Welfare minister
-
బాబు గుండెల్లో ఐటీ భయం
ఒంగోలు: ప్రజాబాహుళ్యంలో దొరికిన దొంగ చంద్రబాబు అని సాంఘిక సంక్షేమశాఖ మంత్రి, ప్రకాశం జిల్లా ఇన్చార్జి మంత్రి మేరుగు నాగార్జున చెప్పారు. ఆయన ఆదివారం ఒంగోలులో ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి నివాసంలో మీడియాతో మాట్లాడారు.నోటీసులు చంద్రబాబుకు కొత్తేమీ కాదన్నారు. ఎటువంటి నోటీసులు ఇచ్చినా కోర్టులకు వెళ్లి స్టేలు తెచ్చుకోవడం పరిపాటేనన్నారు. తాజాగా ఐటీశాఖ నోటీసులు జారీచేయడంతో బాబు గుండెల్లో భయం పట్టుకుందని చెప్పారు. దీంతో బీజేపీ పంచన చేరి ఏదో ఒక విధంగా గట్టెక్కాలనే ఉద్దేశంతోనే ఢిల్లీ వెళ్లి చేతులు కట్టుకుని మరీ వినయాన్ని నటిస్తున్నారని విమర్శించారు. చివరికి పురందేశ్వరి ద్వారా ఢిల్లీ పెద్దల ప్రాపకం కోరుతున్నారన్నారు. -
సాక్ష్యాధారాలను తారుమారు చేస్తారు
సాక్షి, కదిరి: ‘‘ఆదాయ పన్నుల శాఖ దాడుల్లో చంద్రబాబుకు ప్రైవేటు కార్యదర్శిగా పనిచేసిన శ్రీనివాస్ ఇంట్లో రూ.2వేల కోట్లు పట్టుబడ్డాయి. అందుకే చంద్రబాబుతో పాటు ఆయన కుమారుడు లోకేష్ బాబును తక్షణం అదుపులోకి తీసుకోవాలి. లేదంటే సాక్ష్యాధారాలను తారుమారు చేసే అవకాశం ఉంది. వ్యవస్థలను మ్యానేజ్ చేయడంలో చంద్రబాబు సమర్థుడు.’’ అని బీసీ సంక్షేమ శాఖ మంత్రి మాలగుండ్ల శంకరనారాయణ అన్నారు. శనివారం ఆయన కదిరిలో స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ పీవీ సిద్దారెడ్డితో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. గత ఐదేళ్లలో చంద్రబాబు అధికారంలో ఉంటూ రాష్ట ప్రయోజనాలను తాకట్టుపెట్టి అంతులేని అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. ఆయన పీఎస్ దగ్గరే రూ.2 వేల కోట్లు బయటపడ్డాయంటే ఇక చంద్రబాబును తనిఖీ చేస్తే ఎన్ని లక్షల కోట్లు బయటకు వస్తాయోనని అనుమానం వ్యక్త పరిచారు. చంద్రబాబు అక్రమ సంపాదనంతా విదేశాల్లో దాచారని.. దీనిపై సమగ్రంగా దర్యాప్తు జరిపి, ఆ డబ్బు మొత్తం రాష్ట్ర ప్రజలకు పంచిపెట్టాలని మంత్రి డిమాండ్ చేశారు. చంద్రబాబుకు బినామీలుగా ఉంటూ టీడీపీని వీడి బీజేపీలో చేరిన సుజనాచౌదరి, సీఎం రమేష్ ఇళ్లు, వారికి సంబందించిన సంస్థల్లోనూ ఐటీ సోదాలు నిర్వహిస్తే పెద్ద మొత్తంలో నల్లధనం బయటపడిందని మంత్రి గుర్తు చేశారు. వీరితో గానీ, ఈ వ్యక్తులతో గానీ చంద్రబాబుకు ఎలాంటి సంబందం లేదని టీడీపీ నాయకులు ప్రెస్మీట్లు పెట్టి పదే పదే చెప్పడం వెనుక ఆంతర్యమేమిటో ప్రజలకు తెలియజెప్పాలన్నారు. ఎమ్మెల్యే సిద్దారెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు హయాంలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని, ప్రజా ధనం లక్షల కోట్లు దురి్వనియోగం జరిగిందన్నారు. పోలవరంను చూసొద్దాం రండి.. అంటూ అందులో కూడా చంద్రబాబు తో పాటు ఆ పార్టీ నేతలు ప్రజా ధనం దోచుకున్నారని ఆరోపించారు. మట్టి, ఇసుక ఇలా ప్రతిదాంట్లోనూ అవినీతి జరిగిందని, గత ఐదేళ్లలో ఖర్చు చేసిన నిధులపై సమగ్ర విచారణ జరిపితే చంద్రబాబు జైలుకెళ్లడం ఖాయమన్నారు. -
