water for agriculture
-
ప్రతి ఎకరా వరికి నీరివ్వాల్సిందే
దర్శి : నాగార్జున సాగర్ కుడి కాలువ కింద ప్రతి ఎకరాకు నీరు అందివ్వాల్సిందేనని, లేని పక్షంతో తమ పోరాటం ఉధృతం చేస్తామని మాజీ మంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒంగోలు పార్లమెంట్ అధ్యక్షుడు బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. శనివారం దర్శి నియోజకవర్గంలో సాగర్ నీరు అందక సాగుకు నోచుకోని పొలాలను బాలినేని స్థానిక నేతలతో కలిసి పరిశీలించారు. అనంతరం దర్శి పట్టణంలో గడియారం స్తంభం సెంటర్లో రైతులతో కలిసి ధర్నా చేపట్టారు. తొలుత రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూల మాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం నిర్వహించిన ధర్నా కార్యక్రమంలో బాలినేని శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వం వరికి నీరిస్తామని చెప్తేనే జిల్లాలో రైతులు నార్లు పోసుకున్నారన్నారు. ఒక్కో రైతు ఎకరాకు రూ.10 వేలు ఖర్చుపెట్టి నార్లు పోసుకుంటే ఇప్పుడు నీరివ్వలేమని చెప్పడం సిగ్గుచేటన్నారు. నాగార్జున సాగర్‌లో 579.80 అడుగుల మేర నీరున్నా అధికారులు వారబందీలు పెట్టి జిల్లాకు 10 రోజులకు ఒక సారి నీరిస్తామని చెప్పడం దారుణమన్నారు. ఇప్పటి వరకు వరినార్లు పోసుకున్న వారే నాట్లు వేసుకోవాలని, అది కూడా ఈనెల 27వ తేదీ నాటికే నాట్లు పూర్తి చేయాలని అధికారులు ఆంక్షలు పెట్టడం విడ్డూరంగా ఉందన్నారు. సాగర్ ఆయకట్టు రైతులకు నీరిచ్చే ఉద్దేశం ప్రభుత్వానికి లేదన్నారు. జిల్లా రైతాంగం అంటే చంద్రబాబుకు ఆది నుంచి వివక్షే అని బాలినేని విమర్శించారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 2004లో సాగర్‌లో 545 అడుగుల నీరు ఉన్నప్పుడే వరితో పాటు ఆరుతడి పంటలకు నీరిచ్చారని బాలినేని గుర్తు చేశారు. జిల్లాకు రావాల్సిన నీటి ఎక్కువ భాగం గుంటూరు జిల్లా రైతులు అక్రమంగా తరలించుకుపోతుంటే ఇక్కడ అధికారంలో ఉన్న మంత్రి, ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. జిల్లాకు రావాల్సిన నీటి వాటా తీసుకురావడం చేతకాక దద్దమ్మల్లా మంత్రి, ఎమ్మెల్యేలు ఇళ్లలో కూర్చున్నారని ఆయన విమర్శించారు. రైతుల పక్షాన పోరాడుతున్న ప్రతిపక్ష పార్టీని ధర్నాలు చేయడమేంటని అధికార పార్టీ నేతలు పేర్కొనడం దారుణమన్నారు. ఓట్లేసి గెలిపించిన రైతుల కోసం కాలువల పై తిరిగి వారి సమస్యలు తెలుసుకోవడం చేతకాని మీరా వైఎస్సార్ సీపీని విమర్శించేదని బాలినేని మంత్రిని నిలదీశారు. ఒక్క సారి పొలాలకు వెళ్లి పరిశీలిస్తే రైతుల బాధలు అర్థమవుతాయన్నారు. గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న హయాంలో తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు సాగునీటి కోసం చీమకుర్తిలో ధర్నా చేస్తుండగా అప్పటి మంత్రి దామచర్ల ఆంజనేయులు ముఖ్యమంత్రితో మాట్లాడి నీరిస్తామని హామీ ఇచ్చి తమ ధర్నాను విరమింపజేశారన్నారు. ఆ తరువాత ఆయనకు రెండు రోజుల వరకు ముఖ్యమంత్రి చంద్రబాబు అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదని బాలినేని ఎద్దేవా చేశారు. చంద్రబాబుకు రైతులపై చిత్తశుద్ధి లేదని విమర్శించారు. ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి అయిన శిద్దా రాఘవరావు నీరు తెప్పించడం చేతకాక ప్రతిపక్షంపై విమర్శలు చేయడం సబబుకాదన్నారు. నీరు తెప్పించడం చేతకాకపోతే మంత్రి పదవికి శిద్దా రాజీనామా చేయాలని బాలినేని డిమాండ్ చేశారు. మార్చి ఆఖరు వరకు నీరందించకపోతే మీ సంగతి తేలుస్తామని హెచ్చరించారు. ప్రతి ఎకరాను పరిశీలించి రైతులకు నీరందించే వరకు ప్రభుత్వాన్ని నిద్ర పోనివ్వమన్నారు. ఎక్కడ ఎకరా ఎండినా మళ్లీ ధర్నాలు చేసి స్తంభింపచేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో జిల్లా రైతు విభాగం అధ్యక్షుడు మారెడ్డి సుబ్బారెడ్డి, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఐవీ సుబ్బారెడ్డి, రాష్ట్ర ట్రేడ్ యూనియన్ జనరల్ సెక్రటరీ జీ నాగరాజు, స్టేట్ మహిళా ప్రధాన కార్యదర్శి సన్నపురెడ్డి రమణమ్మ, జిల్లా ట్రేడ్ యూనియన్ ప్రసిడెంట్ కేవీ ప్రసాద్, జిల్లా యూత్ ప్రసిడెంట్ గంటా రామానాయుడు, యూత్ జనరల్ సెక్రటరీ బీమిరెడ్డి నాగమల్లేశ్వర్‌రెడ్డి, దర్శి, దొనకొండ, ముండ్లమూరు, తాళ్లూరు మండల కన్వీనర్లు వెన్నపూస వెంకటరెడ్డి, కాకర్ల కృష్ణారెడ్డి, సూదిదేవర అంజయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శులు కుమ్మిత అంజిరెడ్డి, రొండా అంజిరెడ్డి, యడమకంటి వేణుగోపాల్‌రెడ్డి, తాళ్లూరు ఎంపీపీ, జెడ్పీటీసీలు గోళ్లపాటి మోషె, మారం వెంకారెడ్డి, మాజీ సాగర్ ప్రాజెక్ట్ వైస్ చైర్మన్ సద్ది పుల్లారెడ్డి, మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ కేవీరెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి గోను నారాయణరెడ్డి, రైతు విభాగం మండల అధ్యక్షుడు ఉడుముల వెంకటరెడ్డి, మాజీ సర్పంచ్‌లు పాణెం కృష్ణారెడ్డి, చంద్రగిరి గురవారెడ్డి నాయకులు పాల్గొన్నారు. -
సాగునీరు విడుదల చేయండి
సాక్షి, హైదరాబాద్ : శ్రీరాంసాగర్ మొదటి దశలోని మొత్తం 7.30 లక్షల ఎకరాల్లో ఉన్న పంటను కాపాడటానికి ఆన్–ఆఫ్ విధానంలో నీరు సరఫరా చేయాలని మంత్రి హరీశ్‌రావు అధికారులను ఆదేశించారు. సీఎం ఆదేశాలతో రాష్ట్రంలోని పలు జలాశయాలు, సాగునీటి లభ్యతపై శనివారం ఇంజనీర్లతో మంత్రి సమావేశమయ్యారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ఆయకట్టుకు ఇప్పటికే ఆన్–ఆఫ్ పద్ధతితో మూడు తడులకు నీరిచ్చామని చీఫ్ ఇంజనీర్ తెలిపారు. ప్రస్తుతం ఈ జలాశయంలో 65 టీఎంసీలు, లోయర్ మానేరులో 8 టీఎంసీల నీరు ఉందని తెలిపారు. లోయర్ మానేరు ఎగువన ఉన్న 5 లక్షల ఎకరాల పంటను కాపాడటానికి ఇంకా 18 టీఎంసీలు అవసరమవుతాయని, మిషన్ భగీరథ అవసరాలకు మినహాయించుకొని లోయర్ మానేరు దిగువన ఉన్న 2.30 లక్షల ఎకరాలకు ఖరీఫ్ పంటకు ఆన్–ఆఫ్ పద్ధతిలో నీరు ఇవ్వగలమని ఆయన చెప్పారు. చెరువులు నింపండి... శ్రీరాంసాగర్ రెండో దశ ఆయకట్టు పరిధిలో మొత్తం 244 చెరువులు ఉన్నాయని, వాటిని నింపడానికి తక్షణమే చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. ఈ ప్రాంతంలో వర్షాభావ పరిస్థితుల కారణంగా చెరువుల్లోకి నీరు రాలేదని, తీవ్ర కరువు పరిస్థితులు నెలకొన్నాయన్నారు. ఈ చెరువుల కింద ఆయకట్టును రక్షించుకోవడానికి, తాగునీటి కోసం లోయర్ మానేరు డ్యాం నుంచి తక్షణమే నీటిని విడుదల చేయాలని మంత్రి ఆదేశించారు. ఆయకట్టు చివరలో ఉన్న సూర్యాపేట, కోదాడ నియోజకవర్గాల్లో చెరువులను కూడా నింపడానికి చర్యలు తీసుకోవాలన్నారు. ఇంజనీర్లు కాలువల వెంట తిరుగుతూ నీటి నిర్వహణ చేయాలని సూచించారు. కాలువలకు గండ్లు పడితే పూడ్చటానికి జేసీబీ, టిప్పర్లను, ఇసుక బస్తాలను తయారుగా ఉంచుకోవాలని ఆదేశించారు. జిల్లా రెవెన్యూ యంత్రాంగం కూడా ఇంజనీర్లకు సహకరించాలని మంత్రి కోరారు. టెయిల్ టు హెడ్ విధానంలో నీటి నిర్వహణ చేయాలని సూచించారు. ఇది గత రబీ సీజన్లో మంచి ఫలితాలను ఇచ్చిందని, చిట్ట చివరి భూములకు కూడా నీరు అందించగాలిగామని గుర్తు చేశారు. పర్యావరణ ప్రభావ నివేదికలు పంపండి... అలాగే తీవ్ర కరువు పరిస్థితులు నెలకొన్న పాలకుర్తి, గుండాల మండలాల్లో ఉన్న చెరువులను నింపడానికి తక్షణమే చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించిన దరిమిలా దేవాదుల ప్రాజెక్టు ఇంజనీర్లతో ఈ అంశంపై మంత్రి సమీక్షించారు. పాలకుర్తి చెరువులను నింపిన అనంతరం నవాబ్‌పేట్ చెరువు ద్వారా యాదాద్రి జిల్లాలోని గుండాల మండలానికి నీరు సరఫరా చేయాలన్నారు. చిన్న కాళేశ్వరం ఎత్తిపోతల పథకం, మోడీకుంటవాగు, సీతారామ ప్రాజెక్టుల్లో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ద్వారా ప్రజాభిప్రాయ సేకరణ పూర్తి అయినందున త్వరితగతిన పర్యావరణ ప్రభావ నివేదికలను కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖకు పంపాలని సంబంధిత చీఫ్ ఇంజనీర్లను మంత్రి ఆదేశించారు. అలాగే సీతారామ ప్రాజెక్టుకు రెండో దశ అటవీ అనుమతి పొందడానికి కృషి చేయాలని మంత్రి ఖమ్మం చీఫ్ ఇంజనీర్‌ను ఆదేశించారు. ఈ సమావేశంలో ఇంజనీర్ ఇన్ చీఫ్ మురళీధర్, శ్రీరాంసాగర్ రెండో దశ చీఫ్ ఇంజనీర్ నాగేందర్రావు, వరద కాలువ, దేవాదుల ప్రాజెక్ట్ చీఫ్ ఇంజనీర్ అనిల్‌కుమార్, శ్రీరాంసాగర్ మొదటి దశ చీఫ్ ఇంజనీర్ శంకర్, సంబంధిత ప్రాజెక్టుల ఎస్ ఈ, ఈఈలు, ఓఎస్డీ శ్రీధర్‌రావు దేశ్ పాండే పాల్గొన్నారు. -
కట్టలు తెంచుకున్న రైతుల ఆగ్రహం
-
నీరిస్తారా.. నీరుగారుస్తారా..?
మక్కువ, న్యూస్‌లైన్: మక్కువ, సాలూరు మండలాల పరిధిలో కొండలపై ప్రవహించే సెలయేటి నీటిని మక్కువ, బొబ్బిలి, సీతానగరం మండలాల రైతుల పొలాలకు మళ్లించేందుకు వెంగళరాయసాగర్ ప్రాజెక్టు నిర్మించారు. 1977లో పనులు ప్రారంభించి 1984లో ఈ ప్రాజెక్టును పూర్తి చేశారు. వీఆర్ఎస్ ద్వారా మక్కువ, బొబ్బిలి, సీతానగరం మండలాలకు 24,700 ఎకరాలకు సాగునీరు అందించేందుకు లక్ష్యంగా పెట్టుకున్నారు. కానీ ప్రస్తుతం ఆ మేరకు సాగు నీరు అందడం లేదు. వీఆర్ఎస్ ప్రాజెక్ట్ పరిధిలోని కాలువలు, షట్టర్లు, హెడ్‌స్లూయిస్. గోముఖి లింక్‌చానల్ వద్ద రబ్బర్‌సీల్ మరమ్మతులకు గురవ్వడం, గోముఖీ ఆక్విడెక్ట్ పాడవ్వడంతో సాగునీరు పూర్తిస్థాయిలో అందడం లేదు. వీఆర్ఎస్కు జఫాన్ నిధులు వస్తాయి, వాటితో వీఆర్ఎస్ను ఆధునీకరిస్తామని రైతులకు చాలా ఏళ్ల నుంచి చెబుతున్నారు. కానీ నిధులు మాత్రం రావడం లేదు. కేవ లం సీడీఆర్ నిధులతో ఏటా కాలువల్లో పేరుకుపోయిన పూడికలను తొలగిస్తున్నారు తప్ప మిగిలిన పనుల ఊసే పట్టడం లేదు. దీంతో శివారు ప్రాంతాల రైతులకు కన్నీరే మిగులుతోంది. వీఆర్ఎస్ కుడి ప్రధాన కాలువా ద్వారా మక్కువ, బొబ్బిలి, సీతానగరం మండలాలకు చెందిన సుమారు11,500 ఎకరాలకు సాగునీరు అందించాల్సి ఉంది. అయితే బొబ్బిలి మండలం గోపాలరాయుడుపేట వరకు మాత్రమే నీరు వెళుతోంది. గోపాలరాయుడుపేట వద్ద నున్న ఆక్విడెక్ట్ మరమ్మతులకు గురవ్వడంతో బొబ్బిలి, సీతానగరం మండలాలకు చెందిన సుమారు ఆరువేల ఎకరాలకు సాగునీరు ప్రశ్నార్థకంగా మారుతోంది. ఆర్ఎంసీ పరిధిలో ఉన్న 16 షట్టర్లకుగాను 11 షట్టర్లు పాడయ్యాయి. దీంతో నీటిని అదుపు చేసేందుకు వీలు లేక కిందికి వదలాల్సి వస్తోంది. కేవలం సీడీఆర్ నిధులు 15లక్షలు మాత్రమే విడుదల కావడంతో ఆర్‌ఎంసీకి ఏర్పడ్డ గండ్లు, కాలువాల్లో పేరుకుపోయిన షిల్ట్‌ను తొలగించేందుకు వీలు కావడం లేదు. ఎల్బీసీ స్లూయిస్, గోముఖి లింక్‌చానల్ షట్టర్ వద్ద రబ్బర్‌సీల్ కూడా పాడయ్యాయి. హెడ్‌స్లూయిస్ మరమ్మతులు జరిపించే ందుకుగాను *9లక్షలు, గోముఖి లింక్ చానల్ రబ్బర్సీల్ను బాగు చేసేందుకు *4లక్షలు మంజూరయ్యాయి.