West Indies Women
-
అదరగొట్టిన మిథాలీ సేన (ఫోటోలు)
-
కెరీర్ బెస్ట్ స్కోరు నమోదు.. చేదు అనుభవమే మిగిల్చింది
వెస్టిండీస్ వుమెన్ ప్లేయర్ డియాండ్రా డాటిన్ తన వన్డే కెరీర్లో అత్యధిక స్కోరును సాధించింది. సౌతాఫ్రికాతో జోహన్నెస్‌బర్గ్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఈ ఫీట్‌ను నమోదు చేసింది. అలా తన కెరీర్ బెస్ట్ నమోదు చేసిన డియాండ్రాకు మ్యాచ్‌లో చేదు అనుభవమే ఎదురైంది. అయితే ఆమె సెంచరీ చేసిన మ్యాచ్‌లో జట్టు ఓడిపోయిందనుకుంటే పొరపాటే.. వరుణుడి రూపంలో మ్యాచ్ రద్దు కావడంతో ఫలితం రాలేదు. చదవండి: U19 World Cup 2022: మ్యాచ్ జరుగుతుండగా భూకంపం.. మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ వుమెన్స్ జట్టు 46వ ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 234 పరుగులు చేసింది. అందులో సగానికి పైగా స్కోరు డియాండ్రాదే. 159 బంతుల్లో 18 ఫోర్లు, నాలుగు సిక్సర్లతో 150 పరుగుల కెరీర్ బెస్ట్‌ను నమోదు చేసింది. అంతకముందు పాకిస్తాన్‌పై 132 పరుగులు ఆమెకు వన్డేల్లో అత్యధిక స్కోరుగా ఉండేది. అయితే వెస్టిండీస్ బ్యాటింగ్ సమయంలో ఇన్నింగ్స్ 46 ఓవర్లో ఆటకు వర్షం అంతరాయం కలిగించింది. అనంతరం డక్‌వర్త్ లూయిస్ పద్దతిలో దక్షిణాఫ్రికా లక్ష్యం 29 ఓవర్లలో 204 పరుగుల టార్గెట్‌ను విధించారు. అయితే 18 ఓవర్లలోనే దక్షిణాఫ్రికా 5 వికెట్లు కోల్పోయి 87 పరుగులు చేసి ఓటమి దిశగా పయనిస్తోంది. ఈ దశలో మరోసారి వర్షం కురవడంతో ఆటను నిలిపివేశారు. అయితే వర్షం ఎంతకూ తగ్గకపోవడంతో అంపైర్లు పిచ్‌ను పరిశీలించి ఆట సాధ్యం కాదని తేల్చి మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. అలా వర్షం రూపంలో డియాండ్రాను దురదృష్టం వెంటాడింది. తాను భారీ స్కోరు చేసిన మ్యాచ్ ఇలా వర్షార్పణం అవడం ఊహించలేదని.. చాలా బాధగా ఉందని డియాండ్రా ఇంటర్య్వూలో పేర్కొంది. చదవండి: మోర్నీ మోర్కెల్ వేగవంతమైన బంతి.. దిల్షాన్ భయపడ్డాడు -
భారత్ వైట్‌వాష్
మూలపాడు(విజయవాడ):వెస్టిండీస్ మహిళలతో జరిగిన మూడు ట్వంటీల సిరీస్‌లో భారత్ వైట్‌వాష్ అయ్యింది. మంగళవారం ఇక్కడ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో జరిగిన మూడో టీ 20లో భారత మహిళలు 15 పరుగుల తేడాతో ఓటమి పాలయ్యారు. దాంతో మూడు టీ 20ల సిరీస్‌ను భారత్ 0-3 తేడాతో విండీస్‌కు అప్పగించింది. విండీస్ విసిరిన 140 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడంలో భారత మహిళలు చతికిలబడ్డారు.భారత్ 20.0 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 124 పరుగులు చేసి పరాజయం చెందింది. భారత్ ఆదిలోనే ఓపెనర్ వెల్లా వనిత వికెట్ ను స్కోరు బోర్డుపై పరుగులేమీ లేకుండానే కోల్పోయింది.