water levels down
-
పనామా ట్రాఫిక్‌జామ్!
అంతర్జాతీయ వర్తకానికి అతి కీలకమైన పనామా కాలువ నానాటికీ చిక్కిపోతోంది. దాంతో భారీ సరుకు రవాణా నౌకల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. కొద్ది రోజులుగా ఎప్పుడు చూసినా వందలాది నౌకలు బారులు తీరిన దృశ్యాలు కనిపిస్తున్నాయి. దాంతో పనామాకు ప్రత్యామ్నాయంగా మరో కాలువ ఉండాలన్న వాదన మళ్లీ తెరమీదకొచి్చంది. పసిఫిక్, అట్లాంటిక్ మహా సముద్రాలను కలిపే కీలకమైన పనామా కాలువలో నీటి పరిమాణం కొన్నాళ్లుగా బాగా తగ్గుతోంది. దాంతో నీటి మట్టం గణనీయంగా తగ్గిపోయి భారీ నౌకల ప్రయాణానికి ప్రతిబంధకంగా మారింది. ఓ మోస్తరు నౌకలు ఆచితూచి, అతి నెమ్మదిగా కదలాల్సి వస్తోంది. దీంతో విపరీత జాప్యం జరుగుతోంది. ఫలితంగా భారీ నౌకలు కాలువను దాటి అటు అట్లాంటిక్, ఇటు పసిఫిక్ వైపు వెళ్లడానికి రోజుల తరబడి వేచి చూడాల్సి వస్తోంది. ప్రస్తుతం కనీసం 250కిపైగా భారీ నౌకలు తమవంతు ఎప్పుడొస్తుందా అని ఎదురుచూస్తున్నాయంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. కారణమేమిటి? పనామా కాలువకు ప్రధానంగా నీటిని సరఫరా చేసే రెండు రిజర్వాయర్లు కొద్ది్ద కాలంగా నీటి ఎద్దడితో అల్లాడుతున్నాయి. వాటి పరీవాహక ప్రాంతాల్లో నెలకొన్న తీవ్ర వర్షాభావమే అందుకు అసలు కారణం. మళ్లీ తెరపైకి ’ఆ కాలువ’ పనామా కాలువ పరిమితుల నేపథ్యంలో ప్రత్యామ్నాయ కాలువ ఉండాలన్న ప్రతిపాదన మళ్లీ తెర మీదికి వస్తోంది. ఇది కొత్తదేమీ కాదు. 1900 తొలి నాళ్లలో అమెరికా ముందు రెండు ప్రతిపాదనలు ఉండేవి. ఒకటి పనామా కాగా మరోటి నికరాగ్వా గుండా కాలువ నిర్మాణం. పనామాకే అమెరికా సెనేట్ ఓటు వేయడంతో నికరాగ్వా గుండా నిర్మాణం అనేది ప్రతిపాదనలకే పరిమితమైంది. ఆ మార్గంలో చురుకైన అగ్ని పర్వతాలు ఉండటం సైతం ఆ ప్రాజెక్టు ఆదిలోనే ఆగడానికి ప్రధాన కారణం. అదీకాక నికరాగ్వా మార్గంతో పోలిస్తే తక్కువ దూరం ఉండటమూ పనామాకు కలిసొచి్చన అంశాల్లో ఒకటి. దీంతో ఆనాడు కనుమరుగైన ఆ ప్రతిపాదన తాజాగా ఇప్పుడు కొత్త రెక్కలు కట్టుకుని ముందుకు వాలింది. ► ఎలాగైనా దాని నిర్మాణం పూర్తి చేస్తానని చైనాకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త ఒకరు ముందుకొచ్చారు. ► 2013 ఏడాదిలో హెచ్కేఎన్డీ అనే చైనా కంపెనీ నికరాగ్వా కాలువ నిర్మాణానికి సిద్ధపడింది కూడా. నికరాగ్వా దేశ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. 50 ఏళ్ల పాటు దాని నిర్వహణ అధికారాలు సంపాదించింది. కానీ ఇదీ కాగితాలకే పరిమితం అయింది. అంత ఈజీ కాదు... నికరాగ్వా గుండా కాలువ నిర్మాణానికి ఎన్నో అడ్డంకులు ఉన్నాయి. ఎందుకంటే... ► పశి్చమాన పసిఫిక్, తూర్పున అట్లాంటిక్‌ను కలుపుతూ రెండు కాలువలు తవ్వాలి. ఈ కాలువల మధ్యలోనే నికరాగ్వా సరస్సు ఉంటుంది. ► అట్లాంటిక్ వైపు 25 కిలోమీటర్లు, పసిఫిక్ వైపు 100 కిలోమీటర్ల పొడవునా ఈ కాలువలను తవ్వాల్సి ఉంటుంది. ► దీని నిర్మాణానికి కనీసం 40 బిలియన్ డాలర్లు ఖర్చు అవుతుందని అంచనా. ► ఇంత భారీ వ్యయంతో కాలువ నిర్మాణం చేపట్టాలంటే దాని ద్వారా అంతకు మించి ఆదాయం ఉంటుందన్న భరోసా కావాలి. ► ఇంత భారీ కాలువ నిర్మాణమంటే పర్యావరణపరంగా ఎంతో పెద్ద సవాలే. ► నిర్మాణం