అమెరికాలో ఘనంగా వైఎస్సార్‌ జయంతి వేడుకలు | YSR 70th Birth Anniversary Celebrations In washington | Sakshi
Sakshi News home page

అమెరికాలో ఘనంగా వైఎస్సార్‌ జయంతి వేడుకలు

Published Thu, Jul 11 2019 10:21 AM | Last Updated on Thu, Jul 11 2019 1:43 PM

YSR 70th Birth Anniversary Celebrations In washington - Sakshi

వాషింగ్టన్ డీసీ : దివంగత ముఖ్యమంత్రి, మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి 70వ జయంతి వేడుకలు అమెరికాలో ఘనంగా నిర్వహించారు. వాషింగ్టన్‌ డీసీ మెట్రో వైఎస్సార్‌సీపీ ఎన్నారై కమిటీ రిజినల్‌ ఇంచార్జ్‌ శశాంక్‌ రెడ్డి, అడ్వైజర్‌, గవర్నింగ్‌ కౌన్సిల్‌ మెంబర్‌ రమేష్‌రెడ్డి ఆధ్వరంలో వర్జీనియాలోని హేర్నడోన్‌లోని తత్వా రెస్టారెంట్‌లో ఈ వేడుకలు జరిగాయి. అమెరికా పర్యటనలో ఉన్నకోడూరు ఎమ్మెల్యే కొరుముట్ల శ్రీనివాసులు ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రజానేత వైఎస్ సేవలను కొనియాడారు. తొలుత మహానేత వైఎస్సార్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా నాయకులు, అభిమానులు వైఎస్సార్‌ పేద ప్రజలకు చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. ఎమ్మెల్యే కొరుముట్ల శ్రీనివాసులు మాట్లాడుతూ.. వైఎస్సార్‌ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో దేశానికే ఆదర్శవంతమైన పాలనను అందించారని కొనియాడారు. రైతు సంక్షేమం కోసం రుణమాఫీ, పావలా వడ్డీ, పశుక్రాంతి, జలయజ్ఞం, ఉచిత విద్యుత్‌ వంటి ఎన్నో మహత్తర కార్యక్రమాలు ప్రవేశపెట్టి తాను మరణించే వరకు రైతు సంక్షేమ పథకాలను కొనసాగించారని గుర్తు చేశారు. తండ్రి ఆదర్శాలను తనయుడు సీఎం జగన్‌మోహన్‌రెడ్డి మాత్రమే అధిగమించగలరని చెప్పారు. జరిగిన 40 రోజుల పాలనా దానికి ఉదాహరణ అన్నారు. 

స్థానిక సాఫ్ట్‌వేర్‌ మేనేజర్‌ లోరీ మాట్లాడుతూ... గతంలో వైఎస్సార్‌ ప్రవేశపెట్టిన అనేక పథకాలు చూసి ఆయన కుటుంబానికి ఆకర్షితురాలైనానని తెలిపారు. సీఎం వైఎస్‌ జగన్‌కు తన వంతు సాయం చేశానని, భవిష్కత్‌లో కూడా ఆయనకు అండగా ఉంటామన్నారు.  మహానేత జయంతి రోజున ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం రైతు దినోత్సవంగా నిర్వహిస్తున్నందుకు సీఎం జగన్‌కు ధన్యవాదాలు తెలిపారు. ఈ వేడుకకి ఇండియా నుంచి  రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్, ఢిల్లీ తెలుగు అసోసియేషన్ ప్రెసిడెంట్ ఎల్వీఎల్‌ నాగరాజు, మిమిక్రి రమేష్‌, సాదక్‌ కుమార్‌, తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారిని ఎన్నారై విభాగం సత్కరించింది.  ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌ సీపీ అమెరికా రీజినల్ ఇన్ ఛార్జ్  శశాంక్ రెడ్డి, స్టూడెంట్ వింగ్ ప్రెసిడెంట్ సాత్విక్ రెడ్డి, సలహాదారు రమేష్ రెడ్డి వల్లూరు, సుజీత్ మారం, సంజీవ్ మహాజనం, అర్జున్ కామిశెట్టి, సునీల్ యాచవరం, రాజీవ్ పాలడుగు, మినాడ్ అన్నవరం, రామ్ రెడ్డి, సతీష్ నరాలతో పాటు పలువురు ఎన్నారైలుపాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement