waterlogged
-
విషాదం.. రోడ్డుపై వరద, కరెంట్ షాక్‌కు గురై యువకుడి మృతి
న్యూఢిల్లీ: దేశ రాజధాని విషాదం చోటుచేసుకుంది. యూపీఎస్సీ పరీక్షలకు సన్నధమవుతున్న ఓ విద్యార్ధి విద్యుత్ షాక్‌కు గురై ప్రాణాలు విడిచాడు. మృతుడిని నీలేష్ రాజ్‌గా గుర్తించారు. పటేల్ నగర్ మెట్రో స్టేషన్ సమీపంలో ఈ దుర్ఘటన జరిగింది.వివరాలు.. నీలేష్ రాజ్ అనే యువకుడు పటేల్ నగర్ హాస్టల్లో ఉంటూ సివిల్స్ సర్వీసెస్‌కు ప్రిపేర్ అవుతున్నాడు. అయితే వర్షం కారణంగా రోడ్డుపై నీరు నిలవడంతో అటువైపు వెళ్తున్న నీలేష్ విద్యుత్ షాక్ తగిలి అక్కడికక్కడే కుప్పకూలాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించగా.. రోడ్డు పక్కనున్న ఇనుప గేటు గుండా కరెంట్ పాస్ అవ్వడంతో విద్యుదాఘాతానికి గురైనట్లు తెలిపారు. నీలేష్‌ను వెంటనే ఆర్ఎంఎల్ ఆస్పత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. గేట్‌కు కరెంట్ ఎలా పాస్ అయ్యిందో తెలుసుకునేందనే విషయంపై దర్యాప్తు చేపట్టారు. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఓ అమాయక వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడని స్థానికులు మండిపడుతున్నారు. -
Delhi Rains: నీట మునిగిన ఢిల్లీ
న్యూఢిల్లీ: దేశ రాజధాని నీట మునిగింది. రికార్డు స్థాయి భారీ వర్షాలకు అతలాకుతలమైంది. ఢిల్లీతో పాటు జాతీయ రాజధాని ప్రాంతం (ఎన్సీఆర్)లో వరుసగా శుక్రవారం రెండో రోజూ భారీ వర్షం కురిసింది. తెల్లవారుజాము నుంచి ఉరుములు, మెరుపులతో ఎడతెగని వర్షం పడింది. దాంతో భరించలేని ఎండలతో ఉక్కిరిబిక్కిరవుతున్న ఢిల్లీ వాసులకు ఉపశమనం కలిగినా నగరంలో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. ఢిల్లీలోని పలు ప్రాంతాలతో పాటు ఎన్సీఆర్ రోడ్లను వరదలు ముంచెత్తాయి. వరద నీటి ధాటికి చాలాచోట్ల డ్రైనేజీ వ్యవస్థ స్తంభించిపోవడంతో సమస్య మరింత విషమించింది. సమీప ప్రాంతాలన్నింటినీ వరద ముంచెత్తింది. ఢిల్లీ జల మంత్రి ఆతిశితో పాటు శశి థరూర్ తదితర ఎంపీల నివాసాలు కూడా నీట మునిగాయి. వారి ఇళ్లలోని ఫరి్నచర్ తదితరాలు వరద నీటిలో తేలియాడుతూ కని్పంచాయి. వర్షాలు, సంబంధిత ఉదంతాల్లో ఐదుగురు మరణించారు. నీటితో నిండిపోయిన అండర్‌పాస్‌ల్లో వాహనాలు తేలియాడాయి. పలుచోట్ల వాటిలో ప్రయాణికులు గంటలపాటు చిక్కుకున్నారు. గుర్గావ్లోని పలు నివాస ప్రాంతాలు నీట మునిగాయి. దీంతో ట్రాఫిక్ గందరగోళం ఏర్పడింది. తూర్పు ఢిల్లీలోని అక్షరధామ్ నుంచి గాజీపూర్ దాకా, అక్షరధామ్–సరాయ్ కాలే ఖాన్ రహదారిపైనా... ఇలా ఎక్కడ చూసినా ట్రాఫిక్ గంటల తరబడి నిలిచిపోయి జనాలకు చుక్కలు చూపింది. ఎక్కడ చూసినా మోకాలి లోతు, అంతకు మించి వరద కని్పంచింది. పలు చోట్ల మెట్రో స్టేషన్లు కూడా నీట మునిగాయి. ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్ వాతావరణ కేంద్రంలో ఏకంగా 153.7 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఈదురు గాలుల ధాటికి పలుచోట్ల చెట్లు, కరెంటు స్తంభాలు విరిగిపడ్డాయి. జూలై 3 దాకా వానలే ఢిల్లీ–ఎన్సీఆర్లో గురువారం నుంచి శుక్రవారం ఉదయం దాకా 24 గంటల్లో 228 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అక్కడ గత 88 ఏళ్లలో అత్యధిక వర్షపాతంగా రికార్డుకెక్కింది. జూన్‌లో ఢిల్లీలో సగటున 80.6 మి.మీ వర్షం కురుస్తుంది. ఢిల్లీలో ఏడు రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కొనసాగవచ్చని భారత వాతావరణ శాఖ పేర్కొంది. జూలై 3 దాకా ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ‘‘ఈదురుగాలులతో భారీ వర్షాలు పడొచ్చు. జూలై 1, 2 తేదీల్లో ఉరుములతో కూడిన వర్షం పడుతుంది’’ అని పేర్కొంది. -
..వాళ్లొచ్చింది వరద ప్రాంతాల పరిశీలనకట!
-
ఢిల్లీ: వరుణుడి ప్రతాపం.. రోడ్లు జలమయం
సాక్షి, ఢిల్లీ: దేశ రాజధాని ప్రాంతాన్ని మరోసారి వరుణుడు ముంచెత్తాడు. బుధవారం ఉదయం కురిసిన భారీ వర్షంతో నగర వాసులు ఇబ్బందులు పడ్డారు. ఢిల్లీతో పాటు నోయిడా, ఘజియాబాద్ ప్రాంతాల్లో రోడ్లు జలమయం అయ్యాయి. ట్రాఫిక్‌కు విపరీతంగా విఘాతం కలుగుతోంది. బుధవారం భారీ నుంచి అతి భారా వర్షం కురవొచ్చని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. పిడుగులతో కూడిన వర్షం కురవొచ్చని హెచ్చరికలు జారీ చేసింది. ఇదిలా ఉంటే.. తాజా వర్షాలతో యమునా నదికి వరద పోటెత్తుతోంది. మళ్లీ డేంజర్ మార్క్‌కు చేరుకునే అవకాశం ఉండడంతో.. అధికారుల్లో అందోళన నెలకొంది. #WATCH | UP: Noida wakes up to rain lashing parts of the city (Visuals from Noida Sector 20) pic.twitter.com/MMBJ7ExuAa — ANI UP/Uttarakhand (@ANINewsUP) July 26, 2023 #WATCH | Rain lashes parts of the national capital. Visuals from Shantipath. pic.twitter.com/3uosfVnTa9 — ANI (@ANI) July 26, 2023 -
రహదారులే ఏరులైన వేళ.. ఎల్లో అలర్ట్ జారీ