అయితే పనులు మాత్రం కొంతవరకే జరిగాయి. ఇప్పటివరకు పనులు జరిపించకపోవడతో ఈ ఏడాది ఖరీఫ్‌కు సాగునీరు అందుతుందో లేదోనని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వీఆర్ఎస్ ప్రాజెక్ట్ పరిధిలోని ఆర్బీసీ ద్వారా సుమారు ఎనిమిది వేల ఎకరాలకు సాగునీరు అందించాల్సి ఉంది. శివారు గ్రామాల కాలువల్లో పూడికలు పేరుకుపోవడం తదితర కారణాల వల్ల మూడు వేల ఎకరాల పొలాలకు నీరు అందడం లేదు. సీడీఆర్ నిధులు *4లక్షలతో ప్రధాన కాలువల్లోని పూడికలను ఇటీవల తొలగించినప్పటికీ, పిల్ల కాలువల వైపు అధికారులు తొంగిచూడడం లేదు. గోముఖి ఆక్విడెక్టు పరిస్థితి కూడా ఇలాగే ఉంది. ఆండ్ర(మెంటాడ): మండలంలోని ఆండ్ర - లోతుగెడ్డ గ్రామాల మధ్య చంపావతి నదిపై నిర్మించిన ఆండ్ర రిజర్వాయర్ గత ఐదేళ్లుగా సరైన నిర్వహణకు నోచుకోవడం లేదు. ఇది రైతులకు శాపంగా మారింది. ఆండ్ర రిజర్వాయర్ ద్వారా సుమారు పదివేల ఎకరాలకు సాగునీరు అందిస్తున్నారు. నిర్వహణ లోపం కారణంగా పూర్తి స్థాయిలో ఆయకట్టుకు సాగునీరు అందడం లేదని రైతులు వాపోతున్నారు. పలు చోట్ల ప్రధాన కాలువల్లో పూడికలు తీయకపోవడం, శిథిలావస్థకు చేరుకున్న ప్రధాన కుడి, ఎడమ కాలువలతో పాటు పిల్ల కాలువలకు మరమ్మతులు చేపట్టకపోవడంతో సాగునీరు వృథాగా పోతుందని రైతులు ఆరోపిస్తున్నారు. ఆండ్ర రిజర్వాయర్ ద్వారా మెంటాడ, బొండపల్లి, గజపతినగరం మండలాల రైతులకు సాగునీరు అందుతుంది. గతంలో పని చేసిన ఇరిగేషన్ అధికారులు ఏటా కాలువల్లో పూడికలు తీయడం, శిథిలావస్థకు చేరుకున్న పిల్ల కాలువలకు మరమ్మతులు నిర్వహించేవారని పలువురు రైతులు చెబుతున్నారు. అయితే గత ఐదేళ్లుగా సంబంధిత ఇరిగేషన్ అధికారులు పట్టించుకోకపోవడంతో పంట పొలాలకు సాగునీరు అందని పరిస్థితి ఏర్పడిందని ఆయకట్టు రైతులు పలువురు ఆరోపిస్తున్నారు. కుడి, ఎడమ కాలువల్లో పిచ్చిమొక్కలు తొలగించి, కొన్ని చోట్ల శిథిలావస్థకు చేరుకున్న కాలువలను బాగు చేయాలని రైతులు కోరుతున్నారు. అదనంగా మరో 4600 ఎకరాలకు సాగునీరు అందించాలనే ఉద్దేశంతో ఎడమ కాలువకు అనుబంధంగా హైలెవెల్ కెనాల్, కుడి కాలువకు అనుబంధంగా 9 ఆర్ కాలువ పనులు చేపట్టారు. హై లెవెల్ కెనాల్ ద్వారా 4100 ఎకరాలకు, 9 ఆర్ కాలువ ద్వారా మరో 500 ఎకరాలకు సాగునీరు అందుతుంది. హైలెవెల్ కెనాల్ పూర్తయ్యిందని అధికారులు చెబుతున్నారు. కానీ ఒక ఎకరాకు కూడా సాగునీరు అందడం లేదని ఆయకట్టు రైతులు అంటున్నారు. 