గోదావరిలో ఇద్దరి గల్లంతు
మహదేవ్పూర్(కరీంనగర్ జిల్లా): మహదేవ్పూర్ మండలం సర్వాయిపేట సమీపంలోని గోదావరిలో ఇద్దరు వ్యక్తులు గల్లంతయ్యారు. గల్లంతైన వారు వాటర్ గ్రిడ్ ఇంజనీర్ శివకుమార్, రవిగా గుర్తించారు. సంఘటనాస్థలానికి చేరుకున్న అధికారులు గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.