అనంతరం ఫస్ట్ డౌన్ క్రీడాకారిణి మందనా(6), మేఘనా సింగ్(19)లు కూడా నిష్ర్కమించడంతో భారత్ 32 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.ఆ తరుణంలో వేదా కృష్ణమూర్తి(31 నాటౌట్),హర్మన్ ప్రీత్ కౌర్(60 నాటౌట్)లు పోరాడినా భారత్‌ను గెలిపించలేకపోయారు. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న విండీస్ నిర్ణీత ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 139 పరుగులు చేసింది. విండీస్ ఓపెనర్లు హేలే మాథ్యూస్(47), స్టెఫానీ టేలర్(44) మంచి ఆరంభాన్నిచ్చారు.తొలి వికెట్ కు 61పరుగులు భాగస్వామ్యం చేసి విండీస్ గౌరవప్రదమైన స్కోరు చేయడంలో సహకరించారు.అంతకుముందు జరిగిన వన్డే సిరీస్‌లో భారత్ 3-0 తో విండీస్ ను క్లీన్ స్వీప్ చేసిన సంగతి తెలిసిందే. -
తొలి టీ 20లో భారత్ ఓటమి
మూలపాడు(విజయవాడ):వెస్టిండీస్ తో జరిగిన తొలి టీ 20లో భారత మహిళలు ఓటమి పాలయ్యారు. భారత విసిరిన 151 పరుగుల లక్ష్యాన్నివిండీస్ ఐదు వికెట్లతో తేడాతో ఛేదించింది. విండీస్ కెప్టెన్ స్టెఫనీ టేలర్(90;51 బంతుల్లో 12 ఫోర్లు, 3 సిక్సర్లు) చెలరేగి ఆడి జట్టు విజయంలో ముఖ్య భూమిక పోషించింది. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన విండీస్ ఆది నుంచి దూకుడుగా ఆడింది. జట్టు స్కోరు 31 పరుగుల వద్ద మాథ్యూస్(18) వికెట్ ను కోల్పోయినా, టేలర్ మాత్రం ఫోర్లు, సిక్సర్లతో అలరించింది. ఈ క్రమంలోనే హాఫ్ సెంచరీ సాధించిన టేలర్.. విండీస్ విజయాన్ని దాదాపు ఖరారు చేసిన తరువాత పెవిలియన్ చేరింది. ఇక ఆ తరువాత విండీస్ వికెట్లు కోల్పోయినప్పటికీ ఇంకా ఐదు బంతులు మిగిలి ఉండగా గెలుపొందింది. అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత మహిళలు నిర్ణీత ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 150 పరుగులు చేశారు. వేదా కృష్ణమూర్తి(50),హర్మన్ ప్రీత్ కౌర్(68 నాటౌట్)లు హాఫ్ సెంచరీలు సాధించారు. -
వెస్టిండీస్ టార్గెట్ 149
కోల్ కతా: మహిళల టీ20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ లో వెస్టిండీస్ కు ఆస్ట్రేలియా 149 పరుగుల టార్గెట్ నిర్దేశించింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన ఆస్టేలియా 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 148 పరుగులు చేసింది. విలానీ, లానింగ్ అర్ధ సెంచరీలతో చెలరేగారు. విలానీ 37 బంతుల్లో 9 ఫోర్లతో 52 పరుగులు చేసింది. కెప్టెన్ లానింగ్ 49 బంతుల్లో 8 ఫోర్లతో 52 పరుగులు సాధించింది. హీలీ 4, పెరీ 28, బ్లాక్ వెల్ 3 పరుగులు చేశారు. చివరి ఓవర్ లో ఒక్క పరుగు మాత్రమే ఇచ్చి రెండు వికెట్లు తీయడం విశేషం. విండీస్ బౌలర్లలో డొతిన్ 2 వికెట్లు పడగొట్టింది. మాథ్యూస్, మొహమ్మద్ తలో వికెట్ దక్కించుకున్నారు.