మునుగోడు/ చౌటుప్పల్ రూరల్, న్యూస్‌లైన్: సంక్షేమ పథకాలను అమలు చేస్తూ, గ్రామాలను అభివృద్ధి చేయడంలో రాష్ర్ట ప్రభుత్వం ముందుందని మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ మంత్రి, జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి సునితా లక్ష్మారెడ్డి అన్నారు. ఆదివారం నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో అభివృద్ధి పనులకు ఆమె శంకుస్థాపన చేశారు. నల్లగొండ-మునుగోడు, చిట్యాల-మునుగోడు రహదారుల్లోని వాగులపై వంతెనల నిర్మాణాలకు మంత్రి మునుగోడులో శంకుస్థాపన చేశారు. ఒక్కో వంతెనను రూ 5.40 కోట్ల అంచనా వ్యయంతో నిర్మిస్తున్నట్లు ఆమె చెప్పారు. చౌటుప్పల్ మండలం మందోళ్లగూడెం పరిధిలోని సింగరాయిచెర్వులో రూ 1.32కోట్లతో నిర్మించనున్న సబ్‌స్టేషన్ పనులకు శంకుస్థాపన చేశారు.
రూ 10 లక్షలతో నిర్మించిన కుంట్లగూడెం గ్రామపంచాయతీ భవనాన్ని ప్రారంభించారు. కుంట్లగూడెంలో గ్రామసంఘం భవనం ఏర్పాటు చేశారు. పద్మానగర్ కాలనీలో రూ 4.50 లక్షలతో అంగన్‌వాడీ కేంద్ర భవనం నిర్మాణానికి నిధులు మంజూరు చేశామన్నారు. స్థల సేకరణ చేసి అధికారులకు నివేదిక పంపాలని సర్పంచ్‌కు సూచించారు. గ్రామంలో కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి రూ 5లక్షల నిధులు మంజూరు చేశామన్నారు. పిలాయిపల్లి కాలువ, కృష్ణాజలాల పైపులైన్ల పనులు జరుగుతున్నాయని, త్వరలోనే రైతులకు సాగునీరు, ప్రతి గ్రామానికి కృష్ణా జలాలను అందిస్తామని ఈ సందర్భంగా మంత్రి హామీ ఇచ్చారు. భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి మాట్లాడుతూ పిలాయిపల్లి కాంట్రాక్టర్లు పారిపోయారని, మైసమ్మ కత్వ కత్వ ఎత్తును పెంచి, త్వరలోనే రైతులకు సాగు జలాలను అందిస్తామన్నారు.
ఎంపీ పాల్వాయి గోవర్దన్‌రెడ్డి మాట్లాడుతూ పిలాయిపల్లి కాలువ నిర్మాణంలో నాణ్యత లోపించిం ద న్నారు. ఇదిలా ఉండగా మునుగోడులో కోమటిరెడ్డి, పాల్వాయి వర్గీయులు వేర్వేరుగా సమావేశాలు ఏర్పాటు చేసుకున్నారు. పాల్వాయి వర్గీయుల సమావేశానికి హాజరైన మంత్రి కేవలం 5నిమిషాల పాటు వేదిక ఎక్కకుండానే కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించి వెళ్లారు. దీంతో కోమటిరెడ్డి వర్గీయులు కొంత అసంతృప్తి చెందారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే ఉజ్జిని యాదగిరిరావు, ఏఐసీసీ సభ్యురాలు పాల్వా యి స్రవంతి, మార్కెట్ కమిటీ చైర్మన్ డాక్టర్ మాధవరెడ్డి, ట్రాన్స్‌కో ఎస్‌ఐ కర్ణాకర్, ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ ఏం లింగయ్య, ఈఈ రఘునందరెడ్డి, ఆర్డీఓ జహీర్, ప్రత్యేకాధికారి బాబురావు, తహసీల్దార్లు ఏ.ప్రవీన్‌నాయక్, కొప్పుల వెంకట్‌రెడ్డి, ఎంపీడీఓ జి.రజిత, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు పాశం సంజ య్‌బాబు, సర్పంచ్‌లు పందుల నర్సింహ, బక్క శంకరయ్య, వల్లకాటి తులసి, సుర్వి నర్సింహగౌడ్, కప్పల శ్రీనివాస్, రాంరెడ్డి పాల్గొన్నారు.
తెలంగాణవాదాన్ని అడ్డుకునేందుకు కుట్ర
అసెంబ్లీ సమావేశాల్లో తెలంగాణవాదం వినిపి ంచకుండా ఉండేందుకే దుద్దిళ్ల శ్రీధర్‌బాబును శాసనసభ వ్యవహారాల శాఖనుంచి ముఖ్య మంత్రి తప్పించారని రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సునీతా లక్ష్మారెడ్డి అన్నారు. ఆది వారం మునుగోడులో రాజ్యసభ సభ్యుడు పా ల్వాయి గోవర్దన్‌రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే ఉజ్జిని యాదగిరిరావుతో కలిసి విలేకరులతో మాట్లా డారు. సీఎం కుట్ర పన్నినా ఫలించదన్నారు. ఈనెల 25నాటికి కేంద్రానికి బిల్లు వెళ్తుందని, పార్లమెంటులో దానిని ప్రవేశపెడతారన్నారు.
గ్రామాభివృద్ధిలో ముందంజ
Published Mon, Jan 6 2014 2:16 AM | Last Updated on Fri, Oct 19 2018 7:57 PM
Advertisement
Advertisement