కారణంగా సతతహరిత అరణ్యాలు తుడిచి పెట్టుకుపోతాయని పర్యావరణవేత్తలు ఆందోళనలు చేశారు. ఇదీ పనామా కథ ► మధ్య అమెరికాలో ఉన్న బుల్లి దేశం పనామా. ► అక్కడ నిర్మించిన కృత్రిమ కాలువే పనామా కాలువ. ► ఇది ఉత్తర, దక్షిణ అమెరికా ఖండాలను కలుపుతుంది. ► దీని పొడవు 80 కిలోమీటర్లు. ► పనామా కాలువ మధ్యలో గతూన్ అనే కృత్రిమ సరస్సు ఉంటుంది. అలజేలా అనే మరో కృత్రిమ సరస్సు ఈ కాలువకు రిజర్వాయర్‌గా ఉంది. ► ఇటు పసిఫిక్ మహా సముద్రం, అటు అట్లాంటిక్ మహా సముద్రం వైపు కరేబియన్ సముద్రాన్ని విడదీసే ఇస్తుమస్ ఆఫ్ పనామను ఆనుకుని పనామా కాలువ ఉంటుంది. ► పనామా కాలువ గుండా ఏటా 270 బిలియన్ డాలర్ల విలువైన సరుకు రవాణా జరుగుతోంది. ► పనామా గుండా 170 దేశాలకు సరుకులు వెళ్తాయి. ఏం జరగనుంది? ► సరుకు నౌకలు దీర్ఘ కాలం పాటు ఇలా వేచి ఉండటం కారణంగా రవాణా వ్యయం విపరీతంగా పెరుగుతుంది. ► దాంతో ధ్రవీకృత సహజ వాయువు తదితర ఇంధనాల ధరలకు అమాంతం రెక్కలొస్తాయి. ► ఇది అంతిమంగా చాలా దేశాల్లో, అంటే అంతర్జాతీయంగా ధరల పెరుగుదలకు దారి తీస్తుంది. ► చివరకు ద్రవ్యోల్బణం పెరిగి పలు దేశాల ఆర్థిక వ్యవస్థలు అల్లాడే పరిస్థితి రావచ్చు. ‘పనామాలో ఇప్పుడున్నది కనీవినీ ఎరగని అసాధారణ పరిస్థితి. చాలా ఆందోళనకరం కూడా’ – మిషెల్ వైస్ బోక్మ్యాన్, లాయిడ్స్ లిస్ట్ ఇంటెలిజెన్స్‌లో సీనియర్ విశ్లేషకుడు – సాక్షి, నేషనల్ డెస్క్ పనామా కాలువ ప్రవేశ మలుపు వద్ద తమ వంతు కోసం వేచి చూస్తున్న వందలాది ఓడలు -
ఖాళీ అవుతున్న కడెం!
నిర్మల్: ఆరున్నర లక్షల క్యూసెక్కులతో ఏకంగా ప్రాజెక్టు పైనుంచి వరద ఉప్పొంగింది. నిండా నీటితో రిజర్వాయర్ సముద్రాన్ని తలపించింది. ఇదంతా మొన్నటి పరిస్థితి. ఇప్పుడది ఓ చెరువులా మారుతోంది. వరదకు దెబ్బతిన్న గేట్లు కిందకు దిగకపోవడంతో.. వరద జలాలతో కళకళలాడా ల్సిన నిర్మల్ జిల్లాలోని కడెం నారాయణరెడ్డి ప్రాజెక్టు ఖాళీ అవుతోంది. ప్రాజెక్టుకు ఉన్న 18 గేట్లలో వరద రాకముందు నుంచే 12వ గేటు మొరాయించింది. భారీ వరద నేపథ్యంలో దానిని అలాగే వదిలేసి మిగతా 17 గేట్లు ఎత్తారు. 13న అర్ధరాత్రి వచ్చిన 6.5 లక్షల క్యూసెక్కుల వరద ప్రాజెక్టు పైనుంచి పారింది. దీంతో చెట్లు, కొమ్మలు, చెత్త మొత్తం ప్రాజెక్టు పైభాగంలో గేట్లను ఎత్తే యంత్రాలు ఉండే రూమ్‌లలో, గేట్లను ఎత్తే రోలర్లలో, పైభాగంలో పూర్తిగా నిండిపోయింది. గేట్లన్నీ వాటిల్లో కూరుకుపోయాయి. మరోవైపు ఎలక్ట్రికల్ వ్యవస్థ దెబ్బతినడంతో శుక్రవారం ప్రాజెక్టు సిబ్బంది ఎంత ప్రయత్నించినా లాభం లేకుండా పోయింది. ఒక్క గేటును కష్టంగా కొంత కిందకు దింపినా మిగతావి కదల్లేదు. దీంతో ప్రాజెక్టు ఖాళీ అవుతోంది. గేట్లన్నీ ఎత్తే ఉండటంతో ఉన్న నీళ్లన్నీ దిగువకు వెళ్లిపోతున్నాయి. పైగా ఎగువ నుంచి ఇన్‌ఫ్లో కూడా చాలావరకు తగ్గిపో యింది. కేవలం 16,890 క్యూసెక్కులు వస్తుండగా, 17,307 క్యూసెక్కుల అవుట్‌ఫ్లో కొనసాగుతోంది. ప్రస్తుతం నీటినిల్వ 3.5 టీఎంసీలకు పడిపోయింది. ఎగువ నుంచి వరద రాకుండా, అవుట్‌ఫ్లో ఇలాగే ఉంటే ప్రాజెక్టు కనీస మట్టానికి పడిపోనుంది. కాగా గేట్ల మరమ్మతుకు శనివారం సాంకేతిక సిబ్బంది రానున్నట్లు అధికారులు తెలిపారు. -
బోర్లు వేయడానికి నో..
