచనలో ఉన్నట్లు సమాచారం. కాగా జనవరి 20 బైడెన్ పదవీ స్వీకార ప్రమాణానికి అధికారులు ఇప్పటికే సర్వం సిద్ధం చేస్తున్నారు. -
పెట్టుబడులే లక్ష్యంగా ఎంపీ శ్రీధర్ అమెరికా టూర్!
వాషింగ్టన్ డీసీ: అమెరికాలోని పరిశ్రమలు, వ్యాపార వేత్తలతో ఏపీ ప్రభుత్వ సంబంధాలను బలోపేతం చేయడమే లక్ష్యంగా లోక్‌సభ ఎంపీ కోటగిరి శ్రీధర్, ఏపీ ప్రభుత్వ ఉత్తర అమెరికా ప్రత్యేక ప్రతినిధి పండుగాయల రత్నాకర్‌లు ఏయూఎస్ఐబి (ది ఎలైన్స్ ఫర్ యూఎస్ ఇండియా బిజినెస్) ప్రతినిధి బృందాన్ని కలిశారు. ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాల్సిందిగా వారిని ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఏయూఎస్ఐబి వ్యవస్థాపక అధ్యక్షుడు సంజయ్ పూరి మాట్లాడుతూ.. వ్యాపార లావాదేవీలకు సంబంధించి ఏపీలో గొప్ప అవకాశాలున్నాయన్నారు. అమెరికా వ్యాపారస్తులు, పెట్టుబడిదారులతో సరైన భాగస్వామ్యం ఏపీని ప్రపంచ పటంలో వ్యాపార రంగంలో ఉన్నత స్థాయిలో నిలబెడుతుందని పేర్కొన్నారు. ఇందుకోసం ఏయూఎస్ఐబి ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్, రాష్ట్ర వ్యాపార నేతలతో మరింత దగ్గరగా పనిచేసేందుకు సిద్ధంగా ఉందని తెలిపారు. ఎంపీ కోటగిరి శ్రీధర్ మాట్లాడుతూ.. మౌలిక సదుపాయాలు, సాంకేతిక రంగం, రక్షణ రంగం, స్మార్ట్ సిటీల అభివృద్ధికి రాష్ట్రంలో ఉన్న పెట్టుబడి అవకాశాలను ఉద్ఘాటించారు. విజయవాడ, కాకినాడ, తిరుపతి, విశాఖపట్నం నగరాలను స్మార్ట్ సిటీలుగా తీర్చిదిద్దాలని ఏపీ ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించిందని తెలిపారు. ఏపీ ప్రభుత్వ ఉత్తర అమెరికా ప్రత్యేక ప్రతినిధి పండుగాయల రత్నాకర్ మాట్లాడుతూ.. ప్రభుత్వ పెట్టుబడి ప్రాధాన్యతలైన వ్యవసాయం, మత్స్యకార, స్మార్ట్ సిటీస్, ఆరోగ్యభద్రత, పునరుత్పాదక ఇంధన రంగాల గురించి వాటిలో పెట్టుబడి అవకాశాల గురించి వివరించారు. ఏయూఎస్ఐబి సిఓఓ మనీష్ చౌహాన్ మాట్లాడుతూ.. ఉన్నత సాంకేతిక రక్షణ ఎగుమతులు, వాణిజ్య, మానవరహిత వాహనాలు, విద్యారంగాల్లో అవకాశాల గురించి ప్రస్తావించారు. వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా భారత్ ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తోందని ఏయూఎస్ఐబి సీనియర్ కన్సల్టెంట్ జెరేమీ స్పాల్డింగ్ అభిప్రాయపడ్డారు. ప్రాధాన్యత ఉన్న మార్కెట్‌గా భారత్ ఇప్పటికే ఆవిర్భవించిందని కొనియాడారు. ఈ సందర్భంగా ఏయూఎస్ఐబి పారిశ్రామిక సంబంధాల అవకాశాలను గుర్తించి ఏపీని పారిశ్రామికంగా అభివృద్ధి చేసేందుకు అవసరమయ్యే రోడ్ మ్యాప్‌కు ప్రణాళికలను రూపొందించింది. దేశంలోని ఇతర రాష్ట్రాలకు ఏపీని ఆదర్శంగా నిలిపేలా ఇరుపక్షాలు కార్యాచరణను ప్రారంభించనున్నాయి. -
వాషింగ్టన్లో వైఎస్సార్సీపీ శ్రేణుల ఆత్మీయ సమ్మేళనం