మంత్రిగారికి కోపమొచ్చింది
అమృతలూరు (వేమూరు): పేదరాలి ఇల్లును కూల్చారని సానుభూతి లేదు.. జూదాన్ని అరికడదామన్న ఆలోచన లేదు.. వాస్తవాలు రాసిన విలేకరిపై కేసు నమోదు చేయాలని సాక్షాత్తూ రాష్ట్ర సాంఘిక, గిరిజన శాఖ మంత్రి నక్కా ఆనందబాబు జన్మభూమి సభలో అనడంతో, సభకు వచ్చిన జనం అవాక్కయ్యారు. వివరాలిలా ఉన్నాయి. సాక్షి దినపత్రికలో సోమవారం ‘మంత్రి ఇలాకాలో అరాచకాలు’ అనే శీర్షికన కథనం వెలువడింది. ఉన్న గూడు కోల్పోయిన పేద వృద్ధురాలి వేదన, గ్రామంలో జూదం తీవ్రతతో జరిగిన ఘటనపై ఈ కథనం ప్రచురితమైంది. ఈ కథనం మంత్రికి ఆగ్రహం తెప్పించింది. చుండూరు మండలం అంబేడ్కర్ నగర్లో సోమవారం జరిగిన జన్మభూమి–మా ఊరు కార్యక్రమానికి హాజరైన మంత్రి నక్కా ఆనందబాబు మాట్లాడుతూ తనపై ప్రచురించిన వార్తపై విచారించి, ఆ విలేకరిపై కేసు నమోదు చేయాలంటూ పోలీసులను ఆదేశించారు. అవసరమైతే ఎస్సీ, ఎస్టీ కేసులు సైతం నమోదు చేయమన్నారు. లేదంటే తానే రంగంలోకి దిగుతానని సభా సమక్షంలో మంత్రి పోలీసులను హెచ్చరించడంతో అక్కడ ఉన్న వారు ఆశ్చర్యచకితులయ్యారు. మంత్రి హామీతో బాధితులకు బెదిరింపులు... సాక్షాత్తూ మంత్రి సభలో మాట్లాడిన తీరును ఆసరాగా తీసుకున్న వంగివరపు గురవయ్య, కమలాకర్ వెంటనే బాధితుల వద్దకు వెళ్లి మీ అంతు చూస్తామంటూ బెదిరింపులకు దిగారు. దీంతో భయభ్రాంతులకు గురైన అంజమ్మ, ఆమె కుమారుడు వాసు మళ్లీ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి జరిగిన విషయాన్ని తెలియజేశారు. -
పిట్టల‘పోరు’..
సాక్షి, ముంబై: పిట్టపోరు.. పిట్టపోరు పిల్లి తీర్చిందని సామెతను గుర్తు చేస్తున్నాయి శివసేన, ఎమ్మెన్నెస్ రాజకీయాలు. వీరిద్దరి మధ్య విభేదాలు ఇతరపార్టీల విజయానికి తోడ్పడుతున్నాయని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే, మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన (ఎమ్మెన్నెస్) అధ్యక్షుడు రాజ్‌ఠాక్రేలు పరస్పరం చేసుకుంటున్న ఆరోపణల తీవ్రతను బట్టి 2009 ఎన్నికల్లో ఎదురైన పరిస్థితే మళ్లీ ఇప్పుడు పునరావృతమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో కాంగ్రెస్, ఎన్సీపీ కూటమి ప్రభుత్వానికి చెందిన అనేక విమర్శించే అంశాలు ఉన్నప్పటికీ ఉద్ధవ్ కేవలం రాజ్‌ను లక్ష్యంగా చేసుకుని బహిరంగసభల్లో ఆరోపణలు చేస్తున్నారు. ఇదే బాటలో రాజ్ కూడా నడుస్తున్నారు. అప్పుడప్పుడు ఉద్ధవ్‌పై నేరుగా, కొన్ని సందర్భాల్లో పరోక్షంగా రాజ్ ఆరోపిస్తూనే ఉన్నారు. ఉద్ధవ్ విసిరిన సవాళ్లకు రాజ్ కూడా దీటుగా సమాధానమిస్తున్నారు. 