Water Sharing
-
తెలుగు రాష్ట్రాలకు కృష్ణా బోర్డు ఆదేశం
-
డీపీఆర్‌లు ఇవ్వాల్సిందే
కృష్ణా బేసిన్‌లోని అన్ని ప్రాజెక్టుల డీపీఆర్‌లు అడిగాం. అనుమతులు లేని ప్రాజెక్టులపై ముందుకెళ్లొద్దని చెప్పాం. ప్రభుత్వాల అనుమతితో డీపీఆర్‌లు ఇస్తామని ఇరు రాష్ట్రాల ఇంజనీర్లు చెప్పారు. బోర్డు విజయవాడకు తరలింపుపై కేంద్ర జల శక్తి శాఖ ఆదేశాల కోసం చూస్తున్నాం. అపెక్స్ కౌన్సిల్ భేటీకి ఎజెండా అడిగాం. రాష్ట్రాలు పంపే ఎజెండా కోసం ఎదురుచూస్తున్నాం. – పరమేశం, బోర్డు చైర్మన్ సాక్షి, హైదరాబాద్: కృష్ణా నది బేసిన్ పరిధిలో కొత్తగా చేపట్టిన ప్రాజెక్టులకు సాంకేతిక అనుమతి కోసం సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్)లను కృష్ణాబోర్డు, కేంద్ర జల సంఘానికి ఇవ్వాల్సిం దేనని తెలుగు రాష్ట్రాలను బోర్డు ఆదేశించింది. అలాగే అపెక్స్ కౌన్సిల్ అనుమతి కోసం పంపాలని సూచించింది. బోర్డు, అపెక్స్ కౌన్సిల్ అనుమతి లేని ప్రాజెక్టులపై ముందు కెళ్లొద్దని పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వాల అనుమతి తీసుకొని డీపీఆర్‌లను అందిస్తామని ఇరు రాష్ట్రాల అధికారులు తెలిపారు. అయితే ఎప్పటిలోగా డీపీఆర్‌లు ఇవ్వాలన్న దానిపై మాత్రం నిర్ణీత సమయాన్ని ప్రకటించలేదు. కృష్ణా నదీ బేసిన్ల పరిధిలో ప్రాజెక్టుల కింద ఈ ఏడాది కూడా గతేడాదిలాగే 34:66 నిష్పత్తిన నీటిని పంచుకునేందుకు తెలంగాణ, ఏపీ రాష్ట్రాలు అంగీకరించాయి. మైనర్ ఇరిగేషన్ కింద జరుగుతున్న నీటి వినియోగం, మళ్లింపు జలాల అంశంపై తేల్చేవరకు పాత వాటాల ప్రకారమే నీటిని పంచుకోవాలన్న బోర్డు సూచనకు ఇరు రాష్ట్రాలు సమ్మతిం చాయి. కృష్ణా నది బేసిన్ పరిధిలో ఇరు రాష్ట్రాల మధ్య నెలకొన్న వివాదాలు, ఈ ఏడాదిలో నీటి పంపిణీ, డీపీఆర్‌లు, మళ్లింపు జలాల్లో వాటా, టెలిమెట్రీ వ్యవస్థల ఏర్పాటు అంశాలపై చర్చించేందుకు కృష్ణాబోర్డు గురు వారం జలసౌధలో భేటీ అయింది. బోర్డు చైర్మన్ పరమేశం అధ్యక్షతన జరిగిన ఈ భేటీకి తెలంగాణ, ఏపీ నీటిపారుదల శాఖ కార్య దర్శులు రజత్‌కుమార్, ఆదిత్యనాధ్ దాస్లతో పాటు ఈఎన్సీలు మురళీధర్, నారాయణరెడ్డి, తెలంగాణ ఇంజనీర్లు నరసింహారావు, నర్సింహా తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా బోర్డు అజెండా అంశాలతో పాటు ఇరు రాష్ట్రాలు ప్రతిపాదించిన అంశాలపై 6 గంటల పాటు చర్చించారు. ఈ భేటీలో కొత్త ప్రాజెక్టుల డీపీఆర్‌లు, నీటి వాటాల అంశంపై వాడీవేడీగా వాదనలు జరిగాయి. అప్పటిదాకా చెరిసగం.. ఇరు రాష్ట్రాలు తమ ప్రాజెక్టుల డీపీఆర్‌లను ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలతో మాట్లాడిన అనంతరం డీపీఆర్‌లు ఇచ్చేందుకు అంగీకారం తెలిపినట్లు భేటీ అనంతరం కృష్ణా బోర్డు చైర్మన్ పరమేశం వెల్లడించారు. మైనర్ ఇరిగేషన్ కింద నీటి వినియోగం, మళ్లింపు జలాలపై తుది నిర్ణయం చేసే వరకు గతేడాదిలో ఉన్న మేర ఇరు రాష్ట్రాలు 34ః 66 నిష్పత్తిన నీటిని వాడుకునేందుకు తెలంగాణ, ఏపీ రాష్ట్రాలు అంగీకరించినట్లు తెలిపారు. టెలీమెట్రీ రెండో విడత ఏర్పాటుకు సంబంధించి నిధులు విడుదల చేసేందుకు కూడా ఇరు రాష్ట్రాలు అంగీకరించినట్లు వెల్లడించారు. ఇక, శ్రీశైలం, నాగార్జునసాగర్‌ల కింద విద్యుదుత్పత్తిని 50ః 50 నిష్పత్తిన చేసుకునేందుకు ఓకే చెప్పాయి. వరద జలాల వినియోగం సైతం ఏ విధమైన పంపిణీ ఉండాలన్న దానిపై సీడబ్ల్యూసీ సీఈ నేతత్వంలోని కమిటీ తేల్చే వరకు ఇరు రాష్ట్రాలు 50ః 50 నిష్పత్తిన పంచుకునేందుకు అంగీకారం తెలిపాయి. గృహావసరాలకు వినియోగించే నీటిలో 20 శాతాన్ని మాత్రమే వినియోగం కింద చూపాలన్న అంశంపై సీడబ్ల్యూసీ తేలుస్తుందని బోర్డు స్పష్టం చేసింది. ఈ ఏడాది వినియోగించుకోలేని నీటిని తర్వాతి ఏడాదికి క్యారీ ఓవర్ చేయాలన్న తెలంగాణ వినతిపై ఏపీ ప్రభుత్వం తన అభిప్రాయాన్ని తెలిపాక నిర్ణయిస్తామని స్పష్టం చేసింది. ఇక, గోదావరి నుంచి కృష్ణా బేసిన్‌కు నీటి మళ్లింపుతో దక్కే నీటి వాటాల పంపిణీ అంశంపై కేంద్ర జల శక్తి పరిశీలనకు పంపినట్లు బోర్డు స్పష్టం చేసింది. ఇక బోర్డు కార్యాలయాన్ని విజయవాడకు తరలించే అంశం జలశక్తి సూచన మేరకు ఉంటుందని తెలిపింది. జలసౌధలో గురువారం జరిగిన కృష్ణా బోర్డు సమావేశం అనంతరం బయటకు వస్తున్న రజత్‌కుమార్ తెలంగాణ వాదనలు ఇలా.. ► పాలమూరు–రంగారెడ్డి, డిండి, తుమ్మిళ్ల ప్రాజెక్టు పూర్తిగా పాతవే. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు డీపీఆర్ తయారు చేయాలని 2013 ఆగస్టులోనే అప్పటి ప్రభుత్వం జీవో–72 ఇచ్చింది. 2014 ఏప్రిల్ ఎన్నికల సభలో ప్రధాని నరేంద్రమోదీ సైతం ఈ ప్రాజెక్టును పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. బోర్డు సమావేశంలో మోదీ మాట్లాడిన వీడియోను రజత్‌కుమార్ ప్రదర్శించారు. ► డిండి ప్రాజెక్టును 2007 జూలైలోనే జీవో–159 ఇచ్చారు. ఇది ముమ్మాటికీ పాత ప్రాజెక్టు. ► తెలంగాణ ఏర్పాటు అనంతరం వీటిని రాష్ట్ర అవసరాలకు అనుగుణంగా మార్పులు చేర్పులు చేసుకున్నాం. రీ–ఇంజనీరింగ్ చేశాం.. తప్పితే కొత్తగా చేపట్టినవి కావు. ► 2016 సెప్టెంబర్‌లో జరిగిన అపెక్స్ కౌన్సిల్ భేటీలో ఈ ప్రాజెక్టులు పాతవేనని స్పష్టం చేశాం. అనంతరం పాలమూరు ప్రాజెక్టుకు కేంద్రం అటవీ అనుమతులు, పర్యావరణ అనుమతులు ఇచ్చింది. డిండి ప్రాజెక్టుకు సైతం వివిధ కేంద్ర అనుమతులు పొందేందుకు టీవోఆర్ ఇచ్చింది. ► ఏపీ జీవో 203లో పేర్కొన్న శ్రీశైలం నుంచి 3 టీఎంసీల నీటిని తీసుకుంటూ చేపట్టిన రాయలసీమ ఎత్తిపోతల పథకం, పోతిరెడ్డి పాడు కాల్వల సామర్థ్యం 44 వేల క్యూసెక్కుల నుంచి 80 వేల క్యూసెక్కులకు పెంపు ప్రతిపాదనలు పూర్తిగా కొత్తవి. వీటికి అటు బోర్డు కాని, ఇటు అపెక్స్ కౌన్సిల్ అనుమతి కానీ లేదు. కావున ఇవి పూర్తిగా కొత్తవే. వీటిని అపెక్స్ ముందు పెట్టాలి. అప్పటివరకు వీటిని ఆపాలి. ► పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ ద్వారా 101 టీఎంసీల మేర మాత్రమే నీటిని తీసుకునే వెసులుబాటు ఉన్నా గడిచిన రెండేళ్లుగా ఏపీ వినియోగం వరుసగా 115 టీఎంసీ, 175 టీఎంసీలుగా ఉంది. ► శ్రీశైలం ఆధారంగా తెలంగాణ చేపట్టిన ప్రాజెక్టులన్నీ 60 వరద దినాలను పరిగణనలోకి తీసుకుంది. కానీ ఏపీ మాత్రం ప్రస్తుతం 30 వరద దినాలనే పరిగణనలోకి తీసుకొని నీటిని తరలించుకునే ప్రయత్నాలు చేస్తోంది. ఇది అసంబద్ధం. ► పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ ద్వారా తాగునీటికి తమకు 3.5 టీఎంసీలు సరిపోతాయని బ్రిజేశ్ ట్రిబ్యునల్ ముందు వేసిన అఫిడవిట్లో తెలంగాణ పేర్కొంది కావున ఇప్పుడు దాని సామర్థ్యాన్ని ఇంతలా పెంచాల్సిన అవసరం లేదు. ► పోతిరెపడ్డిపాడు ద్వారా శ్రీశైలంలో 880 అడుగులున్నప్పుడు మాత్రమే 44 వేల క్యూసెక్కులు తీసుకెళ్లే వీలుంది. తగ్గిన పక్షంలో అంత నీటిని తీసుకెళ్లలేమనే ఏపీ వాదన తప్పు. 870 అడుగుల మట్టంలోనే 44 వేల క్యూసెక్కులు తీసుకెళ్లొచ్చు. 865 మట్టంలో 33 వేలు, 859 అడుగుల మట్టంలో 20 వేల క్యూసెక్కుల నీటిని తీసుకోవచ్చు. ► శ్రీశైలం వరద జలాలపై ఆధారపడి కల్వకుర్తి (40 టీఎంసీ), ఎస్ల్బీసీ(30), పాలమూరు–రంగారెడ్డి (90), డిండి (30 టీఎంసీ)ల ప్రాజెక్టులను తెలంగాణ నిర్మిస్తోంది. ఇవన్నీ ఉమ్మడి నల్లగొండ, మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాల అవసరాలు తీర్చేవే. కనీసంగా 20 లక్షల ఎకరాలకు నీళ్లిచ్చేవి. శ్రీశైలం నీళ్లు ఏపీ తరలించుకుపోతే ఈ ప్రాంతమంతా ఎడారిగా మారుతుంది. ► శ్రీశైలం నుంచి నాగార్జునసాగర్‌కు నీరు రావాలంటేనే సెప్టెంబర్ పడుతుంది. ప్రస్తుతం శ్రీశైలం నుంచి నీటిని ఎప్పటికప్పుడు తీసుకుంటే అక్టోబర్, నవంబర్ వరకు నీరు రావడం గగనమే. అదే జరిగితే సాగర్ కింది ఆయకట్టు 6.4 లక్షల ఎకరాలతో పాటు ఏఎంఆర్పీ తాగు, సాగు నీటి అవసరాలకు పూర్తిగా విఘాతమే. ► 1978 గోదావరి అవార్డు ప్రకారం పోలవరం ప్రాజెక్టు చేపట్టిన