వాషింగ్టన్ డీసీ : వియన్నా, వర్జీనియా, అమెరికాలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు, పార్టీ శ్రేణులు, తెలుగు సంఘాల నాయకులు, అభిమానులు అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీలో మీట్ & గ్రీట్(ఆత్మీయ సమ్మేళనం) కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నారు. నవంబర్ 4(సోమవారం)న జరిగిన ఈ ఈవెంట్లో ఏలూరు వైఎస్సార్సీపీ ఎంపీ కోటగిరి శ్రీధర్‌తో పాటు.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి(ఉత్తర అమెరికా) రత్నాకర్ పండుగాయల హాజరయ్యారు. హోటల్ బాంబే తందూర్ రెస్టారెంట్లో నిర్వహించిన ఈ సభలో 200 మందికి పైగా పాల్గొన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డిని స్మరిస్తూ రమేష్ రెడ్డి వ్యాఖ్యాతగా అతిథులను సభకు పరిచయం చేశారు. అనంతరం అభిమానులు నాయకులు పుష్పగుచ్చాలతో, శాలువాలతో అతిథులను సత్కరించారు. అనంతరం రత్నాకర్ పండుగాయల ప్రసంగిస్తూ దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆశయాలను, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రవేశపెట్టిన పథకాలను కొనియాడుతూ, ప్రస్తుత ప్రభుత్వ తీరు తెన్నులను ప్రశంసించారు. 'రాష్ట్ర ప్రభుత్వం తరపున నార్త్ అమెరికాలో ప్రత్యేక ప్రతినిధిగా నాకు అప్పగించిన బాధ్యతలను చిత్తశుద్ధితో నిర్వహిస్తాను. ఏపీ అభివృద్ధి కోసం నా వంతు కృషి చేస్తాను. అందుకు మీ అందరి సహాయ సహకారాలు చాలా అవసరం' అని అన్నారు. తన మీద నమ్మకంతో ఈ బాధ్యతలు అప్పగించినందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఏలూరు వైఎస్సార్సీపీ ఎంపీ కోటగిరి శ్రీధర్ మాట్లాడుతూ.. పెద్దాయన ఏర్పరిచిన ఆశయాల దారిలో నడుస్తున్న నేటి తరం యువనేత సీఎం జగన్‌కు సంపూర్ణ సహకారం అందించాలని పిలుపునిచ్చారు. తరాలు మారినా రాజశేఖరుడి లాంటి గొప్ప రాజకీయవేత్త, పేదలపాలిటి పెన్నిధి మనకు కనిపించరని, కులమత ప్రాంతాలకు అతీతంగా ఆయన సామాన్యుడి మదిలో నిలిచిపోయారని ప్రస్తావించారు. అలాంటి మహనీయుని ఆశయాలకు వారసుడిగా ఆశయ సాధనలో ధీరుడిగా పాలన అందిస్తున్న వైఎస్ జగన్ తీరు గొప్పదని కొనియాడారు. ప్రజా సంక్షేమమే ఊపిరిగా ప్రజల మనస్సులో నిలిచిన నేత వైఎస్సార్ అని, దివంగత మహానేత అమలు చేసిన ప్రజా సంక్షేమ పథకాల రూపంలో ఆయన ఇప్పటికీ మనందరి గుండెల్లో నిలిచి ఉన్నారని చెప్పారు. రమేష్ రెడ్డి మాట్లాడుతూ.. మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని, తెలుగు ప్రజలు ఆయనను ఎప్పటికీ మరవరని పేర్కొన్నారు, రాజన్న సువర్ణ యుగం నాటి రాష్ట్రం, ప్రస్తుత పాలకుడు జాతీయ స్థాయిలో రాష్ట్ర ప్రతిష్టను పెంచి గౌరవంగా తల ఎత్తుకునే విధంగా చేయగల నాయకుడు జననేత వైఎస్ జగన్ ఒక్కరే అని వారు ధీమాగా పేర్కొన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గడచినా 5 నెలల్లో ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలు అత్యంత అద్భుతమని అన్నారు. సీఎం జగన్ నాయకత్వంలో తెలుగు ప్రజలంతా లబ్ధి పొందుతున్నారని తెలిపారు. పేదల సంక్షేమం కోసం అహర్నిశలూ కృషి చేసిన మహానేత డాక్టర్ వైఎస్సార్ అడుగుజాడల్లోనే నడుస్తున్నారని, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సమర్థవంతమైన నాయకుడిగా మంచి చేస్తారన్న ధీమా వ్యక్తం చేశారు. 2019 అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మెజారిటీ సీట్లు కైవసం చేసుకొని, వైఎస్ జగన్ ముఖ్యమంత్రి కావడం చాలా ఆనంద దాయకమని వారు సంతోషం వ్యక్తం చేశారు. అతి తక్కువ వ్యవధిలోనే ఈ సభకు హాజరై, సభను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. చివరగా బాంబే తందూర్ భోజనంతో రత్నాకర్ పండుగాయల, కోటగిరి శ్రీధర్ గారి మీట్ & గ్రీట్ (ఆత్మీయ సమ్మెళనం)కార్యక్రమం దిగ్విజయంగా ముగిసింది. -