న్యూఢిల్లీ: గత రెండు రోజులుగా వరసగా కురుస్తున్న భారీ వర్షాలకు రహదారులన్ని జలమయమయ్యాయి. ఈ మేరకు వరద తాకిడికి నేలకూలిన చెట్లు, పాడైన రహదారుల జాబితాను విడుదల చేశారు అధికారులు. ఈ క్రమంలోనే ఆ రహదారులకు ప్రత్యామ్నాయంగా తమ ప్రయాణాన్ని ప్లాన్ చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. అంతేగాదు ఢిల్లీ జైపూర్ హైవేపై ఉన్న వరద నీరు, ఆ నీటిలోనే వెళ్తున్న వాహనాలకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట హల్చల్ చేస్తుంది. రహదారులపై నీరు ఎక్కువగా ఉన్న వేగంగా వెళ్లిపోతున్న వాహనాలను ఆ వీడియోలో చూడవచ్చు. ట్రాఫిక్ పోలీసులు రంగంలోకి దిగే సరికి వాహనాలన్ని నెమ్మదిగా వెళ్తుంటాయి. శుక్రవారం ఉదయం నుంచి శనివారం ఉదయం వరకు సుమారు 15 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని భారత వాతావరణ శాఖ పేర్కొంది. అలాగే శనివారం కూడా భారీ వర్షాలు పడే అవకాశం ఉందంటూ...వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. (చదవండి: ఘోర ప్రమాదం..గోడ కూలి 10 మంది దుర్మరణం) -
భారీ వర్షాలతో జనాలు బెంబేలెత్తిపోతుంటే.. అతను మాత్రం భలే ఎంజాయ్ చేస్తున్నాడు
పరిస్థితులు ఎంత భయానకంగా ఉన్న కొంతమంది చాలా గంభీరంగా ప్రశాంతంగా ఉంటారు. వాళ్లో ఎలాంటి ఉద్విగ్నత, భయం ఆందోళన కనిపించవు. ఆ సంకట పరిస్థితిని సైతం ఆనందంగా మలుచుకుంటారు కొందరూ. అచ్చం అలాంటి కోవకు చెందినవాడే ఇతను కూడా. ముంబై గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా అతలాకుతలమవుతోంది. నగరాలకు నగరాలు, మునిగిపోవడమే గాక లోతట్టు ప్రాంత ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. అంతేకాదు వాతావరణ విభాగం(ఐఎండీ) సమీప ప్రాంతాలకు రెడ్ అలర్ట్ జారీ చేయడమే కాక బీచ్‌లను సందర్శించడం కూడా నిషేధించింది. ఐతే ప్రస్తుతం ముంబైలో ఒక వైపు రహదారులన్ని వర్షపు నీళ్లతో నిండిపోవడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడి ప్రజలు నానాతంటాలు పడుతుంటే..ఒకడు మాత్రం ఆ వర్షపు నీటిని హాయిగా ఆస్వాదిస్తూ.. ఎంజాయ్ చేస్తున్నాడు. అంతేకాదు అతను ఏదో వేసవి సెలవులకు మాల్దీవులు వెళ్లి సరదాగా ఎంజాయ్ చేస్తున్నట్లుగా ఆ వర్షపు నీటిలో పడుకుని ఎంజాయ్ చేస్తున్నాడు. అదికూడా రహదారులపై నిండి ఉన్న వాన నీటిలో పడుకుని ఉన్నాడు. మరోవైపు నుంచి ఆ వ్యక్తి సమీపం నుంచి వాహనాలు నీళ్లను చిమ్ముకుంటూ వెళ్లిపోతున్నాయి. అతను మాత్రం తనకేం పట్టనట్లు తన పని తనదే అన్నట్లు అక్కడ ఎంజాయ్ చేస్తున్నాడు. ఐతే ఎందువల్ల అలా పడుకుని ఉన్నాడో అనేది కారణాలు తెలియరాలేదు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఆన్లైన్లో తెగ వైరల్ అవుతోంది. This man feel Maldives in Malad 😄😄bheegi bheegi sadkon par tera intezaar karu …#Mumbaiweather #mumbailocals#MumbaiRains #MumbaiMonsoon pic.twitter.com/AbVJkxKF2L — 🆂🅷🅰🅷🅸🅳 (@iamshahidkhan42) July 8, 2022 -
