welfare schemes implemented
-
నవ వసంతంలోకి వైఎస్సార్ సీపీ
సాక్షి, విజయనగరం: యువజన శ్రామిక రైతు కాంగ్రెస్(వైఎస్ఆర్ కాంగ్రెస్) పార్టీ ఆవిర్భవించి ఎనిమిది వసంతాలు పూర్తవుతోంది. మంగళవారానికి తొమ్మిదవ వసంతంలోకి ఆ పార్టీ అడుగుపెడుతుతోంది. గడచిన ఎనిమి దేళ్లలో ఆ పార్టీ నేతలు ఏనాడూ ప్రజాక్షేత్రాన్ని వీడలేదు. అధికారపార్టీ నుంచి ఎదువుతున్న అనేక ఇబ్బందులను, కష్టనష్టాలను ఓర్చుకుంటూ జనం సమస్యలపై నిత్యం పోరాటాలు చేస్తూ ప్రజల మధ్యనే గడిపారు. ఆ క్రమంలో అనేక సమస్యల నుంచి ప్రజలను కాపాడగలిగారు. ఎన్నో అభివృద్ధి సంక్షేమ పథకాలను అర్హులకు చేరేలా చేశారు. ఈ నేపధ్యంలో పార్టీ ఆవిర్భావ వేడుకలను ఘనంగా జరుపుకునేందుకు సిద్ధపడుతున్నారు. మహానేత ఆశయాలే ఆలంబనగా... స్వార్థ రాజకీయ శక్తుల కుట్రలు, కుతంత్రాలను ఛేదించుకుంటూ, ప్రజా సంక్షేమమే ఊపిరిగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించింది. తన తండ్రి మహానేత వైఎస్ రాజశేఖరెడ్డి అకాల మరణాన్ని తట్టుకోలేక ప్రాణాలు వదిలినవారి కుటుం బాలను ఓదార్చడానికి కాంగ్రెస్ అధిష్టానం అడ్డుతగిలితే, ఆ పార్టీని వదిలి బయటకు వచ్చి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ పార్టీని స్థాపించారు. ఆ సమయంలో తన తల్లి, తానూ మాత్రమే ఉన్నప్పటికీ జగన్ నమ్మిన సిద్ధాంతాలే ఆయన వెంట అశేష ప్రజానీకం, ఉద్ధండులైన రాజకీయ నేతలు నడిచేలా చేశాయి. ఆయన అందించిన స్ఫూర్తితో జిల్లాలోనూ పార్టీ శ్రేణులు అనేక ఉద్యమాలు చేపట్టాయి. ఉద్యమాల్లో జిల్లా నేతలు.. సమైక్యాంధ్ర ఉద్యమంలో జిల్లా నేతలు పోలీసుల లాఠీ దెబ్బలు తిన్నారు. సాగునీటి ప్రాజెక్టుల కోసం ఉద్యమించారు. ప్రత్యేక హోదా సాధన డిమాండ్‌ను భుజానికెత్తుకుని ఉవ్వెత్తున నినదించారు. ఊరూవాడా నిరాహారదీక్షలు, నిరసనలు చేపట్టారు. అగ్రిగోల్డ్ బాధితుల పక్షాన నిలిచి వారికి న్యాయం జరిపించేందుకు పోరాడారు. జిల్లాలో నెలకొన్న అనేక సమస్యలపై ఆందోళనలు నిర్వహించారు. జ్వరాల బారిన పడి జిల్లా విలవిల్లాడుతున్నప్పుడు ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి తీసుకువచ్చారు. ప్రజారోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. తాగునీటికి జనం కటకటలాడుతున్నప్పుడు మున్సిపాలిటీలను ముట్టడించారు. నీళ్లిచ్చేంత వరకూ వదలకుండా నిరసన తెలిపారు. పార్వతీపురం మండలం బడే దేవరకొండపై అక్రమ మైనింగ్‌ను అడ్డుకోవడంలో కీలకపాత్ర పోషించారు. చీపురుపల్లి ఆర్ఈసీఎస్లో రూ. 1.70కోట్లు మాయంపై పోరాడి విజయం సాధించారు. ఐక్యతకు మారుపేరుగా... జిల్లాలో పార్టీ అధినేత చేపట్టిన ప్రజా సంకల్పయాత్రలో పార్టీ శ్రేణులు ఏకతాటిపై నడిచారు. తమ అధినేతను ఆదర్శంగా తీసుకుని నవరన్నాలు, రావాలి జగన్, కావాలి జగన్ కార్యక్రమాలు చేపట్టి, పాదయాత్రలు, సభలు నిర్వహిస్తున్నారు. అధికార పార్టీ మోసాలను ప్రజలకు వివరిస్తూ తమ పార్టీ అధికారంలోకి రాగానే ప్రజలకు చేసే మంచి గురించి వివరిస్తున్నారు. ఈ క్రమంలో ఓట్ల తొలగింపు, దొంగ సర్వే వంటి కుట్రలను అడ్డుకుంటున్నారు. దానికి ప్రతిఫలంగా అధికారపార్టీ పెడుతున్న అక్రమ కేసులు, అరెస్టులను భరిస్తున్నారు. ఏది ఏమైనా రాజన్న రాజ్యం మరలా వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీతో తీసుకురావాలని ధృఢ సంకల్పంతో ముందుకు సాగుతున్నారు. -
సంక్షేమానికి చెదలే..!