వెంటనే నాగార్జునసాగర్‌కు ఎగువన ఉన్న రాష్ట్రాలకు అంతే పరిమాణంలో నీటి హక్కులు సంక్రమిస్తాయి. ఆ లెక్కన తెలంగాణకు 45 టీఎంసీల వాటా రావాలి. పోలవరం కాకుండా వేరే ఇతర ప్రాజెక్టులు చేపట్టినా అంతే నీటి వాటా దక్కుతుంది. ప్రస్తుతం పట్టిసీమ ద్వారా నీటి మళ్లింపు జరుగుతున్నందున కనీసంగా 45 టీఎంసీల వాటా తెలంగాణకు ఇవ్వాలి. ఈ ఏడాదే 299 టీఎంసీల వాటాకు కలపాలి. ► ఈ ఏడాదిలో సాగర్ కింద కేటాయింపులు ఉండి, వినియోగించుకోలేకపోయిన నీళ్లు 50 టీఎంసీల వరకు ఉన్నాయి. వాటిని ఈ ఏడాది వాటర్ ఇయర్లో తెలంగాణకు క్యారీ ఓవర్ చేయాలి. ► వరద భారీగా ఉన్న రోజుల్లో చేసే వినియోగాన్ని రాష్ట్రాల వినియోగం కింద చూడరాదన్న ఏపీ వాదన తప్పు. వరద ఉండే రోజుల్లో ఏపీ రోజుకు 48 వేల క్యూసెక్కుల నీటిని మళ్లించి 300 టీఎంసీల మేర నీటిని నింపుకునేలా రిజర్వాయర్లు ఉన్నాయి. కానీ తెలంగాణకు రోజుకు 3,200 క్యూసెక్కుల నీటిని మాత్రమే మళ్లించే సామర్థ్యం ఉంది. కావున వరద జలాలను వినియోగ లెక్కల్లో చూపాల్సిందే. బోర్డు సమావేశం అనంతరం బయటకు వస్తున్న ఆదిత్యనాథ్ దాస్, మురళీధర్ తదితరులు ఏపీ వాదనలు ఇవి.. ► పాలమూరు ప్రాజెక్టులకు ఉమ్మడి రాష్ట్రంలో వాటినే చేపట్టేందుకు ఉన్న సాధ్యాసాధ్యాలు తేల్చేందుకు మాత్రమే అనుమతులు ఇచ్చారు. జూరాల ప్రాజెక్టు జల విస్తరణ ప్రాంతం నుంచి నీటిని తరలించేలా సాధ్యాసాధ్యాల నివేదికకు అనుమతిస్తే, తెలంగాణ దాన్ని శ్రీశైలం నుంచి 90 టీఎంసీలు తరలించేలా చేపట్టింది. ఉమ్మడి రాష్ట్రంలో ఇచ్చిన జీవోలపై నివేదికలు రాలేదు. రాష్ట్ర విభజన తర్వాతే తెలంగాణ దాన్ని చేపట్టింది. కావున అది ముమ్మాటికీ కొత్త ప్రాజెక్టుగానే పరిగణించాలి. ► డిండి ప్రాజెక్టుకు సర్వేకు మాత్రమే అనుమతిచ్చారు. తప్పితే అది చేపట్టేందుకు కాదు. దీన్ని తెలంగాణ కొత్తగా చేపడుతోంది. ఇక తుమ్మిళ్ల ఎత్తిపోతలకు ఎలాంటి అనుమతులు లేవు. భక్త రామదాస సైతం కొత్తదే. మా రాష్ట్ర ప్రయోజనాలకు ఈ ప్రాజెక్టులు విఘాతం. ► కల్వకుర్తి, నెట్టెంపాడు, ఎస్ఎల్బీసీ ప్రాజెక్టుల సామర్థ్యాలను సైతం పెంచారు. ఈ అన్ని ప్రాజెక్టులకు బోర్డు, కేంద్ర జల సంఘం, అపెక్స్ కౌన్సిల్ అనుమతి లేదు. వీటన్నింటినీ కొత్త ప్రాజెక్టుగానే పరిగణించాలి. ► అనుమతి లేని ప్రాజెక్టులు, నిర్మాణంలోని ప్రాజెక్టు సామర్థ్యం పెంపుతో తెలంగాణ అదనంగా 178 టీఎంసీల మిగులు జలాలు తరలిస్తోంది. వీటి ప్రభావం రాయలసీమ జిల్లాలతో పాటు నెల్లూరు, ప్రకాశం జిల్లాలపై ఉంటుంది. ► బేసిన్‌లోని శ్రీశైలం, సాగర్లను కచ్చితంగా బోర్డు నియంత్రణలోకి తేవాలి. నీటి విడుదల అజమాయిషీ బోర్డు చేతుల్లో ఉంటేనే సజావుగా ఉంటుంది. వివాదాలకు ఆస్కారం ఉండదు. ► రాష్ట్ర పునర్ వ్యవస్థీకరణ చట్టంలో పేర్కొన్న మేరకు బోర్డును విజయవాడకు తరలించాలి. ► పట్టిసీమ ద్వారా మళ్లించే జలాలపై కేంద్ర జల శక్తి శాఖ మాత్రమే నిర్ణయం చేయాలి. తెలంగాణ సైతం గోదావరి జలాలను కృష్ణా బేసిన్‌కు తరలిస్తున్నారు. దీనిపైనా తేల్చాల్సి ఉంది. ► శ్రీశైలంలో 800 అడుగుల్లో నుంచి నీటిని తీసుకొని రాయలసీమ, నెల్లూరు జిల్లాల అవసరాలు తీర్చేందుకు పోతిరెడ్డిపాడు కాల్వల సామర్థ్యం పెంపు, రాయలసీమ ఎత్తిపోతల పథకాలను చేపట్టాం. రాష్ట్రానికి ఉన్న 511 టీఎంసీల వాటాల్లోంచే నీటిని వినియోగించుకుంటాం. -
రేపు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం
సాక్షి, హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల మధ్య అపరిషృతంగా ఉన్న సమస్యలపై చర్చించడానికి ఇరువురు ముఖ్యమంత్రులు శుక్రవారం భేటీ కానున్నారు. ప్రగతి భవన్లో రేపు ఉదయం 10 గంటలకు తెలంగాణ సీఎం కేసీఆర్‌తో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో విభజన అంశాలు, కృష్ణా, గోదావరి నదుల నీటి వినియోగంపై ముఖ్యమంత్రులు చర్చించనున్నారు. ఈ సమావేశానికి ఇరు రాష్ట్రాల ఉన్నతాధికారులు కూడా హాజరవుతారు. -
‘కృష్ణా’లో కొత్త సమస్య!
ఈ నెలాఖరున ముగియనున్న బోర్డు చైర్మన్ పదవీకాలం ∙కొత్త చైర్మన్ నియామకంపై ఉలుకూపలుకూ లేని కేంద్రం సాక్షి, హైదరాబాద్: కృష్ణా జలాల పంపకాలపై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల మధ్య వివాదాలు ఓ కొలిక్కి రాకముందే మరో కొత్త సమస్య వచ్చి పడింది. ప్రస్తుతం కృష్ణా బోర్డు ఇన్చార్జి చైర్మన్‌గా వ్యవహరిస్తున్న రామ్ శరాణ్ పదవీ కాలం ఈ నెలతో ముగియనున్నా.. ఆ స్థానం లో మరొకరిని భర్తీ చేయడంపై కేంద్రం ఎలాం టి కసరత్తు చేయకపోవడం కలవర పరు స్తోంది. ఇప్పటికే కృష్ణా జలాల పంపకాలపై ఇరు రాష్ట్రాల మధ్య భిన్నాభిప్రాయాలు, పరస్పర ఫిర్యాదులు, విజ్ఞప్తులు నెలకొన్నాయి. ఈ సమయంలో చైర్మన్ పదవి ఖాళీ అవుతుండడంతో.. అది భర్తీ అయ్యే వరకూ జల వివాదాల పరిష్కారంలో జాప్యం తప్పని పరిస్థితి కనిపిస్తోంది. కేంద్రం నిర్లక్ష్యం వాస్తవానికి బోర్డులకు చైర్మన్ల నియామకంపై కేంద్రం తొలి నుంచీ నిర్లక్ష్యంగానే వ్యవహరి స్తోంది. కృష్ణా బోర్డు ఏర్పాటైన తొలినాళ్లలో అప్పటి కేంద్ర జల సంఘం చైర్మన్ ఏబీ పాండ్యాకు చైర్మన్ బాధ్యతలు కట్టబెట్టింది. అనంతరం మూడు నెలలకు కొత్తగా ఎస్కేజీ పండిత్‌కు బాధ్యతలు కట్టబెట్టినా... ఓ నాలుగు నెలల తర్వాత గోదావరి బోర్డుకు ఆయన్నే ఇన్చార్జి చైర్మన్‌గా