Water mafia
-
ఆళ్లగడ్డలో జల యుద్ధం
► నీటి కోసం రోడ్డెక్కిన మహిళలు ► 500 మంది తరలివచ్చి నిరసన ► నగర పంచాయతీ కార్యాలయం వద్ద బైఠాయింపు మొదలైన నీటి మాఫియా..: ఆళ్లగడ్డలో ప్రజల అవసరాన్ని ఆసరాగా చేసుకుని నీటి మాఫియా డబ్బులు గుంజుతున్నట్లు తెలుస్తోంది. పేరుకు ఉచితంగా సరఫరా చేస్తున్నామని కొందరు ట్యాంకర్ల యజమానులు గొప్పలు చెప్పుకుంటున్నా నగర పంచాయతీ నుంచి ట్యాంకరుకు రూ. 400 నుంచి రూ. 500 వరకు బిల్లులు చేసుకుంటున్నారు. ఇది చాలదన్నట్లు నీరు కావాలని ఎవరైనా ఫోన్ చేస్తే పరిస్థితిని బట్టి రూ. వెయ్యి నుంచి రూ. 1500 వరకు గుంజుతున్నారని ఆరోపణలున్నాయి. నగర పంచాయతీ సిబ్బంది కూడా చేతివాటం ప్రదర్శిస్తున్నారు. ఎంతో కొంత ముట్టజెప్పందే ట్యాంకర్లను పంపించడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు. ఆళ్లగడ్డ: గుక్కెడు నీటి కోసం వందలాదిగా మహిళలు రోడ్డెక్కి నిరసన తెలిపిన ఘటన సోమవారం ఆళ్లగడ్డలో చోటుచేసుకుంది. పట్టణంలోని రామలక్ష్మీకొట్టాల, నాయిబ్రాహ్మణ కాలనీ, ముస్లిం వీధి, కొత్త మసీదు, రామాలయం వీధి తదితర ప్రాంతాల్లో మూడు, నాలుగు రోజులుగా కుళాయిలకు నీరు రావడం లేదు. ఇందుకు సంబంధించి నగర పంచాయతీ అధికారులు, పాలక వర్గానికి పలుమార్లు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోయింది. దీంతో విసుగెత్తిపోయిన మహిళలు సోమవారం వివిధ కాలనీల నుంచి 500 మందికిపైగానగర పంచాయతీ కార్యాలయం వద్దకు ర్యాలీగా తరలివచ్చారు. అక్కడ ధర్నా నిర్వహించి నిరసన తెలిపారు. సమస్యపై చైర్పర్సన్ ఉషారాణిని నిలదీశారు. కనీసం రెండు రోజులకు ఓసారైనా నీటిని విడుదల చేయకపోతే ఎలా అని ప్రశ్నించారు. ట్యాంకర్ల ద్వారా సరఫరా చేస్తామని చెబుతున్నా మున్సిపాల్టీ ఉద్యోగులు, వారి బంధువులు, పలుకుబడి ఉన్న వారికి తప్ప పేదలకు చుక్కనీరు అందడం లేదన్నారు. -
దోచేస్తున్నారు..