ముంబైను ముంచెత్తుతున్న వర్షాలు... జలదిగ్బంధంలో నగరం
సాక్షి, ముంబై: దేశ ఆర్థిక రాజధాని ముంబైలో కురుస్తున్న భారీ వర్షానికి రహదారులు, లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. మంగళవారం ఉదయం వీధుల్లో నీరు నిలిచిపోవడంతో వాహనదారులు తెగ ఇబ్బందిపడ్డారు. సియాన్, అంధేరిలో రోడ్డుపై మోకాళ్ల లోతు నీళ్లు చేరుకున్నాయి. కొన్ని రూట్లలో రైళ్లు, బస్సు సర్వీసులకు అంతరాయం ఏర్పడింది. రాబోయే 24 గంటల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం అంచనా వేసింది. మహారాష్ట్ర వ్యాప్తంగా ఆరు జిల్లాల్లో ఎల్లో అలెర్ట్ జారీ అయింది. ముంబైతో పాటు సమీప జిల్లాల్లో ఎన్డీఆర్ఎఫ్ దళాలు అప్రమత్తంగా ఉండాలని మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే ఆదేశించారు. మొదటి వర్షానికే పరిస్థితి ఇలా ఉంటే ఇక ముందుముందు తెరిపి లేకుండా భారీ వర్షాలు కురిస్తే ముంబై పరిస్ధితి ఏంటనే ప్రశ్న తలెత్తుతోంది. వర్షాకాలానికి ముందు బీఎంసీ రూ.కోట్లు ఖర్చుచేసి మురికి కాల్వలు, నాలాలు శుభ్రం చేయిస్తుంది. వర్షా కాలంలో వర్షపు నీరు సాఫీగా సముద్రంలోకి వెళ్లేందుకు వీలుగా పనులు చేపడుతుంది. కానీ ఇప్పటికే కురిసిన భారీ వర్షానికి దాదర్ సర్కిల్, ఫైవ్ గార్డెన్, హిందూకాలనీ, చెంబూర్, వడాల, రఫీ మహ్మద్ కిడ్వాయి మార్గ్ తదితర ప్రాంతాలు జలమయమయ్యాయి. గతంలో నీరు నిల్వని ప్రాంతాల్లో కూడా ఇప్పుడు వర్షపు నీరు నిలిచిపోవడం మొదలైంది. వీటితోపాటు రెండు రోజుల కిందట సెంట్రల్ రైల్వే మార్గంలో థానే, కల్యాణ్ దిశగావెళ్లే లోకల్ రైలు సేవలు కొద్దిసేపు స్తంభించిపోయాయి. పశ్చిమ మార్గంలో అంధేరీ స్టేషన్ సమీపంలో ఉన్న సబ్వేలో కూడా వర్షపు నీరు చేరింది. మూడు అడుగుల మేర వర్షపు నీరు చేరడంతో గత్యంతరం లేక సబ్ వేను మూసివేయాల్సిన పరిస్ధితి వచ్చింది. చివరకు విద్యుత్ మోటర్ పంపుల ద్వారా నీటిని బయటకు తోడాల్సి వచ్చింది. నీరంత బయటకు తోడేసిన తరువాత మరమ్మతులు చేసి సబ్వేను పునఃప్రారంభించారు. అదేవిధంగా ముంబైలోని పేడర్ రోడ్‌పై కొండ చరియలు విరిగిపడ్డాయి. దీంతో ఈ రహదారిని పూర్తిగా మూసివేయాల్సి వచ్చింది. హిందూమాత, దాదర్, తిలక్ నగర్, గాంధీ మార్కెట్ ప్రాంతాల్లో నీరు నిలిచింది. దీంతో బీఎంసీ ఖర్చుచేసిన రూ.