నియమించింది. ఆయన పదవీకాలం ముగిశాక కేవలం నెల రోజుల్లో పదవీ విరమణ చేయనున్న ఎన్ఏవీ నాథన్‌ను కృష్ణా బోర్డు చైర్మన్‌గా నియమించింది. ఆయన నెల రోజుల్లోనే పదవీ విరమణ చేసి వెళ్లిపోవడంతో.. గోదావరి బోర్డు చైర్మన్‌గా ఉన్న రామ్శరాణ్కు కృష్ణా బోర్డు బాధ్యతలు కూడా అప్పగించింది. తాజాగా రామ్‌శరాణ్ పదవీకాలం ఈ నెలాఖరుతో ముగుస్తోంది. అంటే ఇక రెండు బోర్డులకూ చైర్మన్ పదవి ఖాళీ అవుతుంది. కానీ కొత్త చైర్మన్ల నియామకంపై కేంద్రం ఇప్పటివరకు ఎలాంటి కసరత్తు చేపట్టకపోవడం గమనార్హం. ఇప్పటికే ప్రాజెక్టుల నిర్వహణ, నియంత్రణ, ఉమ్మడి ప్రాజెక్టుల నీటి కేటాయింపులు, వాటాలపై రెండున్నరేళ్లుగా వివాదాలు కొనసాగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో చైర్మన్ లేకపోవడం కొత్త సమస్యగా కనిపిస్తోంది. కాగా కేంద్రం ఏదో ఒక బోర్డుకు చైర్మన్‌ను నియమించి వారికే రెండు బోర్డుల బాధ్యతలు అప్పగించే అవకాశముందని నీటి పారుదల వర్గాల ద్వారా తెలుస్తోంది. అఫిడవిట్‌పై మరింత గడువు కోరనున్న తెలంగాణ కృష్ణా జలాల వివాదంపై బ్రిజేశ్ ట్రిబ్యునల్ ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన దృష్ట్యా... ట్రిబ్యునల్‌కు సమర్పించాల్సిన అఫిడవిట్‌పై మరిం త గడువు కోరాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. దీనిపై ఒకట్రెండు రోజుల్లో ట్రిబ్యు నల్కు లేఖ రాయనున్నట్లు తెలిసింది. ట్రిబ్యునల్ తన తీర్పు సందర్భంగా ఏపీ పునర్విభజన చట్టంలోని సెక్షన్ 89లోని ఏ, బీ క్లాజులపై తెలంగాణ, ఏపీలు 4 వారాల్లో తమ అభిప్రా యాలు చెప్పాలని కోరింది. దీనిపై ఇప్పటికే ఓమారు గడువు పొడిగింపు కోరగా ట్రిబ్యునల్ ఈ నెల 30 వరకు గడువిచ్చింది. తాజాగా మరోమారు గడువు పొడిగింపు కోరనున్నారు. -
తేలనున్న గోదావరి అదనపు జలాల లెక్క!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రానికి వరప్రదాయనిగా ఉన్న గోదావరిలో అదనపు జలాల లభ్యత లెక్కలు త్వరలోనే తేలనున్నాయి. అన్నీ కుదిరితే ఈ నెలాఖరుకే తేటతెల్లం కానున్నాయి. ఈ మేరకు బుధవారం ఢిల్లీలో నదుల అనుసంధాన విధాన రూపకల్పనపై కేంద్ర జల వనరుల శాఖ నియమించిన టాస్క్‌ఫోర్స్ కమిటీకి జాతీయ జల అభివృద్ధి సంస్థ (ఎన్‌డబ్ల్యూడీఏ) హామీ ఇచ్చింది. ఇదే సందర్భంలో అదనపు జలాల లభ్యతపై కమిటీ రాష్ట్ర ప్రభుత్వ వివరణను కోరింది. రాష్ట్రం సైతం తాను చెప్పిన లెక్కలను సమర్పిస్తే అదనపు జలాలపై ఓ అంచనాకు వ స్తామని వెల్లడించింది. రాష్ట్రం, ఎన్‌డబ్ల్యూడీఏ సమర్పించే లెక్కల ఆధారంగానే కేంద్రం నదుల అనుసంధానంపై భవిష్యత్ ప్రణాళికను రూపొందించే