♦ వినియోగదారులను అడ్డంగా దోచేస్తున్న నీటి మాఫియా ♦ ఇష్టారాజ్యంగా ట్యాంకర్ల ధరలు ♦ నీటి మాఫియాతో కుమ్మక్కైన బీఎంసీ ప్లంబర్లు ♦ చోద్యం చూస్తున్న అధికార యంత్రాంగం ముంబై : జలాశయాల్లో నీటి నిల్వలు అడుగంటి పోతుండటంతో ఓ వైపు బీఎంసీ నీటి కోతలు విధిస్తుంటే, మరోవైపు నీటి మాఫియా దొరికిన కాడికి దోచుకుంటోంది. ఇష్టారాజ్యంగా రేట్లు పెంచుతూ వినియోగదారులను నిలువునా దోపిడీ చేస్తోంది. గృహాలకు 20 శాతం నీటి కోత విధిస్తూ బీఎంసీ ఆదేశాలు జారీ చేసిన వెంటనే నీటి విక్రయ వ్యాపారులు ధరలు అమాంతం పెంచేశారు. దీంతో మురికివాడలు, నగర శివారుప్రాంతాల ప్రజలు పెరిగిన ధరలతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. గతంలో 20 నుంచి 50 లీటర్ల క్యాన్లను రూ. 40 నుంచి రూ. 200 కి అమ్మేవారని, ప్రస్తుతం నీటి కొరత ఉండటం, బీఎంసీ నీటి కోత విధించడంతో వాటి ధరలను దాదాపుగా రెట్టింపు చేశారని ఓ స్థానికుడు వాపోయాడు. ట్యాంకర్లకు రూ. 1800-2000 వరకు చెల్లించాల్సి వస్తోందని, అప్పడప్పుడు రూ.5 వేల వరకు చెల్లించాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశాడు. ఆ భారమూ మాపైనే.. ‘అంబుజ్వాడి, అజ్మీ నగర్, రాథోడ్ గ్రామం, మాల్వణీ చర్చ్, చికువాడి గ్రామాల్లో వర్షాలు కురిసినా, కురవకపోయినా నీటి కోత మాత్రం తప్పడం లేదు. నీటి మాఫియాకు ప్లంబర్లు అక్రమ కనెక్షన్లు ఇవ్వడంతో నీటి కొరత మరింతగా పెరిగిపోతోంది. మోటార్ పంపులతో నీటిని తోడేస్తున్నారు. దీంతో భారమంతా మాపై పడుతోంది.’ అని మాల్వణీలోని మలాడ్‌కు చెందిన సామాజిక కార్యకర్త నోయెల్ల వారెల చెప్పారు. అవసరం అలాంటిది.. సమాజ్‌వాది పార్టీ నేత రైస్ షాయిక్ మాట్లాడుతూ.. ‘గోవండీ, మాన్‌కుర్ద్ పరిసర ప్రాంతాల్లో ఇలాంటి అక్రమ దందాలు ఎక్కువగా జరుగుతుంటాయి. 2005 తర్వాత మురికివాడలకు నీటి కనెక్షన్లు ఇవ్వలేదు. దీంతో ధరలను నీటి మాఫియా ఎంత పెంచినా అవసరం దృష్ట్యా కొనక తప్పడం లేదు’ అని చెప్పారు. సాధారణంగా నీటి కనెక్షన్లకు రూ.8000-9000 వరకు తీసుకుంటారని, ప్లంబర్లు నీటి సరఫరా శాఖకు సంబంధించిన అధికారులతో కుమ్మక్కై రూ. 25000 వేల వరకు ప్రజలనుంచి వసూలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ నాయకుడు, కొలబా మాజీ కార్పొరేటర్ వినోద్ శేఖర్ మాట్లాడుతూ.. నీటి సమస్యలను బీఎంసీ పట్టించుకోకపోవడం శోచనీయమన్నారు. నగరంలో నీటి సంరక్షణపై బీఎంసీకి తాను పలుమార్లు సూచించానని, కానీ ఇతర మార్గాలను బీఎంసీ అన్వేషించలేదని విమర్శించారు. గీతా నగర్, అంబేడ్కర్ నగర్ ప్రజలు నీటి కొరత వల్ల తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారన్నారు. బకెట్ నీటి కోసం అవస్థలు పడాల్సి వస్తోందని వాపోయారు. బీఎంసీ ఆధ్వర్యంలో 500 