సాక్షి, జనగామ: అసలే కరువు నేల..వేసవి రానే వచ్చింది. భూగర్భ జలాలు క్రమక్రమంగా అడుగంటిపోతున్నాయి. నీటి వినియోగం..ఉష్ణోగ్రతలు పెరగడంతో భూగర్భ జలాలు ప్రమాద ఘంటికను మోగిస్తున్నాయి. జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే 76 గ్రామాల్లో భూగర్భ జలాలు పడిపోయాయి. బోర్లు వేయడానికి నో.. తక్కువ వర్షపాతానికి జిల్లా కేరాఫ్‌గా మారింది. సముద్ర మట్టానికి 510 మీటర్ల ఎత్తులో ఉంది. గోదావరి, కృష్ణా నదులకు మధ్యలో ఉండడంతో సహజంగానే తక్కువగా వర్షాలు కురుస్తున్నాయి. కురిసే వర్షం కంటే నీటి వినియోగం మాత్రం ఎక్కువగా ఉంటుంది. సాగు, తాగు నీటి అవసరాల కారణంగా భూగర్భ జలాలు అడుగంటి పోతున్నాయి. నీటి వినియోగం ఎక్కువగా ఉన్న 76 గ్రామాలను భూగర్భ జలశాఖ(గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్) అధికారులు గుర్తించారు. ఆయా గ్రామాల్లో బోర్లు వేయడం, నీటిని బయటకు తోడడం వంటి కార్యక్రమాలపై నిషేధం విధించారు. సాగు నీటి అవసరాలను తగ్గించుకొని కేవలం ఇంటి పనులను తీర్చుకోవడానికే నీటిని వినియోగించాలని సూచనలు చేస్తున్నారు. నీటిని పొదుపుగా వాడుకోవడంపై చర్యలు చేపట్టారు. పడిపోతున్న భూగర్భ జలాలు.. వేసవి ఉష్ణోగ్రతలు పెరుగుతుండడంతో భూగర్భ జలాలు పడిపోతున్నాయి. దేవాదుల ద్వారా నీటిని తరలించి చెరువులను నింపడంతో జిల్లాలో సగటున 8 మీటర్ల నుంచి 10 మీటర్ల వరకు భూగర్భ జలాలున్నాయి. ప్రస్తుతానికి 14 మీటర్ల లోతుకు జిల్లా భూగర్భ జలాలు పడిపోయాయి. 76 గ్రామాల్లో 20 మీటర్ల లోతుకు భూగర్భ జలాలు పడిపోయాయి. బోర్లు వేయడం నిషేధం ఉన్న గ్రామాలు ఇవే.. బచ్చన్నపేట మండలం: అలీంపూర్, బండ నాగారం, చిన్న రామన్‌చర్ల, దుబ్బకుంటపల్లి, ఇటుకాలపల్లి, కాసిరెడ్డిపల్లి, కొడవటూరు, లక్ష్మాపూర్, మన్సాన్పల్లి, నారాయణపూర్, పడమటి కేశవాపూర్, పుల్లగూడ(డీ), రామచంద్రాపూర్, తమ్మడపల్లి దేవరుప్పుల మండలం: చిన్నమడూర్, ధర్మపురం, గొల్లపల్లి, మదాపూర్, మన్‌పహాడ్, సింగరాజుపల్లి జనగామ మండలం: అడవి కేశవాపూర్, చీటకోడూరు, చౌడారం, చౌడరపల్లి, గానుగుపహాడ్, గోపరాజుపల్లి, జనగామ పట్టణం, మరిగడి, ఓబుల్‌కేశవాపూర్, పసరమడ్ల, పెద్ద పహాడ్, పెద్ద రామన్‌చర్ల, పెంబర్తి, శామీర్‌పేట, సిద్దెంకి, వడ్లకొండ, గొర్రగొల్లపహాడ్ కొడకండ్ల మండలం: కొడకండ్ల, మొండ్రాయి. రేగుల లింగాలఘనపురం మండలం: చీటూరు, చిన్నరాజిపేట, గుమ్మడవెల్లి, కళ్లెం, నాగారం, నేలపోగుల, నెల్లుట్ల, వడిచర్ల, వనపర్తి నర్మెట మండలం: అమ్మాపురం, బొమ్మకూర్, హన్మంతాపూర్, మల్కాపేట్ పాలకుర్తి మండలం: కోతులబాధ, లక్ష్మీనారాయణపురం, మల్లంపల్లి, ఎల్లరాయి తొర్రూర్ రఘునాథపల్లి మండలం: బానాజీపేట, ఫతేషాపూర్, గోవర్ధనగిరి, కన్నాయిపల్లి, కోడూర్, మాదారం, రఘునాథపల్లి, వెల్ది స్టేషన్‌ఘన్‌పూర్ మండలం: ఇప్పగూడెం, శివునిపల్లి తరిగొప్పుల మండలం: అక్కరాజుపల్లి, అంకూషాపూర్, బొంతగట్టునాగారం జఫర్‌గఢ్ మండలం: అలియాబాద్, సూరారం, తీగారం, తిమ్మంపేట, తిమ్మాపూర్ -
నైరుతి నైరాశ్యం
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలోకి నైరుతి రుతుపవనాల రాక ఆలస్యం అంతులేని సమస్యలు తెచ్చిపెడుతోంది. వర్షాకాల సీజన్ మొదలై 15 రోజులు కావస్తున్నా నైరుతి స్తంభించడంతో సాధారణంకన్నా అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతూ ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. రుతుపవనాల రాక ఆలస్యంతో వర్షాలు కురవక కోటి ఎకరాల్లో ఖరీఫ్ సాగుపై రైతులు దిగాలు చెందుతున్నారు. భారీ రిజర్వాయర్లలో నిల్వలు ఖాళీ కావడం, భూగర్భ జలాల్లోనూ మునుపెన్నడూ లేని రీతిలో భారీ తగ్గుదల కనిపిస్తుండటం ఆందోళన రేపుతోంది. ఇప్పటికే పట్టణ ప్రాంతాల్లో తాగునీటి ఇక్కట్లు మొదలవగా అవి మరింత ముదిరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో ఈ నెల 20 నుంచి రాష్ట్రంలోకి నైరుతి ప్రవేశం ఉంటుందన్న సంకేతాలు కొంత ఉపశమనం కల్గిస్తున్నాయి. 