2009లో కూడా ఇదే జరిగింది.. అప్పుడు జరిగిన లోక్‌సభ, శాసనసభ ఎన్నికల్లో ఉద్ధవ్, రాజ్ సోదరుల మధ్య నెలకొన్న వివాదం కాషాయ కూటమి కొంపముంచింది. కాంగ్రెస్, ఎన్సీపీ విజయానికి పరోక్షంగా ఉపయోగపడింది. ఇప్పుడు కూడా అదే పరిస్థితి పునరావృతమవుతుందని పరిశీలకులు భావిస్తున్నారు. ప్రస్తుతం ఎన్నికల ప్రచార సభలు జోరుగా సాగుతున్నాయి. కాని ఎన్నికల షెడ్యూల్ ప్రకటించకముందే ఉద్ధవ్ తమ పార్టీ లక్ష్యాలను, ప్రచార ఆయుధాలను వెల్లడించారు. గత లోక్‌సభ ఎన్నికల్లో 11 స్థానాల్లో పోటీ చేసి లక్షల ఓట్లను చేజిక్కించుకున్న ఎమ్మెన్నెస్ ఈసారీ 13 స్థానాల్లో పోటీ చేయాలని నిర్ణయం తీసుకుంది. ఇందులోని 11 నియోజక వర్గాల్లో ఎమ్మెన్నెస్ కారణంగా శివసేనకు గట్టి దెబ్బ తగిలే అవకాశాలున్నాయి. ఎమ్మెన్నెస్ టికెట్‌పై దక్షిణ ముంబై నియోజకవర్గం నుంచి బాలా నాంద్‌గావ్కర్, ద క్షిణ మధ్య ముంబై-ఆదిత్య శిరోడ్కర్, వాయవ్య ముంబై-మహేశ్ మాంజ్రేకర్, కల్యాణ్-రాజు పాటిల్, నాసిక్-ప్రదీప్ పవార్, పుణే-దీపక్ పాయ్గుడే, శిరూర్-అశోక్ ఖాండేభరాడ్, ఠాణే-అభిజీత్ ఫణసే, భివండీ-సురేశ్ అలియాస్ బాల్యమామ మాత్రే, వాషిం-యవత్మాల్ నుంచి రాజు పాటిల్ రాజే పోటీ చేస్తున్నారు. మరికొంత మంది పేర్లు ప్రకటించాల్సి ఉంది. 2009లో జరిగిన ఎన్నికల్లో ఎమ్మెన్నెస్ కారణంగా ఓట్లు చీలిపోయి కాషాయ కూటమికి గట్టి దెబ్బ తగిలింది. ముఖ్యంగా శివసేన ఓట్లు చీలిపోయాయి. దీంతో ఎమ్మెన్నెస్‌ను కాషాయకూటమితో పొత్తుపెట్టుకునేలా బీజేపీ నాయకులు తీవ్ర ప్రయత్నాలు చేశారు. కాని ఉద్ధవ్ తీవ్రంగా వ్యతిరేకించడంతో వారి ప్రయత్నాలు ఫలించలేదు. కాగా ఈసారి ఎమ్మెన్నెస్ బరిలో దింపిన నియోజకవర్గాల్లో జాల్నా, పుణే, భివండీ మినహా మిగతావన్ని శివసేనకు అనుకూలంగా ఉన్నాయి. కాని ఎమ్మెన్నెస్ అభ్యర్థులవల్ల ఓట్లు చీలిపోయి 2009 ఫలితాలే పునరావృతమయ్యే అవకాశాలున్నాయి. పవార్ గెలుపు రహస్యం ఇదా: ఉద్ధవ్ నాసిక్: ‘ఎన్సీపీ అధినేత శరద్‌పవార్ వరుస విజయాల వెనుక రహస్యం ఇన్నాళ్లకు బయటపడింది. కార్యకర్తలకు రెండేసి ఓట్లు వేయాలని చెప్పి తన వరుస విజయాల వెనుక రహస్యాన్ని ఆయనే బయటపెట్టుకున్నాడు..’ అని శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే వ్యాఖ్యానించారు. ఆయన సోమవారం నాసిక్‌లో జరిగిన కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. ‘నవీముంబైలో ఆదివారం జరిగిన ఎన్సీపీ ర్యాలీలో ఆ పార్టీ అధినేత శరద్‌పవార్ ప్రసంగాన్ని విన్నాను. విడతల వారీ ఎన్నికల నేపథ్యంలో పనిచేస్తున్న ముంబైలోనూ, తమ సొంత ఊళ్లలోనూ రెండు సార్లు ఓటేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.. దీన్నిబట్టి ఆయన పార్టీ ఇన్నాళ్లుగా ఎన్నికల్లో ఎలా గెలుస్తోందీ అర్థమవుతోంది..’ అని ఉద్ధవ్ విమర్శించారు. అలాగే లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థులు పోటీ చేసే స్థానాల్లో తప్ప మిగిలిన స్థానాల్లో శివసేన పోటీ చేస్తుందని ఆయన స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా, తమ పార్టీ తరఫున షిరిడీ లోక్‌సభ స్థానం నుంచి బరిలో ఉన్న బబన్‌రావ్ ఘోలప్ను అక్రమ ఆస్తుల కేసులో కోర్టు దోషిగా నిర్ధారించిన నేపథ్యంలో అతడి కుమారుడు యోగేష్ ఘోలప్ను అభ్యర్థిగా ప్రకటించే అవకాశముందని పార్టీవర్గాలు పేర్కొన్నాయి.