ట్యాంకర్లు మాత్రమే ఉన్నాయని, నగరంలోని అన్ని ప్రాంతాలకు వీటిని పంపించలేమని, ఈ సమస్యకు పరిష్కార మార్గాలను అన్వేషిస్తున్నామని నగర పాలక సంస్థ అధికారులు చెప్పారు. నీటి కొరత ఎక్కువగా ఉన్నందున నగరంలో నిర్మాణ పనులు చేపడుతున్న ప్రాంతాలకు నీటి సరఫరా నిలిపేయాలని స్టాండింగ్ కమిటీ చైర్మన్ యషోదర్ పన్సే డిమాండ్ చేశారు. ఈ విషయమై అడిషనల్ మున్సిపల్ కమిషనర్ సంజయ్ ముఖర్జీకి ఆయన లేఖ రాశారు. నిర్మాణ రంగాలకు నీటి సరఫరా నిలిపివేత వర్షాల ప్రభావం ముంబైలోని నిర్మాణ రంగంపైనా పడింది. కొత్తగా నిర్మిస్తున్న భవనాలకు నీటి సరఫరా పూర్తిగా నిలిపివేయాలని బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) స్థాయి సమితి అధ్యక్షుడు యశోదర్ ఫన్సే ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వులను వెంటనే అమలు చేయాలని బీఎంసీ అదనపు కమిషనర్ సంజయ్ ముఖర్జీని ఆదేశించారు. నగరానికి నీరు సరఫరా చేసే జలాశయాల్లో నిల్వలు కనిష్ట స్థాయికన్నా కిందికి దిగజారి పోవడంతో ముందు జాగ్రత్త చర్యగా నివాస గృహాలకు 20 శాతం, వాణిజ్య, వ్యాపార, హోటల్, మాల్స్‌కు 50 శాతం నీటి కోత విధించిన సంగతి విదితమే. ముంబైకర్లు నీటి కోతతో ఉక్కిరిబిక్కిరి అవుతుంటే బిల్డర్లు మాత్రం తాగు నీటిని వినియోగిస్తున్నారు. దీనిపై మండిపడ్డ పన్సే.. భవన నిర్మాణ రంగాలకు సరఫరా నిలిపివేయాలని నిర్ణయించారు. బీఎంసీ పరిధిలో 2,741 చోట్ల భవన నిర్మాణ పనులు జరుగుతున్నాయి. పనులకు నీటి సరఫరా నిలిపివేయాలని, కేవలం అక్కడ పనిచేసే కూలీలు తాగేందుకు మాత్రమే సరఫరా చేయాలని ఫన్సే పేర్కొన్నారు. నిర్మాణ పనులకు ట్యాంకర్లు, ఇతర ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని బిల్డర్లకు ఆయన సూచించారు. -
వంద కోట్ల నీటి మాఫియా
-
మాఫియా ‘జల’గ
రాజధానిని నీటి మాఫియా జలగలా పట్టుకుంది. కొరతను అదనుగా చేసుకుని నగరవాసులను వీరంతా అడ్డగోలుగా దోచుకుంటున్నారు. ఐదు వేల లీటర్ల నీటిని రూ. 3,000లకు, 12 వేల లీటర్ల నీటిని ఐదు నుంచి పది వేల రూపాయలదాకా విక్రయిస్తున్నారు. మరోమార్గం లేకపోవడంతో నగరవాసులు కొనుగోలు చేయకతప్పడం లేదు. న్యూఢిల్లీ: రాజధాని నగరంలో వాటర్ ట్యాంకర్ మాఫియా రాజ్యం నడుస్తోంది. ఢిల్లీ జల్ బోర్డు (డీజేబీ) అధికారులతో కుమ్మక్కై ఇష్టారాజ్యంగా అడ్డగోలుగా నగరవాసులను దోచుకుంటున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఇటీవల అధికార పగ్గాలు చేపట్టిన నేపథ్యంలో మున్ముందు తమకు అనుకూలమైన పరిస్థితి ఉండకపోవచ్చనే భయం వారిని ప్రస్తుతం వెంటాడుతోంది. కొద్దినెలలుగా నీటి మాఫియా రాకెట్ గుట్టుగా నడుస్తోంది. సాధారణంగా వేసవికాలంలో వీరి కార్యకలాపాలు జోరుగా జరుగుతాయి. అయితే ఈసారి అసాధారణరీతిలో చలికాలాన్ని