46 శాతం లోటు వర్షపాతం... రాష్ట్రంలో మామూలుగా జూన్‌లో 136 మిల్లీమీటర్ల వర్షపాతం పడాల్సి ఉంది. కానీ రుతుపవనాల ఆలస్యంతో సాధారణంకన్నా 46 శాతం తక్కువ వర్షపాతం నమోదైంది. ఈ నెలలో సాధారణం కంటే 60–70% తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఉంటాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. నిజానికి ఈ నెల 8నే నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకినా అరేబియా సముద్రంలో ఏర్పడిన వాయు తుపాను ప్రభావంతో అవి స్తంభించాయి. దీంతో రాష్ట్రంలో సాధారణంకంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఆదిలాబాద్, కొము రం భీం, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, మంచిర్యాల, కామారెడ్డి, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, కరీంనగర్, జయశంకర్ భూపాలపల్లి, భద్రాద్రి, ఖమ్మం, మహబూబ్‌నగర్, వరంగల్ జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 40 నుంచి 43 డిగ్రీల మధ్య నమోదవుతున్నాయి. అయితే గత రెండ్రోజులుగా నైరుతి రుతుపవనాలు నెమ్మదిగా రాష్ట్రంవైపు కదులుతున్నాయి. అవి ఈ నెల 20న రాష్ట్రాన్ని తాకే అవకాశం ఉందని వాతావరణ అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో జూలై నుంచి సాధారణంకంటే 60–70శాతం అధిక వర్షపాతం నమోదవుతుందని స్పష్టం చేస్తున్నారు. ఎస్సారెస్పీ పరిస్థితి ఇలా.. చుక్కలేని కొత్త నీరు... రాష్ట్రంలో ప్రధాన రిజర్వాయర్లన్నీ నోరెళ్లబెట్టాయి. ఏ రిజర్వాయర్‌లోనూ చెప్పుకోదగ్గ రీతిలో నీటి నిల్వలు లేవు. ఒక్క ఎల్లంపల్లిలో మాత్రం ఒకట్రెండు నెలల తాగునీటి అవసరాలకు సరిపడే నిల్వలు ఉండగా మిగతావన్నీ ఎండిపోయి కనిపిస్తున్నాయి. గోదావరి బేసిన్ ప్రాజెక్టుల్లో దారుణ పరిస్థితులు కనిపిస్తున్నాయి. సింగూరు, నిజాంసాగర్‌లో చుక్కనీరు లేదు. ఎస్సారెస్పీది అదే పరిస్థితి. బేసిన్లో మొత్తంగా 215 టీఎంసీల నిల్వ ప్రాజెక్టులుండగా ఏకంగా 200 టీఎంసీల నీటి లోటు కనబడుతోంది. ప్రస్తుతం జూన్ మూడో వారంలోకి వస్తున్నా ఇంతవరకు చుక్క నీటి ప్రవాహాలు లేవు. సాధారణంగా గోదావరిలో జూన్ రెండో వారం నుంచి నీటి ప్రవాహాలు ఉండే అవకాశం ఉన్నా రుతుపవనాల ఆలస్యం కారణంగా ఇంతవరకు ప్రవాహాల జాడ కనిపించడం లేదు. ఈ ప్రభావం గోదావరి బేసిన్‌లోని 15–18 లక్షల ఎకరాలపై ప్రభావం చూపనుంది. కృష్ణా బేసిన్లోనూ ఇవే పరిస్థితులున్నాయి. నాగార్జున సాగర్, శ్రీశైలం, జూరాల ప్రాజెక్టుల్లో 537 టీఎంసీలకుగాను ప్రస్తుతం 375 టీఎంసీల నీటి లోటు ఉంది. ఇందులో సాగర్‌లో ప్రస్తుతం 128.63 టీఎంసీల నీటి లభ్యత కనబడుతున్నా ఇదంతా కనీస నీటి మట్టాలకు దిగువన ఉన్నదే. ఇక్కడ డెడ్ స్టోరేజీ 510 మీటర్లుకాగా ఇప్పటికే 508 మీటర్ల వరకు వెళ్లి హైదరాబాద్ తాగునీటి అవసరాలపై నీటిని అత్యవసర పంపింగ్ చేస్తున్నారు. శ్రీశైలంలో 215 టీఎంసీలకుగాను 32.24 టీఎంసీల లభ్యతగా ఉండగా ఇప్పటికే కనీస నీటిమట్టాలకు దిగువకు వెళ్లి ఇరు రాష్ట్రాలూ నీటిని తీసుకుంటున్నాయి. ఎగువన కర్ణాటక ప్రాజెక్టులైన ఆల్మట్టి, నారాయణపూర్, తుంగభద్ర ప్రాజెక్టుల్లో 225 టీఎంసీల నీరు చేరితేగానీ రాష్ట్ర ప్రాజెక్టులకు నీళ్లు రావు. సాధారణ వర్షపాతాలు నమోదయ్యే ఏడాదుల్లోనూ ఆగస్టు, సెప్టెంబర్ వరకు రాష్ట్ర ప్రాజెక్టులు నిండవు. ప్రస్తుతం రుతుపవనాల ఆలస్యం కారణంగా అక్టోబర్ వరకు ప్రాజెక్టులు నిండుతాయో లేదో చెప్పలేని పరిస్థితులున్నాయి. ఇదే జరిగితే జూరాల, సాగర్ కింద 11 లక్షల ఎకరాల ఆయకట్టుపై ప్రభావం పడే అవకాశం ఉంది. మధ్యతరహా ప్రాజెక్టుల్లోనూ ఎక్కడా నీళ్లు రాలేదు. రాష్ట్రంలో 40 వేలకుపైగా చెరువులు ఉండగా 90 శాతానికిపైగా చెరువులు ఎండిపోయి కనిపిస్తున్నాయి. దీంతో వీటి కింద సాగయ్యే 25 లక్షల ఎకరాలు సాగుక్లిష్టంగానే మారనుంది. భూగర్భ జలాలు దయనీయం.. రాష్ట్రంలో భూగర్భ జలాలు రోజురోజుకూ పడిపోతున్నాయి. గతంలో ఎన్నడూ లేనంతగా భూగర్భ జలాలు అడుగింటి పోతున్నాయి. లోటు వర్షపాతం కారణంగా చాలా జిల్లాల్లో రబీ పంటల సాగుకు రైతులు బోర్లపై ఆధారపడటంతో మట్టాల్లో భారీగా తగ్గుదల కనిపిస్తోంది. గతేడాది మే నెలలో రాష్ట్ర సాగటు నీటిమట్టం 12.73 మీటర్లు ఉండగా ఈ ఏడాది అది 14.46 మీటర్లుగా నమోదైంది. గతేడాది మే నెల మట్టాలతో పోలిస్తే ఈ ఏడాది ఏకంగా 1.83 మీటర్ల దిగువకు పడిపోయాయి. మెదక్ జిల్లాలో ఏకంగా 26.47 మీటర్లకు భూగర్భ నీటిమట్టం పడిపోవడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. సంగారెడ్డి, సిధ్దిపేట, వికారాబాద్ జిల్లాల్లో 20 మీటర్లకన్నా ఎక్కువగా నీటి మట్టాలు పడిపోగా కామారెడ్డి, సిరిసిల్ల, మహబూబ్‌నగర్ వంటి జిల్లాల్లోనూ గడ్డు పరిస్థితులే ఉన్నాయి. భూగర్భమట్టాలు తగ్గుతుండటంతో చాలా జిల్లాల్లోని పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో నీటి కటకట మొదలైంది. బోర్లు పనిచేయకపోవడంతో పట్టణాల్లో వాటర్ ట్యాంకర్లపై ఆధారపడుతున్నారు. ఈ దృష్ట్యానే సాగునీటి ప్రాజెక్టుల్లో తొలి ప్రాధాన్యం తాగునీటి అవసరాలకేనని తేల్చి చెబుతోంది. మిషన్‌భగీరధ అవసరాలకు రెండు బేసిన్ల ప్రాజెక్టుల నుంచి కనిష్టంగా 60 టీఎంసీల నీటిని పక్కన పెట్టాకే సాగు అవసరాలకు నీటి విడుదల ఉంటుందని స్పష్టంగా చెబుతోంది. ప్రస్తుతం ఈ రెండు బేసిన్ల పరిధిలోనూ నిల్వలు తగ్గుతున్న క్రమంలో వర్షాలపైనే భవిష్యత్ ఆధారపడి ఉంది. ఇప్పుడే వర్షాధార పంటలు వద్దు... ఖరీఫ్ పంటల సాధారణ సాగు విస్తీర్ణం 1.07 కోట్ల ఎకరాలు కాగా, ఇప్పటివరకు సాగు లక్ష ఎకరాలకు మించింది లేదు. ఈ సాగు సైతం బోర్లు కింద జరిగినదే. గతేడాది ఇదే సమయానికి 5 లక్షల ఎకరాలు సాగు జరిగినట్లు వ్యవసాయశాఖ నివేదికలు చెబుతున్నాయి. అంటే గతేడాది కంటే గణనీయంగా తక్కువ విస్తీర్ణంలోనే పంటలు సాగయ్యాయి. ఖరీఫ్ వరి సాధారణ సాగు విస్తీర్ణం 35 లక్షల ఎకరాలుకాగా ఇప్పటివరకు ఎక్కడా నార్లు పోసిన దాఖలాలు కనిపించడం లేదు. వర్షాలు కురిస్తే జూలై, ఆగస్టులో వరి నాట్లు పుంజుకోనున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని వాతావరణ పరిస్థితులపై అధ్యయనం చేసిన ఆచార్య జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం, భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి పరిధిలోని కేంద్రీయ మెట్ట వ్యవసాయ పరిశోధన సంస్థ, రాష్ట్ర వ్యవసాయ శాఖ ఈ మేరకు ఒక సంయుక్త ప్రణాళికను రూపొందించి శనివారం విడుదల చేశాయి. దాని ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల వర్షపాతం సాధారణం కంటే 60–70శాతం వరకు తక్కువగా నమోదయ్యే అవకాశం ఉండగా జూలైలో 60–70 శాతం ఎక్కువ నమోదయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలు రుతుపవన వర్షాలు కానందున వర్షాధార పంటలు విత్తుకోకూడదని సూచించింది. నైరుతి రుతుపవనాలు ప్రవేశించిన తర్వాత తేలికపాటి నేలల్లో 50–60 మిల్లీమీటర్ల వర్షపాతం, బరువు నేలల్లో 60–70 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయ్యాక వర్షాధార పంటలైన సోయా చిక్కుడు, మొక్కజొన్న, జొన్న, కంది, పెసర, పత్తి తదితర పంటలు విత్తుకోవాలని తెలిపింది. వరి సాగు చేసే పొలాల్లో తొలకరి వర్షాలను ఉపయోగించుకొని జనుము, జీలుగను పచ్చిరొట్ట పైరుగా, ఆలస్యంగా నీరు విడుదలయ్యే ప్రాంతాల్లో పెసరను పైరుగా లేక పచ్చిరొట్టగా విత్తుకోవాలని సూచించింది. పెసర, జొన్న ఈ నెల 30వ తేదీ వరకు, మొక్కజొన్న, పత్తి, సోయాచిక్కుడు జూలై 15 వరకు, కంది జూలై 31 వరకు, ఆముదం ఆగస్టు 15 వరకు విత్తుకోవడానికి అనువైన సమయమని వెల్లడించింది. వరినార్లు వేసుకోవడానికి దీర్ఘకాలిక రకాలను జూన్ 20 వరకు, మధ్యకాలిక రకాలు జూలై 10 వరకు, స్వల్పకాలిక రకాలు జూలై 31 వరకు అనువైన సమయమని తెలిపింది. రాష్ట్రంలో మూడు రోజులు తేలికపాటి వర్షాలు కోస్తాంధ్ర తీరానికి దగ్గరలో పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో 4.5 కి.మీ నుంచి 5.8 కి.మీ మధ్య ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఆదివారం తెలిపింది. ఈ ప్రభావంతో రాగల 4–5 రోజుల్లో ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వివరించింది. రాగల మూడు రోజులు రాష్ట్రంలో అక్కడక్కడా తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. అదే సమయంలో కొన్ని ప్రాంతాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. వర్షం కోసం ముస్లింల ప్రత్యేక ప్రార్థనలు కాశిబుగ్గ: రాష్ట్రంలో వర్షాలు కురవాలని కోరుతూ వరంగల్ నగరంలోని ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. వర్షాకాలం ప్రారంభమైనా చినుకు జాడ లేకపోవడంతో సామాన్య ప్రజలు, రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో వరుణుడు కరుణించి వానలు కురిపించాలని కోరుతూ వరంగల్, హన్మకొండ, కాజీపేట ప్రాంతాల్లోని ముస్లిం సోదరులు వెయ్యి మంది వరకు ఆదివారం ఉదయం వరంగల్ ఓసిటీ మైదానానికి చేరుకుని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. -
వారి గోడు వినేదెవరు?
