Weekends
-
Durgam Cheruvu Musical Fountain Pics: దుర్గం చెరువులో వాటర్ ఫౌంటెన్లు ప్రారంభం (ఫోటోలు)
-
యూపీలో వారాంతాల్లో లాక్డౌన్
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో కోవిడ్–19 కేసుల సంఖ్య 35 వేలు దాటిపోవడంతో యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం కీలక నిర్ణయం ప్రకటించింది. వారాంతపు రోజుల్లో లాక్డౌన్ నిబంధనలను కఠినంగా అమలు చేయాలని నిర్ణయించింది. వచ్చే శని, ఆదివారాల నుంచి అమలయ్యే ఈ నిబంధనలు ఈ నెలాఖరు వరకు అమల్లో ఉంటాయని రాష్ట్ర అదనపు చీఫ్ సెక్రటరీ(హోం, సమాచార) అవనీశ్ అవస్థి పేర్కొన్నారు. ముఖ్యంగా, పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో జనసమ్మర్థం ఉండే మార్కెట్లు, కార్యాలయాలను ఈ రెండు రోజుల్లో మూసివేసి ఉంచుతామన్నారు. బ్యాంకులు మాత్రం యథావిధిగా పనిచేస్తాయని తెలిపారు. సోమవారం నుంచి శుక్రవారం వరకు ఉదయం 9 నుంచి రాత్రి 9 గంటల వరకు అన్ని మార్కెట్లు పనిచేస్తాయన్నారు. వచ్చే శని, ఆదివారాల్లో అన్ని రకాల దుకాణాల వద్ద ప్రత్యేక పారిశుధ్య, శానిటైజేషన్ కార్యక్రమాలను చేపట్టాలని సీఎం యోగి అధికారులను ఆదేశించారు. దీంతోపాటు, ప్రభుత్వం ప్రకటించిన విధంగా శుక్రవారం రాత్రి నుంచి సోమవారం వరకు 55 గంటలపాటు ఆంక్షలు రాష్ట్రంలో కొనసాగుతున్నాయి. -
కాల్ మనీ గ్యాంగ్ ... విడిదింట్లోనే వీకెండ్స్!
విజయవాడ సిటీ : నగరానికి చేరువలోని ఓ ప్రజాప్రతినిధి అతిథి గృహాన్ని రాము ముఠా వీకెండ్స్‌కు విడిది కేంద్రంగా వినియోగించుకునేవారు. శని, ఆదివారాల్లో ఇక్కడ పండుగ వాతావరణం నెలకొనేదని స్థానికుల సమాచారం. మద్యం, మాంసం, మగువ.. ఇలా ఇక్కడికి వచ్చే అతిథులకు ఏది కావాలంటే అది క్షణాల్లో ఏర్పాటు చేసేవారు. పలువురు ప్రజా ప్రతినిధులు, ఉన్నత స్థానాల్లోని అధికారులు వారాంతపు విశ్రాంతి కోసం ఇక్కడికి వస్తుంటారు. ఇక్కడికి వచ్చే వారి జాబితాలో కొందరు సినీ తారలు కూడా ఉన్నట్టు నిఘా వర్గాల సమాచారం. అందుకయ్యే ఖర్చంతా యలమంచిలి రాము, వెనిగళ్ల శ్రీకాంత్, ఎలక్ట్రికల్ డీఈ ఎం.