weekend collections
-
ఆదిపురుష్ జోరుకు బ్రేకులు...
-
‘ఉప్పెన’ వీకెండ్ కలెక్షన్ రూ. 50 కోట్లు
మెగా హీరో వైష్ణవ్ తేజ్‌ను హీరోగా పరిచయం చేస్తూ దర్శకుడు బుచ్చిబాబు తెరకెక్కించిన చిత్రం ‘ఉప్పెన’. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రం ఫిబ్రవరి 12న విడుదలై బాక్సాఫీసు వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తోంది. మొదటి రోజే ఈ మూవీ రికార్డు స్టాయిలో ప్రపంచ వ్యాప్తంగా 10.42 కోట్ల రూపాయల షేర్ రాబట్టింది. అదే రికార్డు స్థాయిలో వీకెండ్‌కు కూడా కలెక్షన్ల సునామీ సృష్టించింది. ఈ నేపథ్యంలో ఇవాళ దర్శకుడు బుచ్చిబాబు సన పుట్టిన రోజు సందర్భంగా ఆయనకు మైత్రీ మూవీస్ ట్విటర్ వేదికగా భాకాంక్షలు తెలుపుతూ ‘ఉప్పెన’ వీకెండ్ కలెక్షన్లను వెల్లడించింది. ‘మా బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ బుచ్చిబాబు సనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు, అలాగే ‘ఉప్పెన’ 50 కోట్ల కలెక్షన్లు రాబట్టిన సందర్భంగా ఆయనకు అభినందనలు’ అంటూ మైత్రీ మూవీస్ ట్వీట్ చేసింది. కాగా క్రియోటివ్ డైరెక్టర్ సుకుమార్ శిష్యుడైన బుచ్చిబాబు రూపొందించిన ఈ సినిమా ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ సొంతం చేసుకుని సక్సెస్ టాక్‌తో ముందుకెళుతుంది. ఈ సినిమాలో వైష్ణవ్‌కు జోడీగా కృతి శెట్టి నటించగా.. తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి విలన్ పాత్రలో నటించాడు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ స్వరాలు సమకూర్చారు. Wishing our Director @BuchiBabuSana a Very Happy Birthday ♥ What better gift than a 50Cr Gross Blockbuster Weekend 🌊 - Team #Uppena #HBDBuchiBabuSana pic.twitter.com/by376EaiEo — Mythri Movie Makers (@MythriOfficial) February 15, 2021 చదవండి: గుడ్‌న్యూస్: ఓటీటీలోకి ఉప్పెన.. ఎప్పుడంటే ‘ఉప్పెన’ ఫస్ట్ డే కలెక్షన్లు.. ఆల్‌టైమ్ రికార్డు -
9వ వారం మేటి చిత్రాలు
-
8వ వారం మేటి చిత్రాలు
-
అభిమన్యుడు సినిమా దూసుకెళ్తోంది
విశాల్ హీరోగా నటించిన అభిమన్యుడు సినిమాతో థియేటర్లు హౌస్‌ఫుల్‌తో కలకలలాడుతున్నాయి. ఈ వారం విడుదలైన ఆఫీసర్, రాజుగాడు పూర్తిగా తేలిపోవడంతో అభిమన్యుడు కలెక్షన్స్‌లో దుమ్ముదులుపుతోంది. సైబర్ క్రైమ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాను ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. విశాల్ గత సినిమా డిటెక్టివ్ విభిన్న కథతో తెరకెక్కడం, అది కూడా విజయవంతం కావడంతో అభిమన్యుడు సినిమాపై టాలీవుడ్ కూడా ఆసక్తితో ఎదురుచూసింది. మొదటి వారాంతానికి తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా దాదాపు 7కోట్లు వసూళ్లను సాధించింది. ఓ డబ్బింగ్ సినిమా ఈ రేంజ్లో కలెక్షన్స్ సాధించడం చూసి చాలా కాలమైంది. తమిళ నాట కూడా ఈ సినిమా రికార్డ్ కలెక్షన్లను సాధిస్తోంది. ఈ సినిమాలో విశాల్‌కు జోడిగా సమంత నటించగా, ప్రతినాయకుడిగా యాక్షన్ కింగ్ అర్జున్ నటించారు. ఈ సినిమాకు యువన్ శంకర్ రాజా సంగీతమందిచగా, పీఎస్ మిత్రన్ దర్శకత్వం వహించారు. " #Abhimanyudu has collected 7.10 Crs in 3 Days and emerged as Biggest Hit in @VishalKOfficial's career. Film has already became a Superhit." - Producer Gujjalapudi Hari pic.twitter.com/toOiWbYDlr — BARaju (@baraju_SuperHit) June 4, 2018 -
ఈ వారం మేటి చిత్రాలు (11-12-2016)
-
ఈ ఏడాదిలో ఇదే బంపర్ రికార్డు..
