రూఫ్ గార్డెన్తో లుక్కే వేరు!
సాక్షి, హైదరాబాద్: రూఫ్ గార్డెన్ ఇంటికి అందాన్ని, మనసుకు ఆహ్లాదాన్ని ఇస్తుంది. అయితే ఈ రూఫ్ గార్డెన్ నిర్మాణంలో జాగ్రత్తలు తీసుకోవాలి.
⇒ రూఫ్ గార్డెన్ నిర్మించాలనుకునే వారు అందుకు అవసరమైన ప్రణాళికను భవన నిర్మాణం చేపట్టిన నాటి నుంచే అమలు చేయాలి.
⇒ రూఫ్ గార్డెన్తో భవనంపై బరువు పెరుగుతుంది. అందువల్ల పిల్లర్స్‌ను రూఫ్ గార్డెన్‌ను దృష్టిలో పెట్టుకొని నిర్మించాలి. పిల్లర్లు మోయగలిగిన బరువు కంటే ఎక్కువ బరువు పెరిగితే భవనానికి ముప్పే.
⇒ అలాగే అంతస్తు పైకప్పుని చాలా పటిష్టంగా నిర్మించాలి. ఇది పటిష్టంగా లేకపోతే చాలా ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది.
⇒ మొక్కల పెంపకానికి అవసరమైన మీడియం (మృత్తిక)ను రాళ్లులేని మట్టితో ఏర్పాటు చేస్తే మంచిది. కొంత ఒండ్రు మన్ను కలిపితే ఇంకా బాగుంటుంది.
⇒ భవనం పైభాగం (రూఫ్ డెక్)ను చాలా పటిష్టంగా నిర్మించాలి. మొక్కల వేర్లు, నీళ్లు ఇందులోకి ప్రవేశించకుండా జాగ్రత్త వహించాలి.
⇒ మొక్కలకు పోసే నీరు రూఫ్ డెక్ సమీపంలోకి రాకుండా నిర్మించే డ్రైనేజీని వాస్తుకు అనుగుణంగా నిర్మించుకోవాలి. ఈ డ్రైనేజీలో నీరు నిలిచినా, అది కిందికి ఇంకకుండా ఉండేందుకు వాటర్ ప్రూఫ్ కాంక్రీట్ లేయర్‌ను నిర్మించాలి.