watching TV
-
ఫత్వా: టీవీ చూసినా, పాటలు విన్నా శిక్ష
కోల్‌కతా: ముర్షిదాబాద్ జిల్లాలోని మైనారిటీ ఆధిపత్య గ్రామానికి చెందిన అధిపతులు టెలివిజన్ చూడటం, క్యారమ్ ఆడటం, మద్యం లేదా లాటరీ టిక్కెట్లు కొనడం, అమ్మడం, సెల్ఫోన్లు, కంప్యూటర్ల ద్వారా సంగీతం వినడం వంటి ఇతర కార్యకలాపాలపై నిషేధం విధించారు. సామాజిక సంస్కరణల కమిటీ రూపొందించిన ఈ ఫత్వా ఆగస్టు 9న జారీ చేసినట్లు తెలుస్తోంది. ఈ నిబంధనలు అతిక్రమించిన వారికి చెవులు పట్టుకొని క్షమాపణలు చెప్పడం, గుండు చేయించడం, గుంజిళ్లు తీయించడం వంటి శిక్షలతో పాటు రూ .500 నుంచి రూ .7000 వరకు జరిమానాలు విధించనున్నట్లు ఆ ఫత్వాలో పేర్కొన్నారు. ఈ కమిటీ సూచించిన శిక్షల జాబితా: టీవీ చూడటం, సంగీతం వినడానికి మొబైల్ ఫోన్లు లేదా కంప్యూటర్ ఉపయోగించడం: రూ. 1,000 జరిమానా క్యారమ్ బోర్డు ఆడటం: రూ. 500 జరిమానా లాటరీ కొనుగోలు: రూ. 2,000 జరిమానా మద్యం అమ్మకం: రూ. 7,000తో పాటు గుండు చేసి గ్రామంలో ఊరేగిస్తారు. లాటరీ టికెట్లను అమ్మడం: రూ. 7,000 జరిమానా మద్యం సేవించడం: రూ. 2,000 జరిమానా, 10 గుంజిళ్లు గంజాయి కొనుగోలు: రూ. 7,000 జరిమానా అంతేకాకుండా నిబంధనలు ఉల్లంఘించిన వారి గురించి తెలియజేసేవారికి నేరం స్వభావాన్ని బట్టి 200 నుంచి 2,000 రూపాయల వరకు రివార్డును కూడా కమిటీ ప్రకటించింది. యువ తరం నైతిక, సాంస్కృతిక పద్దతులను తప్పి చెడు మార్గాలలో వెళ్లకుండా ఆపడానికి వీటిపై నిషేధం విధించినట్లు కమిటీ పేర్కొంది. చదవండి: కారంపొడి కొట్టి మరీ దొరికిపోయాడు -
టీవీని ఎక్కువగా చూస్తున్నారా?
గంటలకొద్దీ టీవీ ముందు అతుక్కుపోతున్నారా? అయితే మీరు ఆ అలవాటును ఎంత తగ్గించుకుంటే అంత మంచిది. అవును రోజు రెండు గంటలకు పైగా టీవీ చూస్తే త్వరగా మరణం సంభవిస్తుందని ఓ పరిశోధనలో వెల్లడైంది. గ్లాస్గో యూనివర్సిటీ జరిపిన పరిశోధనల్లో ఈ విషయం వెల్లడైనట్లు లాన్సెట్ పబ్లిక్ హెల్త్ జర్నల్ ప్రచురించింది. అతిగా టీవీ చూసే 40 నుంచి 69 ఏళ్ల వయసున్నవారి ఆరోగ్య పరిస్థితిని పరీక్షించింది. అలాగే ఏ వయసు వారు ఎక్కువగా నాలుగు గంటల కన్నా ఎక్కువగా టీవీ చూస్తున్నారో గుర్తించింది. 39 ఏళ్ల వయసు వాళ్లే ఎక్కువగా టీవీలకు అతుక్కుపోతున్నారని, వీరు సుమారు రోజుకు 4 గంటలకు పైగా టీవీ చూస్తున్నారని తమ పరిశోధనలో వెల్లడైనట్లు పేర్కొంది. ఆరోగ్యవంతులు కేవలం రోజుకు 2 గంటల కన్నా తక్కువగా టీవీ చూస్తున్నారని తెలిపింది. అలాగే 7 గంటల కన్నా తక్కువ నిద్రపోయేవారు.. 9 గంటల కన్నా ఎక్కువ నిద్ర పోయేవారిపై కూడా పరిశోధనలు జరిపింది. ఇలా 2గంటల 12 నిమిషాల కన్నా ఎక్కువగా టీవీ చూసేవారిలో తక్కువగా, ఎక్కువగా నిద్రపోయే వారి ప్రాణాలకు ముప్పున్నట్లు తమ పరిశోధనలో వెల్లడైనట్లు పేర్కొంది. అలాగే టీవీ చూస్తూ సిగరెట్ తాగడం, మధ్యం సేవించడం వంటి పనులు చేసే వారికి గుండె జబ్బులు ఎక్కవగా వచ్చే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. -
అదేపనిగా టీవీ చూస్తే..