సత్యానందం తదితరులు భరించేవారని చెపుతున్నారు. వీరు ఎక్కువగా తమ ఫైనాన్స్ వ్యాపారంలో పెట్టుబడి పెట్టినవారికి ఇక్కడ ఖరీదైన పార్టీలు ఏర్పాటు చేస్తుంటారు. కొందరిని విదేశాలకు కూడా వీరి ఖర్చులతోనే పంపుతుంటారు. ఖరీదైన పార్టీలే ఇక్కడ జరిగే పార్టీలన్నీ కూడా ఖరీదైనవేనని పట్టుబడిన ముఠా సభ్యుల సహచరుల సమాచారం. వారాంతంలో రెండు రోజులు జరిగే ఈ పార్టీలకు రూ.1.50 లక్షల నుంచి రూ.2 లక్షల వరకు ఖర్చు చేస్తారని తెలిసింది. విదేశీ మద్యం, ఖరీదైన మాంసాహార వంటకాలు తయారు చేయిస్తారని సమాచారం. కొన్ని రకాల విదేశీ పక్షులను కూడా ఇక్కడి వంటకాల్లో ఉపయోగిస్తుంటారని చెపుతున్నారు. ఇక రాత్రయితే చాలు ఖరీదైన కార్లలో పలువురు యువతులు, మహిళలు ఇక్కడికి వస్తుంటారని తెలుస్తోంది. కొన్ని సందర్భాల్లో ప్రధాన నగరాలకు చెందిన మోడల్స్ కూడా ఇక్కడికి వచ్చి వెళుతుంటారని స్థానికుల సమాచారం. నెలలో మూడు నుంచి నాలుగు మార్లు జరిగే ఈ వేడుకలకు కాల్‌మనీ వ్యాపారంలో ఆర్జించిన మొత్తం నుంచే ఖర్చు చేస్తుంటారని తెలిసింది. వచ్చేది ప్రముఖులే జిల్లాలోని కొందరు ప్రజాప్రతినిధులు, అధికారులు ఇక్కడ జరిగే పార్టీల్లో పాల్గొంటారని చెపుతున్నారు. అక్కడికి వీరిని రప్పించుకొని సకల సౌకర్యాలు సమకూర్చుతుంటారు. ఆపై వీరి నగదును పెట్టుబడిగా పెట్టించుకొని కాల్‌మనీ వ్యాపారం చేస్తుంటారు. ఆ ముసుగులో సెక్స్ రాకెట్లోకి దించిన మహిళలను వీరి వద్దకు పంపుతుంటారని సమాచారం. పైరవీలకూ వేదిక ఇక్కడ జరిగే పార్టీల నడుమ పైరవీల పర్వం కూడా సాగుతుందని తెలిసింది. ఉద్యోగాలు, పోస్టింగ్‌లు, కాంటాక్టులు.. ఇలా ప్రభుత్వపరంగా జరగాల్సిన పలు వ్యవహారాలు ఇక్కడి వీకెండ్స్‌లో ఉంటాయి. రాము, శ్రీకాంత్ తదితరులు తాము చేసుకున్న ఒప్పందాలను పార్టీకి వచ్చిన ప్రముఖుల ద్వారా పూర్తి చేయిస్తారు. ఈ క్రమంలోనే లక్షల రూపాయలు చేతులు మారుతుంటాయని చెపుతున్నారు. ఇప్పుడీ ముఠా పోలీసులకు చిక్కడంతో వీకెండ్ పార్టీల్లో పాల్గొన్న నేతలు, అధికారులు కంగుతిన్నారు. తమ పేర్లు బయటకు రాకుండా చూసేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారని సమాచారం. -
థీమ్ బరాబర్..