సాక్షి, నల్లగొండ లబ్ధిదారులకు సంక్షేమ పథకాలు ఈ ఏడాది దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొన్నటి వరకు సబ్సిడీ ఎటూ తేలకపోవడంతో యూనిట్ల గ్రౌండింగ్ ప్రక్రియ మొదలు కాలేదు. ఈ నెల మొదట్లో సబ్సిడీపై ప్రభుత్వం స్పష్టత (జీఓ101) ఇచ్చింది. అయితే వయో పరిమితి కుదించడం, ఆన్లైన్లోనే దరఖాస్తు చేసుకోవాలని నిబంధన విధించింది. ఆరునెలల పాటు నాన్చి మొక్కుబడిగా సబ్సిడీ పెంచింది. ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారులకు యూనిట్ విలువలో 60శాతం రాయితీని రూ.లక్షకు మించకుండా ఇచ్చేందుకు అంగీకారం తెలిపింది. బీసీ, మైనారిటీ, వికలాంగ లబ్ధిదారులకు యూనిట్ విలువలో 50 శాతం రాయితీని రూ.లక్షకు మించకుండా వర్తింపజేయనుంది. అయితే ఈ పథకాలకు వయోపరిమితి లేకుండేది. ఇప్పుడు ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారులకు 21-45 ఏళ్లు, ఇతరులకు 21-40 వయోపరిమితి కలిగి ఉండాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. ముంచుకొస్తున్న కోడ్... ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, వికలాంగులకు స్వయం ఉపాధి కల్పన కోసం అమలు చేస్తున్న పథకాలు ఇప్పటికే చతికిలబడ్డాయి. ఈ నేపథ్యంలో సార్వత్రిక ఎన్నికలు తరుముకొస్తున్నాయి. మార్చిలో ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చే అవకాశాలున్నాయి. ఇదే జరిగితే అభివృద్ధి, సంక్షేమ పథకాల గ్రౌండింగ్‌పై తీవ్ర ప్రభావం ఉంటుంది. తద్వారా లబ్ధిదారులకు యూనిట్లు అందజేయడం నిలిచిపోతుంది. ఎన్నికల్లో ఓటర్లను తమవైపు తిప్పుకునేందుకు ప్రభుత్వం సబ్సిడీ పెంచుతామని గాలం వేసింది. ఈ అంశాన్ని సుదీర్ఘంగా పరిశీలనలో ఉంచింది. అయితే, రాయితీ పెంపుపై ప్రభుత్వ నిర్ణయం వెలువడే సరికి తీవ్ర ఆలస్యం జరిగిపోయింది. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చేలోగా సత్వర చర్యలు తీసుకోకపోతే లబ్ధిదారుల ఆశలపై నీళ్లు చల్లినట్టే. గ్రౌండింగ్‌పై ప్రభావం... ఏటా అన్ని పనులూ దశల వారీగా జరిగితేనే లక్ష్యం మేరకు యూనిట్లు గ్రౌండ్ కావడం గగనమవుతోంది. అయితే ఈ ఏడాది ఇంతవరకు అతీగతీ లేకపోవడంతో గ్రౌండింగ్‌పై తీవ్ర ప్రభావం చూపనుంది. యూనిట్ల మంజూరు, బ్యాంక్ కాన్సెంట్ , రుణం అందజేయడం ఎప్పటిలోగా చేస్తారో సర్కారుకే తెలియాలి. మరో రెండున్నర నెలల్లో ఈ ఆర్థిక సంవత్సరం ముగిస్తుంది. మరి ఏమేరకు లబ్ధిదారులకు పథకాలు అందజేస్తుందో చూడాలి. -
గ్రామాభివృద్ధిలో ముందంజ
మునుగోడు/ చౌటుప్పల్ రూరల్, న్యూస్‌లైన్: సంక్షేమ పథకాలను అమలు చేస్తూ, గ్రామాలను అభివృద్ధి చేయడంలో రాష్ర్ట ప్రభుత్వం ముందుందని మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ మంత్రి, జిల్లా ఇన్చార్జ్ మంత్రి సునితా లక్ష్మారెడ్డి అన్నారు. ఆదివారం నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో అభివృద్ధి పనులకు ఆమె శంకుస్థాపన చేశారు. నల్లగొండ-మునుగోడు, చిట్యాల-మునుగోడు రహదారుల్లోని వాగులపై వంతెనల నిర్మాణాలకు మంత్రి