లండన్ : రోజులో అత్యధిక సమయం టీవీ చూస్తూ గడిపే వారి అకాల మరణానికి గురవడం లేదా క్యాన్సర్, గుండె జబ్బుల బారిన పడే ముప్పు అధికమని తాజా అథ్యయనం హెచ్చరించింది. శారీరక కదలికలు లేకుండా అధిక సమయం టీవీ ముందు, కంప్యూటర్ స్క్రీన్ల ఎదుట గడిపే వారు అస్వస్థతకు లోనవడం, జీవన శైలి కారణంగా మృత్యువాతన పడే ముప్పుందని గ్లాస్గో యూనివర్సిటీ పరిశోధకులు వెల్లడించారు. స్క్రీన్ల ఎదుట గంటలకొద్దీ సమయం గడిపే వారు అకాల మరణానికి గురవుతారని, శారీరకంగా చురుకుగా ఉండేవారిలో ఈ ముప్పు తక్కువని తెలిపారు. జీవనశైలి సమస్యలతో బాధపడే వారికి అందించే చికిత్సలో తమ అథ్యయనంలో వెల్లడైన అంశాలు ఉపకరిస్తాయని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. 3,90,000 మంది ప్రజల జీవనశైలిని విశ్లేషించిన పరిశోధకులు వీరిలో అత్యధికంగా టీవీ, కంప్యూటర్ స్క్రీన్ల ఎదుట గడిపే వారు ఊబకాయం, డయాబెటిస్, హైబీపీలతో బాధపడుతున్నట్టు గుర్తించారు. వీరిలో పొగతాగడం, అధిక కొవ్వు, ప్రాసెస్డ్ మాంసం తినడం వంటి అలవాట్లు పేరుకుపోయాయని కనుగొన్నారు. శారీరక కదలికలు లేకపోవడంతో వీరిలో క్యాన్సర్, గుండెజబ్బుల ప్రమాదం పొంచిఉందని హెచ్చరించారు. శారీరకంగా ఫిట్‌గా ఉండి, చురుకుగా ఉన్న వారు అంతే సమయం టీవీ స్క్రీన్ల వద్ద గడిపినా ఎలాంటి దుష్ర్పభావాలు కనిపించలేదని అథ్యయనంలో గుర్తించారు. -
టీవీ చూస్తున్నారా..పిల్లలూ జర జాగ్రత్త..
వాషింగ్టన్: మీ పిల్లలు రోజులో ఎక్కువ సేపు టీవీ చూస్తున్నారా? అయితే వారి ఆరోగ్యంపై మరికాస్త శ్రద్ధ వహించండి. ఎందుకంటే ఎక్కువ సేపు టీవీ చూడడం లేదా కంప్యూటర్స్‌లో వీడియోగేమ్స్ ఆడే టీనేజ్ పిల్లల ఎముకల ఆరోగ్యం దెబ్బతింటుందని తాజా అధ్యయనం వెల్లడించింది. ఎక్కువ సేపు ఎలక్ట్రానిక్ తెరల ముందు కూర్చోవడం టీనేజ్ పిల్లల ఎముకల ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం చూపిస్తుందనే అంశంపై ఆర్కిటిక్ యూనివర్సిటీ పరిశోధకులు అధ్యయనం చేశారు. టీనేజ్‌లో ఉన్న పిల్లలు ఎంతసేపు టీవీ చూడడం లేదా కంప్యూటర్ ముందు కూర్చోవడం చేస్తున్నారు అనే విషయాన్ని పరిశోధకులు విశ్లేషించారు. ఇతర ఆరోగ్య అలవాట్లను కూడా పరిగణనలోకి తీసుకున్నారు. అనంతరం వెల్లడించిన అధ్యయన ఫలితాల ప్రకారం వారాంతాల్లో ఎక్కువ టీవీ చూసే వారి ఎముకల సాంద్రత తక్కువగా ఉంది. అయితే బాలల్లో మాత్రమే ఈ ఫలితం కనిపించింది. బాలికల్లోనూ మెడ ఎముక ప్రాంతంలో తక్కువ సాంద్రత కనిపించింది. అయితే బాలబాలికల్లో ఉండే హార్మోన్లు కూడా ఎముకల సాంద్రత విషయంలో కీలక పాత్ర పోషిస్తాయని పరిశోధకులు తెలిపారు.