షారుక్ ఖాన్ తాజా సినిమా 'ఫ్యాన్' సరికొత్త రికార్డును తన ఖాతాలో వేసుకుంది. విడుదలైన తొలి వారాంతంలోనే రూ.52.35 కోట్లు కలెక్ట్ చేసి.. 2016లో తొలి వీకెండ్లో భారీ కలెక్షన్లు రాబట్టిన సినిమాగా రికార్డు సృష్టించింది. ఇప్పటివరకు రూ.44.30 కోట్ల కలెక్షన్లతో తొలి స్థానంలో నిలిచిన అక్షయ్ కుమార్ 'ఎయిర్ లిఫ్ట్' ను ఫ్యాన్ అధిగమించింది. శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మూడు రోజుల్లో రూ. 52 కోట్ల అదిరే కలెక్షన్లను సొంతం చేసుకుంది. ఆర్యన్ ఖన్నా అనే సినీ హీరోను అమితంగా అభిమానించే గౌరవ్ అనే కుర్రాడు.. కొన్ని సంఘటనల అనంతరం అతడిని ద్వేషించడం మొదలుపెడతాడు. సదరు ఫ్యాన్‌కి, సినీ హీరోకి మధ్య జరిగే కథే 'ఫ్యాన్' సినిమా. షారుక్.. ఆర్యన్గా, గౌరవ్గా ద్విపాత్రాభినయం చేసిన విషయం తెలిసిందే. తన చిన్న కుమారుడు అబ్ రామ్ సినిమా చూస్తూ 'టూ టూ పప్పాస్' (ఇద్దరిద్దరు నాన్నలు) అంటూ సంభ్రమాశ్చర్యాలు వ్యక్తం చేసిన విషయాన్ని మురిసిపోతూ ట్వీట్ చేశాడు కింగ్ ఖాన్. ఫ్యాన్ సృష్టిస్తున్న రికార్డులను చూసి కింగ్ ఖాన్ ఫుల్ ఖుషీగా ఉన్నాడు. కాగా 2015లో సల్మాన్ 'భజరంగీ భాయ్ జాన్' రూ.102.6 కోట్ల తొలి వీకెండ్ కలెక్షన్లతో సునామీ సృష్టించగా.. ఆమిర్ 'పీకే' రూ. 95.21 కోట్ల కలెక్షన్లతో రెండో స్థానంలో నిలిచింది. చూడబోతే ఫ్యాన్ ఈ ఏడాది భారీ వసూళ్ల లిస్ట్‌లో చేరే అవకాశం కనిపిస్తోంది. -
లేటు వయసులోనూ ఘాటు కలెక్షన్లు!
బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ వయసు మీద పడుతున్నా.. కలెక్షన్ల సత్తా తనలో తగ్గలేదని అంటున్నారు. అందుకు నిదర్శనం.. ఆయన తాజాగా నటించిన వజీర్ చిత్రం. బిజయ్ నంబియార్ దర్శకత్వంలో వచ్చిన ఈ థ్రిల్లర్ డ్రామా కేవలం మొదటి మూడు రోజుల్లోనే రూ. 21 కోట్లు వసూలు చేసింది. శుక్రవారం విడుదలైన వజీర్ సినిమాకు ఆరోజు రూ. 5.61 కోట్ల వసూళ్లు వచ్చాయి. శని, ఆదివారాల్లో మాత్రం ఇది దుమ్ము దులిపింది. ఆ రెండు రోజుల్లో వరుసగా రూ. 7.16 కోట్లు, 8.24 కోట్ల వసూళ్లు వచ్చాయని, దాంతో స్వదేశంలో వీకెండ్ కలెక్షన్లు రూ. 21.01 కోట్లుగా నిలిచాయని సినిమా వర్గాలు తెలిపాయి. ఇది కాక.. ఓవర్సీస్ కలెక్షన్లు మరో రూ. 10.48 కోట్లు వచ్చాయి. ఆ లెక్కన అక్కడ, ఇక్కడ కలిపితే 31.49 కోట్ల రూపాయలు వసూలు చేసిందన్న మాట. విధు వినోద్ చోప్రా, రాజ్‌కుమార్ హిరానీ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాలో ఫర్హాన్ అఖ్తర్, నీల్ నితిన్ ముఖేష్, అదితి రావు, జాన్ అబ్రహం తదితరులు నటించారు.