అమెరికాలో ఘనంగా వైఎస్సార్ జయంతి వేడుకలు
వాషింగ్టన్ డీసీ : దివంగత ముఖ్యమంత్రి, మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి 70వ జయంతి వేడుకలు అమెరికాలో ఘనంగా నిర్వహించారు. వాషింగ్టన్ డీసీ మెట్రో వైఎస్సార్సీపీ ఎన్నారై కమిటీ రిజినల్ ఇంచార్జ్ శశాంక్ రెడ్డి, అడ్వైజర్, గవర్నింగ్ కౌన్సిల్ మెంబర్ రమేష్‌రెడ్డి ఆధ్వరంలో వర్జీనియాలోని హేర్నడోన్లోని తత్వా రెస్టారెంట్లో ఈ వేడుకలు జరిగాయి. అమెరికా పర్యటనలో ఉన్నకోడూరు ఎమ్మెల్యే కొరుముట్ల శ్రీనివాసులు ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రజానేత వైఎస్ సేవలను కొనియాడారు. తొలుత మహానేత వైఎస్సార్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా నాయకులు, అభిమానులు వైఎస్సార్ పేద ప్రజలకు చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. ఎమ్మెల్యే కొరుముట్ల శ్రీనివాసులు మాట్లాడుతూ.. వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో దేశానికే ఆదర్శవంతమైన పాలనను అందించారని కొనియాడారు. రైతు సంక్షేమం కోసం రుణమాఫీ, పావలా వడ్డీ, పశుక్రాంతి, జలయజ్ఞం, ఉచిత విద్యుత్ వంటి ఎన్నో మహత్తర కార్యక్రమాలు ప్రవేశపెట్టి తాను మరణించే వరకు రైతు సంక్షేమ పథకాలను కొనసాగించారని గుర్తు చేశారు. తండ్రి ఆదర్శాలను తనయుడు సీఎం జగన్మోహన్రెడ్డి మాత్రమే అధిగమించగలరని చెప్పారు. జరిగిన 40 రోజుల పాలనా దానికి ఉదాహరణ అన్నారు. స్థానిక సాఫ్ట్వేర్ మేనేజర్ లోరీ మాట్లాడుతూ... గతంలో వైఎస్సార్ ప్రవేశపెట్టిన అనేక పథకాలు చూసి ఆయన కుటుంబానికి ఆకర్షితురాలైనానని తెలిపారు. సీఎం వైఎస్ జగన్‌కు తన వంతు సాయం చేశానని, భవిష్కత్‌లో కూడా ఆయనకు అండగా ఉంటామన్నారు. మహానేత జయంతి రోజున ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతు దినోత్సవంగా నిర్వహిస్తున్నందుకు సీఎం జగన్‌కు ధన్యవాదాలు తెలిపారు. ఈ వేడుకకి ఇండియా నుంచి రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్, ఢిల్లీ తెలుగు అసోసియేషన్ ప్రెసిడెంట్ ఎల్వీఎల్ నాగరాజు, మిమిక్రి రమేష్, సాదక్ కుమార్, తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారిని ఎన్నారై విభాగం సత్కరించింది. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ అమెరికా రీజినల్ ఇన్ ఛార్జ్ శశాంక్ రెడ్డి, స్టూడెంట్ వింగ్ ప్రెసిడెంట్ సాత్విక్ రెడ్డి, సలహాదారు రమేష్ రెడ్డి వల్లూరు, సుజీత్ మారం, సంజీవ్ మహాజనం, అర్జున్ కామిశెట్టి, సునీల్ యాచవరం, రాజీవ్ పాలడుగు, మినాడ్ అన్నవరం, రామ్ రెడ్డి, సతీష్ నరాలతో పాటు పలువురు ఎన్నారైలుపాల్గొన్నారు. -
అమెరికాలో క్షణం తీరిక లేకుండా..