కూడా వీరు విడిచిపెట్టలేదు. నగరంలోని అత్యంత విలాసవంతమైన కాలనీల్లో నీటి మాఫియా కృత్రిమ నీటి సంక్షోభాన్ని సృష్టించింది. మరోవైపు కొత్తగా అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నగరంలోని ప్రతి గడపకు ప్రతి రోజూ 700 లీటర్ల నీటిని ఉచితంగా అందజేస్తామని ఇప్పటికే ప్రకటించిన సంగతి విదితమే. కాగా కృత్రిమ కొరత సృష్టించిన ప్రాంతాల్లో నివసించేవారు వెయ్యి లీటర్ల నీటి కోసం రూ. 800 నుంచి రూ.1,500 వరకూ చెల్లించకతప్పడం లేదు. గతంలో వీరంతా ఇదే మొత్తం పరిమాణానికి రూ. 400 నుంచి రూ. 800 చెల్లించేవారు. ఇక 5000 లీటర్ల నీటిని రూ. 3,000లకు, 12 వేల లీటర్ల నీటిని రూ. 5,000 నుంచి రూ. 10,000 దాకా నీటి మాఫియా విక్రయిస్తోంది. ఇక హోటళ్లు, ఆస్పత్రులు వంటి పెద్ద పెద్ద సంస్థలకు భారీ పరిమాణంలో నీరు అవసరమవుతుంది. ఇటువంటి వారు 24 వేల లీటర్ల నీటిని కొనుగోలు చేయాలంటే అందుకోసం రూ. 10 వేలు చెల్లించాల్సిందే.నగరంలోని వివిధ ప్రాంతాల్లోగల గొట్టపుబావుల నుంచి ప్రతిరోజూ 2,000లకు పైగా ప్రైవేటు ట్యాంకర్లు నీటిని సేకరిస్తున్నాయి. దీంతోపాటు అక్కడక్కడా డీజేబీ కనెక్షన్లనుంచి కూడా సేకరించిన నీటిని వినియోగదారులకు విక్రయిస్తున్న ప్రైవేటు ట్యాంకర్ మాఫియా.. కొనుగోలుదారుల వద్దను ంచి అసాధారణ చార్జీలను వసూలు చేస్తున్నాయి. వినియోగదారుల ముక్కుపిండి తమ జేబులు నింపుకుంటున్నాయి. నైరుతి, ఆగ్నేయ ఢిల్లీలతోపాటు దక్షిణ ఢిల్లీలోనూ నీటి మాఫియా కార్యకలాపాలు జోరుగా జరుగుతున్నాయి. కాంగ్రెస్ నేతల హస్తం? కాంగ్రెస్ నాయకుల కుమ్మక్కు కారణంగానే నీటి బ్లాక్ మార్కెటింగ్ జోరుగా జరుగుతోందనే ఆరోపణలు కూడా లేకపోలేదు. ఇదిలాఉంచితే ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీమేరకు కొత్తగా ముఖ్యమంత్రి పదవీ బాధ్యతలు చేపట్టిన అరవింద్ కేజ్రీవాల్ నగరవాసులకు నీటిని ఉచితంగా అందజేస్తామని ప్రకటించారు. ఈ ప్రకటన వెలువడి దాదాపు వారం రోజులు గడిచిపోయింది. గతంలో ఏసియాడ్ విలేజ్‌లోని అప్ మార్కెట్ ప్రాంతంలో నివసించేవారికి ప్రతిరోజూ నీరు అందేది. అయితే ఆప్ ప్రభుత్వం తన హామీని నిలబెట్టుకుంటుండడంతో ఆ పరిసరాలు ఎండిపోయాయి. వాస్తవానికి ఇందులో ఆప్ ప్రభుత్వం తప్పేమీ లేదని, ప్రైవేటు ట్యాంకర్లు, ఢిల్లీ జల్ బోర్డు (డీజేబీ) అధికారులు కుమ్మక్కవడమే ఈ పరిస్థితికి కారణమని పలువురు ఆరోపిస్తున్నారు. గడచిన ఐదారు రోజుల నుంచి తమకు నీరు అందడం లేదని ఏసియాడ్ విలేజ్వాసులు వాపోతున్నారు. ‘ఇటువంటి పరిస్థితిని మేము గతంలో ఏనాడూ ఎదుర్కోలేదు. ఆరు రోజుల తర్వాత మాకు నీరు అందింది’ అని కస్టమ్స్ శాఖ మాజీ అధికారి అజయ్ అగ్నిహోత్రి తన ఆవేదనను వెళ్లగక్కారు. ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకునేందుకు చేస్తున్న ప్రయత్నం కారణంగా నీరు ఇతర ప్రాంతాలకు మరలిపోతోందా అని ప్రశ్నించగా డీజేబీ అధికారుల కుట్ర వల్లనే ఈవిధంగా జరుగుతోందన్నారు. ‘కొత్త ప్రభుత్వానికి డీజేబీ అధికారులు వెన్నుపోటు పొడుస్తున్నారని తాను భావిస్తున్నానన్నారు. తనకు ఒకవేళ 700 లీటర్ల నీరు ఉచితంగా అందినప్పటికీ సాధ్యమైనం తక్కువ మోతాదులోనే వాడుకుంటానన్నారు. ఇదే అంశంపై ఆప్ మీడియా సమన్వయకర్త దీపక్ బాజ్‌పేయి మాట్లాడుతూ ఇటువంటి ఫిర్యాదులు దృష్టికి రాగానే తనతోపాటు తమ పార్టీకి చెందిన శాసనసభ్యుడితో కలసి పరిష్కరిస్తామన్నారు. ఈ ప్రాంతంలో డీజేడీ అధికారులు ప్రైవేటు ట్యాంకర్ల యజమానులతో కుమ్మక్కయ్యారన్నారు. కృత్రిమ కొరతను సృష్టిస్తున్నారన్నారు. మాకు నీళ్లు రావడం లేదు తమ సొసైటీకి నీళ్లు రావడం లేదని ఓ కంపెనీలో ఎకౌంటెంట్‌గా పనిచేస్తున్న హేమంత్ ముద్గల్ వాపోయారు. ప్రభుత్వ అధికారులు ప్రైవేటు వాటర్ ట్యాంకర్లను కిరాయికి తీసుకుని నీటిని తెప్పించుకోగలుగుతున్నారని, అయితే తాము ప్రతిరోజూ నీటి కోసం పోరాటం చేయకతప్పడం లేదన్నారు. మొత ్తం 365 రోజులకుగాను కనీసం సగం రోజులు కూడా నీరు రావడం లేదన్నారు. అందువల్ల తమకు ప్రైవేటు ఆపరేటర్లను ఆశ్రయించడం తప్ప మరో గత్యంతరం లేదన్నారు. కాగా చలికాలంలోనూ ఏసియాడ్ విలేజ్ పరిసర ప్రాంతాల్లో నివసిస్తున్న వారి పరిస్థితి దారుణంగా ఉంది. నీటి కోసం వారు నానాఅగచాట్లు పడుతున్నారు. నగరానికి ఓ షో పీస్‌లా భావించే ఏసియాడ్ విలేజ్‌లో ఒక్కొక్క ఫ్లాట్ ఖరీదు సగటున రూ. 10 కోట్ల దాకా ఉంటుంది. వీటన్నింటికీ డీజేబీ కనెక్షన్లు ఉన్నాయి. అయినా వారి కష్టాలు తీర్చేవారు మాత్రం కనిపించడం లేదు. ఏసియాడ్ క్రీడల సందర్భంగా 1982లో ఈ విలేజ్‌ని ప్రభుత్వం నిర్మించింది. ఇందులో మొత్తం 853 ఫ్లాట్లు ఉన్నాయి. ఇక్కడ నివసించేవారిలో 750 మంది ఉన్నతాధికారులు కూడా ఉన్నారు. ఎయిమ్స్ ఉద్యోగులతోపాటు ప్రభుత్వ ఉన్నతాధికారులు కూడా ఉన్నారు. అయినప్పటికీ నీరు సరిగా రాకపోతుండడంతో డీజేబీనుంచి ప్రతిరోజూ ప్రత్యేకంగా తె ప్పించుకోక తప్పడం లేదు. ఆరు ట్యాంకర్లను పంపిస్తున్నాం ఏసియాడ్ విలేజ్‌కి ప్రతిరోజూ ఆరు నీటి ట్యాంకర్లను పంపుతున్నామని ఢిల్లీ జల్ బోర్డు (డీజేబీ)కి చెందిన ఓ అధికారి వెల్లడించారు. ప్రతి రోజూ తమకు దాదాపు 30 ఫిర్యాదులు అందుతుంటాయన్నారు. నీటి సంక్షోభం లేదని తాము అనడం లేదని, ఉన్నతాధికారుల ఆదేశాలకు లోబడి మాత్రమే తాము పనిచేయాల్సి ఉంటుందన్నారు. నిలకడగా ఉండడం లేదు నీటి కొర త, చార్జీల విషయమై నగరంలోని కల్కాజీ ప్రాంతానికి చెందిన విజయ్ ఓఝా అనే వ్యక్తి మాట్లాడుతూ ‘ నీటి చార్జీలు నిలకడగా ఉండడం లేదు. డిమాండ్ పెరిగితే చార్జీలు వాటంతట అవే పెరుగుతున్నాయి’ అని అన్నారు.