సిటీలో భోజనప్రియుల అభి‘రుచు’లకు తగ్గట్లే రెస్టారెంట్లు కూడా శరవేగంగా మారుతున్నాయి.పోటీ పెరగడంతో ఎలాగైనాకస్టమర్లను ఆకట్టుకునేందుకు కొత్త కొత్త ఐడియాలతో ముందుకొస్తున్నాయి. సాదాసీదాగా కనిపించే రెస్టారెంట్లు త్వరగానే బోరు కొట్టేస్తుండటంతో, ‘సిటీ’జనులు కొత్తవాటి కోసం చూపు సారిస్తున్నారు. అలాంటి వారిని ఆకర్షించేందుకు నగరంలోని రెస్టారెంట్లు కొత్త కొత్త థీమ్స్‌తో ముస్తాబవుతున్నాయి. కొన్ని రాచరుచులతో అలరిస్తున్నాయి. మరికొన్ని ఖండాంతర రుచులను చేరువ చేస్తున్నాయి. ఇంకొన్ని ఒద్దికగా సంప్రదాయ రుచులనే సరికొత్తగా వండి వడ్డిస్తున్నాయి. ఇలాంటి థీమ్ రెస్టారెంట్లపై ‘సిటీప్లస్’ కథనం.. ‘చిరు’తిండి... భోజనప్రియులు తరచూ కొత్త కొత్త రెస్టారెంట్లకు వెళుతుంటారు. కొత్త కొత్త రుచులను ఆస్వాదిస్తుంటారు. రుచులు సరే, ఆరోగ్యం మాటేమిటి..? అనే ప్రశ్నకు సమాధానంగానే బేగంపేట్‌లో ‘ఆహార్ కుటీర్’ మొదలైంది. నలుగురు మిత్రులు.. రాంబాబు, అర్చన, శ్రీరామ్, దినేష్.. తమ కార్పొరేట్ ఉద్యోగాలను వదిలేసి మరీ ఈ రెస్టారెంట్‌ను ప్రారంభించారు. సజ్జలు, జొన్నలు, రాగులు వంటి చిరుధాన్యాలతోనే ఇక్కడ అన్ని పదార్థాలనూ తయారు చేస్తారు. రసాయనిక ఎరువులు, పురుగుమందులు వాడకుండా పెంచిన కూరగాయలనే వాడతారు. పల్లెవాతావరణాన్ని తలపించే ఈ రెస్టారెంట్ అలంకరణ ఆహ్లాదభరితంగా ఉంటుంది. ఇక్కడ సంప్రదాయబద్ధంగా అరిటాకుల్లో వడ్డిస్తారు. మంచినీళ్లు, మజ్జిగ మట్టిపాత్రల్లో అందిస్తారు. మహారాజ భోజనం... చాలా రెస్టారెంట్లకు పేరులోనే ‘రెస్ట్’ ఉంటుంది గానీ, అక్కడకు వెళ్లేవారికి ఎలాంటి విశ్రాంతి ఉండదు. ఆర్డర్ చేసిన పదార్థాలు టేబుల్ మీదకు రాగానే, భోంచేయడం, ఆపై బిల్లు కట్టి, టిప్పు చదివించుకుని బయటపడటం.. ఇదంతా రొటీన్ వ్యవహారం. మణికొండలోని ‘వాక్’ (వీకెండ్స్ ఎట్ కూచిపూడి) రెస్టారెంట్ తీరే వేరు. ఇక్కడకు వెళ్లేవారెవరైనా, అడుగు పెడుతూనే ఆహారం కోసం ఆర్డర్ ఇవ్వక్కర్లేదు. విశ్రాంతిగా గడపొచ్చు. గేమ్స్ వంటి వాటితో కాలక్షేపం చేయవచ్చు. ఆకలేసినప్పుడు నిదానంగా ఆర్డర్ చేసి, తాపీగా భోజనం చేయవచ్చు. ‘కింగ్స్’లంచ్, ‘క్వీన్స్’ డిన్నర్ ఈ రెస్టారెంట్ స్పెషల్స్. ఇవి పేరుకు తగినట్లే రాజసం ఉట్టిపడుతూ ఉంటాయి. వెజ్, నాన్ వెజ్లలో అరడజనేసి స్టార్టర్స్, నాలుగు రకాల టిఫిన్లు, ఏడు రకాల బిర్యానీలు, సీఫుడ్ సహా తొమ్మిదిరకాల నాన్ వెజ్ ఐటమ్స్, ఐదు రకాల స్వీట్లు, డెసర్ట్స్ ఉంటాయి. ‘కింగ్స్’లంచ్ కాస్త స్పైసీగా ఉంటే, ‘క్వీన్స్’డిన్నర్ కొంచెం డెలికేట్‌గా ఉంటుంది. ఇందులోని వైట్రూమ్ ధవళకాంతులతో మెరిసిపోతూ ఉంటుంది. ఎల్ఈడీ లైట్లు వెలిగినప్పుడల్లా రంగులు మారుతుంటుంది. బ్లాక్రూమ్లోని ఎల్ఈడీ దీపాలు నింగిలో చుక్కల్లా తళతళలాడుతూ కొత్త అనుభూతినిస్తాయి.