వాషింగ్టన్: సాధారణ ఉద్యోగులు ఆఫీసులకు వెళ్లి వచ్చినంత సులువుగా విదేశాలను చుట్టిరావడం ప్రధాని నరేంద్ర మోదీ వేగవంతమైన జీవితానికి సోదాహరణ. ప్రస్తుతం ఐదు దేశాల పర్యటనలో ఉన్న ఆయన సోమవారం సాయంత్రం అగ్రరాజ్య రాజధాని వాషింగ్టన్ కు చేరుకున్నారు. భారత ప్రధాని విమానం దిగీదిగగానే ఎయిర్ పోర్టు ప్రాంగణమంతా 'మోదీ.. మోదీ..' నినాదాలతో మారుమోగిపోయింది. మూడు రోజులపాటు అమెరికాలో ఉండనున్న మోదీ.. ఆ దేశ అధ్యక్షుడు బరాక్ ఒబామాతోపాటు వ్యాపార దిగ్గజాలు, పలువురు ప్రముఖులను కలవనున్నారు. అమెరికాలో అడుగుపెట్టినప్పటి నుంచి క్షణం తీరిక లేకుండా పలు కార్యక్రమాలకు హాజరైన మోదీ ముందుగా భారత సంతతి వ్యోమగామి, దివంగత కల్పనా చావ్లాకు నివాళులు అర్పించారు. ఎర్లింగ్టన్ జాతీయ స్మారక స్థలిలోని కల్పన సమాధి వద్ద పుష్పగుచ్ఛాలు ఉంచి అంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో చావ్లా కుటుంబసభ్యులతోపాటు మరో భారతీయ సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్ కూడా పాల్గొన్నారు. ఎర్లింగ్టన్ నుంచి నేరుగా బ్లేయర్ హౌస్ కు చేరుకున్న నరేంద్ర మోదీ.. అమెరికా విదేశీ వ్యవహారాల నిపుణులు(థింక్ ట్యాంకర్స్)తో భేటీ అయ్యారు. ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాల పురోగతి, భవిష్యత్ అవసరాలపై చర్చలు జరిపారు. ఆ తర్వాత అక్కడే ఏర్పాటుచేసిన భారత సాంస్కృతిక చిహ్నాల అప్పగింత కార్యక్రమంలో పాల్గొన్నారు. దశాబద్ధాల కిందట ఇండియాలో చోరీకి గురై అమెరికాకు చేరిన 200 దేవతా మూర్తులను యూఎస్ అటార్నీ జనరల్.. మోదీకి అప్పగించారు. ఇక మంగళవారం ఉదయం వైట్ హౌస్ లో అధ్యక్షుడు ఒబామాను కలుసుకోనున్న మోదీ అక్కడే లంచ్ చేస్తారు. శాఖాహారి అయిన భారత ప్రధాని కోసం వైట్ హౌస్ చెఫ్ లు ప్రత్యేక వంటకాలు సిద్ధం చేయనున్నారు. ఆ తరువాత అమెరికా ఉభయసభలను ఉద్దేశించి మోదీ ప్రసంగించనున్నారు. 1949తర్వాత అమెరికా ఉభయసభల్లో ప్రసంగించే ఆరో భారత ప్రధానిగా మోదీ నిలవనున్నారు. ఒబామాతో భేటీలో రక్షణ, వ్యాపార అంశాలతోపాటు వాతావరణ మార్పులపై చర్యలు తదితర అంశాలు చర్చిస్తారు. మూడు రోజుల పర్యటన ముగించుకుని అమెరికా నుంచి నేరుగా మెక్సికోకు వెళ్లనున్న ఆయన జూన్ 9న భారత్ కు తిరిగి వస్తారు.