మునుగోడులో శంకుస్థాపన చేశారు. ఒక్కో వంతెనను రూ 5.40 కోట్ల అంచనా వ్యయంతో నిర్మిస్తున్నట్లు ఆమె చెప్పారు. చౌటుప్పల్ మండలం మందోళ్లగూడెం పరిధిలోని సింగరాయిచెర్వులో రూ 1.32కోట్లతో నిర్మించనున్న సబ్‌స్టేషన్ పనులకు శంకుస్థాపన చేశారు. రూ 10 లక్షలతో నిర్మించిన కుంట్లగూడెం గ్రామపంచాయతీ భవనాన్ని ప్రారంభించారు. కుంట్లగూడెంలో గ్రామసంఘం భవనం ఏర్పాటు చేశారు. పద్మానగర్ కాలనీలో రూ 4.50 లక్షలతో అంగన్వాడీ కేంద్ర భవనం నిర్మాణానికి నిధులు మంజూరు చేశామన్నారు. స్థల సేకరణ చేసి అధికారులకు నివేదిక పంపాలని సర్పంచ్‌కు సూచించారు. గ్రామంలో కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి రూ 5లక్షల నిధులు మంజూరు చేశామన్నారు. పిలాయిపల్లి కాలువ, కృష్ణాజలాల పైపులైన్ల పనులు జరుగుతున్నాయని, త్వరలోనే రైతులకు సాగునీరు, ప్రతి గ్రామానికి కృష్ణా జలాలను అందిస్తామని ఈ సందర్భంగా మంత్రి హామీ ఇచ్చారు. భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి మాట్లాడుతూ పిలాయిపల్లి కాంట్రాక్టర్లు పారిపోయారని, మైసమ్మ కత్వ కత్వ ఎత్తును పెంచి, త్వరలోనే రైతులకు సాగు జలాలను అందిస్తామన్నారు. ఎంపీ పాల్వాయి గోవర్దన్‌రెడ్డి మాట్లాడుతూ పిలాయిపల్లి కాలువ నిర్మాణంలో నాణ్యత లోపించిం ద న్నారు. ఇదిలా ఉండగా మునుగోడులో కోమటిరెడ్డి, పాల్వాయి వర్గీయులు వేర్వేరుగా సమావేశాలు ఏర్పాటు చేసుకున్నారు. పాల్వాయి వర్గీయుల సమావేశానికి హాజరైన మంత్రి కేవలం 5నిమిషాల పాటు వేదిక ఎక్కకుండానే కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించి వెళ్లారు. దీంతో కోమటిరెడ్డి వర్గీయులు కొంత అసంతృప్తి చెందారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే ఉజ్జిని యాదగిరిరావు, ఏఐసీసీ సభ్యురాలు పాల్వా యి స్రవంతి, మార్కెట్ కమిటీ చైర్మన్ డాక్టర్ మాధవరెడ్డి, ట్రాన్స్‌కో ఎస్ఐ కర్ణాకర్, ఆర్అండ్బీ ఎస్ఈ ఏం లింగయ్య, ఈఈ రఘునందరెడ్డి, ఆర్డీఓ జహీర్, ప్రత్యేకాధికారి బాబురావు, తహసీల్దార్లు ఏ.ప్రవీన్‌నాయక్, కొప్పుల వెంకట్‌రెడ్డి, ఎంపీడీఓ జి.రజిత, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు పాశం సంజ య్‌బాబు, సర్పంచ్‌లు పందుల నర్సింహ, బక్క శంకరయ్య, వల్లకాటి తులసి, సుర్వి నర్సింహగౌడ్, కప్పల శ్రీనివాస్, రాంరెడ్డి పాల్గొన్నారు. తెలంగాణవాదాన్ని అడ్డుకునేందుకు కుట్ర అసెంబ్లీ సమావేశాల్లో తెలంగాణవాదం వినిపి ంచకుండా ఉండేందుకే దుద్దిళ్ల శ్రీధర్‌బాబును శాసనసభ వ్యవహారాల శాఖనుంచి ముఖ్య మంత్రి తప్పించారని రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సునీతా లక్ష్మారెడ్డి అన్నారు. ఆది వారం మునుగోడులో రాజ్యసభ సభ్యుడు పా ల్వాయి గోవర్దన్‌రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే ఉజ్జిని యాదగిరిరావుతో కలిసి విలేకరులతో మాట్లా డారు. సీఎం కుట్ర పన్నినా ఫలించదన్నారు. ఈనెల 25నాటికి కేంద్రానికి బిల్లు వెళ్తుందని, పార్లమెంటులో దానిని ప్రవేశపెడతారన్నారు.