waterproof phones
-
ఫోన్ నీటిలో పడిందా..? ఇలా చేయండి..
ప్రతి ఒక్కరి జీవితంలోను ఫోన్ భాగమైపోయింది. స్మార్ట్ఫోనో..ఫీచర్ఫోనో ఏదో ఒకటి తప్పకుండా ఉపయోగిస్తున్నారు. అయితే మనదో..మనకు తెలిసిన వారి ఫోన్ ఎప్పుడో ఒకప్పుడు ప్రమాదవశాత్తు నీటిలో పడిపోవడం చూస్తుంటారు. అలాంటి సమయంలో ఫోన్‌ను వెంటనే ఆరబెట్టే ప్రయత్నంలో కొన్ని పొరపాట్లు చేస్తుంటారు. అయితే ఇలా ఫోన్ నీళ్లలో పడినప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించాలి. అలా చేయడం వల్ల ఫోన్‌ను సురక్షితంగా ఉంచుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. చేయకూడనివి.. నీటిలో తడిచిన వెంటనే ఫోన్‌ను ఎట్టిపరిస్థితుల్లోనూ ఆన్ చేయవద్దు. బటన్లను ప్రెస్ చేయటం కానీ, ఫోన్‌ను షేక్ చేయటం కాని చేయవద్దు. మీకు ఫోన్ గురించి తెలిసినా ఓపెన్ చేయవద్దు. ఇష్టమొచ్చినట్లు ఓపెన్ చేయటం వల్ల వారంటీ కోల్పోవలసి వస్తుంది. తడిసిన ఫోన్‌పై గాలిని ఊదే ప్రయత్నం చేయకూడదు. దాంతో నీరు లోపలి భాగాల్లోకి వెళ్లే ప్రమాదముంది. అవగాహన లేకుండా ఎలాంటి హీట్ డ్రైయర్‌ను ఉపయోగించకూడదు. ఇలా చేయడం వల్ల కూడా ఎక్కువగా నీరు చేరే అవకాశం ఉంటుంది. లేదంటే ఒకే చోట వేడెక్కి మిగతా భాగాలను దెబ్బతీస్తాయి. చేయాల్సినవి.. వారెంటీ, ఇన్సూరెన్స్ ఉంటే వెంటనే సర్వీస్ సెంటర్‌కు తీసుకెళ్లాలి. ఇన్సూరెన్స్ అయిపోతే ముందుగా ఫోన్‌ను ఓపెన్ చేసి సిమ్‌తోపాటు మైక్రో ఓఎస్డీకార్డ్ను తొలగించాలి. రిములబుల్ బ్యాటరీ ఫోన్ అయితే బ్యాటరీని ఫోన్ నుంచి వేరు చేయాలి. క్లాత్ లేదా పేపర్ తీసుకుని చాలా సున్నితంగా ఫోన్లోని తడి భాగాలను తుడవాలి. తడిబారిన ప్రదేశం సాధారణ స్థాయికి వచ్చిన తరువాత సర్వీస్ సెంటర్‌కు తీసుకెళ్లాలి. అయితే జిప్‌లాక్ బ్యాగ్‌లో బియ్యాన్ని వేసి అందులో ఫోన్‌ను ఉంచి కప్పివేయాలని, అందువల్ల తేమశాతం తగ్గుతుందని కొందరు సూచిస్తుంటారు. అయితే దాంతో పూర్తిగా ప్రయోజనం ఉండదు. తాత్కాలికంగా అలా చేసినా మళ్లీ సర్వీస్ సెంటర్‌కు తీసుకెళ్లాలి. -
శామ్సంగ్కు 75 కోట్ల జరిమానా
