West Indies Womens team
-
వెస్టిండీస్‌కు భారీ షాక్.. ఒకేసారి రిటైర్మెంట్ ప్రకటించిన నలుగురు క్రికెటర్లు
వెస్టిండీస్ క్రికెట్‌కు భారీ షాక్ తగిలింది. ఆ జట్టుకు చెందిన నలుగురు మహిళా క్రికెటర్లు ఒకేసారి రిటైర్మెంట్ ప్రకటించి సంచలనం సృష్టించారు. ఆఫ్ స్పిన్నర్ అనిసా మొహమ్మద్, మీడియం పేసర్ షకీరా సెల్మన్, కవలలైన వికెట్‌కీపర్ కమ్ బ్యాటర్ కైసియ నైట్, మిడిలార్డర్ బ్యాటర్ కైషోనా నైట్ అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. ఈ నలుగురు విండీస్ టీ20 వరల్డ్‌కప్ విన్నింగ్ టీమ్‌లోని (2016) సభ్యులు. అనుభవజ్ఞులైన ఈ నలుగురు ఒకేసారి రిటైర్మెంట్ ప్రకటించడంతో విండీస్ మహిళల క్రికెట్ జట్టు దిక్కుతోచని స్థితిలోకి వెళ్లింది. ఈ నలుగురు రిటైర్మెంట్ ప్రకటించిన విషయాన్ని విండీస్ క్రికెట్ బోర్డు దృవీకరించింది. WI Women's cricketers Anisa Mohammed, Shakera Selman, Kycia Knight and Kyshona Knight have confirmed their retirement from International cricket. Read More⬇️ https://t.co/bV88ZNxITw — Windies Cricket (@windiescricket) January 18, 2024 35 ఏళ్ల అనిసా మొహమ్మద్ (ఆఫ్ స్పిన్నర్) 2003-22 మధ్యలో విండీస్ తరఫున 141 వన్డేలు, 117 టీ20లు ఆడి 305 వికెట్లు పడగొట్టింది. ఇందులో తొమ్మిది ఐదు వికెట్ల ఘనతలు ఉన్నాయి. 34 ఏళ్ల షకీరా సెల్మన్ (మీడియం పేసర్) 2008-22 మధ్యలో విండీస్ తరఫున 100 వన్డేలు, 96 టీ20లు ఆడి 133 వికెట్లు తీసి,310 పరుగులు చేసింది. షకీరా వన్డేల్లో ఓసారి ఐదు వికెట్ల ఘనత నమోదు చేసింది. 31 ఏళ్ల కైషోనా నైట్ (లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్) 2013-22 మధ్యలో విండీస్ తరఫున 51 వన్డేలు, 55 టీ20లు ఆడి ఓ హాఫ్ సెంచరీ సాయంతో 1397 పరుగులు చేసి, ఓ వికెట్ తీసింది. 31 ఏళ్ల కైసియ నైట్ (వికెట్‌కీపర్ బ్యాటర్) 2011-22 మధ్యలో 87 వన్డేలు, 70 టీ20లు ఆడి నాలుగు హాఫ్ సెంచరీల సాయంతో 2128 పరుగులు చేసి 78 మందిని ఔట్ చేయడంలో భాగమైంది. -
మంధాన మెరుపులు.. సిరీస్ కైవసం
ఆంటిగ్వా: వెస్టిండీస్ మహిళలతో జరిగిన మూడు వన్డేల సిరీస్‌ను భారత మహిళలు కైవసం చేసుకున్నారు. చివరిదైన మూడో వన్డేలో భారత మహిళలు ఆరు వికెట్ల తేడాతో గెలిచి సిరీస్‌ను 2-1 తో చేజిక్కించుకున్నారు. స్మృతీ మంధాన చెలరేగడంతో భారత్ అవలీలగా గెలుపొందడంతో సిరీస్‌ను కూడా సొంతం చేసుకుంది. తొలి వన్డేలో వెస్టిండీస్ మహిళలు విజయం సాధించగా, రెండు, మూడు వన్డేల్లో భారత గెలిచింది. ఆఖరి వన్డేలో విండీస్ నిర్దేశించిన 195 పరుగుల లక్ష్యాన్ని భారత మహిళలు నాలుగు వికెట్లు వికెట్లు కోల్పోయి ఛేదించారు. ఓపెనర్లు జెమీమా రోడ్రిగ్స్(69; 92 బంతుల్లో 6 ఫోర్లు), స్మృతి మంధాన(74; 63 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్సర్లు) రాణించడంతో భారత్ సునాయాసంగా గెలుపొందింది. ప్రధానంగా మంధాన మెరుపులు మెరిపించడంతో భారత్ 42. 1 ఓవర్లలోనే విజయం సాధించింది. గాయం కారణంగా తొలి రెండు వన్డేలకు దూరమైన మంధాన.. రీఎంట్రీలోనే అదరగొట్టింది. తొలి వికెట్‌కు 141 పరుగులు జత చేసిన తర్వాత రోడ్రిగ్స్ ఔట్ అయ్యింది. తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ మహిళలు 50 ఓవర్లలో 194 పరుగులు చేసి ఆలౌటయ్యారు. విండీస్ కెప్టెన్ స్టెఫానీ టేలర్(79) మరోసారి రాణించగా, మిగతా వారు విఫలమయ్యారు. భారత బౌలర్లలో గోస్వామి, పూనమ్ యాదవ్‌లు చెరో రెండు వికెట్లు సాధించగా, శిఖా పాండే, రాజేశ్వరి గైక్వాడ్, దీప్తి శర్మలు తలో వికెట్ తీశారు. మూడు వికెట్లు రనౌట్ల రూపంలో రావడం విశేషం. -
వెస్టిండీస్xన్యూజిలాండ్
మహిళల రెండో సెమీస్ నేడు ముంబై: వాంఖడే స్టేడియంలోనే పురుషుల మ్యాచ్‌కు ముందు వెస్టిండీస్ మహిళల జట్టు కూడా సెమీఫైనల్ ఆడనుంది. మహిళల టి20 ప్రపంచకప్‌లో న్యూజిలాండ్‌తో అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధమైంది. వెస్టిండీస్ ఈ టోర్నీ చరిత్రలో ఒక్కసారి కూడా ఫైనల్‌కు చేరలేదు. మరోవైపు న్యూజిలాండ్ జట్టు లీగ్ దశలో ఆస్ట్రేలియాపై సహా నాలుగు మ్యాచ్‌లు గెలిచి ఫామ్‌లో ఉంది.