వారంతా మారుమూల గిరిజన గ్రామంలోనివసిస్తున్నారు. ఎన్నికల సమయంలోనే నేతలకు వారు గుర్తుకొస్తారు. మైదాన ప్రాంతానికి రావాలంటే సరైన రహదారి సౌకర్యం ఉండదు. తాగడానికి సురక్షిత నీరు లభ్యం కాదు.అత్యవసర వేళ వైద్యం అందదు. ఇన్ని కష్టాలకోర్చి జీవిస్తున్న వారిని అనుకోకుండా మండల తహసీల్దార్ ఆదివారం అక్కడకు వెళ్లారు. దాదాపు పదికిలోమీటర్ల దూరం కొండలు... గుట్టలు ఎక్కి వెళ్లి అక్కడివారి సమస్యలు స్వయంగా తెలుసుకున్నారు. శృంగవరపుకోట రూరల్ : గిరిజన పల్లెల్లో సౌకర్యాలు లేక అక్కడ నివసిస్తున్నవారి పరిస్థితులు అగమ్యగోచరంగా మారుతున్నాయి. మండలంలోని దారపర్తి గిరిశిఖర పంచాయతీ శివారు రాయపాలెం గిరిజనుల బాధలు చూస్తే ఎంతటివారికైనాగుండె తరుక్కుపోతుంది. ఆదివారం కాలినడకన దారపర్తి పంచాయతీ పల్లపుదుంగాడలో పోలింగ్ కేంద్రం పరిశీలనకు వెళ్లిన తహసీల్దార్ పి.రామారావు మార్గమధ్యంలో కనిపించిన రాయపాలెం గిరిజనులను పలకరించారు. ఈ సందర్భంగా తాము ఎదుర్కొంటున్న సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ఇక్కడ గెడ్డలో ఏర్పాటు చేసిన వాటర్ టబ్బులో నీటి ఊట అడుగంటడంతో కలుషితం లేని మంచినీటికోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. వాటర్ టబ్బులో నీటి ఊట అడుగంటడంతో సమీపంలోని గెడ్డలో గల చలమల నీరే దిక్కవుతోందని పేర్కొన్నారు. గ్రామానికి సమీపంలో గల మరో బావిలో నీరు పుష్కలంగా ఉన్నప్పటికీ కొద్ది సంవత్సరాల క్రితం ఒక గిరిజన మహిళ అందులో పడి ఆత్మహత్య చేసుకోవటంతో ఆ నీటిని అప్పటి నుంచి తెచ్చుకోవటం మానేశామని గిరిజనులు వివరించారు. తక్షణమే బావిని పునరుద్ధరిస్తా... వాడకుండా వదిలేసిన బావి పరిసరాలను గిరిజనులంతా కలిసి శుభ్రం చేసి తనకు తెలియజేస్తే వెంటనే బావి నీటిని జనరేటర్ సాయంతో రెండుసార్లు తోడించి బయటకు వదిలేద్దామని, అనంతరం ఊరే నీటిని మోటార్ సాయంతో గ్రామ సమీపంలో కొత్తగా ఏర్పాటు చేసే ట్యాంక్‌కు వచ్చేలా పనులు చేయిస్తామని, దీనిపై సంబంధిత గ్రామీణ మంచినీటి సరఫరా విభాగం ఏఈ, ఇతర అధికారులతో చర్చించి, సమస్యను పరిష్కరిస్తానని తహసీల్దార్ పి.రామారావు హామీనిచ్చారు. గిరిజనులతో కలిసి గెడ్డలో అడుగంటిన వాటర్ టబ్బు, గిరిజనులు తాగే గెడ్డలో చలమను పరిశీలించారు. వేసవి వచ్చిందంటేకష్టాలు మొదలైనట్టే వేసవి సమీపిస్తుంటే మా పంచా యతీ గిరిజనులు పడే మంచి నీటి కష్టాలు అన్నీ ఇన్నీ కావు. గతంలో వృధాగా వదిలేసిన మంచినీటి బావి నీటిని మోటార్ల సాయంతో పైకి తోడించి శుభ్రం చేయిస్తామని అధికారులు చెప్పారు. తరువాత మా గ్రామం వైపు చూడలేదు. ఇప్పటికైనా గిరిజనులు ఎదుర్కొంటున్న తాగునీటి సమస్యను పరిష్కరించాలి.– కాకర అప్పలస్వామి, రాయపాలెం గిరిజనుడు చలమల నీరే దిక్కు.. దారపర్తి పంచాయతీ పరిధి గిరిజనులకు చలమల నీరే దిక్కవుతోంది. వాటర్ టబ్బులను ఏర్పాటు చేసినప్పటికీ పెద్దగా నీటి ఊటలు లేకపోవటంతో మంచినీటి సమస్య తలెత్తుతోంది. గ్రామంలో వాడకుండా వదిలేసిన మంచినీటి బావిని వాడుకలోకి తెస్తామని తహసీల్దార్ ఇచ్చిన హామీ నెరవేరితే మాకు మంచినీటి కష్టాలు తప్పుతాయి.– గెమ్మెల అప్పారావు, రాయపాలెం -
తగ్గుతున్న గోదావరి నీటిమట్టం