అవకాశం ఉంది. ఒడిశాలోని మహానది మొదలు తెలంగాణ, ఏపీలోని గోదావరి, కృష్ణాలను కలుపుతూ తమిళనాడు, కర్ణాటక పరిధిలోని కావేరి నది వరకు అనుసంధానించే ప్రక్రియను చేపట్టిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా మహానదిలో సుమారు 360 టీఎంసీలతో పాటు గోదావరిలో ఏపీ, తెలంగాణకున్నా 1,480 టీఎంసీల కేటాయింపులు పోనూ మరో 530 టీఎంసీల మిగులు జలాలున్న దృష్ట్యా వాటిని రాష్ట్ర పరిధిలో ఇచ్ఛంపల్లి (గోదావరి)-నాగార్జునసాగర్ (కృష్ణా), ఇచ్ఛంపల్లి-పులిచింతల ప్రాజెక్టులను అనుసంధానించి గోదావరి నీటిని కృష్ణాకు తరలించాలని ప్రణాళిక వేసింది. దీనిపై మానిటరింగ్ కమిటీ బుధవారం మరోమారు అన్ని రాష్ట్రాలతో కీలక సమావేశాన్ని నిర్వహించింది. ఈ కమిటీలో రాష్ట్రానికి చెందిన కేంద్ర జల వనరుల మంత్రి సలహాదారు వెదిరె శ్రీరామ్ సభ్యుడి హోదాలో హాజరవగా, తెలంగాణ నుంచి నీటి పారుదల శాఖ ముఖ్యకార్యదర్శి ఎస్కే జోషి, ఏపీ కార్యదర్శి ఆదిత్యనాథ్‌దాస్‌లు హాజరయ్యారు. నెలాఖరుకు తేలుస్తాం అదనపు జలాలపై తెలంగాణ మరోమారు తన అభ్యంతరాలను కమిటీ దృష్టికి తెచ్చింది. గోదావరిలో లభ్యంగా ఉన్న 980 టీఎంసీల నీరు రాష్ట్ర అవసరాలకే సరిపోతుందని, ఎప్పుడో 30 ఏళ్ల కిందట చేసిన అధ్యయనాన్ని పట్టుకొని గోదావరిలో అదనపు జలాలున్నాయనడం సరికాదంది. గ్రావిటీ ద్వారా వచ్చే 500 టీఎంసీల అదనపు జలాల్లో కేవలం 40 టీఎంసీలు తెలంగాణకు కేటాయించి మిగతా 460 టీఎంసీలను కృష్ణా ద్వారా పెన్నాకు తరలించుకుపోతామంటే అంగీకరించబోమని స్పష్టం చేసింది. అదీగాక గోదావరిపై కొత్తగా చేపడుతున్న ప్రాణహిత-చేవెళ్ల (160 టీఎంసీలు), ఎల్లంపల్లి (60 టీఎంసీలు), దేవాదుల (38 టీఎంసీలు), కంతనపల్లి (50 టీఎంసీలు) వంటి ప్రాజెక్టులు పూర్తయితే అదనపు జలాలు ఉండవని తెలిపినట్లు సమాచారం. అయితే పాత లెక్కలు కాకుండా కొత్తగా 2015 లెక్కల ఆధారంగా గోదావరిలో అదనపు జలాల లభ్యతను లెక్కిస్తున్నామని, నెలాఖరుకు స్పష్టత వస్తుందని ఎన్‌డబ్ల్యూడీఏ పేర్కొంది. మహానది లెక్కలు రూర్కీ పరిశీలనకు ఇక మహానదిలో అదనపు జలాలపై ఎన్‌డబ్ల్యూడీఏ వేసిన లెక్కలను ఒడిశా తప్పుబట్టింది. ఎన్‌డబ్ల్యూడీఏ చెప్పినట్లు 180 టీఎంసీల అదనపు జలాలు లేవని, ఏవైనా కొద్దిపాటి జలాలున్నా, అవి తమ భవిష్యత్తు అవసరాలకే సరిపోతాయని తెలిపింది. దీనిపై భిన్నాభిప్రాయాలు రావడంతో వాస్తవ లెక్కలను పరిశీలించే బాధ్యత ను కమిటీ రూర్కీలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హైడ్రాలజీకి అప్పగించినట్లు సమాచారం. -
రాష్ట్ర విభజనతో రాష్ట్ర ప్రాజెక్టులను వదులుకోవాల్సిందే!