మెల్బోర్న్: ప్రముఖ ఎలక్ట్రానిక్ కంపెనీ శామ్సంగ్కు ఆస్ట్రేలియా ఫెడరల్ కోర్టు ఝలకిచ్చింది. మొబైల్ ఫోన్లు వాటర్ ప్రూఫ్ అంటూ తప్పుదోవ పట్టించినట్లు వచ్చిన ఫిర్యాదులపై విచారణ జరిపిన కోర్టు శామ్సంగ్కు రూ.75 కోట్ల మేర జరిమానా విధించిందని ప్రభుత్వ నియంత్రణ సంస్థ వెల్లడించింది. 2016 మార్చి నుంచి 2018 అక్టోబర్ మధ్య ఎస్7, ఎస్8 సిరీస్ చెందిన 31 లక్షల గ్యాలెక్సీ ఫోన్లను శామ్సంగ్ ఆస్ట్రేలియా విక్రయించింది. ఈ ఫోన్లు నీళ్లలో తడిచినా పాడవవంటూ ప్రకటనలు ఇచ్చింది. అయితే, నీళ్లలో తడిచిన తర్వాత తమ ఫోన్లు పనిచేయడం లేదంటూ వందలాదిగా వినియోగదారులు ఫిర్యాదు చేశారు. ఇందుకు సంబంధించి 2019లో నమోదైన కేసులపై కోర్టు తాజాగా తీర్పు వెలువరించింది. సంబంధిత ఫోన్లను కొనుగోలు చేసిన వినియోగదారులు శామ్సంగ్ను సంప్రదించాలని సూచించింది. -
సోనీ ఎక్స్పీరియాలో 2 కొత్త స్మార్ట్ఫోన్లు
న్యూఢిల్లీ: సోనీ కంపెనీ ఎక్స్‌పీరియా మోడల్లో రెండు కొత్త స్మార్ట్ఫోన్లను గురువారం మార్కెట్లోకి విడుదల చేసింది. ప్రీమియం హ్యాండ్సెట్ మార్కెట్లో మరింత వాటా సాధించడం లక్ష్యంగా ఈ రెండు కొత్త ఎక్స్‌పీరియా స్మార్ట్ఫోన్లను అందిస్తున్నామని సోనీ ఇండియా డిప్యూటీ జనరల్ మేనేజర్ (సేల్స్ అండ్ మార్కెటింగ్) సచిన్ రాయ్ చెప్పారు. 5.2 అంగుళాల స్క్రీన్ సైజు ఉన్న ఎక్స్‌పీరియా జడ్3 ధర రూ.51,990 అని, 4.6 అంగుళాల స్క్రీన్ సైజు ఉన్న ఎక్స్‌పీరియా జడ్3 కాంపాక్ట్ స్మార్ట్‌ఫోన్ ధర రూ.44,900 అని వివరించారు. గురువారం నుంచే వీటి విక్రయాలు ప్రారంభించామని పేర్కొన్నారు. ఈ రెండు ఫోన్లలలో స్నాప్‌డ్రాగన్ 801 ప్రాసెసర్, 2.5 గిగాహెర్ట్స్ క్వాడ్-కోర్ సీపీయూ, 3 జీబీ ర్యామ్, 4జీ ఎల్టీఈ, 20.7 మెగా పిక్సెల్ రియర్ కెమెరా, 25 ఎంఎం వైడ్‌యాంగిల్ లెన్స్, 2600 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి ప్రత్యేకతలున్నాయని పేర్కొన్నారు. నీళ్లలో, దుమ్ములో పడినా ఈ ఫోన్లు పాడుకావని. గేమింగ్ ప్రియుల కోసం పీఎస్4(ప్లేస్టేషన్) రిమోట్ ప్లే ఫీచర్‌ను అందిస్తున్నామని తెలిపారు. పీఎస్4పై గేమ్స్ అడుకోవడానికి ఈ ఫోన్లను రిమోట్ స్క్రీన్లుగా ఉపయోగించుకోవచ్చని వివరించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రిటైల్ అవుట్లెట్ల సంఖ్యను 10వేలకు విస్తరించనున్నామని, వీటిల్లో 250 ఎక్స్‌క్లూజివ్ ఎక్స్‌పీరియా స్టోర్స్ ఉంటాయని పేర్కొన్నారు. భారత ప్రీమియం హ్యాండ్సెట్ మార్కెట్లో సోనీకి 10 శాతం వాటా ఉంది. సోనీ ఇండియా గత ఆర్థిక సంవత్సరంలో రూ.10,000 కోట్ల టర్నోవర్ సాధించింది.