కోట్లు వృథా పోయినట్లు స్పష్టమైతోంది. ఏటా వర్షా కాలంలో హిందూమాత, దాదర్ టీటీ, పరేల్ టీటీ, అంధేరీలో మిలన్ సబ్వేలో వర్షపు నీరు చేరడం పరిపాటే. ఏటా వర్షా కాలంలో తమకు ఈ తిప్పలు తప్పవని స్ధానికులు వాపోతుంటారు. కాని బీఎంసీ మాత్రం మురికి కాల్వలు, నాలాలు వంద శాతం శుభ్రం చేశామని, ఈసారి వర్షా కాలంలో నీరు నిల్వదని ప్రగల్భాలు పలుకుతోంది. కానీ ఏటా వర్షా కాలంలో జరిగే పరిణామాల్లో ఏమాత్రం మార్పు ఉండదు. యథాతధంగా రోడ్లన్నీ జలమయం కావడం, లోతట్టు ప్రాంతాల్లో వర్షపు నీరు చేరడం, లోకల్ రైళ్లకు అంతరాయం కల్గడం లాంటివి జరుగుతూనే ఉన్నాయి. #WATCH | Maharashtra: Sion area of Mumbai witnessed waterlogging in the wake of heavy rains in the city. Visuals from last night. pic.twitter.com/tjniUJ74RE — ANI (@ANI) July 5, 2022 (చదవండి: స్పైస్ జెట్‌లో తలెత్తిన సాంకేతిక లోపం...కరాచీలో అత్యవసర ల్యాండింగ్) -
దేశ రాజధానిని ముంచెత్తిన భారీ వర్షం
సాక్షి, న్యూఢిల్లీ : దేశ రాజధానిని భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలతో ఢిల్లీ-జాతీయ రాజధాని ప్రాంతం (ఎన్సీఆర్)లోని పలు చోట్ల రహదారులపై నీరు నిలిచిపోయింది. ఢిల్లీతో పాటు నోయిడా, గ్రేటర్ నోయిడా, ఘజియాబాద్, గురుగ్రాం, ఫరీదాబాద్ ప్రాంతంలో భారీ వర్షాలతో ట్రాఫిక్ ఎక్కడికక్కడ నిలిచిపోయింది. ఢిల్లీలోని భైరాన్‌మార్గ్ అండర్ రైల్వే బ్రిడ్జ్, హనుమాన్ సేటు రింగ్ రోడ్, నేతాజీ సుభాష్ మార్గ్, ఓఖ్లా సబ్జి మండి, మోది మిల్ ప్లైఓవర్, బిహారి కాలనీ రైల్వే బ్రిడ్జి, ఎస్డీఎం ఆఫీస్ నాలా రోడ్డు, గీతా కాలనీ ఫ్లైఓవర్ ప్రాంతాలు జలమయమయ్యాయని అధికారులు తెలిపారు. ఐఐటీ హజ్‌ఖాస్ నుంచి ఎయిమ్స్‌కు వెళ్లే రహదారిపై భారీ చెట్టుకూలి రోడ్డుపై పడటంతో ఆ మార్గంలో వాహనాల రాకపోకలకు అవాంతరం ఏర్పడిందని చెప్పారు. కాగా యమునా బజార్ ప్రాంతంలో తాము ప్రయాణిస్తున్న బస్సు నిలిచిపోవడంతో బస్సులో చిక్కుకున్న 30 మంది ప్రయాణీకులను స్ధానికుల సాయం పోలీసులు కాపాడారు. వర్షపు నీటిలో వాహనాలు ముందుకు కదలకపోవడంతో ఢిల్లీలోని ఐటీఓ, రాంలీలా మైదాన్, మింటో రోడ్ వంటి పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తాయని అధికారులు చెప్పారు. -
17 గ్రామాలకు రాకపోకలు బంద్
పశ్చిమగోదావరి: పశ్చిమగోదావరి జిల్లా పోలవరం మండలంలోని కొత్తూరు కాజ్‌వేపై గోదావరి ఉధృతంగా పొంగి ప్రవహిస్తోంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్నవర్షాలతో ఆదివారం ఉదయం 11 గంటల నుంచి కాజ్‌వేపై నాలుగు అడుగుల ఎత్తులో వరద ప్రవాహం కొనసాగుతోంది. దీంతో 17 గిరిజన గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. మరో అడుగు మేర వరద ప్రవాహం పెరిగితే పడవలను తిప్పేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. -
ఢిల్లీని చుట్టిన వాన ముసురు