నీటి కేటాయింపు, వాడకంలో వివాదం తలెత్తితే.. పరిష్కారం అంత సులభంగా రావటం లేదు. ఆయా నదులపై ఆధారపడ్డ రాష్ట్రాలు తవుకు అన్యాయుం జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేస్తే.. సవుస్య పరిష్కారానికి సుప్రీంకోర్టు ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేస్తోంది. అరుుతే ఈ ట్రిబ్యునల్‌లో ఆయూ రాష్ట్రాలు తవుతవు వాదనలను వినిపించటం, తర్వాత ట్రిబ్యునల్ తీర్పు వెల్లడించటం, అది అవుల్లోకి రావటం, తీర్పుపై వుళ్లీ అభ్యంతరాలు రావటం సర్వసధారణమైంది. దాంతో రాష్ట్రాల వుధ్య నెలకొన్న జల వివాదం ఏళ్ల తరబడి కొనసాగుతోంది. ఫలితంగా సదరు నదులపై ఆధారపడ్డ ప్రజల వుధ్య శత్రుత్వం పెరిగిపోతోంది. ఉదాహరణకు కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల వుధ్య కొనసాగుతున్న కావేరి జల వివాదం తరచుగా ఉద్రిక్తతలకు దారి తీస్తోంది. ఈ వివాద పరిష్కారానికి ట్రిబ్యునల్ ఏర్పడి సువూరు 24 సంవత్సరాలు గడుస్తున్నా.. ఇంకా పరిష్కారానికి రాలేకపోతున్నారు. ఆఖరికి దేశ ప్రధాన వుంత్రి కల్పించుకునే దశకు చేరినా.. సవుస్యకు పరిష్కార వూర్గం కనిపించటం లేదు. పదేళ్లుగా సా...గుతున్న కృష్ణా ట్రిబ్యునల్: ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, వుహారాష్ట్రల వుధ్య నెలకొన్న కృష్ణా జల వివాద పరిష్కారానికి ఉద్దేశించినరెండో కృష్ణా ట్రిబ్యునల్ ఏర్పడి పదేళ్లు. వుధ్యంతర తీర్పును వెల్లడించినా.. దీనిపై అన్ని రాష్ట్రాల నుంచి అభ్యంతరాలు వ్యక్తం కావటంతో వుళ్లీ సవరణల కోసం వాదనలు కొనసాగుతున్నాయి. వంశధార ట్రిబ్యునల్ పరిస్థితి కూడా ఇంతే. వంశధార నదిపై వునకు, ఒరిస్సాకు ఉన్న అభ్యంతరాలను పరిశీలించటానికి ఉద్దేశించిన ఈ ట్రిబ్యునల్ ఏర్పడి నాలుగేళ్లయినా వాదనల ప్రక్రియ ముగియలేదు. ఇతర రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి: ఇతర రాష్ట్రాల్లోని ట్రిబ్యునళ్ల పరిస్థితి కూడా ఇలాగే ఉంది. పంజాబ్, హర్యానాల వుధ్య నెలకొన్న జల వివాదాన్ని పరిష్కరించటానికి రావి - వియూస్ ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేశారు. కొందరు దుండగులు ట్రిబ్యునల్ సభ్యుడిని హత్య చేయుటంతో ఆ వివాదం ముందుకు కదలటం లేదు. కర్ణాటక - గోవా వుధ్య జల వివాద పరిష్కారం కోసం వుహాదారుు ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేశారు. ఇలా పలు ట్రిబ్యునళ్లు విడివిడిగా ఆయూ రాష్ట్రాల జల వివాదాలను పరిశీలిస్తున్నారుు. అరుుతే ఇవి తుది తీర్పును ప్రకటించటం, దానిని అవులు పరచటంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. శతాబ్దాలు గడిచినా పరిష్కారం కష్టమే! సాగర్, శ్రీశైలంతో పాటు జూరాలపై నియంత్రణ బోర్డులు తప్పవు కృష్ణా జలాలపై ఇప్పటికే కర్ణాటక, మహారాష్ట్రలతో ఏళ్లుగా వివాదాలు ఆంధ్రప్రదేశ్ విభజనతో జల వివాదాలు మరింత సంక్లిష్టమవుతాయి ప్రత్యేక అథారిటీలతో కేంద్ర పర్యవేక్షణలోకి ప్రాజెక్టులు నికర జలాల కేటాయింపులు లేని కొత్త ప్రాజెక్టుల పరిస్థితి ప్రశ్నార్థకం జల వివాదాలు రేగితే ట్రిబ్యునళ్ల ఏర్పాటు.. పరిష్కారానికి దశాబ్దాలు తమిళనాడు - కర్ణాటక మధ్య పాతికేళ్లుగా చల్లారని ‘కావేరి’ చిచ్చు కృష్ణా జలాల ట్రిబ్యునల్ ఎదుట కూడా పదేళ్లుగా సాగుతున్న వాదనలు దేశంలోని ఇతర రాష్ట్రాల మధ్య జల పంపిణీ వివాదాలదీ ఇదే పరిస్థితి