వెస్టిండీస్ క్రికెట్‌కు భారీ షాక్ తగిలింది. ఆ జట్టుకు చెందిన నలుగురు మహిళా క్రికెటర్లు ఒకేసారి రిటైర్మెంట్ ప్రకటించి సంచలనం సృష్టించారు. ఆఫ్ స్పిన్నర్ అనిసా మొహమ్మద్, మీడియం పేసర్ షకీరా సెల్మన్, కవలలైన వికెట్‌కీపర్ కమ్ బ్యాటర్ కైసియ నైట్, మిడిలార్డర్ బ్యాటర్ కైషోనా నైట్ అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు.
ఈ నలుగురు విండీస్ టీ20 వరల్డ్‌కప్ విన్నింగ్ టీమ్‌లోని (2016) సభ్యులు. అనుభవజ్ఞులైన ఈ నలుగురు ఒకేసారి రిటైర్మెంట్ ప్రకటించడంతో విండీస్ మహిళల క్రికెట్ జట్టు దిక్కుతోచని స్థితిలోకి వెళ్లింది. ఈ నలుగురు రిటైర్మెంట్ ప్రకటించిన విషయాన్ని విండీస్ క్రికెట్ బోర్డు దృవీకరించింది.
WI Women's cricketers Anisa Mohammed, Shakera Selman, Kycia Knight and Kyshona Knight have confirmed their retirement from International cricket.
— Windies Cricket (@windiescricket) January 18, 2024
Read More⬇️ https://t.co/bV88ZNxITw
- 35 ఏళ్ల అనిసా మొహమ్మద్ (ఆఫ్ స్పిన్నర్) 2003-22 మధ్యలో విండీస్ తరఫున 141 వన్డేలు, 117 టీ20లు ఆడి 305 వికెట్లు పడగొట్టింది. ఇందులో తొమ్మిది ఐదు వికెట్ల ఘనతలు ఉన్నాయి.
- 34 ఏళ్ల షకీరా సెల్మన్ (మీడియం పేసర్) 2008-22 మధ్యలో విండీస్ తరఫున 100 వన్డేలు, 96 టీ20లు ఆడి 133 వికెట్లు తీసి,310 పరుగులు చేసింది. షకీరా వన్డేల్లో ఓసారి ఐదు వికెట్ల ఘనత నమోదు చేసింది.
- 31 ఏళ్ల కైషోనా నైట్ (లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్) 2013-22 మధ్యలో విండీస్ తరఫున 51 వన్డేలు, 55 టీ20లు ఆడి ఓ హాఫ్ సెంచరీ సాయంతో 1397 పరుగులు చేసి, ఓ వికెట్ తీసింది.
- 31 ఏళ్ల కైసియ నైట్ (వికెట్‌కీపర్ బ్యాటర్) 2011-22 మధ్యలో 87 వన్డేలు, 70 టీ20లు ఆడి నాలుగు హాఫ్ సెంచరీల సాయంతో 2128 పరుగులు చేసి 78 మందిని ఔట్ చేయడంలో భాగమైంది.
Comments
Please login to add a commentAdd a comment