పశ్చిమగోదావరి, పోలవరం రూరల్: గోదావరి నీటి మట్టం తగ్గుతుండటంతో ఇసుక మేటలు బయట పడుతున్నాయి. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతంలో ఎగువ కాపర్ డ్యామ్ నిర్మాణం పై భాగాన అడ్డుకట్టలు వేసి కొంత వరకు తూరల ద్వారా దిగువకు నీరు విడుదల చేస్తున్నారు. దీంతో నీటి ప్రవాహం తగ్గింది. ప్రాజెక్టు దిగువ నుంచి పట్టిసీమ వరకు చిన్న పాయలా నీరు ప్రవహిస్తోంది. ఈ ప్రాంతంలో కూడా పలు చోట్ల ఇసుక మేటలు రోజు రోజుకు బయటపడుతున్నాయి. మార్చి మొదటి వారంలోనే ఈ పరిస్థితి ఉంటే మే నెలలో గోదావరి నీటి ప్రవాహం ఎంత వరకు ఉంటుందో తెలియని పరిస్థితి ఏర్పడిందని గ్రామస్తులు చెబుతున్నారు. మిగిలిపోయిన వాటర్ ప్యాకెట్లు మహాశివరాత్రి ఉత్సవాల్లో భక్తులకు తాగునీరు పంపిణీ కోసం తీసుకువచ్చిన వాటర్ ప్యాకెట్లు పట్టిసం రేవులోనే ఉండిపోయాయి. ఎండ తీవ్రత పెరుగుతున్న దృష్ట్యా భక్తులకు తాగునీటి సమస్య ఉండకుండా చూడాలని ఉన్నతాధికారులు ఆదేశించడంతో భక్తులకు అందించేందకు వాటర్ ప్యాకెట్ల బస్తాలను ఏర్పాటు చేశారు. భక్తుల రాకపోకల్లో వాటర్ ప్యాకెట్ల వినియోగం లేకపోవడంతో, అలాగే ప్యాకెట్లను సరిగా పంపిణీ చేసే వారు లేకపోవడంతో ఈ బస్తాలు అక్కడే ఉండి పోయాయి. కనీసం వీటి గురించి పట్టించుకునే నాథుడు కూడా లేడు. ఎండ తీవ్రతకు వాటర్ ప్యాకెట్ బస్తాలు దెబ్బతినే పరిస్థితి ఉందని గ్రామస్తులు చెబుతున్నారు. శివక్షేత్రాన్ని దర్శించుకున్న భక్తులు పట్టిసం శివక్షేత్రానికి బుధవారం కూడా భక్తులు తరలి వచ్చారు. మహాశివరాత్రి ఉత్సవాల్లో శివక్షేత్రాన్ని దర్శించుకోలేక వెనుదిరిగిన వారితో పాటు సమీప ప్రాంతాల్లోని ప్రజలు కూడా శివక్షేత్రానికి చేరుకుని గోదావరిలో స్నానమాచరించి శ్రీభద్రకాళీసమేత వీరేశ్వరస్వామిని దర్శించుకుని పూజలు నిర్వహించుకున్నారు. -
జలకళ తప్పింది
మోతుగూడెం (రంపచోడవరం):ఇంకా పూర్తి స్థాయిలో వేసవి రాకముందే సీలేరు జలాశయాలు కళ తప్పాయి. గతంలో ఎన్నడూ లేని స్థాయిలో నీటిమట్టాలు పడిపోయాయి. గత 40 ఏళ్లలో ఎప్పుడూ ఇంత దారుణమైన పరిస్ధితి ఏర్పడలేదు. ముఖ్యంగా సీలేరు జలవిద్యుత్ కేంద్రాలకు సంబంధించి గుంటవాడ, డొంకరాయి, ఫోర్‌బే రిజర్వాయర్లలో నీటిమట్టాలు గణనీయంగా పడిపోయాయి. ఏటా మార్చి నాటికి ఈ మూడు రిజర్వాయర్లలో 10 నుంచి 15 టీఎంసీల నీరు నిల్వ ఉండేది. కానీ ఈసారి ఇప్పటికే నీటిమట్టాలు దారుణంగా పడిపోయి, మట్టిదిబ్బలు పైకి కనిపిస్తున్నాయి. మరో పది రోజుల్లో ఈ రిజర్వాయర్లలో ఉన్న మూడు టీఎంసీల నీటిని గోదావరి డెల్టాకు తరలిస్తే పరిసర గ్రామాలకు తాగునీటి సమస్య ఎదురు కానుంది. బలిమెల రిజర్వాయర్ నుంచి నీటిని విడుదల చేస్తే తప్ప నీటి ఎద్దడి నుంచి గట్టెక్కె పరిస్థితి కనిపించడం లేదు. గోదావరి డెల్టాకు మరో 10 టీఎంసీల వరకూ నీటి అవసరం ఉంది. బలిమెల రిజర్వాయర్ నుంచి 10 టీఎంసీల నీటి విడుదలకు కోరినా ఒడిశా ప్రభుత్వం సానుకూలంగా స్పందించే అవకాశాలు కనిపించడం లేదు. ఇప్పటికే బలిమెల రిజర్వాయర్ ఆంధ్రా టన్నెల్ నుంచి అధిక మొత్తంలో నీరు దిగువన ఉన్న సీలేరు కాంప్లెక్స్ జలాశయాలకు వచ్చింది. దీంతో అదనంగా నీరు ఇచ్చే పరిస్థితి ఉండకపోవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. డెల్టాలో పంటలను కాపాడేందుకు ప్రభుత్వం పరంగా చర్చలు జరిగితేనే కానీ బలిమెల నుంచి నీటి విడుదల సాధ్యమయ్యే పరిస్థితి కనిపించడం లేదు. -
కరువు కోరలు
చింతలపూడి/జంగారెడ్డిగూడెం/టి.నరసాపురం : మెట్ట ప్రాంతంలో కరువు కోరలు చాస్తోంది. గత ఏడాది తొలకరిలో తప్ప గడచిన ఆరు నెలల్లో వరుణుడు మొహం చాటేయడంతో భూగర్భ జలమట్టాలు దారుణంగా పడిపోతున్నాయి. సాగునీటికి కొరత ఏర్పడటంతో పంటలు ఎండిపోయే పరిస్థితి తలెత్తుతోంది. మరోవైపు వేసవికి ముందే ప్రజలు తాగునీటికి అల్లాడాల్సిన దుస్థితి దాపురిస్తోంది. మెట్ట మండలాల్లో ఈ ఏడాది సాధారణం కన్నా తక్కువ వర్షపాతం నమోదు కావడంతో భూగర్భ జలాలు అడుగంటిపోయాయి. వేసవి ప్రారంభంలోనే ఇలా ఉంటే.. మే నెలలో పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందోననే ఆందోళన వ్యక్తమవుతోంది. భూగర్భ జలాలపై ఆధారపడిన ప్రాంతాల్లోని పరిస్థితి మరీ అధ్వాన్నంగా ఉంది. ఇప్పటికే చాలాచోట్ల్ల చెరువులు ఎండిపోవడంతో పశువులకు సైతం తాగునీరు అందటం లేదు. ప్రాజెక్టుల్లో నీరు ఉంటే భూగర్భ జలాలు ఎంతోకొంతో ఆశాజనకంగా ఉండేవి. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా తొలకరి వానలు వచ్చేవరకు అందుబాటులో ఉన్న నీటి వనరులను జాగ్రత్తగా వినియోగించుకోవాలని, వర్షాలు కురిసి ప్రాజెక్టుల్లోకి నీరు చేరితే తప్ప కష్టాల నుంచి గట్టెక్కలేమని ఇరిగేష¯ŒS డీఈ అప్పారావు చెబుతున్నారు. చెరువులు, ప్రాజెక్టులు వెలవెల జిల్లాలో మధ్యతరహా నీటి పారుదల కింద తమ్మిలేరు, ఎర్రకాలువ, విజయరాయి ఆయకట్టు ఉండగా చిన్ననీటి పారుదల కింద జల్లేరు జలాశయంతోపాటు 1,398 సాగునీటి చెరువులున్నాయి. వీటిలో తమ్మిలేరు, ఎర్రకాలువ, విజయరాయి ఆయకట్టు కింద 43,500 ఎకరాల్లో పంటలు సాగవుతున్నాయి. చిన్న నీటిపారుదలకు సంబంధించి జల్లేరు జలాశయం, చెరువుల కింద కలిపి 1,19,284 ఎకరాల్లో పంటలు పండిస్తున్నారు. రబీ పంట లకు నీరు విడుదల చేస్తుండటంతో ప్రస్తుతం ఈ ప్రాజెక్టుల్లో నీరు క్రమేణా తగ్గిపోతోంది. ఎర్రకాలువ పరిస్థితి ఇదీ చింతలపూడి మండలం శెట్టివారిగూడెం వద్ద మేడవరపు చెరువు అలుగు నుంచి వచ్చే నీటి వనరులే ఎర్రకాలువకు ఆధారం. ఇక్కడి నుంచి సుమారు 21 కిలోమీటర్ల మేర నీరు ప్రవహించి ఎర్రకాలువ ప్రాజెక్టులో కలుస్తోంది. అలాగే సుమారు 19 వేల ఎకరాలకు సాగునీరు అందిస్తున్న కొంగువారిగూడెంలోని కరాటం కృష్ణమూర్తి ఎర్రకాలువ ప్రాజెక్టుకు సైతం ఈ కాలువే ప్రధాన వనరుగా ఉంది. జలాశయం నీటిమట్టం 83.5 మీటర్లు కాగా ప్రస్తుతం 80 మీటర్లకు చేరుకుంది. ఈ ఏడాది రబీలో ఈ ప్రాజెక్టు నుంచి 10 వేల ఎకరాలకు సాగునీరు విడుదల చేస్తున్నట్టు ఇరిగేష¯ŒS అధికారులు చెబుతున్నారు. ఎండిన నందమూరి విజయసాగర్ ఏటా వర్షాకాలంలో వృథాగా పోతున్న వేలాది క్యూసెక్కుల ఎర్రకాలువ వరద నీటిని పంటలకు వినియోగించుకోవాలన్న ఉద్దేశంతో పోలవరం నియోజకవర్గంలోని టి.నరసాపురం సమీపంలో నందమూరి విజయసాగర్ ప్రాజెక్టును ప్రభుత్వం నిర్మించింది. దీనికింద అధికారికంగా సుమారు వెయ్యి ఎకరాలు, అనధికారికంగా మరో వెయ్యి ఎకరాల్లో పంటలు సాగవుతున్నాయి. ఎర్రకాలువ వట్టిపోవడంతో నందమూరి విజయసాగర్ ప్రాజెక్ట్ సైతం ఎండిపోతోంది. ఎత్తిపోతలు అంతంతే.. ఎర్రకాలువపై ఆధారపడి ఉన్న మరో ప్రాజెక్టు బొర్రంపాలెంలోని వెంగళరాయ ప్రాజెక్టు. దీనికింద సుమారు వెయ్యి ఎకరాల్లో పంటలు సాగవుతున్నాయి. అంతేకాక వెంగళరాయ ప్రాజెక్టు నుంచి ఎత్తిపోతల పథకం ద్వారా కామవరపుకోట మండలంలో సుమారు 3 వేల ఎకరాలు సాగులోకి వచ్చాయి. మూడేళ్లుగా ఎత్తిపోతల నీటితో ఆ మండలం సస్యశ్యామలమైంది. పై రెండు ప్రాజెక్టులు ఎర్రకాలువపైనే ఆధారపడి ఉన్నాయి. ఈ ఏడాది రబీలో రెండు వేల ఎకరాలకు సాగునీరు అందించడానికి అధికారులు అనుమతించారు. ఎర్రకాలువ వట్టిపోవడంతో ఎత్తిపోతల పథకానికి నీరందని పరిస్థితి నెలకొంది. తగ్గుతున్న తమ్మిలేరు చింతలపూడి మండలం నాగిరెడ్డిగూడెం సమీపంలో 3 టీఎంసీల సామర్థ్యం గల జలాశయాన్ని నిర్మించారు. ప్రాజెక్టు దిగువన పశ్చిమ గోదావరి జిల్లాలో 4,200 ఎకరాలు, కృష్ణా జిల్లాలో 4,969 ఎకరాల్లో పంటలు సాగు చేస్తున్నారు. ఇదికాక సుమారు రూ.10 కోట్ల వ్యయంతో చింతలపూడి మండలంలోని 27 గ్రామాలకు తమ్మిలేరు తాగునీటి పథకం నిర్మాణంలో ఉంది. ఈ ప్రాజెక్టులో నీరు ఉంటేనే చుట్టుపక్కల మండలాల్లో భూగర్భ జలాలు సమృద్ధిగా ఉంటాయి. ప్రాజెక్టు గరిష్ట నీటిమట్టం 355 అడుగులు. ప్రస్తుతం ప్రాజెక్టులో 336 అడుగుల నీటిమట్టం ఉంది. దీంతో పలు గ్రామాల్లో భూగర్భ జలాల నీటిమట్టం పడిపోతోంది. పంటల పరిస్థితి ప్రమాదంలో పడింది.