9 ఆర్ కాలువ పనులు మధ్యలో నిలిచిపోయాయి. నిర్వహణకు అవసరమైన నిధులు మంజూరు కాకపోవడంతో పూర్తి స్థాయిలో మరమ్మతులు చేపట్టలేకపోతున్నామని సంబంధిత ఇరిగేషన్ అధికారులు చెబుతున్నారు. బొబ్బిలి, న్యూస్‌లైన్: ఖరీఫ్ సీజను ముంచుకొస్తున్న తరుణంలో నియోజకవర్గంలో సాగునీటి వనరుల పరిస్థితి దయనీయంగా ఉంది. జలాశయాల్లో పుష్కలంగా నీరున్నా ఆయకట్టుకు అందని దుస్థితి నెలకొంది. తొలకరి కూడా పలకరించడంతో అన్నదాత పనులకు సిద్ధమయ్యాడు. కానీ సాగునీటి వనరుల పరిస్థితి చూస్తే మాత్రం నీరిచ్చే విధంగా కనిపించడం లేదు. బొబ్బిలి మండలం, పట్టణానికి సంబంధించి ప్రధాన వనరులు వెంగళరాయసాగర్, పారాది ఆనకట్టలు. సాగర్ జలాశయం నుంచి చివర ఆయకట్టు వరకూ ఈ ఏడాది సాగునీరు పుష్కలంగా అందుతుందా అనేది సందేహమే. జలాశయాన్ని ఆధునికీకరణ చేయడానికి జపాన్ నిధుల కోసం అధికారులు ప్రతిపాదనలు పెట్టడం మినహా నిధులు మాత్రం ఇప్పటివరకు రాలేదు. దీంతో పాటు రాష్ర్ట ప్రభుత్వం కూడా నిధులు ఇవ్వకపోవడంతో ఏటా గండ్లు పడడం, కాలువలు పటిష్టంగా లేకపోవడం, షట్టర్లు లేని మదుములు ఇలా అనేక సమస్యల వల్ల సాగునీరు పొలాల వరకు చేరలేకపోతోంది. ఈ ఏడాది అదనపు ఆయకట్టు అయిదు వేల ఎకరాలకు సాగునీరు కూడా అందుతుందా అనేది ప్రశ్నార్థకమైంది. ఇక పారాది ఆనకట్ట నుంచి అటు బాడంగి, ఇటు బొబ్బిలి మండలాలకు సాగునీరు ఇవ్వాలి. కానీ బాడంగికి నీరివ్వాల్సిన పాల్తేరు చానల్ పూర్తిగా మూతపడింది. దీన్ని తెరిపించడానికి ఎలాంటి చర్యలు అధికారులు చేపట్టడం లేదు. అలాగే రామభద్రపురం, బాడంగి మండలాలకు పెద్దగెడ్డ నీరు ఇస్తామని ప్రకటనలు చేసినా నేటి వరకూ అవి అందలేదు. ఇక బొబ్బిలి మండలంలోని చిత్ర కోట జలాశయం, కంచరగెడ్డలు జలాశయాలుగా రికార్డులకే పరిమితమయ్యాయి. వాటి వల్ల చుక్క నీరు కూడా ఆయకట్టుకు అందడం లేదు. రామభద్రపురం మండలంలోని ఏడొంపులగెడ్డ తదితర వన్నీ రైతులకు నీరివ్వకలేకపోతున్నాయి. నీటి పారుదలశాఖాధికారులు కూడా ఇప్పటివరకూ ఎలాంటి ముందస్తు చర్యలు చేపట్టకపోవడంతో అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బొబ్బిలి, తెర్లాం, బాడంగి మండలాల్లో పెద్ద పెద్ద చెరువులున్నా అవన్నీ ఆక్రమణలకు గురయ్యాయి. వాటి వల్ల నీరు పెద్దగా నిల్వ ఉండక సగమే వినియోగపడడం, గండ్లు పడి వృథా అయిపోవడం జరుగుతుంది. ఇకనైనా అధికారులు దృష్టి సారించాలని రైతులు కోరుతున్నారు.